forest dept in telangana
-
TG: వన్యప్రాణుల దాహార్తి.. అటవీ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి,హైదరాబాద్: వేసవి మండుతోంది. మనుషులతో పాటు జంతువుల గొంతులు తడారిపోతున్నాయి. ప్రస్తుత కరువు పరిస్థితుల్లో అడవిలో ఉండే వన్య ప్రాణులైతే తాగడానికి గుక్కెడు నీటి కోసం వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అడవులలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల(సాసర్ పిట్)లో నీటిని తాగి వణ్యప్రాణులు తమ దాహార్తిని తీర్చుకుంటున్నాయి. Interesting camera trap pics from the forests of Telangana Thirsty Animals Find Refuge in Artificial Water Sources in Telangana. As the drought intensifies, thirsty animals are relying on artificial water sources provided by Forest officials. Despite a funding crunch, Forest… pic.twitter.com/JJCf0IK1nq — Sudhakar Udumula (@sudhakarudumula) April 2, 2024 రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి అమ్రాబాద్ దాకా ఉన్న అడవుల్లో పులి, జింకలు, అడవి దున్నలు, హైనాలు, పక్షులు, పాములు దాహం తీర్చుకుంటున్న పలు దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. వీటిని తెలంగాణ అటవీ శాఖతో పాటు పలువురు వన్యప్రాణి ప్రేమికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఓ వైపు నిధుల కొరత వేధిస్తున్నా వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తెలంగాణ అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను నెటిజన్లు కొనియాడుతున్నారు. A waterhole being filled with water using solar power borewell in Birsaipet range of Utnoor #Telangana @TbiHindi @thebetterindia @IUCN @WorldBankWater @DoWRRDGR_MoJS @IUCN_Water pic.twitter.com/fHmwWxev1r — Mohan Pargaien IFS🇮🇳 (@pargaien) March 31, 2024 -
అది పులి కాదు.. మరి ఏంటి?
-
మూగవేదన
అచ్చంపేట: పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నల్లమలలో వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాజెక్టులో నీటి వనరులు వట్టిపోయాయి. ఐదేళ్లుగా నల్లమలలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో నీటివసతి ఉన్న ప్రాంతాలకు వన్యప్రాణులు వస్తున్నాయి. పంట పొలాలు, బోరు బావులు, చెరువుల వద్దకు వస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈసారి నెల రోజుల ముందే ఎండలు ఎక్కువగా ఉండడంతో సమస్య మరింత ఉత్పనమైంది. అభయారణ్య ప్రాంతంలోని వన్యప్రాణులకు ఎండకాలంలో తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ ప్రతి ఏటా రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నామని బాహాటంగా చెబుతున్నా.. వాటికి నీరు అందడం లేదు. అటవీశాఖ పూర్తిస్థాయిలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తే నీటి కోసం గ్రామాల వైపు జంతువులు ఎందుకు వస్తాయన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4కి.మీ. పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ. పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జల వనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. అటవీ సరిహద్దు గ్రామాలైన మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మిపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు, ఉడిమిళ్ల, తిర్మలాపూర్(బీకే) తదితర గ్రామాల్లో వ్యవసాయ పొ లాల్లో ఉండే బోర్ల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపా రు. బల్మూర్ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో మాత్ర మే కొద్దిగా నీరు ఉంది. అత్యధికం గా వన్యప్రాణులు అక్కడి వస్తుంటాయి. వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఆర్భాటంగా ప్రకటించుకోవడమే తప్ప ఎక్కడ కూడా అమలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అటవీశాఖ చెబుతున్న ఏర్పాట్లు ఇవే.. వన్యప్రాణుల తాగునీటి సమస్య అధిగమించడానికి గతంలో అటవీశాఖ నల్లమ ల ప్రాంతంలో 36 సాసర్లు ఏర్పాటు చేశా రు. వన్యప్రాణులు, జీవరాశులు సంచరించే ప్రాంతాల్లో గతేడాది 428 సాసర్లు నిర్మించడంతో పాటు పాతవాటికి కూడా మరమ్మతులు చేపట్టారు. వీటిని అత్యధికంగా రోడ్డు, వాహనాలు వెళ్లగలిగే ప్రాం తాల్లో నిర్మించారే గానీ లోతట్టు ప్రాం తంలో ఏర్పాటు చేయడం లేదు. వీటితో చాలా వరకు ప్రయోజనం తక్కువగా ఉం టుంది. అత్యధికంగా ఇవి పర్హాబాద్ నుం చి వ్యూపాయింట్, అప్పాపూర్, మల్లాపూ ర్, భౌరాపూర్, రాంపూర్, మేడిమల్కల రోడ్డు మార్గంలో ఉన్నాయి. పర్హాబాద్ వ ద్ద ఏర్పాటు చేసిన సోలార్ డిఫ్‌వెల్ పం పింగ్ సిస్టమ్‌తో ట్యాంకర్‌కు నీటిని నింపి వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పిం చాలి. రోజుకు ఒక ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం అని అటవీ శాఖ అ«ధికారులకు చెబుతున్నా.. రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా వెళ్లడం లేదు. ట్యాంకర్ల ద్వారా అటవీ జంతులవుల దాహార్తి తీరుస్తున్నామని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి గానీ అదీ ఆచరణంలో సక్రమంగా అమలు కావడం లేదు. అత్యధికంగా వన్యప్రాణులు తిరిగే ప్రదేశమైన పిచ్చకుంట్ల చెరువు, రాళ్లవాగు, గుడేశ్వరం, తాళ్లచెరువు నీళ్లులేక ఎండిపోయాయి. లోతట్టు అటవీ ప్రాంతంలో సాసర్ల ఏర్పాటు లేకపోవడంతో అక్కడ తాగునీరు లేక వన్యప్రాణులు బయటికి వస్తున్నాయి. సాసర్లలో నీటిని పోయిస్తున్నాం.. జంతువులకు నీటికి ఇబ్బంది లేదు. నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్న అడవుల్లో 71 సాసర్లు, నాలుగు సోలార్ పంపులు ఏర్పాటు చేశాం. ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని అభయారణ్య ప్రాంతంలో అటవీశాఖ తరుఫున జంతువుల కోసం సాసర్లలో నీటిని పోయిస్తున్నాం. – గంగారెడ్డి, డీఎఫ్ఓ, మహబూబ్‌నగర్ -
మైనింగ్ అనుమతుల జారీకి ప్రత్యేక విధానం
సాక్షి, హైదరాబాద్: మైనింగ్ అనుమతులు త్వరితగతిన జారీ చేసేందుకు ప్రత్యేక విధా నాన్ని రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు. సచివాలయంలో కేంద్ర, రాష్ట్ర గనుల శాఖ అధికారులు, రాష్ట్రంలోని జియోసైన్స్ సంస్థల ప్రతినిధులతో గురువారం జరిగిన వార్షిక వ్యూ హాత్మక ముఖాముఖి సమావేశం (అసిమ్)లో ఆయన మాట్లాడారు. అటవీ, పర్యావరణ అనుమతులు జారీ చేస్తున్న తరహాలో గనుల శాఖలోనూ లీజుదారులకు మైనింగ్ అనుమతులు సత్వరం జారీ చేయాలన్నారు. దీనికోసం కన్సల్టెన్సీ సేవలు అందించాలని సీఎస్ సూచించారు. దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సమావేశాన్ని తెలంగాణలో కేంద్ర గనుల శాఖ నిర్వహించడాన్ని అభినందించా రు. రాష్ట్రంలో గనుల అభివృద్ధి, ఖనిజాన్వేషణకు ఈ సమావేశం దోహదం చేస్తుందన్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేంద్ర గనుల శాఖ పరిధిలోని జియోసైన్స్ పరిశోధనా సంస్థల సహకారంతో తెలంగాణలో ఖనిజాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అసిమ్ తరహా ఎంతో ఉపయోగం హైదరాబాద్‌లో ఉన్న జియో సైన్స్ పరిశోధనా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేసేందుకు అసిమ్ తరహా సమావేశాలు ఉపయోగపడుతాయని కేంద్ర గనుల శాఖ అదనపు కార్యదర్శి కె.రాజేశ్వర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ), మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్), అటమిక్ మినరల్ డైరక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్ (ఏఎండీ), ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), నేషనల్ జియోఫిజికల్ రీసె ర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ) వంటి సం స్థల సహకారంతో ఖనిజాన్వేషణ వేగవంతం గా చేపట్టవచ్చన్నారు. తెలంగాణలో సున్నపురాయి, మాంగనీస్, ఐరన్‌ఓర్, బొగ్గు తదితర ఖనిజాల అన్వేషణ పనులు చేపడతామన్నారు. రూ.4,792 కోట్ల ఆదాయం రాష్ట్రంలో 3,291 మైనింగ్ లీజులుండగా, 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.4,792 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు గనులశాఖ జాయింట్ డైరక్టర్ రఫీ అహ్మద్ వెల్లడించారు. స్టేట్ జియోలాజికల్ ప్రోగ్రామింగ్ బోర్డు ద్వా రా ఖనిజాల అన్వేషణ చేపట్టడంతోపాటు కేం ద్ర జియోసైన్స్ సంస్థల సమన్వయంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీగా గుర్తింపు పొందినట్లు టీఎస్ఎండీసీ మేనేజింగ్ డైరక్టర్ మల్సూర్ వెల్లడించారు. తమ సంస్థకు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్టు నాలుగు ప్రాజెక్టులు కేటాయించిందన్నారు. -
ఫారెస్టు కార్యాలయంపై ఏసీబీ దాడులు
నిజామాబాద్‌అర్బన్: నిజామాబాద్ ఉత్తర మండలం ఫారెస్టు రేంజ్ కార్యాలయంపై సోమవారం ఏసీబీ అధికారులు దాడి చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చిన డిప్యూటీ డైరెక్టర్ రమణకుమార్ నలుగురు సిబ్బందితో కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఏసీబీ అధికారులు తనిఖీలు చేసే సమయంలో ఫారెస్టు అధికారి కార్యాలయంలో రూ. 94 వేలు పట్టుబడినట్లు సమాచారం. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై విచారణ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా మూడు రోజుల కిందట నెలవారీ మూమూళ్ల కోసం ఫారెస్టు అధికారులు వేధింపులు చేపట్టడంతో బాధితుడు ఒకరు హైదరాబాద్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అక్కడి నుండి ఏసీబీ అధికారులు తనిఖీలకు వచ్చినట్లు సమాచారం. రేంజ్ పరిధిలో మొత్తం సామిల్లులు ఎన్ని ఉన్నాయి. వాటి నిర్వహణకు సంబంధించిన రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈ తనిఖీల్లో నిజామాబాద్ డీఎస్పీ ప్రసన్నరాణితో పాటు సిబ్బంది ఉన్నారు. విచారణ పూర్తయిన తరువాతే వివరాలు వెల్లడిస్తామని డిప్యూటీ డైరెక్టర్ చెప్పారు. అక్రమ కలప వ్యవహారంలో ముగ్గురు అధికారులు సస్పెన్షన్‌కు గురికాగా, దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ దాడులు జరగడం కలకలరేగింది. అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగాయి. -
వన్యప్రాణులకు రక్ష
మెదక్‌జోన్: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుండటం, మరో వైపు వేసవి సమీపిస్తుండటంతో అటవీప్రాంతంలోని చెట్లు చేమలు, పచ్చనిగడ్డి ఎండిపోయింది. దీంతో వన్యప్రాణులకు ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా మూగజీవాల కోసం ప్రత్యేకమైన దాణాను అందిస్తూ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మెదక్ – కామరెడ్డి జిల్లాల సరిహద్దులోని హవేళిఘణాపూర్ మండల పరిధిలోని పోచారం శివారు బోధన్ రహదారి పక్కన మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో అభయారణ్యం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రెండు డీర్ బీడింగ్(డీబీసీ)లు ఉన్నాయి. డీబీసీ–1లో 125 హెక్టార్ల అడవి ఉండగా డీబీసీ–2లో 39 హెక్టార్ల అడవి ఉంది. వీటిచుట్టూ కంచెను సైతం ఏర్పాటు చేసి వాటిలో జింకలను పెంచుతున్నారు. జింకలతో పాటు మరికొన్ని రకాల శాఖాహర జంతువులున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జింకలు 450, నీల్గాయిలు 45, సాంబార్లు 25, అడవిపందులు 1500, నెమళ్లతో పాటు అనేకరకాల పక్షులున్నాయి. కాగా ఇందులోని జంతువులు మొత్తం శాఖాహరం జంతువులే. వర్షాకాలంలో చెట్ల ఆకులతో పాటు అడవిలో సహజసిద్ధంగా పెరిగే గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. వేసవికాలం రాగానే అడవిలోని చెట్లకు ఆకులు రాలిపోవటంతో పాటు గడ్డి ఎండిపోతోంది. డీబీసీల చుట్టూ కంచె వేయడంతో అవి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో సుమారు 5 నుంచి 6 మాసాల వరకు వీటికి దాన (మేత) పెడతారు. ఇది ప్రతిఏటా మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తారు. కానీ ఈయేడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచే అందిస్తున్నారు. ఈ ఏడాది చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవటంతో చెట్ల ఆకులతోపాటు గడ్డిసైతం త్వరగా ఎండిపోయింది. దీంతో ప్రతిరోజు 2.5 క్వింటాళ్ల దాన పెడుతున్నారు. అంతే కాకుండా డీబీసీ–1లో 3 హెక్టార్లలో గడ్డిని పెంచుతున్నారు. అభయారణ్యంలోనే.. అభయారణ్యంలో డీబీసీల్లోనే జంతువులకు తాగునీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అడవిలో చెక్‌డ్యాంలతో పాటు కుంటలను తవ్వించి అందులో బోర్లు వేయించారు. బోరునీటిని చెక్‌డ్యాంలు, కుంటల్లో నింపుతున్నారు. ఇవి కాకుండా సాసర్ ఫీట్లు సైతం నిర్మించారు. తాగునీటికి ఇబ్బంది రాకుండా వాటిలో నీటిని నింపుతున్నారు. అడవిలోని ఒక్క బోరు మోటార్‌కు సోలార్(పవర్)ను ఏర్పాటు చేశారు. డీబీసీ–1 పక్కనే పోచారం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే బ్యాక్‌వాటర్ డీబీసీ–1లోకి కొంతమేర వస్తుంది. ఆ నీటిని సైతం అటవీశాఖ అధికారులు జంతువుల తాగునీటి కోసం ఉపయోగిస్తుంటారు. పర్యాటకుల తాకిడి... పోచారం అభయారణ్యం(జింకల ప్రత్యుత్పత్తికేంద్రం) హైదరాబాద్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరం ఉండటంతో వీకెండ్లో పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చి జంతువులకు తిలకిస్తున్నారు. ముఖ్యంగా డీబీసీ–1లో జింకల గుంపులు అధికం ఇందులో 4.5 కిలోమీటర్ల మట్టిరోడ్డును వేశారు. పర్యాటకులు ఇందులో పర్యటించాలంటే వాహనానికి రూ. 100 చెల్లించి ఒక్కో వ్యక్తికి రూ. 20 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. వారివెంట ఒక గైడ్‌ను లోపలికి పంపిస్తారు. అభయారణ్యంలో కాలుపెట్టగానే చంగుచంగున దుముకుతూ జింకలు కళ్లముందే కదలాడుతుంటే పొరవిప్పి నాట్యం చేసే నెమళ్ల వయ్యారం, గుర్రం కన్నా ఎత్తులో ఉండే నీల్గాయిల గాంభీరం, పొదలమాటున నక్కినక్కి చూసే కొండగొర్ల దాగుడు మూతలతో అభయారణ్యం నిండా జంతువుల సందడి కనిపిస్తాయి. కాగా వీటిని తిలకించేందుకు చాలా జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అంతేకాకుండా ఈ అభయరణ్యానికి ఆనుకుని పోచారం ప్రాజెక్టు సైతం చుట్టూ కొండలు, గుట్టల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టు ఎంతో సహజ సిద్ధంగా ఉంది. ముందుగానే ఇస్తున్నాం.. అభయారణ్యంలోని జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంలోని జింకలకు 2వ తేదీ నుంచి దాన పెడుతున్నాం. గడ్డినిసైతం పెంచి మేతగా వేస్తున్నాం. ఈయేడు వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో చెట్ల ఆకులతో పాటు గడ్డి ఎండిపోవటంతో కాస్త ముందుగానే దాన ఇవ్వాల్సి వస్తోంది. రెండు డీబీసీల్లో నిత్యం 2.5 క్వింటాళ్ల దాన అవసరం పడుతోంది. –కృష్ణమూర్తి , బీట్ ఆఫీసర్ -
అడవికి రక్షణ
ఆదిలాబాద్‌రూరల్: జిల్లా అడవులకు పెట్టింది పేరు. కానీ ఇక్కడి అడవులు ఉష్ణ మండలానికి చెందినవి కావడంతో వేసవిలో ఆకు రాలుతాయి. ఇలా రాలిన ఆకులు, గింజలు భూమిపై పడడం..అడవుల్లోకి వెళ్లిన వారు బీడీలు, చుట్టలు కాల్చి పారేయడంతో అడవులు అంటుకొని కాలిపోతున్నాయి. దీని నుంచి అడవులను రక్షించేందుకు అటవీ అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ఎక్కడ మంటలు చెలరేగినా శాస్త్రీయ పద్ధతిలో శాటిలైట్ల ద్వారా గుర్తించి ఆర్పి వేస్తున్నారు. ఈ విధానంలో మంటలు అంటుకున్న విషయంపై సంబంధిత రేంజ్ పరిధిలోని బీట్ అధికారికి మేసేజ్ వెళ్తుంది. వెంటనే సంబంధిత అధికారి సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేస్తారు. ఇప్పటికే అటవీ ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లవద్దని, పశువులు, కాపరులు, స్మగ్లర్లు, అగ్గిపెట్టెలు, నిప్పు రాజేసే లైటర్లతో అడవుల్లోకి వెళితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో uమొదటిపేజీ తరువాయిపాటు అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టింది. జిల్లాలో ఎండిన ఆకులను వేరే చేయడం.. పైప్లైన్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తోంది. కాలితే బూడిదే.. జిల్లాలో 1.55లక్షల హెక్టార్లలో అటవీ..వంద నుంచి 200 ఎకరాల్లో ఏడాది పొడవునా ఏపుగా పెరిగిన మొక్కలు వేసవి కాలం వచ్చే సరికి అడవుల్లో నిప్పు పడి (ఎలగడి) పెద్దగా మంటలు లేస్తూ కొత్తగా ఎదుగుతున్న మొక్కలను కాల్చివేస్తుండగా, పెద్ద పెద్ద వృక్షాల మొదళ్లలో మంటలు వ్యాపించి వాటికి నష్టం చేకూరుస్తున్నాయి. దీనిని అధిగమించడానికి వీలైనన్ని చర్యలు చేపడుతున్నారు. అడవుల దహనాన్ని అడ్డుకోవడానికి అటవీ శాఖ ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో ఆయా రేంజ్ పరిధిలోని అడవుల్లో గ్రామాల మధ్య రోడ్డుకు ఇరువైపులా కొన్ని కిలోమీటర్ల చొప్పున ఫైర్లైన్ల ఏర్పాటును పూర్తి చేశారు. ఫైర్‌పైన్ల విభజన తరువాత వాటిని అధికారులు దగ్గరుండి ఎండిన ఆకులను కాల్చి వేయిస్తున్నారు. దీంతో కొత్తగా వచ్చే అగ్ని అడవుల్లోకి ప్రవేశించకుండా ఉంటోంది. ఫైర్‌లైన్ అంటే.. రోడ్డు వెంట ఉన్న అడవుల్లో ప్రస్తుతం విపరీతమైన ఆకు రాలి కుప్పకుప్పలుగా పడి ఉంటుంది. రోడ్డు వెంట వెళ్లే వారు సిగరేట్, బీడీ కాల్చి వదిలేస్తే ఎండిన ఆకులు కావడంతో క్షణాల్లో అడువుల్లోకి మంటలు వ్యాపించి అడవులకు తీవ్ర నష్టం చేస్తున్నాయి. దీనిని అదుపు చేయడానికి రోడ్డు హద్దుకు 6 మీటర్ల దూరంలో ఆకును ఒక లైన్‌గా విభజిస్తున్నారు. దీంతో ఎండిన ఆకులు రెండుగా విభజించడంతో ఎండిన ఆకులకు తగిలిన అగ్ని విభజన రేఖ (గీత) వద్దకు వెళ్లి ఆగిపోతుంది. అధికారులు కూలీలను ఏర్పాటు చేసి రోడ్డు వెంట మొత్తం అటవీ ప్రాంతాల్లో ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కొనసాగుతున్న ఫైర్లైన్ల ఏర్పాటు.. ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్, ఇంద్రవెళ్లి, బోథ్, నేరడిగొండ తదితర రేంజ్‌ల పరిధిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా అటవీ ప్రాంతాల్లో గడిచిన నెల రోజుల నుంచి రోజు పదుల సంఖ్యలో కూలీలతో ఫైర్‌లైన్ ఏర్పాటుకు ఆకులను చీపుర్లతో ఊడ్చి ఆకును ఒక చోట చేర్చి వాటిని కాల్చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే బ్లోవెర్ యంత్రాలతో ఆకులను దగ్గరికి చేస్తున్నారు. దీంతోపాటు అటవీ ప్రాంతంలో ఎక్కడైన నిప్పు అంటుకుంటే శాటిలైట్ ద్వారా దానిని పర్యవేక్షించి వెంటనే ఆర్పుతున్నారు. ముమ్మర ప్రచారం.. అడువుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా గ్రామాల్లో అటవీశాఖ అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రధానంగా రైతులు వేసవి కాలంలో పత్తి కట్టెను వ్యవసాయ పొలాల్లోనే కాల్చుతారు. ఆ మంటలు అటవీ ప్రాంతాల్లోకి వ్యాపించకుండా కాల్చినంతరం దగ్గరుండి ఆర్పివేయాలని రైతులకు సూచిస్తున్నారు. అంతేకాకుండా అడవుల్లోకి అగ్నిని రాజేసే వస్తువులను తీసుకెళ్తే భారీ జరిమానా విధిస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచరిస్తున్నారు. అలాగే కళాజాత బృందాల ద్వారా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అగ్ని ప్రమాదాలకుతావులేకుండా చర్యలు అడవుల అభివృద్ధిలో భాగంగా అగ్ని ప్రమాదాలు నివారించడానికి ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. దీంతోపాటు ఫైర్లైన్లు ఏర్పాటు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారులను సమన్వయ పరిచి అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే ఆర్పే కార్యక్రమంలో ప్రజలను, ఉద్యోగులను భాగస్వాములను చేస్తున్నాం. అడవుల సంరక్షణలో అందరి సహకారం తీసుకుంటున్నాం. – అప్పయ్య, ఎఫ్ఆర్వో, ఆదిలాబాద్ -
చట్టం తెచ్చిన తంటా..!
నర్సంపేట: ఆసాములంతా కూర్చొనే వడ్రంగుల వాకిలి నేడు పొక్కిలి లేచి దుఃఖిస్తోంది.. అరకల పనికి ఆకలిదీరక ఫర్నీచర్ పనులు చేసుకొని బతుకుదామనుకుంటే వారిపై చట్టాల పేరుతో వేధింపులు పెరుగుతున్నాయి. వడ్రంగుల వెతలు వర్ణనాతీతం. వేరే వృత్తిలోకి వెళ్లలేక జీవనోపాధి కోసం నమ్ముకున్న వృత్తినే ఆధారం చేసుకోగా కర్ర పనులపై నమ్మకం పెంచుకోని జీవితాలను వెల్లదీస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అటవీ సంరక్షణకు ప్రత్యేకంగా నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టింది. వీటిని అమలు చేసే విధానంలో కిందిస్థాయి అధికారుల దుందుడుకుడుతనం విశ్వకర్మలపై పెనుభారం పడుతుంది. ఇటీవల కాలంలో ఫారెస్ట్ అధికారులు దాడులు తీవ్రతరం చేశారు.బతుకుపై భారంపడుతుండటంతో ప్రభుత్వ తీరు, అధికారుల పద్ధతిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 5650 వడ్రంగులు.. జిల్లా వ్యాప్తంగా 5650 వడ్రంగుల కుటుంబాలు ఉండగా 12500 జనాభా నివసిస్తున్నారు. వీరిలో 8720 మంది కులవృత్తులపై ఆధారపడి పనులు చేసుకుంటున్నారు. నేటి కంప్యూటర్ యుగంలో యాంత్రీకరణతో పనులు ఎక్కువగా సాగుతున్నప్పటికీ వడ్రంగులు తమ కష్టాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వడ్రంగులు తమ వద్దకు కర్రను తీసుకువచ్చే వారికి ఇండ్లకు, ఇంట్లోకి కావాల్సిన పర్నిచర్‌ను తయారు చేస్తుంటారు. కేవలం ఫర్మిషన్ ఉన్న కర్రను మాత్రమే తీసుకువస్తే ఇంటి ధర నిర్ణయించి పనులు చేస్తారు. ఇలా అనేక సంవత్సరాలుగా కులవృత్తులను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు గ్రామాల్లో వారు చేసే పనులు ఫారెస్ట్ అధికారులకు పూర్తిస్థాయిలో నిత్యం తెలుస్తూనే ఉండేది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాలతో తనిఖీలు నిర్వహించినా ఎలాంటి అక్రమ కలప లభించని సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అధికారుల అడపాదడపా తనిఖీలను తట్టుకొని సైతం పనులు సాగిస్తున్నారు. ఇటీవల ఫారెస్ట్ అధికారుల దాడులతో పర్మిట్ కర్రను సైతం కొనుగోలు చేసుకోలేని స్థితులు రావడంతో వారి జీవనంపై పెను భారం పడుతోంది నూతన చట్టాలతో తప్పని తలపోటు.. తెలంగాణ ప్రభుత్వం అడవులను రక్షించాలనే మంచి ఉద్దేశంతో మార్పులు తీసుకువచ్చింది. ఆ మార్పులే వడ్రంగుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఇటీవల ఫారెస్ట్ చట్టాల్లో వచ్చిన మార్పులు వడ్రంగులకు తలపోటు తప్పడంలేదు. వడ్రంగులపై గత వారం రోజులుగా ఫారెస్ట్ అధికారులు తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారు. ఇంటి నిర్మాణానికి కావాల్సిన కలప, ఫర్నిచర్‌కు కావాల్సిన కలపను తయారు చేయించుకోవడానికి వినియోగదారులు వడ్రం గుల వద్దకు తీసుకెళ్లగా వారిపై ఫారెస్ట్ అధికారులు దాడులు నిర్వహించి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఎలాంటి తప్పులు చేయకున్నా అక్రమంగా కేసులు నమోదు చేస్తుండడంతో బతుకుపై భారం పడుతుందని వడ్రంగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందని ప్రభుత్వ చేయూత.. గత ప్రభుత్వాలు ఏనాడు విశ్వకర్మలకు ఆర్థిక ఎదుగుదలకు సహకరించలేదు. కేవలం తాత్కాలిక పనిముట్లు అందించి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉండేది. ఆయా కులాల వారీగా ప్రభుత్వాలు ప్రత్యేక సొసైటీలు ఏర్పాటు చేసి ఆర్థిక రుణాలు అందించారు. కానీ విశ్వకర్మలకు ఎలాంటి రుణ, ఆర్థిక సహాయాలు అందని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే విశ్వకర్మల బ్రతుకులు మారతాయనుకున్నారు. తెలంగాణ కోసం విశ్వకర్మలైన తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్, శ్రీకాంతచారి, మారోజు వీరన్నలతో పాటు పలువురు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించారు. వారి తాగ్యాలతో ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో విశ్వకర్మలకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. దాడులకు నిరసనగా చలో హైదరాబాద్... ఫారెస్ట్ అధికారులు విశ్వకర్మలపై దాడులను నిరసిస్తూ ఈ నెల 16, 17 తేదీల్లో ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఫ్లాంటేషన్ కర్రను ప్రభుత్వమే ఖరీదు చేసి విశ్వకర్మ వడ్రంగులకు పంపిణీ చేయాలని, విశ్వకర్మ కార్పొరేషన్‌ను 600 కోట్లతో ఏర్పాటు చేసి వడ్రంగుల కుటీర పరిశ్రమలుగా ఏర్పాటు చేయాలని, జీవన అభివృద్ధి కోసం ముడి కలపను పంపిణీ చేయాలని, ఇంటి వద్ద ఫర్నిచర్‌ను 20 ఫీట్ల వరకు రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమం కోసం సిద్ధమవుతున్న వడ్రంగులను ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛలో హైదరాబాద్‌ను భగ్నం చేసేందుకు ఉన్నతాధికారులు పోలీసులతో వారిని అరెస్ట్ చేస్తుండడంపై ప్రభుత్వంపై తీవ్ర అసహనం చేస్తున్నారు. వడ్రంగులపై దాడులను ఆపాలి కులవృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వడ్రంగులపై ఫారెస్ట్ అధికారుల దాడులను ఆపాలి. అనేక సంవత్సరాలుగా పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నం. ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా చట్టాలు మారాయంటూ ఇళ్ల మీదకు వచ్చి దాడులు నిర్వహించడం సరికాదు. దాడులతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.– దేవోజు సదానందం, నర్సంపేట కుటీర పరిశ్రమలుగా గుర్తించాలి ఇంటి వద్ద పని చేస్తూ జీవనం గడుపుతున్న వడ్రంగి వృత్తులను కుటీర పరిశ్రమలుగా గుర్తించాలి. 20 ఫీట్ల ఫర్నిచర్‌కు రాయితీలు కల్పించాలి.విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలి.అనేక సంవత్సరాలుగా కులవృత్తులపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఫారెస్ట్ దాడులతో రోడ్డున పడుతున్నాం. దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నం. – కురిమిల్ల సుదర్శనచారి,నర్సంపేట -
ఆ ఒక్కరే దిక్కు
వనపర్తి: రోజురోజుకు తగ్గిపోతున్న వనాలు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. ఫారెస్టు చట్టాలను మరింత కఠినతరం చేయడమే కాకుండా అటవీప్రాంతాన్ని కాపాడటంతో పాటు పచ్చదనం పెంచేందుకు ఊరుకో నర్సరీని ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా 139 గ్రామాల్లో డ్వామా, ఫారెస్టు శాఖల ఆధ్వర్యంలో నర్సరీలు పెంచుతున్నారు. వచ్చే వర్షాకాలం నాటికి మొక్కలు నాటే దశకు వస్తాయి. కానీ అటవీ ప్రాంతా న్ని రక్షించే వనమాలి(బీట్ ఆఫీసర్) మాత్రం జిల్లాలో ఒక్కరే ఉన్నారు. ఫారెస్ట్ శాఖ లో ఉద్యోగుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. జిల్లాలో 11,083 హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఈ పచ్చని ప్రాంతంలో వివిధ రకాల చెట్లు, మొక్కలు, అడవి జంతువులు, నెమళ్లు, జింకలు, కుందేళ్లతో పాటు ఇతర జంతువులు ఉన్నాయి. అడవిలో ఉండే చెట్లు, మొక్కలతో పాటు వన్యప్రాణులను సంరక్షించేందుకు జిల్లా అటవీశాఖ అధికారులు mahaమొత్తం అటవీ ప్రాంతాన్ని 26 బీట్లుగా విభజించారు. ఒక్కో బీటుకు ఒక్కో అధికారి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలి. ఒక్కో బీట్ అధికారికి సుమారుగా 500 నుంచి 700 హెక్టార్ల భూభాగాన్ని కేటాయించారు. వారికి కేటాయించిన ప్రాంతంలోని చెట్లు, వన్యప్రాణులను నిరంతరం రక్షిస్తూ ఉండాలి. ఆ ఒక్కరే దిక్కు జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని కాపాడేందుకు 26 వనమాలీలు (బీట్ అధికారులు) ఉండాల్సి ఉండగా.. కేవలం ఒక్కరు మాత్రమే ఉన్నారు. సెక్షన్ అధికారులకు విధులను కేటాయించి వనసంరక్షణ చర్యలు చేపడుతున్నారు. చట్టాలను కఠినతరం చేస్తూ వనాలు, వన్యప్రాణుల రక్షణపై అధికారులు దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అటవీ ప్రాంతాన్ని కాపాడటం, చెట్లు తక్కువగా ఉన్న ప్రాంతంతో పాటు రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటించి పెంచడం, ఆయా బీట్ల పరిధిలో వన్యప్రాణులను రక్షించడం వనమాలి విధులు. ‘వనాల’పర్త జిల్లావ్యాప్తంగా 11,083 హెక్టార్లలో అటవీప్రాంతం ఉండగా వనపర్తి మండలం, ఖిల్లాఘనపురం మండలం, గోపాల్పేట మండలం బుద్దారం, పాన్‌గల్ మండలం, పెద్దమందడి మండలాల్లోని ప్రాంతాల్లో అటవీప్రాంతం ఎక్కువగా ఉంది. వనపర్తి సంస్థానాధీశులు ఫారెస్ట్ కోసం ఇచ్చిన భూభాగమే ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ప్రస్తుతం వనపర్తి మండలం శ్రీనివాసపురం, సవాయిగూడెం, చందాపూర్, దత్తాయపల్లి తదితర ప్రాంతాలను కలుపుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని కొందరు ఆక్రమించేందుకు ప్రయత్నించగా, కేంద్ర రక్షణ బలగాలు ఇక్కడ కొన్నాళ్లూ క్యాంపులు వేసి ఈ భూమిని ఫారెస్టుశాఖకు వర్తింపజేసేలా నీలగిరి చెట్లు, ఇతర రకాల మొక్కలను నాటించి వెళ్లారు. నాటినుంచి భూమి ఫారెస్ట్‌శాఖ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.! నియామకాల ఊసేది? ఫారెస్టు శాఖలో సెక్షన్, బీట్ అధికారుల నియామకం కోసం ఏడాదిన్నర క్రితం ఉద్యోగ అర్హత పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఉద్యోగులను ఎంపిక చేశారు. కారణాలు ఏవైనా వారికి ఇప్పటి వరకు నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. కొత్త చట్టాలను పకడ్బందీగా అమలుకు ఉద్యోగులను నియమించాల్సి ఉందని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. అడవి రక్షణకు చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్న 1967 ఫారెస్టు చట్టంలో మార్పులు చేస్తూ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ఫారెస్టుశాఖ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చట్టాలను మరింత కఠినతరం చేస్తూ ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు పంపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో వనాలు, వన్యప్రాణులు, పచ్చదనం పెంచడం తదితర అశాలపై సుదీర్ఘచర్చ జరిగే అవకాశం ఉంది. పకడ్బందీగా చట్టం అమలు మారుతున్న ఫారెస్టు చట్టాల ప్రకారం గతంలో అడవిలో చెట్లు నరికితే ఏడాది కాలం జైలు శిక్ష ఉండేది. మారిన చట్టాల ప్రకారం కనీసం మూడేళ్లు జైలుశిక్ష, రూ.ఐదువేల జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక నుంచి ప్రభుత్వం, ప్రైవేట్ ప్రదేశాల్లో ఎక్కడ చెట్లు నరికినా కఠినచర్యలు తప్పవు. చట్టాలను పకడ్బందీగా అమలుచేయాలంటే అవసరమైన సిబ్బందిని నియమిస్తే బాగుంటుంది. – బాబ్జిరావు, జిల్లా అటవీ అధికారి, వనపర్తి -
నిబంధనలు వర్తిస్తాయి!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అటవీ సంపద, వృక్షాల సంరక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు టింబర్ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలకు గొంతులో వెలక్కాయలా మారాయి. రోజురోజుకూ వృక్ష సంపద అంతరించిపోతుండడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోంది. దీనిని నివారించేందుకు విస్తృతంగా మొక్కలు పెంచడంతోపాటు ఇప్పుడున్న అటవీ సంపద, వృక్షాలను కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ‘జంగల్ బచావో – జంగల్ బడావో’ కార్యక్రమం అమలులో భాగంగా తాజాగా తుమ్మ, వేప, మామిడి కలపకు వాల్టా చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా సామిల్లుల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. మరోపక్క నిబంధనలు పాటించని సామిల్లులు, టింబర్ డిపోలపై పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలోని 274 టింబర్ డిపోలు, సామిల్లుల యాజమాన్యాల్లో ఆందోళన మొదలైంది. ది ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ టింబర్ మర్చంట్స్, సామిల్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని వాటి యజమానులు నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం విధించిన నిబంధనలతో తాము టింబర్ డిపోలను, సామిల్లులను నడపలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పచ్చదనం లోటు 25.62 శాతం.. జాతీయ అటవీ విధానం ప్రకారం భూభాగంలో మూడో వంతు పచ్చదనం ఉండాలి. కాని మన జిల్లాలో ఇదెక్కడా కనిపించడం లేదు. జిల్లా వైశాల్యం 7.5 లక్షల హెక్టార్లు కాగా.. ఇందులో ప్రస్తుతం 7.38 శాతం (సుమారు 55,350 హెక్టార్లు) మాత్రమే అడవులు, వృక్షాలు విస్తరించి ఉన్నాయి. ఈ పచ్చదనాన్ని మరో 25 శాతానికి పెంచితే.. నిర్దేశిత 33 శాతం పచ్చదనం సాధ్యపడుతుంది. ఈ నేపథ్యంలో మొక్కల పెంపకం, అటవీ, వృక్ష సంపద సంక్షరణకు యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇటీవల జిల్లాలోని టింబర్ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలు, అటవీ, పోలీస్ శాఖల అధికారులతో కలెక్టర్ లోకేష్ కుమార్ సమావేశమై పలు ఆదేశాలు జారీ చేశారు. అటవీ శాఖ నియమావళి ప్రకారం టింబర్ డిపోలు, సామిల్లుల యాజమానులు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలన్నారు. కలప క్రయవిక్రయాల రికార్డులను నిర్వహించాలని సూచించారు. అయితే, ఈ షరతులు తమ పాలిట శరాఘాతంగా మారాయని టింబర్ డిపోలు, సామిల్లుల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. -
ఇచ్చోడ టు ఇందూరు
ఇచ్చోడ(బోథ్): ఆదిలాబాద్ జిల్లాలోని అడవుల నుంచి కలప రవాణా దందా ఇచ్చోడ నుంచి ఇందూర్ వరకు నిరా టంకంగా సాగుతోంది. జిల్లాలోని కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్ ప్రాంతాల్లో నివసించే ముల్తానీలు కలప స్మగ్లింగ్ గ్యాంగ్‌లుగా ఏర్పడి కోట్ల రూపాయల కలపను జిల్లా సరిహద్దులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. కలప తరలింపులో సిద్ధహస్తులుగా పేరున్న ముల్తానీలకు నిజామాబాద్‌లో కలప దందా విక్రయాలు చేసే సామిల్ యజమానులు అండగా ఉండడంతో దందా సాగుతోంది. ఈ ముల్తానీలు ఎవరు? పాకిస్తాన్ ముల్తాన్ ప్రావిన్స్ (రాష్ట్రంలో)లోని ముస్లింలలో గిరిజన తెగకు చెందిన ముల్తానీలు దేశానికి స్వాతంత్రం రాక ముందు ఇక్కడి ప్రాంతానికి వలస వచ్చారు. మహారాష్ట్రలోని కిన్వట్ తాలుకా చికిలి, ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలం కేశవపట్నం, గుండాల, ఎల్లమ్మగూడ, జోగిపేట్‌లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. స్వాంతంత్రం రాక ముందు ముల్తాన్ రాష్ట్రం అవిభక్త భారత్‌లో భాగంగా ఉండేది. దీంతో ముల్తానీలు అక్కడి నుంచి కూలీనాలీ చేసుకుంటూ సంచార జీవితం ప్రారభించారు. పొట్ట చేతబట్టుకొని అడవుల గుండా గుడారాలు ఏర్పాటు చేసుకుంటూ ఈ ప్రాంతానికి చేరుకున్నారు. పాకిస్తాన్ ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. ఇక్కడి వారు ఇక్కడే ఉండిపోయారు. కేశవపట్నం, గుండాల నుంచి జోగిపేట్, బావోజీపేట్, ఎల్లమ్మగూడలకు విస్తరించారు. వీరు నివసించే ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతాలుగా ఉండేవి. దీంతో ముల్తానీలు కలప రవాణానే ఉపాధిగా మార్చుకున్నారు. ముందు నుంచి నేరప్రవృత్తే... అక్రమంగా కలప రవాణాకు పాల్పడే ముల్తానీలు ముందు నుంచి నేరప్రవృత్తి కలిగిన వారే ఎక్కువ. కలప రవాణా ప్రారంభం మొదట్లో చుట్టు పక్కల ప్రాంతాల్లో గృహ నిర్మాణం, ఇతర అవసరాలకోసం కలపను రవాణా చేసే వారు. ముందుగా కలప రవాణా ఎడ్లబండ్ల ద్వారా ప్రారంభమైంది. దాదాపుగా 20కిపైగా ఎడ్లబండ్ల ద్వారా కలపను తీసుకెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయించే వారు. కలప రవాణాలో అడ్డువచ్చిన వారిని భయాందోళనకు గురి చేసి అడ్డుతొలగించేవారు. ఈ రవాణా రాత్రి వేళల్లోనే కొçనసాగేది. కాలక్రమంలో వాహనాల్లో హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు కలపను తరలించడం ప్రారంభించారు. జాతీయ రహదారిలో వెళ్తున్న వాహనాలు హైజాక్ చేసి కలపను జిల్లా సరిహద్దులు దాటవేయడం చేశారు. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే లారీలు ఇక్కడి ప్రాంతాల్లో నిలిపిన సమయంలో లారీలు ఎత్తుకెళ్లి కలప తరలించేవారు. స్మగ్లర్ల ఫొటోలు పలు దాబా హోటళ్ల వద్ద ప్రదర్శించారు. కొద్ది రోజులకు లారీల హైజాక్ నిలిచిపోయింది. ముల్తానీలు దందా కొనసాగించడానికి మరో పద్ధతి ఎంచుకున్నారు. జాతీయ రహదారిలోని దాబా హోటల్లో మకాం వేసి కలప స్మగ్లింగ్‌కు అణువుగా ఉన్న లారీ డ్రైవర్లను మచ్చిక చేసుకొని కూరగాయాలు హైదరాబాద్‌కు తరలించాలని నమ్మించి డబ్బు ఆశ చూపేవారు. జాతీయ రహదారికి పర్లాంగ్ దూరంలో కూరగాయలు ఉన్నాయని నమ్మించి తీసుకెళ్లిన లారీలో అరగంటలోనే కలప లోడ్ చేసి డ్రైవర్లను బెదిరించి తరలించేవారు. ఇలా తరలిస్తున్న క్రమంలో కొన్ని వందల లారీలు పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. సినిమాను తలపించేలా స్మగ్లింగ్ కొన్ని ఏళ్ల నుంచి కలప రవాణా ఆధారంగా జీవిస్తున్న ముల్తానీలు సినిమాను తలపించేలా స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సెల్ఫొన్ వ్యవస్థ వీరికి అండగా ఉంటోంది. రాత్రి సమయంలో అటవీ, పోలీస్ అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి మరోచోట నుంచి కలపను తరలిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులను నమ్మించడానికి చిన్న వాహనంలో కలప ఉంచుతున్నట్లు తెలుస్తోంది. చిన్న వాహనాన్ని మండలకేంద్రానికి తరలించేలోపే మరోచోట నుంచి పెద్ద మొత్తంలో కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. ఏడాదిలో రూ.50 లక్షల కలప పట్టివేత 2018లో జనవరి నుంచి నవంబర్ వరకు దాదాపుగా రూ.50 లక్షల కలపతోపాటుగా 18 వాహనాలు అటవీ, పోలీసుశాఖ అధికారులు పట్టుకున్నారు. ఈ ప్రకారం మరో పదోవంతు రూ.5 కోట్ల విలువైన కలప ఇచ్చోడ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పదేళ్లలో నిజామాబాద్ వ్యాపారుల కనుసన్నల్లో రూ.50 కోట్ల కలప తరలిపోయినట్లు సమాచారం. వందలకుపైగా వాహనాల నంబర్ ప్లేట్లు.. నిజామాబాద్‌లోని పలు సామీల్లలో అటవీ శాఖ, పోలీసుశాఖ తనిఖీలు నిర్వహించగా వందల కొద్ది వాహనాల నంబర్ప్లేట్లు లభించడంతో ముల్తానీలకు వ్యాపారులు సహకరిస్తున్నారని తేలింది. ఇచ్చోడ ప్రాంతంలో పట్టుబడ్డ వాహనాలకు పైన ఒకనంబర్ ప్లేట్, కింది భాగంలో మరోనంబర్ ప్లేట్, వాహనంలో మరో నంబర్ ప్లేట్ లభించిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. నిజామాబాద్ వ్యాపారుల కీలకపాత్ర.. ముల్తానీలు సాగిస్తున్న కలప స్మగ్లింగ్‌కు పదేళ్ల నుంచి నిజామాబాద్‌కు చెందిన కలప వ్యాపారులు రంగంలోకి దిగారు. దీంతో ముల్తానీల కలప రవాణా జోరందుకుంది. కలప రవాణా చేయడానికి అక్కడి వ్యాపారులే వాహనాలు సమకుర్చడం, స్మగ్లింగ్‌లో ముల్తానీలకు నూతన పద్ధతులు నేర్పించడంతో అక్రమ కలప రవాణాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. పదేళ్లుగా ఇచ్చోడ ప్రాంతం నుంచి వేల కోట్ల కలప జిల్లా సరిహద్దులు దాటి పోయింది. సెల్‌ఫోన్ వ్యవస్థ అందుబాటులోకి రావడం. కలపతో లోడ్ చేసిన వాహనాన్ని జాతీయ రోడ్డుపైకి ఎక్కించి, ఆదిలాబాద్ జిల్లాలోని చెక్పోస్టులతోపాటుగా నిర్మల్, నిజామాబాద్ సరిహద్దులోని సోన్ చెక్‌పోస్టులు కలప వాహనాలు దాటే వరకు నిజామాబాద్ కలప వ్యాపారులు చూసుకోవడంతో కలప దందా ఊపందుకుంది. ముల్తానీలు నివాసమంటున్న గ్రామాల్లో వందలకుపైగా గ్యాంగ్‌లుగా ఏర్పడి దట్టమైన అడవిలోని విలువైన టేకు కలప నరికి తరలించడానికి పూనుకున్నారు. చెక్‌పోస్టులపైనే అనుమానాలు కొన్నేళ్లుగా జిల్లా సరిహద్దుల నుంచి కలపతో వాహనాలు దాటిపోతూనే ఉన్నా జాతీయ రహదారిపై ఉన్న ఇస్పూర్, మొండిగుట్ట చెక్‌పోస్టుల వద్ద ఇప్పటి వరకు ఒక్క వాహనం కూడా పట్టుపడకపోవడంతో, చెక్‌పోస్టుల నిర్వహణపై పలు అనుమానాలకు తావిస్తోంది. అటవీ«శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది సహకరిస్తుండడంతోనే ఈ వ్యవహారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నట్లు సమాచారం. కలప అక్రమ నివారణకు పూర్తిస్థాయిలో చర్యలు కలప అక్రమ నివారణకోసం ప్రభుత్వం పూర్తిస్థాయి చర్యలు తీసుకుంటోంది. కలప స్మగ్లర్లపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. స్మగ్లింగ్‌కు పాల్పడితే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. స్మగ్లింగ్ అడ్డుకోవడానికి పోలీస్, ఫారెస్టుశాఖ సమన్వయంగా అడవుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. – చంద్రశేఖర్, ఎఫ్‌డీవో -
నిర్లక్ష్యంపై వేటు
నిర్మల్: ‘జంగిల్ బచావో–జంగిల్ బడావో’ నినాదాన్ని సీఎం కేసీఆర్ వందశాతం అమలు చేసేందుకు సీరియస్‌గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో వన్యప్రాణుల వేట, కలప అక్రమ దందాలు జోరుగా సాగడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో ఇన్నేళ్లుగా అడవులను కాపాడటంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై సర్కారు బదిలీ వేటు వేసింది. పలువురికి తక్కువ స్థాయి బాధ్యతలు అప్పగించింది. వారి స్థానాల్లో కఠినంగా వ్యవహరించే, నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను నియమించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అటవీశాఖ ఉన్నతాధికారులు బదిలీలను చేపట్టారు. అడవుల సంరక్షణ, చెట్ల పెంపకంపై చిత్తశుద్ధి చూపించే అధికారులను ముఖ్యప్రాంతాల్లో నియమించినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండే ఉమ్మడి ఆదిలాబాద్‌లో నిబద్ధత కలిగిన అధికారులను నియమించడం, స్మగ్లర్లు, వన్యప్రాణుల వేటగాళ్లపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మంగళవారం సాయంత్రం జిల్లా భారీగా బదిలీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో బుధవారం నలుగురు ఎఫ్ఆర్ఓలకూ స్థానచలనం చేశారు. మొత్తం క్షేత్రస్థాయి నుంచి బదిలీల ప్రక్రియ కొనసాగుతుందని అటవీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో నలుగురు బదిలీ.. ఉమ్మడిజిల్లా అటవీశాఖలో బదిలీల అలజడి కొనసాగుతోంది. కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(సీఎఫ్)తో పాటు కవ్వాల్ అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్స్(ఎఫ్డీపీటీ)గా ఉన్న శరవణన్, నిర్మల్, మంచిర్యాల డీఎఫ్ఓలు దామోదర్‌రెడ్డి, రామలింగంను మంగళవారం సాయంత్రం బదిలీ చేశారు. వారి తర్వాత బుధవారం ఉమ్మడి జిల్లాలో నలుగురు ఫారెస్ట్ రేంజ్ అధికారు(ఎఫ్ఆర్ఓ)లను ట్రాన్స్ఫర్ చేశారు. నిర్మల్‌జిల్లా దిమ్మదుర్తి రేంజ్ ఎఫ్ఆర్ఓ షబ్బీర్ అహ్మద్‌ను మంచిర్యాలలోని తునికాకు(బీడీ లీఫ్) గోదాం ఇన్చార్జి(స్పెషల్డ్యూటీ)గా పంపించారు. దిమ్మదుర్తి రేంజ్ బాధ్యతలను ఇంకా ఎవరికీ అప్పగించలేదు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి ఎఫ్ఆర్ఓ నిజామొద్దీన్‌ను కెరమెరి రేంజ్ అధికారిగా బదిలీ చేశారు. కెరమెరిలో ఎఫ్‌ఆర్‌ఓగా పనిచేస్తున్న మజారొద్దీన్ను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రేంజ్ ఎఫ్‌ఆర్‌ఓగా బదిలీ చేశారు. బెల్లంపల్లి ఎఫ్ఆర్ఓ వినయ్‌కుమార్‌ను తిర్యాణి రేంజ్‌కు పంపించారు. పనితీరుపైనే.. ఏళ్లుగా అటవీశాఖలో కలప దొంగతనాలు, వన్యప్రాణుల వేట కొనసాగుతూ వస్తోంది. అరికట్టాల్సిన శాఖాధికారుల్లోనే కొందరు ఇంటిదొంగలుగా మారి, స్మగ్లర్లకు సహకరించారు. తమకు తెలిసినా అరికట్టలేకపోయిన తీరు, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంపైనే సర్కారు సీరియస్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు.. ఉమ్మడి జిల్లా అడవుల్లో ఇటీవల కాలంలో వరుస సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెంబి మండలం పుల్గంపాండ్రి వద్ద పెద్దపులిని హతమార్చడం, పాత మంచిర్యాల బీట్‌లో చిరుతపులి, శివ్వారం బీట్‌లో ఏకంగా రాయల్ బెంగాల్ టైగర్‌ను మట్టుబెట్టడం.. ఇలా వరుసగా సంచలనాలు చోటుచేసుకున్నాయి. కవ్వాల్ అడవుల్లోకి అడుగు పెట్టిన ప్రతి పులినీ వేటగాళ్లు ఖతం చేస్తున్నా.. అరికట్ట లేకపోవడం స్థానిక అధికారులకు మైనస్ అయ్యింది. దీనికి తోడు ఆదిలాబాద్–నిర్మల్–నిజామాబాద్ జిల్లాల మధ్య పెద్ద కలప రాకెట్ కూడా బయట పడటం, అందులో ఇంటి దొంగలతో పాటు పోలీసు అధికారుల ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఈ వరుస ఘటనలపై ‘సాక్షి’ లోతైన పరిశోధనలతో వరుస కథనాలనూ ప్రచురించింది. వీటన్నింటి నేపథ్యంలో ఉమ్మడి జిల్లా అటవీశాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సర్కారు సీరియస్‌గా దృష్టి పెట్టింది. ఏకంగా సీఎఫ్‌తో పాటు ఇద్దరు డీఎఫ్ఓలు, పలువురు ఎఫ్డీఓలు, ఎఫ్‌ఆర్‌ఓలను బదిలీ చేసింది. విధుల్లో చేరని కొత్త బాస్‌లు.. ఉమ్మడి ఆదిలాబాద్ సీఎఫ్ శరవణన్‌ను మంగళవారం సాయంత్రం మెదక్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఎఫ్డీపీటీ, సీఎఫ్‌గా ఉన్న సీపీ. వినోద్‌కుమార్‌ను కేటాయించారు. కానీ ఆయన బుధవారం విధుల్లో చేరలేదు. అలాగే మంచిర్యాల డీఎఫ్ఓగా ఉన్న రామలింగంను వరంగల్అర్బన్, జనగామ జిల్లాల డీఎఫ్ఓగా పంపించారు. ఆయన స్థానంలో రావాల్సిన ఐఎఫ్ఎస్ అధికారి శివానీ డోగ్రా కూడా బాధ్యతలు చేపట్టలేదు. నిర్మల్ డీఎఫ్ఓగా ఉన్న దామోదర్‌రెడ్డిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డివిజన్లోని కిన్నెరసాని వైల్డ్‌లైఫ్‌కు కేటాయించారు. నిజామాబాద్జిల్లా డీఎఫ్ఓ వీఎస్ఎన్వీ ప్రసాద్ నిర్మల్‌కు కేటాయించారు. ఆయన కూడా ఇంకా విధుల్లో చేరలేదు. పులి హతం కేసులకు సంబంధించిన విచారణలో సీఎఫ్ శరవణన్, నిర్మల్ డీఎఫ్ఓ దామోదర్‌రెడ్డి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు వారు వచ్చిన తర్వాత కొత్త అధికారులు విధుల్లో చేరనున్నట్లు ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మంచిర్యాల ఎఫ్‌డీఓగా కిన్నెరసాని వైల్డ్‌లెఫ్ ఎఫ్‌డీఓగా ఉన్న ఎం.నాగభూషణం, కాగజ్‌నగర్ ఎఫ్‌డీఓగా పీసీసీఎఫ్ ఆఫీస్‌లో ఏసీఎఫ్‌గా ఉన్న ఎం.రాజారమణారెడ్డి, ఖానాపూర్ ఎఫ్‌డీఓగా ప్రస్తుతం బెల్లంపల్లి ఎఫ్డీఓ, మంచిర్యాల ఇన్చార్జి ఎఫ్‌డీఓగా ఉన్న తిరుమల్‌రావు బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కొనసాగనున్న బదిలీలు.. ప్రభుత్వం మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 200 మంది అధికారులను బదిలీ చేసింది. ఇందులో చీఫ్ కన్జర్వేటర్ నుంచి బీట్ ఆఫీసర్ వరకు ఉన్నారు. రాష్ట్రంలో 19 మంది రేంజ్ ఆఫీసర్లను మార్చినట్లు తెలిసింది. ఇందులో బుధవారం ఉమ్మడి జిల్లాలో నలుగురికి స్థానచలనం కల్పించారు. కెరమెరి, బెల్లంపల్లి, తిర్యాణి, దిమ్మదుర్తి ఎఫ్‌ఆర్‌ఓలను బదిలీ చేశారు. ఇక రాష్ట్రంలో బీట్ ఆఫీసర్లు 160 మందిని బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది ఎఫ్బీ ఓల బదిలీ జరగనుందో తేల్చే పనిలో ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా అటవీ సంబంధిత నేరాలను నివారించడంలో విఫలమైన వారిని, పనితీరు సరిగా లేని వారిని బదిలీ చేసి, ఆయా అటవీ ప్రాంతాల్లో సమర్థులను కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అటవీశాఖలో ఇదే అంశంపై చర్చ సాగుతోంది. -
అడవి దొంగలపై ఉక్కుపాదం
ఇచ్చోడ(బోథ్): అడవి దొంగలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో తొలిసారిగా పీడీ యాక్టు అస్త్రాన్ని ప్రయోగించారు. అటవీ సంపదను దోచుకునే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో కలప దొంగలపై జిల్లా యంత్రాంగం ఓ కన్నేసింది. పీడీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. జిల్లాలో తొలిసారిగా ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన కలప స్మగ్లర్ షబ్బీర్‌పై కలెక్టర్ అనుమతితో జిల్లా పోలీసులు పీడీ యాక్టు కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. జిల్లాల వారీగా అడవి దొంగల గుర్తింపు ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల వారీగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారిని ఇప్పటికే అధికారులు గుర్తించి జాబితా తయారు చేశారు. జల్లా వ్యాప్తాంగా కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ నేర ప్రవృత్తిపైనే ఆ«ధారపడ్డా వారు 69 మంది వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. త్వరలో 69 మందిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ, గుడిహత్నూర్, నేరడిగొండ, బజార్హత్నూర్, బోథ్, పెంబి, ఇంద్రవెళ్లి, సిరికొండ, ఖానాపూర్, కడెం, మామడ, సారంగపూర్, ఉట్నూర్, జన్నారం, తిర్యాణి, వాంకిడి మండలాల్లో అడవి దొంగలను అధికారులు గుర్తించారు. సీఎం సీరీయస్.. ఆదిలాబాద్ జిల్లాలో 43 శాతం ఉన్న అడవులు 33 శాతానికి పడిపోవడంతో రానున్న రోజుల్లో పర్యావరణానికి త్రీవ ముప్పు ఏర్పడనుండడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సీరీయస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. జంగిల్ బచావో..జంగిల్ బడావో అనే నినాదంతో అడవుల పెంపకంపై దృష్టి సారించారు. ఈ మేరకు జిల్లా అధికారులు స్మగ్లర్ల ఆట కట్టించే పనిలో ఉన్నారు. సీఎంవో నుంచి పర్యవేక్షణ.. కలప స్మగ్లింగ్ జరుగుతున్న ప్రాంతాలు, స్మగ్లర్లు, అధికారులు, నాయకులపై సీఎంవో నుంచి రోజు వారి పర్యవేక్షణ జరుగుతున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా జరుగుతున్న కలప స్మగ్లింగ్‌ను నిరోధించడంలో సీఎంవో అధికారులు జిల్లా స్థాయి అధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నట్లు తెలుస్తుంది. కలప స్మగ్లింగ్‌లో ప్రమేయం ఉన్న వారు ఎంతటి వారైనా వదిలపెట్టకుండా పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. దీంతో అటవీశాఖ, పోలీసు అధికారులు, నాయకులు, స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జిల్లాలో మొదటి సారిగా పీడీ యాక్టు.. జిల్లాలో పీడీ యాక్టు కేసు మొదటిసారిగా నమోదైంది. ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన కలప స్మగ్లర్ శబ్బీర్‌పై ఈ యాక్టు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. గత కొన్ని రోజుల నుంచి అటవీఅధికారులు, పోలీసులకు సవాలుగా మారిన శబ్బీర్‌పై ఇచ్చోడ, నేరడిగొండ, గుడిహత్నూర్, ఆదిలాబాద్, నిర్మల్ పోలీస్టేషన్ల పరిధిలో 15 వరకు కేసులు ఉన్నాయి. అటవీ అధికారులపై దాడులు, అటవీ చెక్‌పోస్టుల ధ్వంసం వంటి కేసులు కూడా అటవీశాఖలో నమోదై ఉన్నాయి. గత కొన్నేళ్లుగా తరచూ అక్రమ కలప రవాణా చేయడం లాంటి కేసులు ఉండటంతో మోస్ట్ వాంటెండ్ కింద శబ్బీర్‌పై పీడీ యాక్టు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అజ్ఞాతంలోకి స్మగ్లర్లు.. గత వారం రోజుల కిత్రం కలప స్మగ్లర్ శబ్బీర్ను పోలీసులు అరెస్ట్ చేసి పీడీ యాక్టు కింద జైలుకు తరలించడండంతో కలప స్మగ్లర్లలో వణుకు పుట్టింది. కొన్నేళ్ల నుంచి కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ ఐదారు కేసులు ఉన్న వారిపై పీడీ యాక్టులు నమోదు చేస్తారని ప్రచారం జరుగుతుండడంతో కలప స్మగ్లింగ్‌కు పాల్పడుతూ పలు కేసుల్లో అరెస్ట్ అయి జామీనుపై బయటకు వచ్చిన వారు చాలా మంది ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. పీడీ యాక్టు కింద కేసు నమోదు చేయాల్సిన వారిపై పోలీసులు ఓ కన్నేసి వారి కదలికలను గమనిస్తున్నట్లు సమాచారం. -
కలప అక్రమ రవాణాకు చెక్
రామాయంపేట(మెదక్): అటవీ ప్రాంతల నుంచి కలప అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అడవులను కాపాడే నేపథ్యంలో కఠినంగా వ్యవహరించాలని అటవీశాఖ అధికారులను తాజాగా ప్రభుత్వం ఆదేశించింది. ఎవరినీ వదిలిపెట్టకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. జిల్లాలో విలువైన కలప లేకపోవడంతో రామాయంపేట అటవీ ప్రాంతం మీదుగా ఇతర రాష్ట్రాల నుంచి టేకు, ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. దీంతో ఈ విషయమై జిల్లా అటవీశాఖ ప్రత్యేక చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఎక్కడిక్కడ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు ముమ్మరం చేశారు. అటవీ ప్రాంతం రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంచేందుకు సీఎం ఆదేశాల మేరకు జిల్లాలో అధికారులు పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. జిల్లాలో అటవీ ప్రాంతం నుంచి కలప అక్రమ రవాణా తగ్గినప్పటికీ అక్రమార్కులు అడపాదడగా చెట్లను నరుకుతునే ఉన్నారు. వీరికి ఇప్పటికే గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జిల్లాలో మొత్తం ఆరు రేంజీల పరిధిలో 58 వేల హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో విలువైన కలప లేకపోవడంతో ఈ ప్రాంతంలో కలప అక్రమ రవాణా తక్కువగానే సాగుతోంది. సీఎం ఆదేశాల దరిమిలా అన్ని రేంజీల పరిధిలో ప్రత్యేక చర్యలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో అక్రమ రవాణా జరిగినా ప్రాంతాలను అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గిరిజనతండాలను ఆనుకునే ఉన్న అటవీ ప్రాంతం నుంచి అక్కడక్కడా చెట్లను నరుకుతున్నట్లు సమాచారం. ఇందుకు గుర్తుగా మొడులు మాత్రమే మిగిలాయి. జాతీయ రహదారిపై నుంచి విలువైన కలప అక్రమ రవాణా జరుగుతుండగా... పలుమార్లు రామాయంపేటవద్ద అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు పట్టుబడ్డాయి. ఇతర రాష్ట్రాలనుంచి గతంలో ఎర్రచందనం, టేకు కలప అక్రమరవాణా జరుగుతుండగా అటవీ అదికారులు రామాయంపేట వద్ద పట్టుకున్నారు. ఇందులో భాగంగా రాత్రివేళ పెట్రోలింగ్ ముమ్మరం చేయడంతోపాటు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కలప అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా పరిధిలో అటవీప్రాంతంలో విలువైన కలప లేకపోవడంతో ఈ ప్రాంతంలో అక్రమ రవాణా తగ్గింది. ఏదేమైనా కలప అక్రమ రవాణాకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఉన్నటువంటి అడవిని కాపాడుకోవడానికిగాను ప్రజలు కూడా తమకు సహకరించాలి. ఎదైనా సమాచారం తెలిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. – పద్మజారాణి, జిల్లా అటవీ అధికారిణి -
అడవిని కాపాడాల్సిందే!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ‘‘జంగిల్ బచావో, జంగిల్ బడావో అనే నినాదంతో అధికార యంత్రాంగం ముందుకు సాగాలి. ఓ వైపు చెట్లు పెంచడం కోసం హరితహారం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ, మరోవైపు అడవులు అంతరించి పోతుంటే చూస్తూ కూర్చోవడం వల్ల లాభం లేదు. అడవిని కాపాడకుంటే హరితహారం లాంటి ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా, ఫలితం రాదు. అడవిని కాపాడే విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలి. ఇందుకోసం పోలీసులు, అటవీశాఖ అధికారులు కలిసి పనిచేయాలి. అటవీశాఖకు సాయుధ పోలీసులు అండగా నిలుస్తారు. అడవులును నరికే వారిని, స్మగ్లింగ్ చేసే వారిని గుర్తించే పనిలో ఇంటెలిజెన్స్ ఉంది. స్మగ్లింగ్ జీరో సైజుకు రావాలి. స్మగ్లింగుకు పాల్పడే వారిపై పీడీ యాక్టు నమోదు చేయాలి’’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అటవీ శాఖ అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. అడవుల సంరక్షణ విషయంలో గత కొద్ది రోజులుగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి అటవీశాఖ అధికారులతో శనివారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, అటవీ శాఖ పీసీసీఎఫ్ పికె ఝా, అడిషనల్ డీజీ జితేందర్, ఐజీలు నవీన్‌చంద్, స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, సీసీఎఫ్ రఘువీర్, సీఎంఓ అధికారులు భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ అడవుల నుంచి నిజామాబాద్ మీదుగా హైదరాబాద్ వరకు సాగుతున్న జీరో దందాపై ప్రధానంగా సమీక్షించినట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 8 మంది అటవీ శాఖ అధికారులను అరెస్టు చేయడం, మరో ఇద్దరు లా అండ్ ఆర్డర్ సీఐ, ఎస్ఐలను బదిలీ చేయడం వంటి సంఘటనల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అటవీ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, అడవి నుంచి పూచిక పుల్ల కూడా బయటకు పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయుధ పోలీసులు, అటవీ శాఖ అధికారులతో కలిసి జాయింట్ ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ బృందాలు అడవిలో నిరంతర తనిఖీలు నిర్వహించడంతోపాటు, అడవి నుంచి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓలు కలిసి తమ జిల్లా పరిధిలో అడవుల సంరక్షణకు కావాల్సిన కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ ఇన్స్పెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అడవులు రక్షించే బాధ్యతుల నెరవేర్చాలని కోరారు. స్మగ్లర్లపై ఉక్కుపాదం కలప స్మగ్లింగ్‌కు పాల్పడే వారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నట్లు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించడంతోపాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరైనా కలప స్మగ్లింగ్‌కు పాల్పడితే అందరికన్నా వారినే ముందు అరెస్టు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడం గమనార్హం. ప్రభుత్వం అటవీ సంరక్షణకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన ఈ వ్యాఖ్యల ద్వారా తెలియజేశారు. అడవుల సంరక్షణ కోసం ప్రస్తుతమున్న అటవీ చట్టాలను పూర్తి స్థాయిలో సమీక్షించాలని ఆదేశించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచడం, అడవులను రక్షించడం, స్మగ్లర్లను శిక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యానికి అనుగుణంగా పర్యావరణ రక్షణ కోసం కొత్త చట్టం రూపొందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. పచ్చదనం పెంచే కార్యక్రమానికి నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. కాంపా నిధుల వినియోగంపై కూడా ఆయన స్పష్టత ఇచ్చారు. ముఖ్యమంత్రి సమీక్ష నేపథ్యంలో ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కలప దందాపై ఉక్కుపాదం మోపినట్లే. ఈ పరిణామం అధికారులతోపాటు అడవిలో దందాసాగిస్తున్న స్మగ్లర్లకు కలవరానికి గురి చేస్తోంది. -
‘కలపదందా’లో మరెందరో?
నిర్మల్: ఆదిలాబాద్–నిజామాబాద్ జిల్లాల మధ్య దర్జాగా సాగుతున్న కలప రవాణాలో పెద్ద రాకెట్ ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలుతోంది. ఇందులో స్మగ్లర్లకు పోలీసు, అటవీ శాఖకు చెందిన ఇంటిదొంగలే సహకరిస్తున్నట్లు స్పష్టమైంది. ఇప్పటికే నిజామాబాద్‌కు చెందిన ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, ఉట్నూర్ ఎఫ్ఎస్వో రాజేందర్ సస్పెండ్ కాగా, తాజాగా ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, నేరడిగొండ ఎస్సై హరిశేఖర్‌ను తన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్ గురువారం ఆదేశించడం, వారి స్థానాల్లో మరో ఇద్దరికి వెంటనే బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. కలప అక్రమ రవాణాపై సీరియస్‌గా దృష్టిపెట్టిన సర్కారు ఈ కేసులో లోతుగా విచారణకు ఆదేశించడంతో నిర్మల్ పోలీసులు ఆ దిశగా కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగా మరింతమంది ‘ఇంటి దొంగలు’ కూడా బయటపడనున్నట్లు తెలుస్తోంది. బయటపెట్టిన నిర్మల్ పోలీసులు.. ఈ నెల19న నిజామాబాద్ తరలుతున్న రూ.16.52 లక్షల విలువైనకలపను నిర్మల్ పోలీసులు పట్టుకోవడంతో బట్టబయలైన ఈ అక్రమ దందా రెండు ఉమ్మడి జిల్లాల్లో సంచలనంగా మారుతోంది. ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్‌కు ఏళ్లుగా సాగుతున్న కలప స్మగ్లింగ్ రాకె ట్లో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే దొరికిన స్మగ్లర్లు, అధికారులతోపాటు మరింత మంది ప్రమేయం ఉన్నట్లు తేలుతుండడంతో పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. శనివారం వేకువజామున కలప పట్టుబడగానే నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు రంగంలోకి దిగారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు బృందాలను పంపించి విచారణ చేయించారు. ఈమేరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలు సామిల్ల యజమానులు, స్మగ్లర్లు, ఏఆర్ ఎస్సై కలిసి ఆదిలాబాద్ జిల్లా నుంచి కలపను అక్రమంగా తరలిస్తున్నట్లు తేల్చారు. ఇచ్చోడ మండలంలోని కేశవపట్నం ప్రాంతానికి చెందిన ముల్తానీలతో టేకు చెట్లను నరికిస్తూ..స్థానిక ఉట్నూర్ ఎఫ్ఎస్ఓ రాజేందర్, నిర్మల్ జిల్లా సోన్ వద్ద గల చెక్‌పోస్టులో అక్కడి అధికారులు ప్రైవేటుగా నియమించిన సహాయకుడు సద్దాంల సహకారంతో గుట్టుగా నిజామాబాద్ జిల్లాకు తరలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా స్వయంగా అక్రమ రవాణాలో ఉండి, సామిల్‌కు కలప చేరుస్తున్నట్లు తేలిపోయింది. ఇతడి ఇంట్లో తనిఖీలు నిర్వహించగా వాహనాల నంబర్ప్లేట్లు వందవరకు లభించినట్లు సమాచారం. సీఐ, ఎస్సైలపై చర్యలు.. కలప స్మగ్లింగ్‌లో నేరుగా పాల్గొన్న నిజామాబాద్ ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, సహకరించిన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఎఫ్ఎస్ఓ రాజేందర్‌ను అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు. కేసును లోతుగా విచారించగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ సీఐ సతీశ్‌కుమార్, నేరేడిగొండ ఎస్సై హరిశేఖర్లు పరోక్షంగా సహకరించినట్లు సందేహాలు రావడంతో వారిని గురువారం తన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ ఆదేశించారు. తమ పరిధిలో జరుగుతున్న దందాను అరికట్టడంలో విఫలం కావడమే కాకుండా, పరోక్షంగా సహకరించినట్లు సమాచారం ఉండడంతో డీఐజీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. కలప రాకెట్‌కు సహకారం అందించిన పక్కజిల్లా నిజామాబాద్‌లోనూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. జిల్లాలో స్మగ్లర్లతోపాటు స్థానిక సామిల్ యజమానులకు పరోక్షంగా సహకరించేలా ప్రవర్తించారన్న ఆరోపణలతో నిజామాబాద్ ఎఫ్‌డీవో వేణుబాబు, సౌత్ రేంజ్ ఎఫ్ఆర్వో రవిమోహన్‌భట్, డిప్యూటీ ఎఫ్ఆర్వో శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. అక్కడి ఒక సామిల్‌ను సీజ్ చేశారు. మరోవైపు కేసు నమోదైన తర్వాత నుంచి పరారీలో ఉన్న ఏఆర్ ఎస్సై షకీల్‌పాషా, నిజామాబాద్‌కు చెందిన సామిల్ యజమాని ఆఫ్జల్ఖాన్లను గురువారం నిర్మల్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉట్నూర్ ఎఫ్ఎస్వో రాజేందర్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నట్లు వారు చెబుతున్నారు. కలపను అక్రమంగా తరలిస్తున్న ఈ కేసుపై మరింతగా విచారణ కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ ఇటీవల చేసిన స్పష్టమైన ఆదేశాలమేరకు కలపదందాలో ఎంతటి వారున్నా ఉపేక్షించేది లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
వనమేధం
తలమడుగు(బోథ్): మానవాళి మనుగడకు అడువులే ఆధారం. వాతావరణ సమతుల్యతను కాపాడుతూ జీవరాశికి ఎంతో ఉపయోగపడుతున్న అరణ్యంలో వనమేధం జోరుగా జరుగుతోంది. అటవీపెంపకానికి ఓవైపు ప్రభుత్వం రూ.కోట్లువెచ్చి హరితహారం మొక్కలు నాటుతుంటే పచ్చని చెట్లను నరికిస్తూ ఇతరప్రాంతాలకు తరలించి కలప స్మగ్లర్లు సొమ్ముచేసుకుంటున్నారు. గ్రామాల్లో పంటపొలాల్లోని గట్లపై, వాగుల సమీపంలో చెట్లను విక్రయించాలన్నా, తరలించాలన్నా తప్పనిసరిగా అటవీశాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. కాని ఇదేమీ లేకుండానే వ్యాపారులు చెట్లను నరికి కలప తరలిస్తున్నారు. నిబంధనలు తుంగలో తొక్కి వ్యాపారులు మూడు చెట్లు ఆరు దుంగులుగా మార్చి వ్యాపారం సాగిస్తున్నారు. అడవిని కాపాడే అధికారులు ఏమీ పట్టనట్లు నిద్రమత్తులో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 18 మండలాలు ఉన్నాయి. అంతటా ఇదే తంతు జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో రాత్రి వేళల్లో కలప తరలుతోంది. మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన తాంసి తలమడుగు, బేల, జైనథ్, బజార్హత్నూర్, బోథ్, మండలం నుంచి కలప వ్యాపారం జోరుగా సాగుతోంది. గ్రామపంచాయతీల్లో అటవీ సంపద, వ్యవసాయ పొలాలు, వాగులు, కొండల సమీపంలో చెట్లు నేలకొరుగుతున్నాయి. వ్యాపారులు రైతు వద్ద పట్టా జిరాక్స్ పత్రాలు ఒక్కసారి తీసుకొని పలుమార్లు కలప తరలిస్తున్నారు. దీంతో అటవీప్రాంతాలు, పంటపొలాలు, ఎడారులుగా మారిపోతున్నాయి. చెట్లను నరికి లారీల్లో మామిడి, వేపచెట్లు, తుమ్మ , చింత తదితర చెట్లు నిత్యం నరికేస్తున్నారు. చెట్లను క్షణాల్లో నరికేందుకు పెట్రోల్ యంత్రాలు విచ్చలవిడిగా మార్కెట్లోకి రావడంతో వ్యాపారుల పని సులువుగా మారింది. ఇంత జరుగుతున్నా లారీలను పట్టుకున్న దాఖలాలు లేవు. అనుమతి లేకుండా అక్రమంగా రవాణా చెట్లను నరకాలంటే అటవీశాఖ రేంజ్ అధికారుల అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. అనుమతి వచ్చిన తరువాత రైతు వ్యాపారికి తన పట్టా పాసుపుస్తకం, జిరాక్స్ అందించాలి. రైతు చెట్టు నరికిన స్థానంలో మరో మొక్క నాటాలి. కానీ అవి ఏమీ లేకుండానే వ్యాపారులు రైతుకు ఎంతోకొంత డబ్బు ముట్టజెప్పి విలువైన చెట్లు డింబర్‌డిపోలకు తరలిస్తున్నారు. అధికారులను మభ్యపెడుతూ కలపదందా కొనసాగిస్తున్నారు. అటవీశాఖ అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడం మూలంగా పచ్చని చెట్లతో ఉండాల్సిన పొలాలు, కొండలు ఎడారిగా మారుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెట్లను నరికి అక్రమ కలప రావాణా సాగించే వారిపై చర్యలు తీసుకొని జిల్లాలో వనమేధం పూర్తిగా నిర్మూలించాలని జిల్లాప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం గ్రామాల్లో నుంచి అనుమతి లేకుండా తరలిస్తే సమాచారం అందించాలి. రవాణాపై మా దృష్టికి రాలేదు. వస్తే వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. పట్టాభూమిలో నుంచి చెట్లు నరికి విక్రయిస్తే తప్పనిసరిగా వాటిస్థానంలో రైతు మరో మొక్కనాటాలి. ఇప్పటివరకు ఎవ్వరికి ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. – ప్రకాశ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ -
ఆవుపేడతో అడవికి జీవం
సాక్షి, ఆసిఫాబాద్: ఏళ్ల నాటి చెట్టు కళ్ల ముందే కనుమరుగవుతుంటే ఏమి చేయలేక ఇన్నాళ్లు నిరాశపడిన అటవీ అధికారులకు ఓ చక్కటి పరిష్కారం దొరికింది. సహజ సిద్ధంగా ఎటు వంటి ఖర్చు లేకుండా ఆవుపేడ, బంకమట్టి తో ఎండిపోయే చెట్లకు పునర్జీవం పోయడమే ఈ పద్ధతి ప్రత్యేకత. సాధారణంగా అడవి లోని చెట్లను కలప కోసమో లేక అటవీ భూమిని సాగుచేయాలనో స్థానికులు చెట్లను నరికివేస్తారు. కానీ కొన్ని చెట్లు ధృఢంగా ఉంటాయి. వీటిని గొడ్డలితో నరకడం కష్టం. దీంతో చెట్టు కాండానికి గొడ్డలితో గాటు పెట్టి కొద్ది రోజుల తర్వాత వాటంతట అవే ఎండిపోయేలా చేసి అక్కడి భూమిని సాగు చేయడమో లేక ఎండిన కలపను అక్రమంగా తరలించడమో చేసేవారు. అటవీ అధికారు లు ఇందుకు బాధ్యులైన వారిపై కేసులు పెట్టడం, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులను సస్పెండ్ చేయడమో చేసేవారు. కానీ గొడ్డలి గాయలతో ఉన్న చెట్లు మాత్రం నెల రోజుల వ్యవధిలో చూస్తుండగానే ఎండిపోయేవి. గాటు పెట్టి వదిలివేయడం అక్రమంగా అడవిలో చెట్లను నరికేవాళ్లు గొడ్డలి వంటి ఆయుధాలతో నరికి వేసి తమకు అనువైన సమయంలో వాటిని తరలిస్తారు. కానీ నారేపి, నల్లమద్ది తదితర జాతులకు చెందిన చెట్లు ధృ«ఢంగా ఉంటాయి. వీటిని గొడ్డలితో నరకడం కొంత కష్టంతో పని. అంతేకాక ఒక వేళ కష్టపడి చెట్టును నరికి వేసిన దానిని మరల ముక్కలుగా చేసి అటవీ ప్రాంతం నుంచి బయటికి తరలించడం మరింత కష్టం. ఎలాగైనా చెట్లను అక్కడి నుంచి తొలగించాలని భావించిన వాళ్లు ముందుగా ఆ చెట్టు కాండం చుట్టూ దాదాపు 10 సెంటీమీటర్ల వరకు గొడ్డలితో ఒక పెద్ద గాటు పెడతారు. దీంతో కాండంపై ఉన్న బెరడు తొలగిపోవడంతో ఆ చెట్టు కొమ్మలపై భాగానికి కింది భాగంలో ఉండే వేరు వ్యవస్థకు పోషక పదార్థాల సరఫరా ఆగిపోతుంది. దీంతో నెల రోజుల్లోనే ఆ చెట్టు పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు చెట్టు మొదలు వద్ద నిప్పు పెట్టడంతో మొత్తం బూడిద అవుతుంది. అలాకాక దుంగలు అవసరముంటే ఎండిన తర్వాత ముక్కలుగా చేసుకుని అక్కడి నుంచి తరలిస్తారు. దీంతో చెట్టు దానంతట అదే కింద పడిపోయి చనిపోయిందనుకునేలా అటవీ అధికారులకు చిక్కకుండా ఉండేందుకు కొంత మంది ఈ ఎత్తుగడను అనుసరించేవారు. దీనికి విరుగుడుగా ఆసిఫాబాద్ డివిజన్ అటవీ అధికారి డి.రవీందర్‌గౌడ్ ఓ కొత్త పద్ధతిని తెలుసుకుని ఆ చెట్లను బతికించి నిరూపించారు. ఆవుపేడ, బంక మట్టితో చెట్టు కాండం చుట్టూ గొడ్డలితో చేసిన గాటును మొదట సున్నితంగా ఎండిన బెరుడు కణాల్ని తొలగించారు. ఆ ప్రాంతాన్ని నునుపుగా చేసి జీవం ఉన్న కణాలకు పైభాగాన్ని కింది భాగాన్ని కలుపుతూ ఆవుపేడ, బంక మట్టిని నీటితో కలిపి చేసిన మిశ్రమాన్ని ఆ గాటు పడిన ప్రాంతంలో అతికించారు. ఇలా కొద్దిరోజుల వరకుపై బెరుడుకు కింది బెరడు ద్వారా పోషక పదార్థాల సరఫరా జరిగి చెట్టుకు మళ్లీ పునరుజ్జీవనం కలిగింది. ఈ పద్ధతిలో గత సెప్టెంబర్‌లో ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని దహెగం మండలం రావులపల్లి అడవిలో సుమారు 70పైగా నారేపి, నల్లమద్ది తదితర జాతులకు చెందిన చెట్లకు జీవం పోశారు. ఈ ప్రయోగంతో అటవీశాఖకు ఓ పరిష్కారం దొరికినట్టేనని అటవీ అధికారులు పేర్కొన్నారు. -
అటవీశాఖలో ఖాళీల భర్తీ: మంత్రి రామన్న
హైదరాబాద్: అటవీ శాఖలోని ఉద్యోగాలన్నీ త్వరలో భర్తీ చేస్తామని అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఇక్కడ నెహ్రూ జులాజికల్ పార్కులో నిర్వహించిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి మాట్లాడారు. రెండు వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. అటవీ సంరక్షణకు చట్టాలను బలోపేతం చేసి బెయిలబుల్ కేసులను నాన్ బెయిలబుల్‌గా మారుస్తున్నామని చెప్పారు. అటవీ సంపద, వన్యప్రాణులను సంరక్షించే క్రమంలో స్మగ్లర్ల చేతిలో 22 మంది అటవీ అధికారులు అమరులయ్యాయని అన్నారు. స్మగ్లర్ల బెడదను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలను తీసుకుంటుందని చెప్పారు. అటవీ సంపదను మరింత విస్తరించడంలో భాగంగా ప్రభుత్వం హరితహారాన్ని చేపట్టి రాష్ట్రవ్యాప్తంగా 29.50 కోట్ల మొక్కలను నాటినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నవంబర్ 10కు బదులు ఈ నెల 11న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం మంత్రి రామన్నను రాష్ట్ర జూనియర్ ఫారెస్ట్ అధికారులు, ఆలిండియా ఫారెస్ట్ అసోసియేషన్ అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉన్నతాధికారులు బి.ఆర్.మీనా, పి.కె.ఝా, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీ డెరైక్టర్ రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.