మూగవేదన  | Forest Animals Problem With Water Mahabubnagar | Sakshi
Sakshi News home page

మూగవేదన 

Published Mon, Apr 22 2019 7:25 AM | Last Updated on Mon, Apr 22 2019 7:25 AM

Forest Animals Problem With Water Mahabubnagar - Sakshi

జంతువుల కోసం సాసర్లలో నీటిని నింపుతున్న అటవీశాఖ సిబ్బంది 

 అచ్చంపేట: పెద్ద పులుల సంరక్షణ ప్రాంతమైన నల్లమలలో వన్యప్రాణులు తాగునీటికి అల్లాడుతున్నాయి. అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్టులో నీటి వనరులు వట్టిపోయాయి. ఐదేళ్లుగా నల్లమలలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో నీటివసతి ఉన్న ప్రాంతాలకు వన్యప్రాణులు వస్తున్నాయి. పంట పొలాలు, బోరు బావులు, చెరువుల వద్దకు వస్తున్నాయి. ప్రతి ఏటా ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేది. ఈసారి నెల రోజుల ముందే ఎండలు ఎక్కువగా ఉండడంతో సమస్య మరింత ఉత్పనమైంది. అభయారణ్య ప్రాంతంలోని వన్యప్రాణులకు ఎండకాలంలో తాగునీటి సమస్య తీర్చేందుకు అటవీశాఖ ప్రతి ఏటా రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నామని బాహాటంగా చెబుతున్నా.. వాటికి నీరు అందడం లేదు. అటవీశాఖ పూర్తిస్థాయిలో వన్యప్రాణులకు నీటి వసతి కల్పిస్తే నీటి కోసం గ్రామాల వైపు జంతువులు ఎందుకు వస్తాయన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

జంతువులు సాధారణంగా ఆహార అన్వేషణలో భాగంగా 4కి.మీ. పరిధిలో తిరుగుతాయి. నల్లమలను అనుసరించి 140 కి.మీ. పరిధిలో కృష్ణానది ప్రవహిస్తుంది. అటవీ ప్రాంతంలో నిరంతరం నీళ్లు ఉండే సహజ జల వనరుల దగ్గర ఎక్కువగా ఉంటాయి. అటవీ సరిహద్దు గ్రామాలైన మన్ననూర్, మద్దిమడుగు, బాణాల, బిల్లకల్లు, లక్ష్మిపల్లి, అప్పాయిపల్లి, ఎర్రపెంట, చెన్నంపల్లి, వట్టువర్లపల్లి, సార్లపల్లి, కుడి చింతలబైలు, ఉడిమిళ్ల, తిర్మలాపూర్‌(బీకే) తదితర గ్రామాల్లో వ్యవసాయ పొ లాల్లో ఉండే బోర్ల వద్దకు దుప్పులు, ఎలుగుబంట్లు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపా రు. బల్మూర్‌ మండలం బిల్లకల్లు అటవీ ప్రాంతంలోని రుసుల చెరువులో మాత్ర మే కొద్దిగా నీరు ఉంది. అత్యధికం గా వన్యప్రాణులు అక్కడి వస్తుంటాయి. వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి వసతి ఏర్పాటు చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు ఆర్భాటంగా ప్రకటించుకోవడమే తప్ప ఎక్కడ కూడా అమలు చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. 

అటవీశాఖ చెబుతున్న ఏర్పాట్లు ఇవే.. 
వన్యప్రాణుల తాగునీటి సమస్య అధిగమించడానికి గతంలో అటవీశాఖ నల్లమ ల ప్రాంతంలో 36 సాసర్లు ఏర్పాటు చేశా రు. వన్యప్రాణులు, జీవరాశులు సంచరించే ప్రాంతాల్లో గతేడాది 428 సాసర్లు నిర్మించడంతో పాటు పాతవాటికి కూడా మరమ్మతులు చేపట్టారు. వీటిని అత్యధికంగా రోడ్డు, వాహనాలు వెళ్లగలిగే ప్రాం తాల్లో నిర్మించారే గానీ లోతట్టు ప్రాం తంలో ఏర్పాటు చేయడం లేదు. వీటితో చాలా వరకు ప్రయోజనం తక్కువగా ఉం టుంది. అత్యధికంగా ఇవి పర్హాబాద్‌ నుం చి వ్యూపాయింట్, అప్పాపూర్, మల్లాపూ ర్, భౌరాపూర్, రాంపూర్, మేడిమల్కల రోడ్డు మార్గంలో ఉన్నాయి.

పర్హాబాద్‌ వ ద్ద ఏర్పాటు చేసిన సోలార్‌ డిఫ్‌వెల్‌ పం పింగ్‌ సిస్టమ్‌తో ట్యాంకర్‌కు నీటిని నింపి వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పిం చాలి. రోజుకు ఒక ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం అని అటవీ శాఖ అ«ధికారులకు చెబుతున్నా.. రెండు, మూడు రోజులకు ఒకసారి కూడా వెళ్లడం లేదు. ట్యాంకర్ల ద్వారా అటవీ జంతులవుల దాహార్తి తీరుస్తున్నామని అటవీ శాఖ లెక్కలు చెబుతున్నాయి గానీ అదీ ఆచరణంలో సక్రమంగా అమలు కావడం లేదు. అత్యధికంగా వన్యప్రాణులు తిరిగే ప్రదేశమైన పిచ్చకుంట్ల చెరువు, రాళ్లవాగు, గుడేశ్వరం, తాళ్లచెరువు నీళ్లులేక ఎండిపోయాయి. లోతట్టు అటవీ ప్రాంతంలో సాసర్ల ఏర్పాటు లేకపోవడంతో అక్కడ తాగునీరు లేక వన్యప్రాణులు బయటికి వస్తున్నాయి. 

సాసర్లలో నీటిని పోయిస్తున్నాం.. 
జంతువులకు నీటికి ఇబ్బంది లేదు. నారాయణపేట, మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలో ఉన్న అడవుల్లో 71 సాసర్లు, నాలుగు సోలార్‌ పంపులు ఏర్పాటు చేశాం. ట్రాక్టర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఉమ్మడి జిల్లాలోని అభయారణ్య ప్రాంతంలో అటవీశాఖ తరుఫున జంతువుల కోసం సాసర్లలో నీటిని పోయిస్తున్నాం.  – గంగారెడ్డి, డీఎఫ్‌ఓ, మహబూబ్‌నగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement