Srungavarapukota
-
చంద్రబాబుపై శృంగవరపుకోట పబ్లిక్ ఫైర్
-
బొత్స ఝాన్సీ సమక్షంలో వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు
-
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ విజయం ఖాయం: ఎమ్మెల్యే కడుబండి
-
వైఎస్సార్సీపీలో 300 మంది టీడీపీ కార్యకర్తల చేరిక
లక్కవరపుకోట/జామి/వేపాడ: విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం వేపాడ మండలానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది వైఎస్సార్సీపీలో చేరారు. శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర జమ్మాదేవిపేటకు చేరుకున్న వేళ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరిన నాయకులకు రాష్ట్ర విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి బూడి ముత్యాలనాయుడు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వేపాడ మండలం మాజీ ఎంపీపీ దొగ్గ శ్రీదేవి, కుమ్మపల్లి కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షుడు దొగ్గ సూరిదేముడు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు దొగ్గ శ్రీనివాసరావు, కుమ్మపల్లి మాజీ సర్పంచ్ దొగ్గ లక్ష్మి తదితరులు ఉన్నారు. -
శృంగవరపుకోటలో వైఎస్ఆర్ సీపీ బస్సు యాత్ర
-
శృంగవరపుకోటలో వైఎస్ఆర్ సీపీ బస్సు యాత్ర
-
మృత్యువై దూసుకొచ్చిన కారు
వేసవి సేద తీర్చుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న తాటి ముంజుల విక్రయదారుడు వద్ద ఆగిన ఆ తండ్రి కొడుకులను కారు మృత్యు రూపంలో దూసుకొచ్చి కాటేసింది. మరో ముగ్గురిని తీవ్ర గాయాల పాల్జేసింది. శ్రీరామనవమి పండగ రోజున జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం కిల్తంపాలెం సమీపంలోని రాజీపేట జంక్షన్ వద్ద ఉన్న సిమెంటు ఇటుక పరిశ్రమ వద్ద ఆదివారం కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృత్యు ఒడికి చేరగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులతో పాటు ఎస్ఐ జి.లోవరాజు తెలిపిన వివరాలు...విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురం గ్రామ గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యా యుడు కమ్ వార్డెన్‌గా పనిచేస్తున్న కిల్లో సోనాపతి స్వగ్రామం ఇదే మండలంలోని కోనాపురం. ఈయన ఎస్.కోట పట్టణం పందిరప్పన్న జంక్షన్ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సోనాపతి తన భార్య శ్రావణి, పిల్లలు కిల్లో శ్రావణ్(7), కిలో సుహాస్(4)తో ద్విచక్ర వాహనంపై శివలింగపురం అత్తారింటికి బయలుదేరాడు. మార్గంలో రాజీపేట జంక్షన్ సమీపంలో ఇటుక పరిశ్రమ వద్ద రోడ్డు పక్కన తాటిముంజులు తినేందుకు ఆగారు. వీరితో పాటు ఎస్.కోట మండలం పెదఖండేపల్లికి చెందిన కొసర సహిత, కొసర అప్పారావు బొడ్డవర వెళ్తూ తాటిముంజుల కోసం ఆగారు. ఇంతలో అరకు వైపు నుంచి అతివేగంగా వస్తున్న కాకినాడకు చెందిన ఏపీ 05 డీవీ 0579 నంబరు గల కారు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో అదుపుతప్పి కుడి వైపున ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆ పక్కనే తాటిముంజులు తింటున్న వారిని ఢీకొని పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు కిల్లో సోనాపతి(38), కిల్లో శ్రావణ్, కిలో సుహాస్ మృతి చెందారు. ప్రమాద స్థలంలోనే శ్రావణ్, సుహాస్ మృతి చెందగా వీరి తండ్రి సోనాపతి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే మృతి చెందారు. ఈయన భార్య కిల్లో శ్రావణి విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెదఖండేపల్లికి చెందిన సహిత తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉంది. సహిత తండ్రి బొడ్డవర రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ కొసర అప్పారావు పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కాగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లోవరాజు తెలిపారు. ఇదిలా ఉండగా కాకినాడకు చెందిన వారు ఫోటోషూట్ కోసం అరకు, ఇతర ఏజెన్సీ ప్రాంతాలకు కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి ఎమ్మెల్సీ రఘురాజు ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టీ ఎదురుగా రోడ్డుపై ఉన్న చిన్న గుంత వల్లే పలు ప్రమాదాలు జరిగాయన్న సంగతి తెలిసి గుంతను పూడ్చి వేసే పనులు చేపట్టాలని సర్పంచ్ సుంకరి ఈశ్వరరావు, గ్రామ పెద్దలకు సూచించారు. ఆస్పత్రిలో ఆర్తనాదాలు ప్రమాదంలో ఉపాధ్యాయుడు సోనాపతి, ఆయన కుమారులు మృతి చెందారన్న సమాచారం తెలిసి న కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎస్.కోటలోని సీహెచ్‌సీకి చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన వారిని అరెస్టు చేయాలంటూ ఎస్.కోట పోలీసుస్టేషన్ వద్ద మృతుల బంధువులు ఆందోళన చేశారు. -
మృత్యువై దూసుకొచ్చిన కారు
వేసవి సేద తీర్చుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న తాటి ముంజుల విక్రయదారుడు వద్ద ఆగిన ఆ తండ్రి కొడుకులను కారు మృత్యు రూపంలో దూసుకొచ్చి కాటేసింది. మరో ముగ్గురిని తీవ్ర గాయాల పాల్జేసింది. శ్రీరామనవమి పండగ రోజున జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే... శృంగవరపుకోట రూరల్ : ఎస్.కోట మండలం కిల్తంపాలెం సమీపంలోని రాజీపేట జంక్షన్ వద్ద ఉన్న సిమెంటు ఇటుక పరిశ్రమ వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృత్యు ఒడికి చేరగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలై ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులతో పాటు ఎస్ఐ జి.లోవరాజు తెలిపిన వివరాలు... విశాఖ జిల్లా అనంతగిరి మండలం శివలింగపురం గ్రామ గిరిజన ఆశ్రమ పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు కమ్ వార్డెన్‌గా పనిచేస్తున్న కిల్లో సోనాపతి స్వగ్రామం ఇదే మండలంలోని కోనాపురం. ఈయన ఎస్.కోట పట్టణం పందిరప్పన్న జంక్షన్ వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటూ ఇద్దరు పిల్లలను ప్రైవేటు పాఠశాలలో చదివిస్తున్నాడు. ఆదివారం సెలవు కావడంతో సోనాపతి తన భార్య శ్రావణి, పిల్లలు కిల్లో శ్రావణ్(7), కిలో సుహాస్(4)తో ద్విచక్ర వాహనంపై శివలింగపురం అత్తారింటికి బయలుదేరాడు. మార్గంలో రాజీపేట జంక్షన్ సమీపంలో ఇటుక పరిశ్రమ వద్ద రోడ్డు పక్కన తాటిముంజులు తినేందుకు ఆగారు. వీరితో పాటు ఎస్.కోట మండలం పెదఖండేపల్లికి చెందిన కొసర సహిత, కొసర అప్పారావు బొడ్డవర వెళ్తూ తాటిముంజుల కోసం ఆగారు. ఇంతలో అరకు వైపు నుంచి అతివేగంగా వస్తున్న కాకినాడకు చెందిన ఏపీ 05 డీవీ 0579 నంబరు గల కారు రోడ్డుపై ఉన్న గుంతను తప్పించే క్రమంలో అదుపుతప్పి కుడి వైపున ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి ఆ పక్కనే తాటిముంజులు తింటున్న వారిని ఢీకొని పంట కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకులు కిల్లో సోనాపతి(38), కిల్లో శ్రావణ్, కిలో సుహాస్ మృతి చెందారు. ప్రమాద స్థలంలోనే శ్రావణ్, సుహాస్ మృతి చెందగా వీరి తండ్రి సోనాపతి విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన కొద్ది సేపటికే మృతి చెందారు. ఈయన భార్య కిల్లో శ్రావణి విశాఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెదఖండేపల్లికి చెందిన సహిత తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లగా పరిస్థితి విషమంగా ఉంది. సహిత తండ్రి బొడ్డవర రైల్వేస్టేషన్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడ్డ కొసర అప్పారావు పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. కాగా కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్థానికంగా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ లోవరాజు తెలిపారు. ఇదిలా ఉండగా కాకినాడకు చెందిన వారు ఫోటోషూట్ కోసం అరకు, ఇతర ఏజెన్సీ ప్రాంతాలకు కారులో వచ్చారు. తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి ఎమ్మెల్సీ రఘురాజు ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ, స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇటుక బట్టీ ఎదురుగా రోడ్డుపై ఉన్న చిన్న గుంత వల్లే పలు ప్రమాదాలు జరిగాయన్న సంగతి తెలిసి గుంతను పూడ్చి వేసే పనులు చేపట్టాలని సర్పంచ్ సుంకరి ఈశ్వరరావు, గ్రామ పెద్దలకు సూచించారు. ఆస్పత్రిలో ఆర్తనాదాలు ప్రమాదంలో ఉపాధ్యాయుడు సోనాపతి, ఆయన కుమారులు మృతి చెందారన్న సమాచారం తెలిసి న కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఎస్.కోటలోని సీహెచ్‌సీకి చేరుకున్నారు. బంధువులు, స్నేహితుల రోదనలు మిన్నంటాయి. సోనాపతి వృత్తిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారని తోటి ఉపాధ్యాయులు తెలిపారు. -
కారు ఆగిపోయిందంటూ హైడ్రామా.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కారులో ఎక్కించి..
సాక్షి, శృంగవరపుకోట రూరల్(శ్రీకాకుళం): ఓ సాఫ్ట్వేర్ ఇంజనీరు అయిన యువకుడిని కిడ్నాప్చేశారన్న వార్త ఎస్.కోట, తెర్లాం మండలాల్లో కలకలం రేపింది. ఉదయం మార్నింగ్‌వాక్‌కు వెళ్లిన యువకుడిని నలుగురు వ్యక్తులు సినీఫక్కీలో కిడ్నాప్ చేసేందుకు కారులో ఎక్కించారు. తలపై దాడి చేశారు. రూ.50 లక్షలు డిమాండ్ చేశారు. ఓ రహస్య ప్రదేశంలో బంధించే ప్రయత్నంలో యువకుడు కేకలు వేయడంతో స్థానికులు స్పందించారు. కిడ్నాపర్లను వెంబడించడంతో ఇద్దరు పరార్కాగా, మరో ఇద్దరు పట్టుబడ్డారు. స్థానికులు, ఎస్.కోట పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెర్లాం మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన తెర్లి అప్పలనాయుడు కుమారుడు ఈశ్వరరావు హైదరాబాద్‌లో వీఎల్ఎస్ఐ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. కోవిడ్‌తో రెండేళ్లుగా ఇంటివద్ద ఉంటూనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పటిలాగే మార్నింగ్ వాకింగ్‌కు రాజాం–రామభద్రపురం ప్రధానరోడ్డుకు శుక్రవారం తెల్లవారుజామున వెళ్లారు. కూనాయవలస పెట్రోల్ బంక్ దాటిన తరువాత రోడ్డుపక్కన ఆగి ఉన్న కారు నుంచి ఓ వ్యక్తి దిగాడు. కారు ఆగిపోయింది.. కొంచెం తోయాలని ఈశ్వరరావు సాయం కోరాడు. కారు నెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కారులో నుంచి మరోవ్యక్తి దిగి ఈశ్వరరావు తలపై బలంగా కొట్టాడు. మరో ఇద్దరు కలిసి కాళ్లుచేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి కారులో ఎక్కించి తీసుకెళ్లిపోయారు. కారులో చిత్రహింసలు పెట్టారు. ఇంటికి ఫోన్ చేసి రూ.50 లక్షలు తెమ్మని బెదిరించారు. లేదంటే పెద్దసార్కి అప్పగిస్తామని, ఆయన నీ కళ్లు, కిడ్నీలు, ఇతర శరీర అవయవాలు అమ్మేస్తాడని భయపెట్టారు. ఎస్.కోట సీహెచ్‌సీలో కిడ్నాప్‌నకు గురయిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తెర్లి ఈశ్వరరావుని విచారిస్తున్న పోలీసులు డబ్బులు ఇవ్వకపోతే మీ నాన్నను చంపేస్తామంటూ కారు ఎక్కించిన ప్రాంతం నుంచి దించిన ధర్మవరం గ్రామం వరకు భయపెడుతూనే ఉన్నారు. ధర్మవరం వద్ద ఉన్న ఓ రహస్య ప్రదేశంలో బంధించేందుకు కారు నుంచి కిందకు దించారు. ఆ సమయంలో ఈశ్వరరావు గట్టిగా కేకలు వేశారు. అటువైపుగా వెళ్లే ధర్మవరం గ్రామస్తులు కొందరు స్పందించారు. వెంటనే దుండగులను పట్టుకునేందుకు వెంటపడ్డారు. ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. ఎస్.కోట పోలీసులకు సమాచారం ఇచ్చి ఇద్దరు కిడ్నాపర్లను అప్పగించారు. కిడ్నాపర్ల చేతిలో తీవ్రంగా గాయపడిన సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను ఎస్.కోట సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. ఆయన తలకు తొమ్మిది కుట్లు పడినట్టు వైద్యులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ తారకేశ్వరరావు కేసు నమోదు చేశారు. కిడ్నాప్ చేసిన ప్రాంతం తెర్లాం మండల పరిధిలోదని, ఉన్నతాధికారుల సూచన మేరకు కేసును అక్కడకు బదిలీ చేస్తామని చెప్పారు. విచారణలో ఉన్నందున కిడ్నాపర్ల పేర్లు చెప్పలేమన్నారు. కిడ్నాపర్లను బంధించి పోలీసులకు సమాచారమిచ్చిన ధర్మవరం గ్రామస్తులను ఎస్ఐ అభినందించారు. కిడ్నాప్ ఎందుకు చేశారు.. ఎవరు చేయించారన్న వివరాలు తెలియాల్సి ఉంది. కిడ్నాపర్లలో ముగ్గురు ఎస్.కోట మండలం వారే.. కిడ్నాపర్లు నలుగురిలో ముగ్గురు ఎస్.కోట మండలంవారే. రేవళ్లపాలెం గ్రామానికి చెందిన యువకులు ఇద్దరు కాగా, మరొకరు ఎస్.కోట పట్టణానికి చెందిన వ్యక్తి. ఈ ముగ్గురు యువకులూ రేవళ్లపాలెం గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి ధర్మవరం గ్రామంలో నడుపుతున్న వాటర్‌ప్లాంట్‌లో పని చేస్తున్నారు. వీరందరూ ప్రతిరోజు మద్యం సేవించి ప్లాంట్‌లోనే రాత్రుళ్లు ఉంటారని ధర్మవరం గ్రామస్తులు చెబుతున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను కిడ్నాప్ చేసిన కారు నంబర్ కూడా నకిలీదై ఉంటుందని, కారులో నాలుగైదు నంబర్ ప్లేట్లు, ఇనుప రాడ్లు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. సుఫారీ దందాలో భాగంగానే ఈ కిడ్నాప్ తతంగం జరిగిందని, కూనాయవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రోద్బలంతో జరిగినట్టు సమాచారం. కారు డ్రైవర్, కిడ్నాప్‌నకు పూనుకున్న వ్యక్తి ఇద్దరూ పరారీలో ఉన్నారు. బాధితుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ తెర్లాం మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెర్లి ఈశ్వరరావు కిడ్నాప్‌కు గురైనట్టు తెలుసుకున్న బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈశ్వరరావును కిడ్నాప్ చేయడానికి కారణాలు ఏమై ఉంటాయని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఉన్నాడని, కిడ్నాప్‌కు పాల్పడిన కొందరిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని కూనాయవలస ఎంపీటీసీ బొమ్మి శ్రీనివాసరావు ఎమ్మెల్యేకు తెలియజేశారు. -
పది కోళ్లను తిన్న కొండచిలువ
సాక్షి, శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం, బొడ్డవర గ్రామంలోని ఎస్ఎస్ఎస్ చికెన్ షాపు వద్ద గల షెడ్డులోకి 10 అడుగుల భారీ కొండచిలువ ఆదివారం ప్రవేశించి పదికోళ్లకు పైగా తినేసి మరో రెండు కోళ్లను తీవ్రంగా గాయపరిచింది. అదే సమయంలో షాపు యజమానులు సాయి, రామసత్తి, స్థానికులు భారీ కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుడు పట్నాయక్ సహాయంతో భారీ కొండచిలువను షాపు యజమానులు పట్టుకుని గోనె సంచిలో బంధించి సమీపంలో ఉన్న గంటికొండలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సమీపంలో ఉన్న కొండపై నుంచి గెడ్డ ప్రవాహం ద్వారా భారీ కొండ చిలువ కొట్టుకుని వచ్చి చికెన్‌షాపులో ప్రవేశించి ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు. చదవండి: (విదేశీ వలస విహంగాల విలాపం.. పదుల సంఖ్యలో మృతి) భారీ కొండచిలువను పట్టుకున్న స్థానికుడు -
మంత్రించిన యంత్రాలు.. తెరిచి చూస్తే పేలిపోతాయి
శృంగవరపుకోట: పిల్లలు కలగని దంపతులు, నిరుద్యోగులను టార్గెట్ చేసి మంత్రించిన యంత్రాల పేరుతో మోసగిస్తున్న ముగ్గురు దొంగస్వాములను ఎస్.కోట మండలం, ముషిడిపల్లి గిరిజన గ్రామంలో బుధవారం నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించి దొంగస్వాములను పట్టుకున్న ముషిడిపల్లి గ్రామపెద్ద ముత్యాల సన్యాసిరావు, స్వాముల చేతిలో మోసపోయిన చీడిపాలెం గిరిజనులు చిమిడి జోగారావు, గడుబంటి రామకృష్ణ, జి.గంగరాజు, అప్పారావు, బి.గంగమ్మ, పొటుపర్తి జగన్నాథం తదితరులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన ఎస్.దుర్గారావు, విశాఖ జిల్లా వాడపల్లికి చెందిన సతీష్, కె.దుర్గారావు అనే ముగ్గురు వ్యక్తులు మంగళవారం ఉదయం గ్రామానికి వచ్చారు.స్వామిజీ శిష్యులమని చెప్పి గ్రామంలోని పలువురి నుంచి గిరిజన కుటుంబాల వివరాలు సేకరించారు. ఆ తర్వాత గిరిజనుల ఇళ్లకు వెళ్లి మీకు ఏళ్ల తరబడి పిల్లలు లేరని కొందరికి, మీకు ఉద్యోగాలు రాక బాధపడుతున్నారంటూ మరి కొందరికి చెప్పి కలిశారు. మీరు పడుతున్న సమస్యలను దుర్గారావు స్వామీజీ తీరుస్తారని చెప్పి రంగప్రవేశం చేయించారు. దొంగస్వామీజీ వచ్చి రూ.6వేలు చెల్లిస్తే మంత్రించిన యంత్రం, పూజ చేసిన సామగ్రి ఇస్తానని, వాటిని భద్రంగా దాచుకుంటే సమస్యలు తీరడంతో పాటు కోరికలు నెరవేరుతాయని నమ్మించి 9మంది నుంచి రూ.53వేలు వసూలు చేశాడు. మంత్రించిన యంత్రాలు, పూజాసామగ్రి గురించి ఎవరికీ చెప్పకూడదని, వాటిని తెరిచి చూస్తే పేలిపోతాయని స్వామిజీ బెదిరించాడు. నమ్మినట్లు ప్రవర్తించిన గ్రామపెద్ద దొంగ స్వామీజీ, ఇద్దరు శిష్యులు బుధవారం ఉదయం ముషిడిపల్లి గ్రామంలో ప్రవేశించి మాజీ సర్పంచ్ ముత్యాల సన్యాసమ్మ కుమారుడు ముత్యాల సన్యాసిరావును కలిసి మా వద్ద మంత్రించిన యంత్రాలను తీసుకుంటే కోరికలు వెంటనే తీరుతాయని నమ్మించే ప్రయత్నం చేశారు. దీంతో సన్యాసిరావు నమ్మినట్లు ప్రవర్తించి ముగ్గురు స్వాములను గ్రామంలోని రామాలయంలోకి తీసుకువెళ్లి లోపల ఉంచి బయట తాళం వేసి ఎస్.కోట పోలీసులకు సమాచారమందించాడు. ఈ విషయం తెలిసిన తరువాత స్థానికంగా మోసపోయిన చీడిపాలెం బాధితులు, గ్రామస్తులు పెద్దఎత్తున రామాలయం వద్దకు చేరుకున్నారు. బ్రాహ్మణ వేషధారణలో తిరుగుతూ అమాయకులను మోసగిస్తున్న ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఆలయ పురోహితుడు దొంతుకుర్తి సాయికుమార్ శర్మ వారిని ప్రశ్నించగా ఒకసారి బ్రాహ్మణులమని, మరోసారి విశ్వబ్రాహ్మణులమని పొంతనలేని సమాధానాలిచ్చారు. పోలీసు సిబ్బంది రామాలయం వద్దకు చేరుకుని ముగ్గురినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ముగ్గురి ప్రాణాల్ని బలిగొన్న కరోనా భయం
వేపాడ (శృంగవరపుకోట): కరోనా భయం ముగ్గుర్ని పొట్టన పెట్టుకుంది. విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి చెందిన ఉడత సత్యనారాయణ గుప్తా (62), భార్య సత్యవతి (57), అతడి అత్త సీహెచ్.వెంకట సుబ్బమ్మ (84) నూతిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ కుటుంబం రెండేళ్లుగా విశాఖ జిల్లా చోడవరంలో ఉంటోంది. మూడు రోజుల క్రితం గుప్తాకు జ్వరం రావడంతో అతని కుమార్తె అన్నపూర్ణ, అల్లుడు ప్రసాద్ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. గుప్తాకు కరోనా ప్రాథమిక లక్షణాలు ఉన్నట్టు వైద్యులు చెప్పగా.. ఆ తర్వాత గుప్తా భార్య సత్యవతికి కోవిడ్ లక్షణాలు కనిపించాయి. దీంతో కలత చెందిన గుప్తా శుక్రవారం తన భార్య సత్యవతి, అత్త వెంకట సుబ్బమ్మతో కలిసి స్వగ్రామమైన నల్లబిల్లి వచ్చి.. గ్రామ పొలిమేరలో శివాలయం వెనుక గల నూతిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. నూతిలో మృతదేహాలను, నూతి బయట సంచిలో ఆధార్ కార్డులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, 3 గ్లాసులు, కంటి అద్దాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కరోనా సోకిందన్న భయంతో మొదట పురుగు మందు తాగి, ఆ తరువాత నూతిలో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. గుప్తా కుమారుడు సంతోష్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను శృంగవరపుకోట సీహెచ్‌సీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఊరు దాటకుండా.. కరోనా రాకుండా
శృంగవరపుకోట రూరల్: అన్ని దేశాలు కరోనా బారినపడి అల్లాడిపోతుంటే.. విజయనగరం జిల్లా ముషిడిపల్లి పంచాయతీ పరిధిలోని గిరిజనులు ఊరు దాటకుండా కరోనా మహమ్మారిని కట్టడి చేస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సూచనలను పాటిస్తూ కరోనా బారిన పడకుండా తమ జీవనాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. వివరాలు.. శృంగవరపుకోట మండలం పరిధిలోని ముషిడిపల్లి గిరిజన పంచాయతీ పరిధిలో ముషిడిపల్లి, చినఖండేపల్లి, దొర్లపాలెం, బందవలస, తాటిపూడి గ్రామాలున్నాయి. వీటిలో 372 కుటుంబాలకు చెందిన 1,346 మంది నివసిస్తున్నారు. కరోనా వైరస్ ఒక మనిషి నుంచి మరో మనిషికి సోకుతుందన్న విషయాన్ని తెలుసుకున్న వీరంతా.. ఊరు దాటకుండా జీవించాలని నిర్ణయించుకున్నారు. నిత్యావసర సరుకుల కోసం వెళ్లేవారు తప్పనిసరిగా మాస్‌్కలు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రం చేసుకోవడం వంటి నిబంధనలు పాటిస్తున్నారు. సర్పంచ్ సొలుబొంగు దారప్ప, పంచాయతీ కార్యదర్శి కె.అనిల్‌కుమార్, గ్రామ సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్ల సూచనలను, సలహాలను పాటిస్తూ కరోనాకు దూరంగా జీవిస్తున్నారు. ప్రత్యేక జీవనశైలే కారణం.. ఇక్కడి గిరిజనుల ప్రత్యేక జీవనశైలి కూడా కరోనా కేసులు నమోదు కాకుండా తోడ్పడింది. వీరు స్వతహాగా దూరం దూరంగా జీవిస్తుంటారు. ఇక గ్రామాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ప్రత్యేక పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. రోజూ సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేయించడం, బ్లీచింగ్ పౌడర్ జల్లించడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూస్తున్నాం. – సొలుబొంగు దారప్ప, సర్పంచ్, ముషిడిపల్లి అవగాహన కల్పిస్తున్నాం.. సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్, వలంటీర్లతో కలిసి ఇక్కడి గిరిజనులకు కరోనా గురించి అవగాహన కల్పిస్తున్నాం. వీరి ప్రత్యేక ఆహారపు అలవాట్లు, స్వీయ నియంత్రణ చర్యల కారణంగా కరోనాను కట్టడి చేయగలిగాం. గ్రామస్తుల సహకారంతో మున్ముందు కూడా కరోనా కేసులు నమోదు కాకుండా చూస్తాం. – కె.అనిల్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి, ముషిడిపల్లి -
బయటపడ్డ భూతవైద్యుడి బండారం
సాక్షి, శృంగవరపుకోట: దెయ్యాలు... భూతాలు... చెడుపు... చిల్లంగి... చేతబడులు... బాణామతులు అంటూ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను సొమ్ము చేసుకుంటున్న ఓ భూతవైద్యుడి బండారం బయటపెట్టిన సంఘటన ఇది. శృంగవరపుకోటలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించి స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. మూలబొడ్డవర పంచాయతీ పరిధి గాదెల్లోవ గ్రామంలో గమ్మెల పోతురాజు అనే వ్యక్తి భూతవైద్యం పేరుతో సామాన్యులను మోసం చేసి డబ్బులు గుంజుతున్నాడు. ఇటీవల ఇతని భూతవైద్యాన్ని నమ్మి కొడుకును పోగొట్టుకున్న కుటుంబీకుల వేదన చూసి చలించిపోయిన శృంగవరపుకోట బర్మాకాలనీకి చెందిన జనా లక్ష్మీనారాయణ మారుమూల గ్రామంలో భూతవైద్యుడు పోతురాజు చేస్తున్న మోసాన్ని కొంతమంది మీడియా మిత్రులకు చెప్పారు. భూతవైద్యుడి ఆటకట్టించాలని పథక రచన చేశారు. బర్మా కాలనీకి చెందిన పొడుగు అప్పలరాజు అనే వ్యక్తికి ఆరోగ్యం బాగా లేదని పోతురాజు వద్దకు తీసుకెళ్లారు. అతనికి దెయ్యం పట్టిందని బాగుచేయాలని, అందుకు పూజ జరిపించాలని పోతురాజు చెప్పాడు. పూజలు చేసేందుకు బయటి వారికైతే రూ. 40వేలు తీసుకుంటానని చెప్పాడు. లక్ష్మీనారాయణ తదితరులు బాధితుడు అప్పలరాజుకు బాగు చేసేందుకు పూజ పెట్టాలని కోరారు. అందుకు రూ.10వేలు ఇస్తామంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అతడిని ఎస్.కోట రావాలంటూ పిలిచారు. శనివారం సాయంత్రం ఎస్.కోట వచ్చిన పోతురాజు 6గంటల సమయంలో బర్మా కాలనీ సమీపంలోఉన్న క్వారీలో అప్పలరాజును కూర్చోబెట్టి రంగులతో ముగ్గులు వేసి, హోమాలు వేసి పూజలు చేసినట్టు నమ్మించాడు. పూజలు చేస్తున్న సమయంలో లక్ష్మీనారాయణ తదితరులు కొందరు విలేకరుల సహాయంతో పోలీసులకు సమాచారం ఇవ్వటంతో ఎస్.కోట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని భూతవైద్యుడు పోతురాజును స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీఐ శ్రీనివాసరావు పోతురాజును విచారించగా తాను డబ్బు కోసం పూజలు చేయనని, ఎవరైనా గాలి గుణంతో ఇబ్బంది పడితే బాగు చేసి, వాళ్లిచ్చిందే తీసుకుంటానంటూ చెప్పాడు. లక్ష్మీనారాయణ, అప్పలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్.కోట పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆరునెలలు వెంటపడ్డాడు.. తిరస్కరించిడంతో
ప్రేమిస్తున్నానంటూ ఆరునెలలుగా వెంటపడ్డాడు. ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో కత్తితో దాడిచేశాడు. గొంతు, చేతిపై కత్తితో కోసాడు. చనిపోయిందని భావించి తనూ రైలు కింద పడి ఉసురు తీసుకున్నాడు. కుటుంబానికి కలకలం తెచ్చిన ఘటన వేపాడ మండలం బొద్దాం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం చోటుకుచేసుకుంది. సాక్షి, శృంగవరపుకోట: ప్రేమిస్తున్నానంటూ ఆరునెలలుగా వెంటపడి వేధిస్తున్న యువకుడిని కాదన్నందుకు ఉన్మాదిలా మారాడు. విద్యార్థిని ప్రాణం తీయాలని హత్యకు తెగబడ్డాడు. హత్యాయత్నం తర్వాత ఆమె చనిపోయి ఉంటుందన్న భయంతో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. వేపాడ మండలం బొద్దాం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన జామి మండలం చింతాడ గ్రామానికి చెందిన విద్యార్థిని వేపాడ మండలం బొద్దాం గ్రామంలోని తన మేనమామ ఇంటిలో ఉంటోంది. ఆరునెలలుగా అదే గ్రామానికి చెందిన పందిరిపల్లి కోటేశ్వరరావు(21) ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడి వేధిస్తున్నాడు. దీనికి విద్యార్థిని ప్రతిస్పందించకపోవడంతో కసితో రగిలిపోయాడు. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. మధ్యాహ్నం విద్యార్థిని మేనమామ మేడ పక్కన ఉన్న మేడపై కాపుకాశాడు. భోజనం తర్వాత మేనమామ మేడ కిందికి వెళ్లిపోగా, అతని భార్య నీళ్లు తెచ్చుకోవటానికి మేడ దిగి వెళ్లడాన్ని గమనించిన కోటేశ్వరరావు ఒక్కసారిగా ఇంటిలోకి చొరబడ్డాడు. 3.15 గంటల సమయంలో విద్యార్థిని మెడపై కత్తితో దాడి చేశాడు. రెండోసారి దాడిచేయడంతో విద్యార్థిని చేతిని అడ్డుగా పెట్టింది. దీంతో ఆమె ఎడమచేయి తెగిపోయింది. రక్తపుమడుగులో పడిపోవడంతో ఉన్నాదిగా మారిన యువకుడు పరారయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు బాధితురాలు, మేనమామ కొడుకు కేకలు వేయడంతో కింది నుంచి వచ్చిన కుటుంబీకులు వెంటనే ఎస్.కోట సీహెచ్‌సీకి విద్యార్థిని తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కోలుకుంటోంది. హత్యాయత్నానికి పాల్పడిన కోటేశ్వరరావు పరారయ్యాడని పోలీసులు భావించారు. కాగా.. సాయంత్రం 6.30 గంటల సమయంలో పుణ్యగిరి రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారం తెలిసింది. అక్కడికి వెళ్లిన ఎస్ఐ రాజేష్, పోలీసులు.. హత్యాయత్నానికి పాల్పడిన కోటేశ్వరరావు అయి ఉండొచ్చన్న కోణంలో బాధితురాలి కుటుంబీకులకు ఫొటోలు చూపి ఆరా తీశారు. మృతుడు హత్యాయత్నానికి పాల్పడిన కోటేశ్వరరావు అంటూ నిర్ధారించారు. ప్రాణాలు తీయబోయి.. తనను కాదన్న కసితో అమ్మాయి ప్రాణాలు తీసేందుకు తెగబడిన కోటేశ్వరరావు కిరండోల్ నుంచి కొత్తవలస వైపు వెళ్తున్న డౌన్ ట్రైన్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు వదిలాడు. రైల్వేట్రాక్‌పై రెండు చేతులు, తల, మొండెం వేర్వేరు చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. మృతుడి స్వస్థలం విశాఖజిల్లా ఆనందపురం మండలం రెడ్డిపల్లి గ్రామం. భర్త చనిపోవడంతో మృతుని తల్లి గణపతి చాలా ఏళ్ల కిందటే తన కన్నవారి గ్రామం బొద్దాం చేరుకుంది. ఇక్కడ కూలి పనులు చేసుకుంటూ కుమార్తె ప్రసన్న, కొడుకు కోటేశ్వరరావులను పోషిస్తోంది. ప్రసన్న ఏఎన్ఎం శిక్షణ పూర్తిచేయగా.. మృతుడు ఐటీఐ చదివాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితురాలి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు వల్లంపూడి ఎస్ఐ జి.రాజేష్ చెప్పారు. విజయనగరం జీపీఆర్‌ఎఫ్ పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు రైల్వే అధికారులు చెప్పారు. చదవండి: ధర్మవరం పోలీసుల దొంగాట -
ఎస్.కోట ఎమ్మెల్యేకు అరుదైన అవకాశం
సాక్షి, విజయనగం(శృంగవరపుకోట) : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ చట్ట సభ్యులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ సబార్డినేట్ చట్ట సభ్యులుగా మొత్తం 11 మంది శాసనసభ్యులతో ఈ కమిటీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. అయితే, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఏకైక శాసనసభ సభ్యునిగా ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు కమిటీలో చోటు దక్కడంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవికి ఎంపిక చేసిన సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరింత చురుకుగా పనిచేసి ఎంపిక చేసిన పదవికి న్యాయం చేస్తానని, శృంగవరపుకోట నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరుగని కృషి చేస్తానని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. -
అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఆరోపణలు
విజయనగరం : శృంగవరపుకోట శాసన సభ్యులు కడుబండి శ్రీనివాసరావు తన నియోజకవర్గంలో గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయంటూ టీడీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కొందరు టీడీపీ నాయకులు ఒక ప్రణాళిక ప్రకారం తనపై అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరవుతుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక ఇలాంటి పనులకు ఒడిగట్టడం సరికాదు. ప్రజా నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్వర్యంలో అందరం కలిసి పనిచేస్తున్నాం. ప్రభుత్వం ప్రవేశపెట్టే అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గంలోని నాయకులందరి సమన్వయంతోనే పారదర్శకంగా అమలుచేస్తున్నట్లు తెలిపారు. అవినీతి రహిత పాలనను ప్రజలకు అందిస్తున్నాం. గ్రామసచివాలయ ఉద్యోగ నియామకాలనే అందుకు చక్కటి ఉదాహరణగా చెప్పవచ్చు. ఈ నియామకాలలో ప్రతిపక్షపార్టీల పిల్లలకు కూడా ఉద్యోగాలొచ్చాయి. అంతేగాక ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణలో మా నుంచి ఎటువంటి ఒత్తిడిలు ఉండవు. వారి విధులు సక్రమంగా నిర్వర్తించుకొనేందుకు, గత ప్రభుత్వ మాదిరిగా కాకుండా మేము అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపట్టాం. అన్ని వర్గాలనుంచి మంచి స్పందన వస్తోంది. టీడీపీ నాయకులు గ్రూపు రాజకీయాలంటూ చేసే ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. -
ప్రతి ఊరూ... మహాభారత కథకు సాక్ష్యాలే...
సాక్షి, శృంగవరపుకోట : తింటే గారెలే తినాలి... వింటే భారతమే వినాలి. అంటారు కదా. అలాంటి మహాభారతంలోని సంఘటనలకు సాక్ష్యాలే శృంగవరపుకోట పరిసర ప్రాంతాలు. ఒక్కో ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటే అంతా ఆసక్తికరంగా ఉంటుంది. విరాటరాజ్య రక్షకుడు అయిన కీచకుడు తన శృంగార కార్యక్రమాలకు మట్టికోటను వినియోగించేవాడు. అదే ఈ ప్రాంతంలో నేడు వృంగవరపుకోటగా వాసి కెక్కింది. దండకారణ్య ప్రాంతంలో విరాటరాజు కొలువులో పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు భీముని చేతిలో నిహతుడైన కీచకుని సద్గతి కల్పించాలని సుధేష్ణదేవి కోరికమేరకు పుణ్యగతులు పొందిన ప్రాంతం నేడు పుణ్యగిరిగా ప్రసిద్ధిగాంచింది. విరటుని కొలువులో ఉన్న పాండవుల అజ్ఞాతవాసం భగ్నం చేయాలని లాక్ష్య గృహదహనం జరిగిన ప్రాంతం తర్వాత లక్కవరపుకోటగా మారింది. ద్వాపర యుగంలో పాండవులు వనవాసం చేసిన సమయంలో నాటి జమ్మివనం ఉన్న ప్రాంతంలో తమ అస్త్ర,శస్త్రాలను జమ్మి చెట్టుపై భద్రం చేశారు. కాల క్రమేణా జామి గ్రామంగా మారింది. ఉత్తర గోగ్రహణం వేళ కౌరవులు తోలుకుపోతున్న ఆలమందను అర్జునుడు అడ్డుకున్న స్థలం ఇప్పుడు అలమండ అయ్యింది. అజ్ఞాతవాసంలో వలలుడు పేరుతో వంటవాడిగా భీముడు ఉన్న ప్రాంతం భీమాళిగా మారిందని ప్రతీతి. -
పిడుగుపాటుకు మహిళ మృతి
సాక్షి, విజయనగరం : పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందడంతో పాటు మరో ఏడుగురు మహిళలకు తీవ్రగాయాలైన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాలు.. శృంగవరపుకోట మండలం ధర్మవరం గ్రామానికి చెందిన 8మంది మహిళలు సమీప గ్రామం సన్యాసయ్య పాలెంలో కూలీ పనులకు వెళ్లారు. వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం రావడంతో ఇళ్లకు బయలుదేరారు. దారి మధ్యలో ఈదురు గాలులు ఎక్కువ కావడంతో చెట్టు దగ్గర తలదాచుకున్నారు. అకస్మాత్తుగా చెట్టుపై పిడుగు పడటంతో అంకమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మిగతా ఏడుగురు మహిళలకు సైతం తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తక్షణమే 108కి సమాచారం అందించి గాయపడిన వారిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురు మహిళల పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖ కేజీహెచ్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. -
అమర జవాన్‌కు కన్నీటి వీడ్కోలు
సాక్షి, శృంగవరపుకోట(విజయనగరం) : భరతమాత సేవలో తరించిన జవాన్ తనువు చాలించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుంటే ‘అక్రమ్ అమర్ రహే’ అంటూ అందరూ అంజలి ఘటించారు. ఎస్‌కోట పట్టణంలో శ్రీనివాసకాలనీకి చెందిన మహ్మద్ ఫజరుల్లా అలియాస్ అక్రమ్ (40) భౌతికకాయం ఇండియన్ ఆర్మీ వింగ్ కమాండర్ల పర్యవేక్షణలో బుధవారం రాత్రి 12 గంటలకు ఆయన ఇంటికి చేరుకుంది. అక్రమ్‌ను తీసుకొచ్చిన సైనికులు అందరూ గురువారం ఉదయం 9 గంటల వరకు ఇక్కడే ఉన్నారు. తహసీల్దార్ రామారావు, ఎస్‌కోట ఎస్ఐ అమ్మినాయుడు, విజయనగరం నుంచి వచ్చిన ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు బ్యాండ్ పార్టీ సైనిక లాంఛనాల మధ్య స్థానికులు, యువకులు అక్రమ్ భౌతికకాయాన్ని శ్మశానవాటికకు చేర్చారు. ముస్లిం మత పెద్దలు ముందుగా నమాజు చేశారు. అనంతరం ఏఆర్ పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి వీరజవాన్‌కు నివాళులు అర్పించారు. అనంతరం సైనికులు, పోలీస్ అధికారులు సెల్యూట్ చేశారు. కంటతడి పెట్టిన కోట.. ఈ సందర్భంగా స్థానికులు జాతీయ పతాకాలు చేత పట్టి, అక్రమ్ అమర్ రహే అన్న నినాదాలు చేశారు. స్థానికులు పెద్ద ఎత్తున ఆయన భౌతిక కాయాన్ని చూసేందుకు తరలివచ్చారు. పుట్టిన ఊరుకు, మతానికి పేరు తెచ్చాడని వేనోళ్ల పొగిడారు. 30 రోజుల్లో వస్తాడనుకుంటే.. 1999లో మహ్మద్ ఫజరుల్లా భారత సైన్యంలో చేరాడు. ఆగష్టు 31 నాటికి సర్వీస్ పిరియడ్ ముగియనుంది. నెల రోజుల్లో ఇంటికి వస్తాడని ఇంటిల్లి పాది ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మరణవార్త వినాల్సి రావడంతో కుటుంబీకులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోమవారం ఉదయం ఫైరింగ్ ప్రాక్టీస్‌కి వెళ్తున్న సమయంలో ఫజరుల్లా గుండెపోటు కారణంగా కుప్పకూలాడు. ఆస్పత్రికి తీసుకెళ్లినా అప్పటికే మృతి చెందాడు. -
గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం
సాక్షి, విజయనగరం: శృంగవరపుకోట మండలం మూల బొడ్డవర గిరిజన గ్రామంలో అనారోగ్యంతో డిప్పల సింహాచలం అనే గిరిజన బాలుడు మృతి చెందాడు. దీంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్ప శ్రీవాణి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి తల్లి తండ్రులులను ఓదార్చి వారికి తన వంతుగా పాతిక వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. అంతేకాక ప్రభుత్వం తరపున రావలసిన సాయాన్ని త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో బాలుడు చదువుకున్న గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న మౌళిక వసతులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రఘురాజు, నెక్కల నాయుడు బాబు తదితరులు ఆమె వెంట ఉన్నారు. -
అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి
సాక్షి శృంగవరపుకోట(విజయనగరం) : మండలంలోని మూలబొడ్డవర గ్రామానికి చెందిన డిప్పల సింహాచలం (14) అనే గిరిజన విద్యార్థి అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఇంటి వద్ద మృతి చెందాడు. సింహాచలం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈ నెల 21వ తేదీన గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న వరుసకు అన్నయ్య అయిన తోటి విద్యార్థితో కలిసి సింహాచలం మూలబొడ్డవరలో గల ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి సింహాచలం హాస్టల్‌కు వెళ్లకపోవడంతో వసతిగృహ సంక్షేమాధికారి ఎం. భాస్కర్ ఆరా తీయగా ఇంటి వద్ద ఉన్నట్లు తేలింది. ఇంతలో హఠాత్తుగా ఈ నెల 30న సింహాచలం అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే తండ్రి అడివేసు కుమారుడ్ని ఎస్.కోట ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల ప్రైవేట్ ల్యాబ్‌కు తీసుకువచ్చి రక్తపరీక్షలు చేయించగా.. హిమోగ్లోబిన్ 2.6 శాతం ఉన్నట్లు తేలింది. వెంటనే సింహాచలంను ప్రైవేట్ క్లినిక్‌కు తీసుకెళ్లి వైద్యసేవలందించి.. ఇంటికి తీసుకెళ్లిపోయాడు. బుధవారం మరో ఆస్పత్పికి తీసుకెళ్దామనుకున్న సమయంలో ఘోరం జరిగిపోయిందని విద్యార్థి తల్లిదండ్రులు అంకాలమ్మ, అడివేసి బోరున రోదిస్తూతెలిపారు. ఆడుతూ పాడుతూ కళ్లముందు తిరుగుతున్న విద్యార్థి సింహాచలం మృతి చెందడంతో మూలబొడ్డవర గ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం ఆదుకోవాలి.. మృతి చెందిన గిరిజన విద్యార్థి డి.సింహాచలం కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని ఏపీ గిరిజన సంఘ డివిజన్ కార్యదర్శి జె.గౌరీష్, సభ్యులు ఆర్.శివ, జి.గౌరినాయుడు డిమాండ్ చేశారు. బుధవారం వారు మాట్లాడుతూ, గిరిజన విద్యార్థులు విషజ్వరాల బారిన పడుతున్నప్పటికీ హాస్టల్ వార్డెన్, ఐటీడీఏ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వారి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు మృతి చెందుతున్నారన్నారు. దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్నాడు.. విద్యార్థి సింహాచలం సికిల్‌సెల్ ఎనీమియా, రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్ అనే వ్యాధితో దీర్ఘకాలంగా బాధపడుతున్నాడని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్ వార్డెన్ ఎం.భాస్కర్ తెలిపారు. 2014లో విశాఖలోని కేజీహెచ్‌లో కూడా చికిత్స తీసుకున్నాడన్నారు. గతేడాది జనవరిలో ఆశ్రమ పాఠశాలలో చేరి అంతలోనే డ్రాపౌట్ అయ్యాడని తెలిపారు. మరలా జూన్ 2019లో విద్యార్థి డి.సింహాచలం 5వ తరగతిలో చేరాడని, ఈ నెల 21వ తేదీన ఇంటికి వెళ్లిపోయాడని స్పష్టం చేశారు. హాస్టల్లో ఏఎన్ఎం ఉంటున్నారని, ఎప్పటికప్పుడు కొట్టాం పీహెచ్సీ వైద్యులు, సిబ్బంది విద్యార్థులను పరీక్షించి వెళ్తుంటారని తెలిపారు. ఇదిలా ఉంటే సింహాచలం మృతి వార్త తెలుసుకున్న ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పీవీ ప్రసాదరావు, ఏటీడబ్ల్యూఓ వరలక్ష్మి, వార్డెన్ ఎం.భాస్కర్ మూలబొడ్డవర వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల నిమిత్తం హెచ్ఎం ప్రసాదరావు రూ. ఐదు వేల ఆర్థిక సాయం చేశారు. కుమారుడి మృతదేహం వద్ద దీనంగా రోదిస్తున్న తల్లి, కుటుంబసభ్యులు -
ఆమె ఆత్మహత్యకు అత్తింటివారే కారణం
సాక్షి, శృంగవరపుకోట(శ్రీకాకుళం) : పట్టణంలోని విశాఖ-అరకు రోడ్డులో ఉంటున్న సాలూరు ప్రియాంక అనే వివాహిత బుధవారం సాయంత్రం ఐదు గం టల సమయంలో ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మృతురాలు ప్రియాంక, నాయనమ్మ భాగ్యలక్ష్మి ఇంట్లో ఉండగా.. ట్యాంక్‌లో నీళ్లు పడుతున్నాయా లేదా చూసి వస్తానంటూ ప్రియాంక సాయంత్రం 5 గంటల సమయంలో మేడ మీదికి వెళ్లింది. ఎంతకూ మనుమరాలు కిందికి రాకపోవడంతో నాయనమ్మ భాగ్యలక్ష్మి మేడమీదికి వెళ్లి చూడగా ప్రియాంక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో హతాశురాలైన భాగ్యలక్ష్మి వెంటనే పట్టణంలో ఉన్న తమ బంధువులకు ఫోన్ చేయగా, వాళ్లు వచ్చి ప్రియాంకను కిందికి దించారు. అయితే అప్పటికే ఆమె మరణించడంతో పోలీసులకు... శ్రీకాకుళంలో ఉద్యోగం చేస్తున్న మృతురాలి తల్లి అరుణకుమారికి సమాచారం అందించారు. రెండు నెలల్లోనే.. ఎస్.కోటకు చెందిన సాలూరు లేటు ప్రసాద్, అరుణకుమారిల కుమార్తె ప్రియాంక(23)ను హైదరాబాద్‌కు చెందిన అక్కుమహంతి గోపీకృష్ణకు ఇచ్చి ఏప్రిల్ నెల 17న వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే ప్రియాంకకు వరకట్న వేధింపులు ఆరంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రియాంక కొద్ది రోజులు అత్తింటి వేధిం పులు భరించి ఆ తర్వాత తన తల్లికి విషయం చెప్పింది. తర్వాత ఎస్.కోటలో తల్లి వద్దకు వచ్చిన ప్రియాంక స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భర్త గోపీకృష్ణ, అత్త లక్ష్మీఇందిరలపై ఫిర్యాదు చేసింది. పోలీస్‌ల నిర్లక్ష్యమే కారణం.. మృతురాలు ప్రియాంక తొలుత హైదరాబాద్‌లో కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. సొంత ఊరులో ఫిర్యాదు చేసుకో అంటూ ప్రి యాంకను పంపేశారు. దీంతో ఎస్.కోట వచ్చి న ప్రియాంక గత నెల 18న ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్.కోట పోలీసులు హైదరాబాద్ వెళ్లి చిరునామా తెలియక వెనక్కి వచ్చేశారు. ప్రి యాంకకు అత్తింటి వారితో పాటు కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నుంచి తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. తన వల్ల కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి తెలిపింది. ఎస్.కోట ఎస్సై జి. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భూములూ పోయే.. పరిశ్రమా రాకపాయె.. ?
సాక్షి, శృంగవరపుకోట (విజయనగరం): పరిశ్రమలు వస్తాయి.. పది మందికీ ఉపాధి వస్తుంది.. ఉద్యోగాలు వస్తాయి. మీ జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయి. మీ పిల్లలు ఉద్యోగస్తులు అయిపోతారంటూ పచ్చని పల్లెల్లో చిచ్చు పెట్టి పంటభూముల్ని పరిశ్రమల కోసం లాక్కున్నారు. ఏళ్లు గడిచాయి.. పచ్చని పొలాలు బీళ్లుగా మారాయి తప్ప పరిశ్రమల జాడలేదు. ఉపాధి, ఉద్యోగాల ఊసే లేదు. పరిశ్రమల పేరుతో పందేరం పతంజలి పరిశ్రమను ఏర్పాటు చేస్తామంటూ ప్రభుత్వం భూసేకరణకు పూనుకుంది. కొత్తవలస మండలం చినరావుపల్లిలో పతంజలి ప్రాజెక్ట్ కోసం టీడీపీ ప్రభుత్వం తరాలుగా రైతులు సాగు చేసుకుంటున్న జీడి, మామిడితోటలను బలవంతంగా సేకరించింది. చినరావుపల్లి, పెదరావుపల్లి రెవెన్యూ గ్రామాల పరిధిలో సుమారు 350 మంది రైతుల నుంచి 172.84 ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. పరిహారం పంపిణీ అరకొరగానే.. భూ సేకరణ సమయంలో రైతులు ఎకరాకి 20 నుంచి 25 లక్షలు నష్టపరిహారం కోరగా ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా రూ. 7 లక్షలు, ఉద్యానవశాఖ ద్వారా మరో 50 వేలు కలిపి ఎకరాకి రూ 7.50 లక్షలు చొప్పున చెల్లించారు. 571 జీఓ ప్రకారం 10 సంవత్సరంలు పైబడి సాగులోఉన్న రైతులకు 7.50 లక్షలు, 10 నుంచి 5 సంవత్సరాల్లోపు సాగులో ఉన్న రైతులకు రూ. 3.25 లక్షలు.. 5 సంవత్సరాల్లోపు సాగులో ఉన్న వారికి అసలు నష్టపరిహారం ఇవ్వకుండా భూసేకరణ చేసినట్లు రైతులు వాపోతున్నారు. భూ సేకరణలో భాగంగా భూములిచ్చిన 15 ఎస్సీ కుటుంబాలకు, నాలుగు బీసీ కుంటుంబాలకు నేటికీ పరిహారం అందలేదు. నష్టపోయిన ఎస్సీలకు భూమికి ప్రతిగా భూమి, రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తామని కోర్టులో ఉన్న కేసుల్ని విత్‌డ్రా చేయించి, ఇప్పటికీ భూముల కేటాయింపు చేయలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతుల నుంచి తీసుకున్న భూములను మళ్లీ వారికే అప్పగించాలని పలువురు కోరుతున్నారు. భూములు లాక్కున్నారు చినరావుపల్లిలో సర్వే నంబర్ 95 నుంచి 105, 87/1, 87/3,90లో 2.93/1 నుంచి 44, 94–2, 98 నంబర్లలో 145.64 ఎకరాలు సేకరించగా, పెదరావుపల్లిలో 27.20 ఎకరాలు సేకరించి మొత్తం 172.84 ఎకరాలు పతంజలికి దారాధత్తం చేశారు. ఇందులో ఆక్రమణదారుల నుంచి 41.79 ఎకరాలు, డీ పట్టా భూములు 66.20 ఎకరాలు, ప్రభుత్వభూమి 6.62 ఎకరాలు, పీఓటీ భూములు 22.56 ఎకరాలు, ప్రైవేట్ వ్యక్తుల జిరాయితీ భూములు 8.47ఎకరాలు, పంతంజలి ప్రాజెక్టుకు దారాధత్తం చేశారు. తగ్గించి అమ్మకం.. టీడీపీ ప్రభుత్వంలో చిన్న, మధ్య తరగతి పరిశ్రమల స్థాపనకు ఎంఎస్ఎంఈ పార్కులు అభివృద్ధి పేరిట ఏపీఐఐసీ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో భూసేకరణ చేసింది. వీటిలో కొత్తవలస, రామభద్రపురం, భోగాపురం మండలాల్లో మాత్రమే పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. చినరావుపల్లిలో రైతుల వద్ద నుంచి ఎకరా 7.50 లక్షల రూపాయలు చెల్లించి తీసుకున్న భూముల్ని ఎకరానికి రూ. 2.50 లక్షలు తగ్గించి కట్టబెట్టి చంద్రబాబు సర్కారు తన ప్రేమను చాటుకుంది. నాడు పరిశ్రమ కోసం మాజీ ఎమ్మెల్యే సహా, ఆమె అనుచరులు, రెవెన్యూ అధికారులు భయపెట్టి భూసేకరణ చేశారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒత్తిడి చేశారు... మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుందని.. స్థానికులకు అవకాశం కల్పిస్తారని.. భూములు అతి తక్కువ ధరకే అమ్మేటట్లు రైతులపై ఒత్తిడి తీసుకువచ్చారు. 172.84 ఎకరాలు ఏపీఐఐసీ ద్వారా కొనుగోలు చేశారు. పరిశ్రమలు రానపుడు కేవలం భూములు అమ్ముకొవడం కోసమే ఇదంతా చేశారు. రైతులకు న్యాయం జరిగేవరకూ పోరాడతా. –బూసాల దేముడు చినరావుపల్లి నమ్మించి మోసం చేశారు.. మాకు అన్యాయం జరుగుతుందని మా జీవనోపాధి పోతోందని కోర్టుకు వెళ్లిన మమ్మల్ని భూమికి భూమి ఇస్తామంటూ నమ్మబలికి ఇప్పుడు రెండు సెంట్ల భూమి చేతిలో పెట్టి పొమ్మంటున్నారు. మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. – పెట్ల నరసింగరావు, చినరావుపల్లి ఒక్కరూపాయి చెల్లిస్తే ఒట్టు.. పతంజలి కంపెనీ కోసం అన్నదమ్ములం సాగు చేసుంటున్న భూమి పీఓటీలో ఉందంటూ బలవంతంగా లాగేసుకున్నారు. తీసుకున్న భూమికి పరిహారం చెల్లిస్తామన్నారు. నేటికి ఒక్క రూపాయికూడా చెల్లించలేదు. టీడీపీ నాయకులు మాకు అన్యాయం చేశారు. – బొబ్బిలి ఎర్రయ్య చినరావుపల్లి -
నాలుగో తరగతి విద్యార్థినిపై అత్యాచారం!
సాక్షి, విజయనగరం : విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామంలో ఎంపీయూపీ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న గిరిజన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం స్కూలు పూర్తయ్యాక బస్ స్టాప్ వద్ద తన గ్రామానికి వెళ్లేందుకు వేచిచూస్తుండగా, ఓ యువకుడు మాయమాటలు చెప్పి చిన్నారిని తాటిపూడి దాటిన తర్వాత ఓ మామిడితోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బుధవారం తెల్లవారుజామున రోడ్డు పైనే ఏడుస్తూ కూర్చున్న బాలికను అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకుని బాలిక తల్లి తండ్రులకు అప్పచెప్పాడు. ఘటనావివరాలు తెలుసుకున్న తల్లిదండ్రులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించి, చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరావు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపుచర్యలు ముమ్మరం చేశారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన రఘురాజు
సాక్షి, విశాఖపట్నం: విజయనగరం జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పర్వం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో ఆయనను వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. రఘురాజుతో పాటు 500 మంది నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. అంతకుముందు శృంగవరపు కోట నుంచి ఐదు వందల బైకులతో ర్యాలీగా వీరంతా పెందుర్తికి తరలివచ్చారు. విశాఖకు చెందిన ప్రముఖ వైద్యుడు, కళా ఆస్పత్రి అధినేత పైడి వెంకట రమణమూర్తి, పలువురు వైశ్యులు కూడా ఈ రోజు వైఎస్సార్ సీపీలో చేరారు. సైనికుల్లా పనిచేస్తాం.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం సృష్టిస్తారని రఘురాజు ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్ సీపీ కైవశం చేసుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సైనికుల్లా పనిచేసి పార్టీని బలోపేతం చేస్తామన్నారు. రాజన్న ఆశయ సాధన కోసం జగన్ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారని, ఆయన కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్ వల్లే సాధ్యమన్నారు. బేషరతుగా వైఎస్సార్ సీపీలో చేరినట్టు తెలిపారు. ఎస్ కోట నియోజకవర్గాన్ని గెలిచి జగన్‌కు కానుకగా ఇస్తామన్నారు. మన మద్దతుదారులతో రఘురాజు బైకు ర్యాలీ -
వృద్ధ దంపతులపై కుమార్తె దాడి
శృంగవరపుకోట రూరల్: ఉన్న భూమంతా తమకే ఇచ్చేయాలంటూ జన్మనిచ్చిన తల్లిదండ్రులపైనే కుమారుడితో కలసి ఓ కుమార్తె దాడి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే...మండలంలోని తిమిడి గ్రామానికి బత్తిన సింహాద్రి, నారాయణమ్మలకు నలుగురు కుమార్తెలు. వీరిలో మొదటి, మూడో సంతానం చనిపోయారు. రెండో కుమార్తె వి.ఈశ్వరమ్మ భర్తను విడిచిపెట్టి అండమాన్ వెళ్లిపోయి తిరిగి ఇక్కడకు ఇటీవల వచ్చింది. వృద్ధుల పేరిట ఉన్న ఎకరంపావు పొలాన్ని తనకు ఇవ్వాలని ఈశ్వరమ్మ తన కుమారుడు రాముతో కలసి కొన్నాళ్లుగా అడుగుతోంది. దీంతో తామెలా బతకాలని వృద్ధ దంపతులు ఇవ్వలేదు. ఇలా కొన్నాళ్లుగా తమపై తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో వృద్ధులు సాగు చేస్తున్న భూమిలో ఈశ్వరమ్మ నువ్వు చేను వేసింది. ఆ పంటను తాము కోయగా కోపంతో ఈశ్వరమ్మ మొత్తం తగులబెట్టింది. ఈ వివాదం పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఈశ్వరమ్మ తన కుమారుడితో శనివారం వచ్చి తమపై దాడి చేసి గాయపరిచిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సగం భూమి ఇస్తామన్నా వినకుండా మొత్తం భూమి ఇచ్చేయాలని వివాదానికి వస్తోందని తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆ వృద్ధ దంపతులు ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎస్.అమ్మినాయుడు తెలిపారు. -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - కోళ్ల లలిత కుమారి
-
ఆరిపోయిన చిరుదివ్వెలు
ఆ ఇంటి దీపాలు ఆరిపోయాయి. ఎన్నో ఆశలతో సుదూరంలో ఉన్న బడికి పంపిస్తున్న వారి కలలన్నీ కల్లలయ్యాయి. తాము నిరుపేదలమైనా.. తమ పిల్లలు చదివి బాగుపడాలన్న వారి ఆకాంక్షలు ఆదిలోనే నీరుగారిపోయాయి. ప్రాథమికోన్నత పిల్లలకు ఉచిత రవాణా సదుపాయం అంటూ చెప్పిన ఆర్టీసీ బస్సుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వారి నిండు ప్రాణాలను బలిగొన్నాయి. బస్సుల్లో పిల్ల లను ఎక్కించుకోకపోవడం... ఉన్న బస్సుల్ని రద్దు చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు వేరే మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం ఆ కుటుంబాల్లో కడుపుకోతకు కారణమయ్యాయి. ఒంటిపూట బడి ముగించుకుని ఇంటికి చేరేందుకు లిఫ్ట్ అడిగి వెళ్తున్న బైక్ కాస్తా ఓ బస్సును ఢీకొన్న సంఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. వారిని తీసుకెళ్తున్న ఆ యువకుడి ప్రాణాలు సైతం గాలిలో కలసిపోయాయి. శృంగవరపుకోట రూరల్: ఒంటి పూట బడులు. మధ్యాహ్నం 12.30 అయింది. బడి వదిలేశారు. ఆకలి వేస్తోంది. వెంటనే ఇంటికి చేరాలి. అమ్మచేతిముద్ద తినాలి. కాస్తంత సేద తీరాలి. మళ్లీ హోం వర్క్‌కు సిద్ధం కావాలి. ఇదే ధ్యాసతో బయలుదేరిన ఆ పిల్లలకు బస్సులు దొరకలేదు. తమతమ గ్రామాలకు వెళ్లాల్సిన బస్సు ఇక రాదని తెలుసుకుని అటుగా బైక్‌పై వెళ్లేవారిని కాస్త ఎక్కించమని బతిమి లాడారు. ఓ అన్న వారిని ఎక్కిం చుకున్నాడు. కానీ అదే వారి ప్రా ణాలు బలిగొంటుందని వారస్సలు ఊహించలేదు. కాసేపట్లోనే వా రు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర సం ఘటన ఎస్‌కోట మండలం కొత్తూరు–వెంకటరమణపేట గ్రామాల మధ్య శనివారం చోటు చేసుకుంది. వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. ఎలా జరిగిందంటే... భోగాపురం మండలం నందిగాం పోస్టు సబ్బన్నపేటకు చెందిన మల్లాడ గౌరీశేఖర్(22) విజయనగరం ఎల్జీ సర్వీస్ సెంటర్లో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఎస్.కోట పట్టణం నుంచి వచ్చిన ఓ కంప్లయింట్‌ను పరిష్కరించేందుకు వచ్చిన ఆ యువకుడు అక్కడి పని పూర్తి చేసుకుని కొత్తవలసలో మరో చోటకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో లక్కవరపుకోట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చప్పగడ్డి విజయ్(6వ తరగతి), గొర్లె లోకేష్ (7వ తరగతి) బడి విడిచిపెట్టాక ఇంటికి వెళ్లేందుకు శృంగవరపుకోట బస్టాండుకు సమీపంలో లిఫ్ట్ అడిగారు. వారిని ఎక్కిం చుకున్న గౌరీశేఖర్ బైక్ కొత్తూరు–వెంకటరమణపేట గ్రామాల మధ్య ముందుగా వెళ్తున్న ఆటోను ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టి పల్టీ కొట్టడంతో బైక్‌ను బస్సు కొద్ది దూరం ఈడ్చుకుని పోయింది. ఈ ప్రమాదంలో బైక్ పై కూర్చున్న ముగ్గురి తలలు, ఇతర శరీర భాగాలు రోడ్డుకు బలంగా తాకటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న మల్లాడ గౌరీశేఖర్ తలకు హెల్మెట్ ధరించినప్పటికీ ఆర్టీసీ బస్సు, బైక్ ఒకదానికొకటి బలంగా ఢీకొనటంతో హెల్మెట్ పక్కనే గల తుప్పలోకి ఎగిరిపోగా గౌరీశేఖర్ తల రోడ్డుకు గుద్దుకోవటంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. బైక్ నుజ్జు నుజ్జయ్యింది. ఇదిలా ఉండగా ఎస్.కోట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు విశాఖ నుంచి ఎస్.కోట వైపు అతివేగంగా వస్తూ ఈ బైక్‌ను ఢీకొందని మరికొంత మంది ఆరోపిస్తున్నారు. హుటాహుటిన మృతదేహాల తరలింపు మృతిచెందిన చప్పగడ్డి విజయ్‌కు 9వ తరగతి చదువుతున్న సోదరుడు అజయ్, తల్లి కాంత, తండ్రి రమణ ఉండగా.. గొర్లె లోకేష్‌కు ఎల్.కోట హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్న జానకి అనే సోదరి, తల్లి వెంకటలక్ష్మి, తండ్రి రామారావు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారన్న సమాచారంతో సమీప గ్రామాల ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకోవటంతో ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసు సిబ్బంది శ్రమించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్.కోట సర్కిల్ ఇన్స్పెక్టర్ వై.రవి, ఎస్.కోట ఆర్టీసీ డిపో మేనేజర్ నాగార్జునరాజుతో కలిసి విజయనగరం డీఎస్పీ ఏ.వి.రమణ పరిశీలించారు. మృతదేహాలను ఎస్.కోట ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. శృంగవరపుకోట ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జిల్లా విద్యాశాఖాధికారిణి జి.నాగమణి, డీఎస్పీ ఏ.వి.రమణ, ఎంఈఓ బి.అప్పారావు ఓదార్చారు. సీఐ వై.రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందరివీ వ్యవసాయ కుటుంబాలే... రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మల్లాడ గౌరీశేఖర్(22), చప్పగడ్డి విజయ్(11), గొర్లె లోకేష్ (12)లు ముగ్గురూ వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే. గౌరీశేఖర్ రోజూ స్వగ్రామమైన భోగాపురం మండలం సబ్బన్నపేట గ్రామం నుంచి విజయనగరంలోని ఎల్జీ సర్వీస్ సెంటర్‌కు ద్విచక్రవాహనంపై వచ్చి వెళ్తుంటారు. సర్వీస్ సెంటర్ నిర్వాహకుల ఆదేశాల మేరకు ఎల్ఈడీ టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు వంటివాటికి మరమ్మతులు చేసేందుకు వివిధ గ్రామాలకు వెళ్తుంటాడు. తండ్రి సన్యాసిరావు తాపీ మేస్త్రీ కాగా, అన్న నాగరాజు వెల్డర్. విద్యార్థి చప్పగడ్డి విజయ్ ఎస్కో ట పట్టణంలోని రామన్ ప్రైవేట్ స్కూల్లో 6వ తరగతి, గొర్లె లోకేష్ ఎస్.కోట పట్టణంలోని శ్రీ రవిజేత హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. రోజూ ఎల్.కోట మండలంలోని సీతారాంపురం గ్రామం నుంచి ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తుంటారు. ఆర్టీసీ బస్సు ఎక్కించకే... బస్సు పాసులు ఉన్నప్పటికీ విద్యార్థులను సక్రమంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కించటం లేదనీ, విద్యార్థులు చేతులు ఎత్తి ఆపుతున్నా స్టాపుల్లో ఆపకుండా బస్సులు వేగంగా వెళ్లి పోతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు, పలువురు విద్యార్థులు, మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో చదువుతున్న స్కూళ్లకు సమయానికి వెళ్లి తిరిగి ఇళ్లకు వచ్చే క్రమంలో విద్యార్థులు అటు వైపుగా ప్రయాణిస్తున్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను ఆశ్రయిస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నపాటి వ్యవసాయ పనులతో పాటు కూలీ పనులు చేసుకుంటూ పిల్లలను బాగా చదివించి వారి జీవితాలను ఉన్నతంగా ఉంచాలనే ఆశయంతో ఎస్.కోట పట్టణంలోని కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నామని, చివరికి రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను మింగేసిందంటూ రోదిస్తున్న ఆ తల్లిదండ్రుల తీరు అక్కడున్నవారిని కంటతడిపెట్టించింది. సీతారాంపురంలో అలుముకున్న విషాదఛాయలు లక్కవరపుకోట: అరకు–విశాఖ రోడ్డులోని ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్కవరపుకోట మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎంతో చలాకీగా ఉంటూ... అందరి తలలో నాలుకలా ఉండే పిల్లలు విగత జీవులుగా మారడంతో వారి కుటుంబ సభ్యులు బోరుమంటూ విలపించారు. ఆర్టీసీ బస్సులు సకాలంలో తిప్పి ఉంటే తమ పిల్లలు బతికేవారని వారంతా గుండెలు బాదుకుని రోదిస్తున్నారు. -
పిలిస్తే పలకడం లేదని.. మహిళపై కత్తితో దాడి
శృంగవరపుకోట రూరల్ : కొన్నేళ్లుగా తనతో కలిసిమెలిసి తిరిగిన వివాహిత మహిళ కొద్ది నెలలుగా తాను పిలిచినా పలకడం లేదనే కోపంతో ఓ వ్యక్తి కత్తితో ఆ మహిళపై దాడి చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు, గాయపడ్డ మహిళ బంధువులు తెలిపిన వివరాలు... మండలంలోని వెంకటరమణపేట గ్రామానికి చెందిన శానాపతి రమణమ్మ(45) మల్లిపూడి క్వారీల సమీపంలో ఉన్న పొలంలో పని చేస్తున్న అన్నదమ్ములకు బుధవారం మధ్యాహ్నం భోజనం పట్టుకుని వెళ్తుండగా ఆమెను అనుసరించిన యండపల్లి జగ్గారావు పిలిచి ఇటీవల ఎందుకు తనకు దూరంగా ఉంటున్నావని నిలదీశాడు. దీనిపై స్పందించిన ఆమె తన భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్నానని తన మానాన తనను వదిలేయాలని చెప్పి వెళ్లిపోతుండగా జగ్గారావు కత్తితో దాడి చేశాడు. రమణమ్మ మెడ, వీపు, ముఖం, చేతి భాగాలపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన రమణమ్మ కేకలు వేయగా స్థానికులు చేరుకుని 108 వాహనం, పోలీసులకు సమాచారమిచ్చారు. రమణమ్మను ఎస్.కోటలోని సీహెచ్‌సీకి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స అనంతరం విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. నిందితుడు జగ్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్.కోట ఇన్చార్జి సీఐ లలిత పరిశీలించారు. ఎస్ఐ మారూఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కఠిన శిక్ష పడేలా చూస్తాం : ఎస్పీ రమణమ్మ విషయం తెలుసుకున్న ఎస్పీ జి.పాలరాజు సీహెచ్‌సీకి చేరుకుని ఆమె పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐని అడిగి వివరాలు తెలుసుకున్నారు. చట్ట ప్రకారం నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ హామీనిచ్చారు. -
భర్త ఇంటి ముందు...భార్య మౌన పోరాటం
♦ గిరిజన మహిళకు మద్దతుగా మహిళ సంఘాలు ♦ తలుపులు వేసి పరారైన అత్తింటి వారు... ♦ చర్చించిన ఎస్ఐ ♦ కాపురానికి తీసుకెళ్లే వరకు ఆందోళన కొనసాగిస్తా... శృంగవరపుకోట రూరల్: తనను కులాంతర వివాహం చేసుకున్న భర్త కాపురానికి తీసుకువెళ్లాలని గిరిజన మహిళ కాకి సుదీప(20) భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. తనకు మద్దతుగా వచ్చిన కరకవానిజోరు, రాయవానిపాలెం, అడ్డతీగ, డెప్పూరు తదితర గిరిజన గ్రామాలకు చెందిన మహిళా మండలి సభ్యులు, తల్లి దేముడమ్మతో కలిసి జరిగిన అన్యాయాన్ని విలేకరులకు వెల్లడించింది. రాయవానిపాలెం గ్రామానికి చెందిన తనను ఎస్.కోట మండలం కిల్తంపాలెం పంచాయతీ శివారు గౌరీపురం గ్రామానికి చెందిన చల్లా శంకరరావు ప్రేమించాడని తెలిపింది. ఏడాది పాటు ప్రేమించుకున్న తాము పెద్దల అంగీకారంతోనే గత ఏడాది మార్చి 5వ తేదీన రాయవానిపాలెం చర్చిలో, 6న ఎస్.కోట దారగంగమ్మ ఆలయంలో తమ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నామని పేర్కొంది. అదే నెల 7న స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోగా ఇక్కడకు తమ అత్తమామలు హాజరు కాలేదని సుదీప చెప్పింది. అనంతరం హైదరాబాద్‌లో ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్న తన భర్త శంకరరావు అక్కడకు తీసుకువెళ్లి ఒక హాస్టల్లో ఉంచాడని, అక్కడకు వస్తూపోతూ...తనుంటున్న గదికి కూడా తీసుకువెళ్లేవాడని చెప్పింది. దీనిపై ప్రశ్నించగా నా ఇష్టం అంటూ...తానేమి చేసినా అడ్డు చెప్పనంటూ లేఖ రాసి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. దీన్ని తాను వ్యతిరేకించడంతో వేధింపులు ప్రారంభించాడని ఆరోపించింది. నిద్రమాత్రలు మింగా.. నా భర్త శంకరరావు పెట్టే వేధింపులు భరించలేక..మా అమ్మకు విషయాలు చెప్పలేక తీవ్ర మనోవేదనతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించానని, చుట్టు పక్కల వారు ఆసుపత్రికి తీసుకువెళ్లి బతికించారని సుదీప చెప్పింది. దీనిపై తన భర్త ఈ పనేదో మీ కన్నవారింటి దగ్గర చేయాలని వేధించాడని తెలిపింది. హైదరాబాద్‌లో ఉండగా తనకు అబార్షన్ మాత్రలు కూడా వేయించాడని చెప్పింది. విషయం నా తల్లికి తెలిసి పెద్ద మనుషుల సమక్షంలో విషయం పెట్టారని హాస్టల్లోనే ఉంచాలని సూచించడంతో అక్కడే ఉన్నానని పేర్కొంది. తరువాత వేధింపులు భరించలేక విశాఖలోని అక్క దగ్గరకు వచ్చి ఉన్నానని డబ్బులు కావాలంటే చిరాకు పడేవాడని రోదిస్తూ చెప్పింది. అత్తవారింటికి గౌరీపురం వెళ్తానంటే చంపుతానని బెదిరించేవాడని, దీంతో కన్నవారింటికి వచ్చేశానని తెలిపింది. కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాటం.. తనను కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాడతానంటూ సుదీప అత్తింటి ముందు మౌన పోరాటానికి కూర్చోవటం, ఆమెకు మద్దతుగా మహిళా మండలి సభ్యులు, తల్లి దేముడమ్మ గౌరీపురం చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారమందుకున్న ఎస్.ఐ ఎ.నరేష్, పోలీసు సిబ్బంది గౌరీపురం చేరుకుని మహిళలతో చర్చించారు. ఎస్.ఐ నరేష్ సూచన మేరకు మౌన పోరాటానికి దిగిన గిరిజన మహిళ సుదీప, ఆమె తల్లి దేముడమ్మ, మహిళా మండలి సభ్యులు పోలీసు స్టేషన్‌కు తరలివెళ్లారు. -
16కిలోల గంజాయి పట్టివేత
ఎస్.కోటలో రహస్య అమ్మకాలు శంగవరపుకోట: ఏడాదిగా ఎస్.కోట పట్టణంలో గంజాయి పట్టుబడుతోంది. స్థానిక పోలీసులు ఇటీవల నిఘా పెంచడంతో పాటు, ఏజెన్సీలో పట్టిష్ట నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయటంతో వరుసగా గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతోంది. తాజాగా గురువారం సాయంత్రం ఎస్.కోట పోలీసులు మాటువేసి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకుని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ బండారు రమణమూర్తి విలేకరుల సమావేశం నిర్వహించిన వివరాలు తెలిపారు. సీఐ రమణమూర్తి మాట్లాడుతూ ఎస్.కోట ఎస్సై రవికుమార్, కానిస్టేబుళ్లు అనిల్, రామునాయుడులు తమకు వచ్చిన సమాచారం ఆధారంగా గురువారం ఆర్టీసీకాంప్లెక్స్ వద్ద నిఘా పెట్టారు. ఇన్‌గేట్ వద్ద వేరే రాష్ట్రానికి చెందిన నలుగురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16కిలోలు ఉన్న 8గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారిని మధ్యప్రదేశ్‌లో విదిశ జిల్లా, కొత్వాలీ తాలూకా సమీపంలో పొరుగు గ్రామాలకు చెందిన నలుగుర్ని రాజు అరివార్, పప్పూ రాజ్‌పూత్, నావెలింగ్ యహర్వారీ, బూరా యహర్వారీలుగా గుర్తించామని సీఐ చెప్పారు. ఎస్.కోటలో ఒక వ్యక్తి నుంచి గంజాయి ప్యాకెట్లు తీసుకున్నామని వారు చెప్పారన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు రూ.80,000 ఉండొచ్చన్నారు. ఎస్.కోటలో వారికి గంజాయి ఇచ్చిన వ్యక్తి ఫోన్‌నంబర్ ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నామని, పట్టుబడ్డ నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎస్.ఐ రవికుమార్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
సమస్యలకు పరిష్కారం ఉద్యమమే
శృంగవరపుకోట: సమస్యలకు పరిష్కారం ఊడిగం కాదు..ఉద్యమమే అంటూ ఆంద్రప్రదేశ్ మహిళాసమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో ఏపీ మహిళాసమాఖ్య జిల్లా కార్యవర్గ సమా వేశాన్ని శనివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సమావేశంలో సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి మాట్లాడుతూ మనువు కాలం నంచి పురుషాధిక్య సమాజంలో మహిళ వివక్షకు గురవుతూనే ఉందన్నారు. అన్ని మతాలు మహిళలకు సమాన హక్కులు లేవనే ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విమల మాట్లాడుతూ పల్లెల్లో మంచినీళ్లు లేకున్నా మద్యం ఏరులై పారుతోందన్నారు. నిత్యవసరాలు నింగిని అంటుతున్నాయని, మహిళల్లో ఆర్థిక స్వావలంబన లేదన్నారు. పోరాటాలే స్ఫూర్తిగా సాగితేనే సమానహక్కులు సాధ్యమన్నారు. సమాఖ్య జిల్లా గౌరవాధ్యక్షురాలు మద్ది మాణిక్యం అధ్యక్షతన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బి.రమణమ్మ, మిడ్డే మీల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి పి.లక్ష్మి, ఎస్.కోట నియోజకవర్గ అద్యక్షురాలు ఎ.పార్వతి. కార్యదర్శి వాడపల్లి సుధలతో పాటూ సుమారు 200 మంది మహిళా సమాఖ్య సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. -
30 కిలోల గంజాయి స్వాధీనం
శృంగవరపుకోట: కోటలో వరుసగా అక్రమ గంజాయి పట్టుబడుతోంది. స్థానిక పోలీసులు ఇటీవల నిఘా పెంచటంతో పాటూ, ఏజెన్సీలో తగిన నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడమే దీనికి కారణం. తాజాగా సోమవారం రాత్రి అరుకు నుంచి వస్తున్న అక్రమ గంజాయిని ఎస్.కోట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో సీఐ లక్ష్మణమూర్తి విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. గంజాయి రవాణా జరుగుతుందన్న ఖచ్చితమైన సమాచారంతో సోమవారం రాత్రి ఎసై్స రవికుమార్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం మాటు వేసి ఏపీ 31 టీఈ 5087 నంబరు గల ఆటోలో తరలిస్తున్న గంజాయిని పట్టుకున్నట్లు వివరించారు. ఒక్కసారిగా పోలీసులు రోడ్డుపై కనిపించడంతో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు పరుగు లంకించుకున్నారని, పోలీసులు చీకట్లో వారిని వెంబడించి ఒకరిని పట్టుకున్నట్లు తెలిపారు. మిగిలిన ఇద్దరు పరారైనట్లు వివరించారు. పట్టుబడిన వ్యక్తిని విచారించగా తన పేరు పాగి ఇండోర్ అని, ఆయన పెదబయలు మండల పరిధిలోని కొరుగుడుపుట్టు గ్రామానికి చెందిన వాడినని వివరించినట్లు పేర్కొన్నారు. ఎస్.కోటకు చెందిన బాలస్వామి అనే వ్యక్తి సరుకు కొనమని చెప్పడంతో కొనుగోలు చేశామని, ఆటోలో 15 గోనెల్లో 30కిలోల గంజాయిని తీసుకువచ్చినట్లు పేర్కొన్నాడు. డాక్టర్ ఎం. హరి సమక్షంలో నిందితుని అదుపులోకి తీసుకున్నామని సీఐ వివరించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ మార్కెట్లో రూ. 60 నుంచి 80 వేల వరకు ఉంటుందన్నారు. బాలస్వామిపై నిఘా పెట్టామని, ఆయన ప్రస్తుతం పరారీలో ఉన్నాడన్నారు. ఆటో రిజిస్ట్రేషన్ ప్రకారం భీమునిపట్నానికి చెందినదిగా గుర్తించినట్లు వివరించారు. ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి పట్టుబడిన వ్యక్తిని కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. -
‘ఉపాధి’ వేతనాలు ఆన్లైన్లో ఎప్పుడు?
శృంగవరపుకోట రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న జిల్లా వేతనదారులకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి బ్యాంకుల ద్వారా నేరుగా వారి ఖాతాలకు ఆన్లైన్ నగదు చెల్లింపులు చేపడతామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఒట్టిమాటేనా? అనే సందేహాన్ని పలువురు వేతనదారులు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి వేతనదారులకు ప్రస్తుతం పోస్టాఫీసుల ద్వారా జరుగుతున్న నగదు చెల్లింపులను నిలిపివేసి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా ఆన్లైన్ చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కింద జిల్లాలోని 34మండలాల్లో చురుగ్గా పనిచేస్తున్న 7,53,082మంది వేతనదారులకు బ్యాంకు ఖాతాలను తెరిచే ప్రక్రియ చేపట్టి ఇప్పటివరకు 3,72,161 పూర్తి చేశారు. ఇంకా జిల్లావ్యాప్తంగా 3,80,921మంది వేతనదారులకు బ్యాంకు ఖాతాలను తెరిపించాల్సి ఉంది. అయితే మండలాల వారీగా ఇప్పటివరకు తెరిచిన 3,72,161వేతనదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన ప్రక్రియ చాలా మందకొడిగా జరుగుతోంది. జిల్లాలోని 34మండలాల్లో గణాంకాల ప్రకారం కేవలం 82,693 వేతనదారుల బ్యాంకు ఖాతాల పరిశీలన జరగ్గా ఇంకా 2,89,468మంది ఖాతాలను పరిశీలించాల్సి ఉంది. ఖాతాల సీడింగ్‌లో ‘సీతానగరం’ ముందంజ జిల్లావ్యాప్తంగా ఉపాధి వేతనదారుల బ్యాంకు ఖాతాల సీడింగ్ ప్రక్రియలో సీతానగరం మండలం ముందంజలో ఉండగా రామభద్రపురం మండలం చిట్టచివరన నిలిచింది. సీతానగరం మండలంలో 27,077మంది వేతనదారులకు గాను 18,038మంది బ్యాంకు ఖాతాలు తెరిచారు. శృంగవరపుకోట మండలంలో 23,311మందికి 11,771, బలిజిపేట 25,603మందికి 14,239, భోగాపురం 14,754మందికి 8378, బొబ్బిలిలో 27,675మందికి 15966, బొండపల్లి 23821కి 9928, చీపురుపల్లి 23029మందికి 8525, గజపతినగరం 21,741మందికి 9226, గంట్యాడ 26,739మందికి 11,510, గరివిడి 21,290మందికి 14,338, గుమ్మలక్ష్మీపురం 21,288మందికి 9600, జామి మండలంలో 20,128మందికి 9163, జియ్యమ్మవలస 28,330మందికి 14024, కొత్తవలస 14,169మందికి 7637, లక్కవరపుకోట 18,675మందికి 8021, పార్వతీపురం 27082మందికి 14888, రామభద్రపురం 15,458మందికి 6835, విజయనగరంలో 14042మంది వేతనదారులకు గాను 7229 మంది బ్యాంకు ఖాతాలను తెరిచారు. జూన్ 1 నుంచి చెల్లింపులు : ఏపీఓ ఆదిలక్ష్మి జిల్లాలో ప్రయోగాత్మకంగా 100 గ్రామాల్లో వేతనదారుల బ్యాంకు ఖాతాలను తెరిచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో నగదు చెల్లింపులు చేయాలని ముందుగా నిర్దేశించారని ఏపీఓ ఎస్.ఆదిలక్ష్మి చెప్పారు. ఇందులో భాగంగా ఎస్.కోట మండలంలో నాలుగు గ్రామాలను ప్రతిపాదించారు. జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్లో నగదు చెల్లింపులు జరపాలని లక్ష్యంగా పెట్టారు. -
హోంగార్డు ఆత్మహత్య
శృంగవరపుకోట : స్థానిక అగ్నిమాపక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శృంగవరపుకోటలోని మునసబు వీధిలో నివాసముంటున్న వసంత ఎరుకునాయుడు(28) అగ్నిమాపక శాఖ కార్యాలయంలో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఆయన మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఫైర్ ఆఫీసర్ రామచంద్రకు ఫోన్‌చేసి ‘సార్ నేను చనిపోతున్నా. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నా..’ అని చెప్పాడు. ఎక్కడున్నావని రామచంద్ర ప్రశ్నించడంతో పుణ్యగిరి కొండపై ఆశ్రమం వద్ద ఉన్నానని తెలిపాడు. వెంటనే ఇద్దరు ఫైర్మెన్లను పుణ్యగిరికి పంపగా, వారు ఎరుకునాయుడిని గుర్తించి సాయంత్రం ఐదు గంటల సమయంలో ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు పంపారు. ఫైర్ సిబ్బంది సమాచారం మేరకు ఎస్ఐ రవికుమార్ వచ్చి ఎరుకునాయుడు వద్ద ఉన్న సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఎరుకునాయుడు మరణించాడు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. ఎరుకునాయుడుకు భార్య మణి, కుమార్తె సౌజన్య ఉన్నారు. మనశ్శాంతి లేక చనిపోతున్నా.. తల్లి కాంత తనను తప్పుడుమార్గంలో పెంచిందని, తాగుడు నేర్పించిందని, తండ్రిని కొట్టించిందని మనశ్శాంతి లేక మరణిస్తున్నానని ఎరుకునాయుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తల్లి కాంత, మరో ముగ్గురు తనపై తప్పుడు కేసులు బనాయించి, గౌరవంగా బతకనీయకుండా చేస్తున్నారని, స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని, వారి వేధింపుల వల్లే చనిపోతున్నానని రాశాడు. తన కూతురిని చిన్నమామకు అప్పగించాలని, భార్యకు మరో పెళ్లి చేయాలని కోరాడు. ఆస్తిని తన తల్లి, భార్య, కుమార్తెకు సమానంగా పంచాలని పేర్కొన్నాడు. తన తండ్రి దహన సంస్కారాలకు ఎవరూ రాకపోవడం బాధించిందని రాశాడు. తన దహన సంస్కారాలకు బంధువులు, కుటుంబ సభ్యుల మొత్తం హాజరుకావాలని ఆ లేఖలో విన్నవించాడు. -
తెలుగుదేశం పార్టీని వీడుతున్నాం
పార్టీకి వెలమల కళ్లాల వాసులు గుడ్‌బై అధికార పార్టీ నేతల తీరుపై నిప్పులు చెరిగిన గ్రామస్తులు శృంగవరపుకోట: ముప్పై సంవత్సరాలు జెండా మోశాం. తెలుగుదేశం పార్టీకి తప్ప మరో పార్టీకి ఏనాడూ ఏ ఒక్క ఓటు వేసిన పాపాన పోలేదు. గ్రామమంతా ఒక్కటే మాటగా గంపగుత్తగా ఓట్లు వేశాం. ఏనాడూ మాకు ఇది కావాలని నాయకుల్ని అడగలేదు. వాళ్లు మాకు చేసింది లేదు సరికదా..ఇప్పుడు మమ్మల్ని ఇరుకున పెట్టి ఇబ్బందుల పాలు చేశారు. పోలీసులు ఈడ్చుకెళ్లి అక్రమంగా అరెస్టు చేస్తే కనీసం మమ్మల్ని పరామర్శించేందుకు పార్టీ నాయకుడు ఒక్కరూ రాలేదు. ఇదీ మాకు పార్టీలో దక్కిన గౌరవం’’’ అంటూ ఎస్.కోటలోని వెలమల కళ్లాల వాసులు మూకుమ్మడిగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వెలమల కళ్లాల వద్ద డంపింగ్‌యార్డు ప్రారంభం సందర్భంగా జరిగిన ఘటనలో పోలీసులు ఏడుగురు వ్యక్తుల్ని అరెస్టు చేయడం, ఈ ఘటనలో పలువురు మహిళల్ని ఈడ్చేయడం చేశారు. ఈ ఘటనలతో కలత చెందిన వెలమలకళ్లాల వాసులు బుధవారం మీడియాను తమ కళ్లాలకు పిలిచి సమావేశం నిర్వహించారు. మాకు అన్యాయం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. పార్టీకి సేవ చేశాం. అభ్యర్థి ఎవరైనా, ఎలక్షన్ ఏదైనా వెలమల కళ్లాలు అంటే తెలుగుదేశం అనేలా పనిచేశామన్నారు. తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌లు ఉన్నా ఏనాడూ డంపింగ్‌యార్డు ఇక్కడ పెడతామన్న మాట చెప్పలేదన్నారు. మా బతుకులు పాడవుతాయని అడిగితే పోలీసులతో తన్నించి, కేసులు పెట్టించారని, ఓట్లేసినందుకు మంచి న్యాయం చేశారని వాపోయారు. పోలీసులు అరెస్టులు చేస్తే కనీసం వారికి నచ్చచెప్పేందుకు ఒక్క నేత మా వెంట రాలేదు. పార్టీవల్ల మాకు న్యాయం జరగలేదు సరికదా..ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్ల తీరు వల్ల అన్యాయం జరిగింది. అందుకే మూకుమ్మడిగా 40కుటుంబాల వారం తెలుగుదేశం పార్టీని వీడుతున్నాం అంటూ గ్రామానికి చెందిన పురుషులు, యువకులు ఎడ్ల రామారావు, ఎడ్ల సంతోష్‌కుమార్, నాగిరెడ్డి గణేష్, వేచలపు సత్తిబాబు, ఎడ్ల గోవింద, రామారావు, బోజంకి ఎర్నాయుడు, అప్పలనాయుడు, రాపేటి నాగేశ్వరరావు, వంటాకు గౌరినాయుడులతో పలువురు మహిళలు మూకుమ్మడిగా ప్రకటించారు. అనంతరం వారంతా ఎమ్మెల్యే, ఎంపీపీ, సర్పంచ్‌లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
ప్రేమికుల జంట ఆత్మహత్యాయత్నం
పుణ్యగిరి సమీపంలో ఘటన కుటుంబ సభ్యులకు ఫోన్‌ద్వారా సమాచారం మిత్రుల సాయంతో ఆస్పత్రిలో చేరిక శృంగవరపుకోట : వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని ఒక్కటవుదామనుకున్నారు. పెద్దలు అంగీకరించలేదు. ఇక కలసి బతకలేమనుకుని కలిసే చావాలనుకున్నారు. అంతే... క్రిమి సంహారక మందులు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అయితే సమాచారం తెలుసుకుని కొందరు వారిని ఆస్పత్రిలో చేర్చడంతో ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రి వర్గాలు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట పట్టణంలోని శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థిని మేడపాటి సత్యవతి, సెంటరింగ్ పనులు చేసే కోటపల్లి ప్రసాద్ ఉరఫ్ స్వామి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దల అంగీకారం లభించకపోవడంతో ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. ఇద్దరూ పుణ్యగిరి ప్రాంతానికి వెళ్లి క్రిమిసంహారక మందు సేవించారు. వాంతులు చేసుకుని అపస్మారకస్థితికి చేరుకున్న వీరిద్దరినీ 4గంటల సమయంలో కాలనీ యువకులు బైక్‌లపై ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. డాక్టర్ శ్యామల ప్రాధమిక చికిత్స చేసి పరిస్థితి చేయిదాటడంతో మెరుగైన వైద్యంకోసం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేస్తున్నట్టు హెచ్‌సీ వెంకటరావు చెప్పారు. చివరి నిమిషంలో ఇళ్లకు సమాచారం స్థానికుల కథనం ప్రకారం సత్యవతి తన తండ్రికి ఫోన్ చేసి ‘నేను వైజాగ్ వెళ్లిపోయా, చనిపోతున్నా నా కోసం వెదకొద్దు’ అంటూ చెప్పింది. స్వామి తన యజమాని ధన భార్యకు ఫోన్ చేసి ‘అక్కా నేను విశాఖలో మా అక్క ఇంటికి వెళ్లాను. రెండు రోజులు పనికి రాను’ అంటూ తొలుత చెప్పాడు. మళ్లీ ఫోన్ చేసి ‘మేం పుణ్యగిరి కొండపై ఉన్నాం. పురుగుల మందు తాగేస్తున్నాం. చనిపోతున్నాం మాకోసం రావదు.్ద’ అంటూ చెప్పినట్టు తెలిసింది. వెంటనే కాలనీ యువకులు, వారి కుటుంబీకులు పుణ్యగిరికి పరుగెత్తారు. పుణ్యగిరి మెట్ల మార్గంలో అపస్మారక స్థితిలో ఉన్న వారిని బైక్‌లపై ఆస్పత్రికి చేర్చారు. -
ముక్కుపు‘ఠా’లు
పల్లెకు పోదాం..సందడి చేద్దాం.. చలో..చలో.. కాలుష్యం లేని పచ్చదనంతో ప్రశాంత వాతావరణం, కల్మషం లేని మనసులతో ఆత్మీయ పలకరింపులు, ఎవరికి ఏ అవసరమొచ్చినా పదిమందీ గుమిగూడడం..కొత్తవారితో అమాయకంగా మాటలు..ఒకరికొకరు సహాయం చేసుకోవడం..పండగొచ్చిందంటే అంతా కలిసి జరుపుకోవడం..అందరి మదిలో మెదిలే అద్భుత భావన ఇది. ఈ వాతావరణాన్ని పల్లెల్లో ఆస్వాదించడానికి వెళ్లేవారు ఇప్పుడు ముక్కుమూసుకుని అక్కడ అడుగు పెట్టాల్సిందే. చాలామంది ఇళ్లలో మరుగుదొడ్లు లేని కారణంగా గ్రామాల్లో రోడ్ల వెంబడి.. ఖాళీ ప్రదేశాల్లో ఎక్కడ బడితే అక్కడ బహిరంగ మలమూత్ర విసర్జన జరుగుతున్న పరిస్థితి ఇప్పుడు వెగటు పుట్టిస్తోంది. శృంగవరపుకోట రూరల్: దేశ ప్రధాని ‘స్వచ్ఛభారత్’ పిలుపులో భాగంగా ఈ ఏడాది అమలు చేస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జిల్లాలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం చేయించిన సర్వే మేరకు జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు 3,01,458 ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు కలెక్టర్ క్షేత్రస్థాయిలో అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించి ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నప్పటికీ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి ఇలా.. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రగతి జిల్లాలో అథమంగానే ఉంది. జిల్లాలోని 34 మండలాల్లో 3,01,458 మరుగుదొడ్లు లేని ఇళ్లకు గాను 94,442 ఇళ్లకు మరుగుదొడ్లు మంజూరు చేశారు. వీటిలో ఇప్పటివరకు 12,428 మరుగుదొడ్లు పూర్తయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా శృంగవరపుకోట మండలంలో 177, బాడంగి 282, బలిజిపేట 59, భోగాపురం 111, బొబ్బిలి 386, బొండపల్లి 216, చీపురుపల్లి 166, దత్తిరాజేరు 230, డెంకాడ 275, గజపతినగరం 32, గరివిడి 143, గుమ్మలక్ష్మీపురం 416, గుర్ల 140, జామి 12, జియ్యమ్మవలస 181, కొమరాడ 17, కొత్తవలస 224, కురుపాం 278. లక్కవరపుకోట 391, మక్కువ 147, మెంటాడ 92, మెరకముడిదాం 14, నెల్లిమర్ల 142, పాచిపెంట 888, పార్వతీపురం 622, పూసపాటిరేగ 206, రామభద్రపురం 210, సాలూరు 169, సీతానగరం 144, తెర్లాం 205, వేపాడ 326, విజయనగరం 191 మొత్తంగా 7685 మరుగుదొడ్ల నిర్మా ణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే నిర్మించిన మరుగుదొడ్లకు ప్రభుత్వ అధికారులు చెప్పినట్లుగా నిధులు వెంటవెంటనే మంజూరు చేయకపోవడం కూడా ప్రగతికి అవరోధంగా నిలిచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామూహిక మరుగుదొడ్లే ప్రత్యామ్నాయం.. ఇళ్లల్లో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడం అంటే మహిళల ఆత్మ గౌరవానికి భంగపాటని అధికారులు గ్రామస్థాయిలో అవగాహన క ల్పిస్తూ మరుగుదొడ్లకు నిధులు మంజూరు చేస్తామన్నా ఇళ్లల్లో స్థలాభావంతోనే మరుగుదొడ్డి నిర్మాణానికి వెనుకడుగు వేసే పరిస్థితి ఒక కారణంగా కనిపిస్తోంది. అది కాకుండా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారికి బిల్లుల మంజూ రులో జాప్యం జరుగుతుండడం మరో కారణంగా కనిపిస్తోంది. అప్పులు చేసి మరుగుదొడ్డి నిర్మిస్తే బిల్లులందక పోతే అప్పులు తీర్చడమెలా అని శంకిస్తూ చాలామంది ముందుకు రావడం లేదని స్పష్టమవుతోంది. ఈ పరిస్థితులను అధిగమించేందుకు ముందుగా పలు గ్రామాలను ఎంపిక చేసి సామూహిక మరుగుదొడ్లను ప్రభుత్వ స్థలాల్లో నిర్మించి వాటికి పూర్తిస్థాయిలో నీరు, విద్యుత్ వంటి సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రతిరోజూ పంచాయ తీ సిబ్బంది పర్యవేక్షణ ఉండేలా చూస్తేనే ఆనుకున్న సత్ఫలితాలు వస్తాయని పలువురు భావిస్తున్నారు. నిర్మాణ బాధ్యతలు ఉపాధి పథకానికి? స్వచ్ఛభారత్ పథకంలో అనుకున్నంతగా నిధులు లేనందున ఇక నుంచి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ బాధ్యతలు ఉపాధిహామీ పథకానికి అప్పగించనున్నట్టు అధికారిక సమాచారం. జిల్లా వ్యాప్తంగా 34 మండలాల ఉపాధి పథకం ఏపీఓలకు మరుగు దొడ్ల నిర్మాణాలకు సంబంధించి ఇటుకలు, బేసిన్లు ముందుగానే సిద్ధం చేసుకున్న అనంతరం శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉపాధి సిబ్బం దితో జిల్లా ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నట్టు తెలిసింది. -
నకిలీ నోట్ల ముఠా అరెస్టు
శృంగవరపుకోట రూరల: నకిలీ నోట్లు చెలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను శృంగవరపుకోట పట్టణ ఎస్ఐ కె.రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శనివారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన నకిలీ ఐదొందల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్.కోట సీఐ ఎం.లక్ష్మణమూర్తి, ఎస్ఐ కె.రవికుమార్‌లు తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం చిననాగయ్యపేట గ్రామానికి చెందిన తమటపు దండునాయుడు, బుద్దల శ్రీనివాస్ (తాడేపల్లిగూడెం), బొద్దు శ్రీనివాస్ (పిఠాపురం), యడ్ల గోపాలకృష్ణ (జగ్గంపేట), మండూరు రమేష్ (గణపవరం), కేసనాపల్లి రమేష్‌కుమార్(తాడేపల్లిగూడెం)లు ఒక ముఠాగా ఏర్పడి చిన్న పిల్లలు ఆడుకునే నకిలీ ఐదొందల నోట్లకట్టలకు పైనా.. దిగువున ఒరిజనల్ ఐదొందల నోట్లను పెట్టి ప్లాస్టిక్ కవర్లలో ప్యాకింగ్ చేసి సిద్ధంగా ఉంచుకుంటారు. ఎవరైనా లక్ష ఒరిజనల్ నోట్లు ఇస్తే మూడు లక్షల దొంగనోట్లు ఇస్తామంటూ అమాయకులను ప్రలోభపెడతారు. ఈ నేపథ్యంలో ఎస్.కోట పట్టణ ంలోని వన్‌వే ట్రాఫిక్ సమీపంలో నివసిస్తున్న ఫిర్యాదుదారుడుకు ముఠా సభ్యుడు దండునాయుడు తారసపడి, అసలు నోట్లకు మూడింతలు దొంగనోట్లు ఇస్తామంటూ నమ్మబలికారు. దీంతో ఆయన అప్రమత్తమై ముఠా సభ్యుల ఆట కట్టించాలని భావించి ఎస్ఐ కె.రవికుమార్ దృష్టికి తీసుకెళ్లాడు. ఆయన సూచనల మేరకు ఫిర్యాదుదారుడు ముఠాసభ్యుడికి రూ.30 వేలు ఒరిజనల్ నోట్లు అందజేసి లక్ష నకిలీ నోట్లు తీసుకున్నాడు. ఇదే సమయంలో ఎస్ఐ చాకచక్యంతో కానిస్టేబుల్ శ్రీనును సాధారణ వ్యక్తిగా ఆ ముఠా వద్దకు పంపించారు. బేరసారాలు జరుగుతుండగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రూ.15 లక్షల నకిలీ నోట్లతో పాటు ఆరుగురు ముఠాసభ్యులను అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురిని పెందుర్తి వద్ద, దండునాయుడును దేవరాపల్లి మండలం చిననాగయ్యపేటలో పట్టుకుని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ లక్ష్మణ మూర్తి ప్రజలకు సూచించారు. నకిలీ నోట్ల సమాచారం తెలిస్తే తమకు విషయం తెలియజేయాలని కోరారు. కాగా, 20 రోజుల పాటు శోధన చేసి ఆరుగురు ముఠా సభ్యులను అరెస్టు చేసిన ఎస్ఐను, పోలీసు సిబ్బందిని అభినందించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
జీడితోటలో కొమ్మకు వేలాడుతున్న మృతదేహం భర్తే చంపాడంటున్న మృతురాలి తల్లిదండ్రులు తనకు తెలియదంటున్న భర్త దబ్బగుంట(శృంగవరపుకోట) : నూతన సంవత్సర వేడుకలు ముగియకముందే ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మరణించింది. శృంగవరపుకోట మండలం దబ్బగుంట గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని మూలబొడ్డవర పంచాయతీ దబ్బగుంట గ్రామానికి చెందిన కొర్ర జమరాజు, ఎరుకులమ్మ దంపతుల మూడో కుమార్తె కన్నమ్మ(21)కు, వేపాడ మండలం కొండగంగుబూడి పంచాయతీ పరిధిలోని ఎస్.కోట సీతారాంపురం గ్రామానికి చెందిన కందుల రాముతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నూతన సంవత్సర వేడుకల కోసం జమరాజు సీతారాంపురంలో ఉంటున్న తన కుమార్తె కన్నమ్మను గురువారం సాయంత్రం దబ్బగుంట తీసుకొచ్చారు. కన్నమ్మ భర్త రాము శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో అత్తారింటికి వచ్చాడు. అదే సమయంలో జమరాజు గ్రామంలోని తమ కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి పిక్నిక్కు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. ఇష్టానుసారంగా పిక్నిక్లకు వెళుతూ డబ్బు ఖర్చు చేస్తున్నావంటూ రాత్రి 9 గంటల సమయంలో జమరాజుతో అల్లుడు రాము గొడవపడ్డాడు. ఇద్దరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో రాము తన భార్య కన్నమ్మను తీసుకుని వెళ్లిపోయాడు. అయితే రాము రాత్రి 11 గంటల సమయంలో జమరాజు ఇంటికి వచ్చి తన భార్య ఎక్కడుంది... పరిగెత్తుకు వచ్చింది.. మీరే దాచారు.. అంటూ మళ్లీ గొడవపడి వెళ్లిపోయాడు. ఆ రాత్రికి గ్రామంలోని తామల కన్నబాబు ఇంటి వద్ద నిద్రించాడు. కన్నమ్మ కుటుంబ సభ్యులు రాత్రంతా ఆమె కోసం వెదికినా కనిపించలేదు. శనివారం ఉదయం జమరాజు ఇంటి వెనుక వంద గజాల దూరంలో ఉన్న జీడితోటలో చెట్టు కొమ్మకు చున్నీతో వేలాడుతున్న కన్నమ్మ మృతదేహం ఆమె తల్లి ఎరుకులమ్మకు కనిపించింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా... భర్త రాము పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతడ్ని గ్రామస్తులు పట్టుకుని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ కుమార్తెను రాము హత్య చేసి నమ్మించటం కోసమే రాత్రి గ్రామంలో బస చేశాడని కన్నమ్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాను భార్యను హత్య చేయలేదని, ఆమె తనతో సఖ్యతగా ఉండేదని రాము చెబుతున్నాడు. ఎస్ఐ రవికుమార్ ఆధ్వర్యాన కన్నమ్మ మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రామును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కుటుంబ గొడవల నేపథ్యంలో కన్నమ్మ ఆత్మహత్య చేసుకుందా.. హత్యకు గురైందా.. అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. -
సర్వేయర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
శృంగవరపుకోట: మండలంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచే సేందుకు సర్వేయర్ పోస్టులకు దరఖాస్తులు అహ్వానిస్తున్నట్టు తహశీల్దార్ రాములమ్మ చెప్పారు. అభ్యర్థులు ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్, లేదా పాలిటెక్నిక్ డిప్లమోలో సివిల్ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా దరఖాస్తులను స్థానిక తహశీల్దార్ కార్యాలయానికి పంపాలని సూచించారు. మండలానికి 5 నుంచి 10 మంది అభ్యర్థులను ఎంపిక చేసి కలెక్టర్‌కు నివేదిక పంపుతామన్నారు. కలెక్టర్ ఎంపిక చేసిన వారికి, విలువైన శిక్షణ 60 రోజులు పాటు ఇచ్చిన తర్వాత, రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారిని మండలానికి ఇద్దరిని పోస్టు చేస్తామన్నారు. వీరికి నెలకు రూ. 5000 నుంచి రూ.6000 వరకూ గౌరవభృతి ఇస్తారని చెప్పారు. -
సలాం... కలామ్‌జీ
శృంగవరపుకోట : భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాంకు ఎస్.కోట వా సులు గురువారం ఘన నివాళులర్పిం చారు. స్థానిక జేఏసీ నేతృత్వంలో గురువారం ఉదయం 10.30 గంటలకు ఎస్.కోటలో స్థానిక పుణ్యగిరి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభాస్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్.కోట మండలాధ్యక్షుడు రెడ్డి వెంకన్న, జెడ్పీటీసీ ఎస్.రామలక్ష్మి, సర్పంచ్ అంబటి లక్ష్మి, ఎల్.కోట జెడ్పీటీసీ కె.ఈశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ నెక్కల నాయుడుబాబు, జేఏసీ నాయకులు జె.మురళి. సుధాకర్, మోహన్‌రాజ్, అశోక్‌రాజు, రాష్ట్ర రేషన్‌డీలర్ల సంఘ అధ్యక్షులు బుగత వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్, స్నేహ స్వచ్చంద సంస్థల సభ్యు లు అంతా ముందుగా కలాం చిత్రపటానికి పూలు వేసి నివాళులు అ ర్పించారు. అనంతరం విద్యార్థులు, స్థానికులు, అధికారులు వేలాదిగా వెంటరాగా కలాం చిత్రపటాన్ని దేవీ జంక్షన్‌కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ అంతా కాసేపు మౌనం పాటిం చారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు కలాం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కలాం మరణం ఎన్నటికీ తీరని లోటని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జెడ్పీ చైర్మన్ శోభాస్వాతిరాణి, వైఎస్ఆర్ సీపీ నాయకుడు నెక్కల నాయుడుబాబు అన్నారు. కొత్తవలస సీఐ సంజీవరావు, ఎస్.కోట ఎస్ఐ సాగర్‌బాబులు ర్యాలీకి బందోబస్తు నిర్వహించారు. -
పుష్కర విషాదం
రాజమండ్రి నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం జిల్లాకు చెందిన నలుగురు మహిళలు మృతి పలువురికి తీవ్ర గాయాలు శోకసంద్రంలో రెడ్డిపాలెం, శింగరాయి శృంగవరపుకోట,వేపాడ,ఎల్.కోట, కె.కోటపాడు : పితృదేవతల్ని తరింప చేయడం కోసం, పుణ్యప్రదమైన గోదావరి పుష్కరస్నానాలు ఆచరించేందుకు రాజమండ్రి వెళ్లి తీర్థవిధులు పూర్తిచేసి ఆ ఆనందాన్ని, అనుభూతులను గుండెల నిండా నింపుకొని ఇంటికి చేరుతున్న తరుణంలో మృత్యువు దారికాచి వారి సంతోషాలను చిదిమేసింది. ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో విధి వారిని కాటే సింది. మరో అరగంటలో ఇంటికి చేరుకుంటారన్న తరుణంలో నలుగురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాజమండ్రి నుంచి వస్తున్న వాహనం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం వారాడ సంతపాలెం కూడలి వద్ద మంగళవారం వేకువజామున ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా, 29 మంది గాయాల పాలయ్యారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది. బాధితులు, బంధువుల రోదనలతో కె.కోటపాడు ఆస్పత్రి మార్మోగిపోయింది.లక్కవరపుకోట మండలం రెడ్డివానిపాలెంకు చెందిన 29 మంది, వేపాడ మండలం బానాదికి చెందిన ఇద్దరు, శింగరాయి, వేపాడ గ్రామాలనుంచి ఒక్కొక్కరు మొత్తంగా 33మంది సోమవారం రాత్రి టాటా ఏస్ వ్యాన్‌లో రాజమండ్రి బయలుదేరారు. రాజమండ్రిలో పుష్కరస్నానాలు చేసుకుని తిరిగి ఇంటిముఖం పట్టారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో విశాఖ జిల్లా కె.కోటపాడు మండల పరిధిలో వారాడ సంతపాలెం వద్ద కల్వర్టు వద్దకు వచ్చే సరికి ప్రమాదం జరిగి సుమారు 20 అడుగుల లోతున్న గెడ్డలో బోల్తాపడింది. ప్రమాదంలో రెడ్డివానిపాలెం గ్రామానికి చెందిన రెడ్డి దేముడమ్మ(62), వేపాడ మండలం సింగరాయి గ్రామానికి చెందిన కొల్లి సన్యాసమ్మ(58) సంఘటన స్థలంలోనే మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ రెడ్డి సన్యాసమ్మ(60), రెడ్డి అచ్చియ్యమ్మ(63) చనిపోయారు. కాళ్లు,చేతులు విరిగిపోయిన ఆర్.ఈశ్వరమ్మ, ఎ.రాముడమ్మ, ఆర్.గణేష్, ఆర్.శ్రీలక్ష్మి, ఆర్.రాజేశ్వరి, ఆర్.లక్ష్మణరావు, ఆర్.సింహాచలం, రెడ్డి సింహాచలంనాయుడు, ఆర్. వేములమ్మ, ఆర్. లక్ష్మి, ఆర్.ఈశ్వరరావులకు కె.కోటపాడు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. ఆర్.భవాని, రెడ్డి సన్యాసమ్మ , ఆర్.చినదేముడు , ఆర్.సన్యాసమ్మ , అనపర్తి కీర్తన, అనపర్తి భరత్ , రెడ్డి కోటి , కొప్పు ముత్యాలరావు, అనపర్తి లక్ష్మి , ఆర్. ఈశ్వరమ్మ , ఆర్.సన్యాసమ్మ , ఎ.లక్ష్మి , ఆర్.అక్కమ్మ , కె.బుచ్చమ్మ , వి.కన్నమ్మ , ఎ.రాముడమ్మ , రెండు సంవత్సరాల వయస్సు గల ఆర్.కోమలి (2) కె.కోటపాడులో వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు బాధితులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందేలా దగ్గరుండి పర్యవేక్షించారు. మృతిచెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్.కోట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నెక్కల నాయుడుబాబులు పరామర్శించారు.. చనిపోయిన రెడ్డి సన్యాసమ్మ, రెడ్డి దేముడమ్మ, కొల్లి సన్యాసమ్మ, రెడ్డి అచ్చియ్యమ్మల దహన సంస్కారాలకు రూ.8 వేలు చొప్పున ఆయా కుటుంబ సభ్యులకు కె.కోటపాడు తహశీల్దార్ కె.సత్యారావు అందజేశారు. బాధిత కుటుంబాలను స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు రెడ్డి జగన్మోహన్, శ్రీకాంత్ శ్రీనులు పరామర్శించారు. చోడవరం సీఐ కిరణ్‌కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. శోకసంద్రమైన రెడ్డివానిపాలెం లక్కవరపుకోట మండలం పోతంపేట పంచాయతీ రెడ్డివానిపాలెం గ్రామంలో ముప్పై కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. రెడ్డి ఇంటిపేరున ఉన్న వీరంతా దాయాదులు, దగ్గర బందువులు. వ్యవసాయం, కూలి పనులు ప్రధాన వృత్తిగా చే సుకుని గడిపే వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ప్రతిఇంటి నుంచి ఒకరిద్దరుగా కలిసి పుష్కరస్నానాలకు బయల్దేరారు. రెడ్డివానిపాలెంకు చెందిన రెడ్డి అచ్చియ్యమ్మ(56) గ్రామంలోని వారితో కలిసి పుష్కరస్నానానికి బయల్దేరింది. ఆమెకు ఎనభైయేళ్ల వయస్సు పైబడ్డ ఆమె తల్లి, 60 యేళ్ల పైబడ్డ భర్త, కొడుకు, కోడలు, కూతురు-అల్లుడు, మనుమలు ఉన్నారు. అంతా యాత్రకు వెళ్లిన అమ్మ వచ్చేస్తుందని పిల్లలు చూస్తుంటే చనిపోయిందన్న పిడుగులాంటి వార్త వారికి చేరింది. దీంతో వారు భోరున విలపిస్తున్నారు. ఇదేగ్రామానికి చెందిన రెడ్డి దేముడమ్మ, తనకోడలుతో కలిసి పుష్కరాలకు వెళ్లింది. ప్రమాదంలో దేముడమ్మ చనిపోగా, కోడలు తీవ్రగాయాలతో విశాఖ కెజీహెచ్‌లో ఉంది. ఇదే గ్రామానికి చెందిన రెడ్డి సన్యాసమ్మ, గ్రామంలో వారంతా వెళ్తున్నారు. అంతా అయినవాళ్లే కదా వె ళ్లొస్తానంటూ పుష్కరాలకు వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు మహిళలు చనిపోవడం, మరో 26 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలవటం, కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో రెడ్డివానిపాలెంలో విషాధచాయలు అలముకున్నాయి. మంగళవారం ఘటన వార్త తెలిసిన వెంటనే గ్రామస్తులంతా ఆస్పత్రికి పరుగులు తీశారు. రెడ్డివానిపాలెం ప్రతి ఇంటా కన్నీటి ధారలు పారుతున్నాయి. వేపాడ మండలం శింగరాయి గ్రామానికి చెందిన కొల్లు సన్యాసమ్మ(58) రెడ్డివానిపాలెం గ్రామంలో ఉంటున్న తన మేనల్లుడుతో కలిసి పుష్కరాలకు వె ళ్లి ప్రమాదం పాలై ప్రాణాలు వదిలింది. ఈమెను పుష్కరాలకు తీసుకెళ్లిన మేనల్లుడు, అతని భార్యకు ప్రమాదంలో కాళ్లు విరిగాయి. -
అనుమానంతో భార్యపై భర్త దాడి
విజయనగరం/కొట్టాం(శృంగవరపుకోట): అనుమానం పెనుభూతమైంది. దీనికి మద్యం రక్కసి తోడైంది. తాళికట్టిన భార్యపై మద్యం మత్తులో ఓ భర్త దాడికి తెగబడ్డాడు. అనంతరం ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని కొట్టాం గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కొట్టాం గ్రామానికి చెందిన సింగిడి శ్రీను, రమణమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు వివాహం కావటంతో అత్తవారింట ఉంటోంది. కొడుకు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ వేరొక చోట ఉంటున్నాడు. శ్రీనుకు భార్య రమణమ్మ ప్రవర్తనపై అనుమానం ఉంది. గతంలో పలు దఫాలు ఆమెను హెచ్చరించాడు. ఇదే విషయమై బుధవారం మధ్యాహ్నం ఇద్దరూ గొడవ పడ్డారు. ఆవేశంలో శ్రీను భార్యపై కత్తితో దాడి చేశాడు. తర్వాత క్రిమిసంహారక గుళికలు తిని వాంతులు చేసుకున్నాడు. దీనిని గమనించిన స్థానికులు 100కు సమాచారం ఇవ్వటంతో ఎస్.కోట పోలీసులు వారిద్దరిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం కేంద్ర ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు పోలీసులు తెలిపారు. -
నువ్వే ఆధారం అనుకుంటే..
కానరాని లోకాలకు చేరిన కన్నకొడుకు రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం బస్ కిందపడి మృతి శంగవరపుకోట: కని పెంచిన కొడుకు చేతికి అందివచ్చాడు. ఇక చింతా లేదు. ఏ కూలీనాలి చేసైనా పోషిస్తాడు. అంతా తానే చూసుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రుల నమ్మకం అంతలోనే ఆవిరైంది. కొడుకు కనిపించని లోకాలకు వెళ్లిపోయి కడుపుకోత మిగల్చడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తమ కష్టం పగవారికైనా రాకూడదంటూ ఏడుస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరమూ కాలేదు. ఎస్.కోట పట్టణంలో గురువారం మధ్యాహ్నం విశాఖ -అరకు రోడ్డులో షిర్డీసాయి గుడి ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి విరాలిలా ఉన్నాయి. మండలంలోని ఆలుగుబిల్లి గ్రామానికి చెందిన జీనపాటి ఎర్నిబాబు(25) అనే యువకుడు గ్రామంలోని ఆదిత్య ఎగ్రిగేట్స్ క్వారీలో లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్.కోటలో ఇటీవల తాను తీసుకున్న ద్విచక్రవాహనానికి సంబంధించి ఫైనాన్స్ చెల్లించేందుకు ఎర్నిబాబు ఎస్.కోట వచ్చినట్టు తెలిసింది. పనిచూసుకుని గ్రామానికి వెళ్లేందుకు బయల్దేరిన ఎర్నిబాబు స్థానిక షిర్డీసాయి ఆలయం వద్ద విశాఖ నుంచి ఎస్.కోట డిపో వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్‌ను ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పి రోడ్డుపైకి తూలిపోయాడు. అదే సమయంలో వెనుక వస్తున ఆర్టీసీబస్ ఢీకొట్టడంతో బైక్ నుజ్జయిపోగా, ఎర్నిబాబును సుమారు 10 అడుగుల దూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో ఎర్నిబాబు తలకు తీవ్ర గాయం కావడంతో పాటూ బస్ ముందు టైర్‌కింద శరీరం ఛాతీ భాగం ఉండిపోయింది. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో వెంటనే వచ్చిన సిబ్బంది ఎర్నిబాబును ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుడు ఎం.ఎన్.చారి సిబ్బంది సేవలు అందిస్తుండగానే ఎర్నిబాబు ప్రాణాలు వదిలాడు. ఎస్.కోట ఎస్సైలు సాగర్‌బాబు, కాంతారావులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మతుని తండ్రి దేముడు గ్రామస్వీపర్. కుమారుడు మరణ వార్త విని తల్లిదండ్రులు దేముడు-ఈశ్వరమ్మలు ఆస్పత్రికి వచ్చి మమ్మల్ని అన్యాయం చేశావురా అంటూ నెత్తీనోరు బాదుకుంటూ ఏడ్వడం ఆస్పత్రిలో అందర్నీ కంటతడి పెట్టించిందిృ మతుడికి ఒక చెల్లెలు ఉంది. -
భార్య కళ్లముందే భర్త మృతి
శృంగవరపుకోట: ఆలూమగలిద్దరూ మార్నింగ్‌వాక్‌కు వెళ్లారు. అడుగులో అడుగేస్తూ నడుస్తున్న వారి వెనకే ఆర్టీసీ బస్ మృత్యురూపంలో వచ్చి ఢీకొట్టడంతో భర్త రోడ్డు మీదే ప్రాణాలు కోల్పోయారు. వివరాలిలా ఉన్నాయి. శృంగవరపుకోటలో గాంధీనగర్ రెండవవీధికి చెందిన దాసరి కృష్ణమూర్తి(63) భార్య కామేశ్వరిలు మంగళవారం వేకువజామున మార్నింగ్‌వాక్‌కు బయల్దేరారు. వారిద్దరరూ ఎస్.కోట నుంచి కొత్తూరు వైపు వాకింగ్ చేస్తున్నారు. భార్య కామేశ్వరి కాస్త ముందుగా న డిచి కొత్తూరు గ్రామంలో వినాయక ఆలయం వద్ద కూర్చుంది. కృష్ణమూర్తి కొత్తూరు గ్రామం శివాలయం వద్ద రోడ్డు మలుపు తిరుతుండగా ఎస్.కోటలో బయల్దేరిన అరకు -విశాఖ డీలక్స్ ఆర్టీసీ బస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన బస్ కృష్ణమూర్తిని సుమారు 30మీటర్లకు పైగా ఈడ్చుకు పోవడంతో రోడ్డుపై పడ్డ ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు. అదే దారిలో వాకింగ్‌కు వచ్చిన వారు గమనించి బస్ ఢీకొని వృద్ధుడు చనిపోయారని చెప్పుకోవడంతో వినాయక ఆలయం వద్ద కూర్చున్న భార్య కామేశ్వరికి అనుమానం వచ్చి చూడగా చనిపోయింది భర్త కావడంతో ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. భర్తతో పాటు తాను కూడా పోకుండా ఎందుకు ఉండిపోయానంటూ ఆమె నెత్తీ నోరు బాదుకుంటుంటే చూపరులు చలించిపోయారు. ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ కేఆర్డీ. ప్రసాద్ బస్‌ను సంఘటనా స్థలంలో వదిలి ఎస్.కోట స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఘనీ కేసు నమోదు చేసి, వివరాలు సేకరించి, మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపి, ఆర్టీసీబస్‌ను తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు. -
ఆడ కూతురికి న్యాయం చేయండి
శృంగవరపుకోట: అత్తింటి ఆరళ్లకు బలైన ఓ ఆడకూతురికి న్యాయం చేయాలని కోరుతూ మహిళలు రోడ్డెక్కా రు. స్థానిక వన్ వే జంక్షన్ వద్ద వారంతా బాధితురాలి అత్తింటి వారికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కట్నం తీసుకుని, పెళ్లి చేసుకుని తర్వాత అమ్మాయికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ బాధితురాలి బంధువులు అత్తింటి వారిపై దాడికి దిగారు. దీంతో పోలీ సులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. ఈ మొత్తం వ్యవహారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ సాగింది. దీనికి సంబంధించి పోలీసులు అందించిన వివరాలు... పట్టణంలోని మునసబువీధికి చెందిన ఆడారి లావణ్యకు 2010లో వివాహం జరిగింది. అయితే భర్తతో సరిపడక కోర్డు ద్వారా విడాకులు తీసుకుంది. అ నంతరం ఆమెను వన్‌వే జంక్షన్‌కు చెందిన మళ్ల కుమార్ ఇష్టపడటంతో ఇరువురి కుటుంబ సభ్యుల అంగీకారం తో 2013మే 29న వివాహం జరిగింది. అయితే నాలుగు నెలల క్రితం లావణ్య ఆరోగ్యం బాగాలేదని అత్తింటి వారు ఆమెను పుట్టింటిలో దిగబెట్టారు. ప్రస్తుతం లా వణ్య రెండు కిడ్నీలు చెడిపోయాయి. కాళ్లు వాచిపోయి మంచం కదల్లేని స్థితిలో ఉంది. ఆమె భర్త మళ్ల కుమార్, కుటుంబ సభ్యులు విడాకుల కోసం ఒత్తిళ్లు తెస్తున్నార ని, అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని లావణ్య బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపైనే ఇరు కుటుం బాల మధ్య ఘర్షణ జరిగింది. ఆదివారం మధ్యాహ్నం రెండు కుటుంబాల మధ్య వాగ్యుద్ధమే జరిగింది. లక్షల రూపాయలు కట్నంగా తీసుకుని, ఇప్పుడు వదిలించుకోవడానికి ప్రయత్నించడం సరికాదని కుమార్‌పైనా, అతని తల్లిదండ్రులు తాతబాబు, అచ్చియ్యమ్మ తదితరులపై పలువురు దాడి చేశారు. ఈ ఘటనతో వన్‌వే జంక్షన్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కుమార్ కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో లావణ్య బంధువులు, మహిళా సంఘాల సభ్యులు, స్థానిక సీపీఎం నేతలు అంతా లావణ్యకు న్యా యం చేయాలంటూ వన్‌వే జంక్షన్ నుంచి స్టేషన్ వరకూ ర్యాలీ నిర్వహించి, స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. లావణ్య తల్లి ఆడారి పద్మ మాట్లాడుతూ పెళ్లినాటి ఒప్పందం మేరకు ముందు 1.5లక్షలు కట్నం, 15తులాల బంగారం, ఒక ఇల్లు, 1.20ఎకరాల భూమి ఇచ్చామని తెలిపారు. తర్వాత కూడా లక్ష రూపాయలు ఇచ్చినట్లు చెప్పారు. నాలుగు నెలల కిందట పిల్లకు ఒంట్లో బాగోలేదని చెప్పి పంపించేశారని, అమ్మాయికి మందు పెట్టి ఆరోగ్యం పాడు చేశారని ఆరోపించారు. ఆరు నెలల కిందట కూడా కిరోసిన్ పోసి చంపాలని చూశారని చెప్పారు. అప్పుడు ఎస్.కోట స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పెద్దలు రాజీ చేశారని తెలిపారు. ఇప్పడు తన కూతురి ఆరోగ్యం పాడైపోతే విడాకులు అడుగుతున్నారని, పోలీసులే న్యాయం చెప్పాలని అన్నారు. కుమార్, అతని తల్లిదండ్రులు మాట్లాడుతూ... ‘రూ.1.5 లక్షల కట్నం, పొలం, ఇళ్లు, తొమ్మిది తులాల బంగారం ఇచ్చారు. ఇద్దరి మధ్య ఏ తగువూ లేదు. ఈ మధ్య ఆరోగ్యం బాగోక అమ్మగారింటికి వెళ్తానంటే పంపాం. తర్వాత వాళ్లింటికి వెళ్తే మేము మందు పెట్టి పాడు చేశాం అని తిట్టడంతో వెళ్లటం మానేశాం. నిన్న పెద్దలు బంగారం తిరిగి ఇచ్చేయమన్నారు. బంగారం కుదువ పెట్టి వాళ్లు ఇచ్చిన ఇల్లు రిపేరు చేయించాం. సమయం కావాలని కోరాం. ఈ రోజు ఊహించని విధంగా మాపై దాడి చేసి ఇష్టానుసారం మమ్మల్ని కొట్టారు. నిందలు మోపారు. లావణ్యను మా ఇంటికి తీసుకెళ్లిపోవటానికి మాకు ఏ అభ్యంతరం లేదు’ అని చెప్పారు. దీనిపై ఎస్.కోట ఎస్ఐ ఎస్.కె..ఘనీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లడిల్లిన తల్లిపేగు
వేములాపల్లి (శృంగవరపుకోట రూరల్) : అప్పటి వరకు అమ్మ వెనుకే తిరిగి అల్లరి చేసిన బాలుడు శాశ్వతంగా అల్లరి మానేశాడు. స్కూలుకు వెళ్లా లి నాన్నా అని తండ్రికి చెప్పిన చిన్నారి అంతలోనే శాశ్వ త సెలవు తీసుకున్నాడు. వద్దన్నా తల్లి వెనుక వెళ్లిన ఆ బాలుడు చివరకు మృత్యుగోతిలో పడిపోయాడు. వేములాపల్లిలోని గోస్తనీ నది గోతిలో పడి సోమవారం ఓ బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎస్.కోట మండలం, వే ములాపల్లి గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన టొంపల అ ప్పారావు కొంతకాలంగా విశాఖలో ఆటో నడుపుకుం టూ కుటుంబంతో జీవిస్తున్నారు. గంట్యాడ మండలంలోని మధుపాడ గ్రామానికి చెందిన తన భార్య సునీత మేనమామ బోనెల తాత (రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీఆర్ఏ) అంతిమ సంస్కారాలకు కుటుంబసభ్యులతో కలిసి ఆయన హాజరయ్యారు. అంతిమ సం స్కారాలు పూర్తికావడంతో విశాఖ వెళ్లిపోదామనుకున్నారు. అయితే అస్థికలు కలిపే వరకు ఉండమని బంధువులు ఒత్తిడి తేవడంతో భార్యాపిల్లలను వేములాపల్లి పంపించి ఆయన పుణ్యగిరి వెళ్లారు. ఇంతలో సునీత దు స్తులు ఉతకడానికి ఇంటి సమీపంలో ఉన్న గోస్తనీ నది వద్దకు వెళ్లారు. తల్లి వెంటే కుమారుడు టొంపల ప్రసాద్ (7) కూడా వెళ్లాడు. అయితే ఆమె కుమారుడిని మందలించి ఇంటికి పంపించేశారు. కానీ ప్రసాద్ మళ్లీ నది వద్దకు వచ్చి నీటిలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గోతి లో పడిపోయాడు. దుస్తులు ఉతికే పనిలో నిమగ్నమైన సునీత కుమారుని కేరింతలు వినిపించక పోవడంతో చు ట్టూ చూడగా... బాలుడు పక్కనే ఉన్న గోతిలో పడిపోయిన విషయం గ్రహించి పెద్దగా కేకలు వేశారు. అక్కడకు సమీపంలోనే గ్రోయిన్ నిర్మాణ పనుల కు వచ్చిన అర్లి మల్లికార్జున, రవి అనే కార్మికులు పరుగున వచ్చి గోతిలో మునిగిన బాలుడిని ఒడ్డుకు చేర్చారు. కొన ఊ పిరితో ఉన్న ప్రసాద్‌ను గ్రామానికే చెందిన లగుడు మహేశ్వరరావు అనే రైతు నీటిని కక్కించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎస్.కోట ఎస్.ఐ ఎస్కేఎస్ ఘని గోస్తనీ నది వద్దకు వచ్చి జరిగిన సంఘటనపై విచారణ జరిపారు. వేములాపల్లి సర్పంచ్ లగుడు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ లగుడు వెంకటరావు, గ్రామపెద్దలు మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. శవ పంచనామా అనంతరం బాలుడు ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్.కోటలోని సీహెచ్‌సీకి తరలించారు. ఎస్ఐ ఎస్కేఎస్ ఘని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకును పోగొట్టుకునేందుకే ఇక్కడకు వచ్చానని మృతుని తండ్రి టొంపల అప్పారావు బోరున విలపించాడు. టొంపల అప్పారావు సునీత దంపతులకు కృష్ణ, రూతమ్మ, ప్రసాద్, అనీల్ అనే నలుగురు సంతానం ఉన్నారు. వారిలో రెండో కుమారుడు ప్రసాద్ గోస్తనీనది గోతిలో పడి మృతి చెందాడని ఎస్.ఐ ఎస్కేఎస్ ఘని వెల్లడించారు. -
‘ప్రీతి’పాత్రం
శృంగవరపుకోట రూరల్: తమిళనాడులోని తిరుపూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి (ఆలిండియా) షటిల్ బ్యాడ్మింటన్ అండర్-15 ర్యాంకింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కొణదం ప్రీతి (విజయనగరం జిల్లా ఎస్.కోట) విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన దీప్తికుట్టిపై 21-12, 21-15 తేడాతో వరుస సెట్లలో ప్రీతి విజయం సాధించింది. జాతీయ ర్యాంకింగ్ పోటీల్లో విజయం సాధించిన అనంతరం ప్రీతి సాక్షి ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ తన విజయం గురించి వివరించింది. ఎస్.కోట పట్టణానికి చెందిన కొణదం ప్రీతి విజయం సాధించడం పట్ల జిల్లా ప్రజలతో పాటు ఎస్.కోటలోని ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్‌కు చెందిన షటిల్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు. -
డీలా వద్దు... భవిష్యత్తు మనదే
శృంగవరపుకోట :అధికారంలో లేమని కార్యకర్తలు డీలా పడొద్దని... భవిష్యత్తు మనదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో దొంగ హామీలు ఇవ్వడం వల్లే అధికారంలోకి వచ్చారని చెప్పారు. శనివారం మధ్యాహ్నం పట్టణంలోని సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నెక్కల నాయుడుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నాయకులు,కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారని, కానీ ఎవరూ డీలా పడాల్సిన అవసరం లేదన్నారు. అబద్ధం ఆడకూడదు...మాట తప్పకూడదన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయతీ వల్ల అధికారం కోల్పోయామని చెప్పారు. చంద్రబాబు దొం గ హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. ఇప్పుడు ప్రజ ల్లో జగన్‌ను మోసం చేసి, చంద్రబాబు చేతిలో మోసపోయామన్న పరివర్తన ప్రారంభమైందని చెప్పారు. పార్టీ మనకేం ఇచ్చిందని కాకుండా పార్టీకి మనం ఏం చేశామన్న ఆలోచన చేయాలని హితవుపలికారు. వచ్చే నెల 5వ తేదీన కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను కార్యకర్తలు విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ చంద్రబాబు ఆరు నెలల పాలనకే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. జిల్లాలో పార్టీ శ్రేణులన్నీ ఒక్కటి గా నడవాలని, త్వరలో గ్రామస్థాయి కమిటీలు వేసి పార్టీని పటిష్టం చేస్తామన్నారు.నియోజకవర్గ ఇన్చార్జి నెక్కల నా యుడుబాబు మాట్లాడుతూ వర్గాలు, గ్రూపులకు అతీతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ నాయకులు తుపాను సమయంలో మృతి చెందిన జామి మండలం జాగరం గ్రామానికి చెందిన సింగిడి రమేష్, కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన సానబోని అప్పన్న కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున పార్టీ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సమవేశంలో పార్టీ నాయకులు సింగుబా బు, షేక్ రెహ్మన్, కె. ముత్యాలనాయుడు, కె. రంగా, మేలా స్త్రి అప్పారావు, జి. నాగభూషణం, వేచలపు చినరామునాయుడు, సూర్యనారాయణరాజు, మామిడి అప్పలనాయు డు, జైహింద్ కుమార్, శానాపతి చంద్రరావు, వై. మాధవరావు, సింగంపల్లి సత్యం, ఎన్. శ్రీను, కేత వీరన్న, మోపాడ నాయుడు, లక్ష్మణరావు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు. ఇదో చేతకాని ప్రభుత్వం గంట్యాడ : టీడీపీ ఎన్నికల హామీలపై వచ్చే నెల 5వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను కార్యకర్తలు విజయవంతం చేయా లని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. శనివారం కొటారుబిల్లి జంక్షన్‌లోని పార్టీ కార్యా లయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు బుద్ధి ఆరు నెలల్లోనే ప్రజలకు అర్ధమైందన్నారు. ప్రభుత్వ పథకాల మంజూరులో కార్యకర్తలకు అన్యాయం జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, ఉద్యమాలు చేపట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు మామిడి అప్పలనాయు డు, వర్రి నరసింహమూర్తి, కృష్ణంరాజు, వై. నాగు, తదితరులు పాల్గొన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం ఖాసాపేట (లక్కవరపుకోట) : టీడీపీ ప్రభుత్వానికి పాలన చేత కావడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీర భద్రస్వామి విమర్శించారు. శనివారం ఖాసాపేటలోని 500 మంది తుపాను బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూప్ సహాయంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటివరకు బాధితులకు పరిహారం ఇవ్వలేదు సరికదా కనీసం నిత్యావసర సరుకులు కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నాయుడుబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నప్పటికీ కేవలం రెండు మండలాల్లో మాత్ర మే తుపాను తీవ్రత ఉన్నట్టు పరిహారం పంపిణీ చేశారన్నా రు. మిగతా మండలాల్లోని బాధితులకు అన్యాయం చేశార న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పి. సాంబశివ రాజు, కిసాన్ సెల్ జిల్లా అధ్యుడు డి. సింగుబాబు, కె. వి. సూర్యనారయణ, కొటాన శోభ, మేలాస్త్రీ అప్పారావు, బి. శ్రీనివాసరావు, సూరిదేముడు, పాల్గొన్నారు. -
లారీ డ్రైవర్ దారుణ హత్య
వెంకటరమణపేట (శృంగవరపుకోట రూరల్) : ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామ చావిడి సమీపంలో (దిగువ వీధిలో) అడపా శ్రీను (38) అనే లారీడ్రైవర్ సోమవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్.కోట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్.లక్ష్మణమూర్తి, ఎస్సై బి.సాగర్‌బాబు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీను మృతదేహాన్ని పరిశీలించడంతో పాటు నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు సిబ్బంది, స్థానికులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. వెంకటరమణపేట గ్రామానికి చెందిన అడపా శ్రీను లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది నెలల కిందట ఒక లారీని కొనుగోలు చేసి బాడుగకు తిప్పి నష్టపోవడంతో తిరిగి లారీ డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. వెంకటరమణపేట గ్రామంలోని కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటున్న శ్రీను సోమవారం అదే గ్రామంలోని దిగువ వీధిలో నివాసం ఉంటున్న మేనమామ గన్ను గోవింద ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం శ్రీను పడుకున్న సమయంలో అతని మేనమామ గోవింద కత్తితో మెడపై నరికి హత్య చేశాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, మూడేళ్ల కుమార్తె యశస్విని ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భవతి. సీఐ ఎస్. లక్ష్మణమూర్తి, ఎస్సై సాగర్‌బాబు మృతుడి తల్లి, అక్క, బంధువులు,స్థానికులను విచారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్ఓ వైవీఎస్ఆర్ ప్రతాప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వేధింపులు భరించలేకే హత్య.. నిందితుడు మేనల్లుడు అడపా శ్రీను వేధింపులు భరించలేకే హత్య చేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు గన్ను గోవింద నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. తన కుమార్తెలతో పాటు తనను కూడా నిత్యం వేధిస్తున్నట్లు గోవింద పోలీసులకు చెప్పినట్లు సమాచారం. -
‘కాశీపట్నం’ చూడర బాబూ!
శృంగవరపుకోట: పవిత్రంగా ప్రవహించే గోస్తనీ నది, మదిని అలరించే అందమైన ఇసుక తిన్నెలు, నీడనిచ్చే వృక్షాలు, ఆ వృక్షాల నడుమ ఓ తొ ర్రలో కొలువైన శివుడు. ఆ స్వామి ఎదుట స్వయంభువుగా వెలసిననంది. అన్నీ కలిపి కాశీపట్నం. కార్తీక మాసాన భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ, వారి పాలిట కొంగుబంగారంగా పరిఢవిల్లుతోందీ క్షేత్రం. ఎస్.కోటకు 13కిలోమీటర్ల దూరంలో విశాఖ-అరకు రోడ్డులో విశా ఖ జిల్లా అనంతగిరి మండల పరిధిలో ఉన్న కాశీపట్నానికి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వెళతారు. ఈ క్షేత్రం విశాఖ జిల్లాలోనే ఉ న్నా విజయనగరం నుంచే అధిక సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. ని త్యం భక్తుల దర్శనాలతో, పర్యాటకులతో సందడిగా ఉండే కా శీపట్నం క్షేత్రం అటు దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకున్నా భక్తులు సమర్పిస్తున్న దక్షిణలు, కానుకలతో నిర్వహణ సాగుతోంది. ఇదీ ఉమారామలింగేశ్వరుని చరితం... కాశీపట్నంలో కొలువుదీరిన నీలకంఠుడు ఉమారామలింగేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడు. ఇక్కడ ఉన్న కథనం ప్రకారం... విజయనగరం సంస్థానాధీశులు వేటకు వెళ్లినపుడు చక్రవ ర్తి కాలికి రాయి తగిలింది. చక్రవ ర్తి శివలింగాకారంలో ఉన్న రాయిని చూసి ఇది దైవ సంకల్పం అని విశ్వసించారు. శివలింగం పక్కనే రావి,మర్రి మొక్కలు నాటి పూజ చేశారు. తర్వాత కొన్నేళ్లకు వేటకు వెళ్లే సమయానికి శివలింగం పెరిగి పెద్దదయినట్టు గుర్తించారు. ప్రస్తుతం శివలింగం మూడు అడుగుల ఎత్తులో ఉంది. అప్పటి నుంచి ఈ ఈశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. పవిత్రం గోస్తనీ స్నానం... కాశీపట్నంలో కొలువుదీరిన ఉమారామలింగేశ్వరుని దర్శించేందుకు వచ్చిన భక్తులు ఆలయం పక్కనున్న గోస్తనీలో తనివీ తీరా పవిత్ర స్నానాలు చేసి పుల కించి, స్వామిని దర్శించి త రిస్తారు. గోస్తనీ పరవళ్లు, పక్కనే ఉన్న పర్యతాలు, చెట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వయంభువుడైన నందీశ్వరుడు : విజయనగరం సంస్థానాధీశులు ఉమారామలింగేశ్వరుని కనుగొన్నప్పుడు అక్కడ నందీశ్వరుడు లేడు. కాలక్రమంలో రాజులు ఉమారామలింగేశ్వరుని కనుగొన్న తర్వాత అక్కడ నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని స్థానికులు చెబుతారు. నందీశ్వరున్ని కాలితో తన్నిన వ్యక్తి నోటిమాట పోయిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు నందీశ్వరున్ని సైతం అంతే భక్తితో కొలిచి పూజలు చేస్తారు. చెట్టు తొర్రే కైలాసంగా: కాశీపట్నం క్షేత్రంలో నేటికీ ఉమారామలింగేశ్వరుడు మర్రి, రావి చెట్లు కలిసి ఏర్పడిన చెట్టు తొర్రలోనే ఉన్నాడు. చెట్లు పెద్దవిగా పెరిగిపోవటంతో చెట్ట కాండాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో క్ర మంగా ఇటుకలు పేర్చి పూరించారు. నేటీకి ఈ ఆలయం చెట్టుగానే కొనసాగుతోంది. బయటి నుంచి చూస్తే ఆలయం ఎక్కడా కని పించదు. మిగిలిన ఆలయాల మాదిరిగా ఆలయ గోపురం, ప్రాం గణం, గర్భాలయం, గాలిగోపురం ఏమీ ఉండవు. విస్తారంగా వ్యాపించిన రావి, మర్రి చెట్లు కొమ్మల మాటున ఉన్న ఆలయ ప్రాంగణంలో ఉమారామలింగేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. కాశీపట్నంలో ఉమారామలింగేశ్వరుని సన్నిధి, ఆలయానికి ఎదురుగా శ్మశానవాటిక, పక్కనే పవిత్ర గోస్తనీ నదీ ప్రవాహం ఉన్నాయి. కాశీపట్నం చేరాలంటే : * విశాఖ నుంచి ఎస్.కోట మీదుగా అరుకు వెళ్లే బస్‌లు కాశీపట్నం మీదుగా వెళ్తాయి. ఎస్.కోట నుంచి కాశీపట్నం వెళ్లేందుకు ప్రతి గంటకు బస్ ఉంది. * ఎస్.కోట నుంచి కాశీపట్నం 13 కిలోమీటర్ల ఉంటుంది. బస్ చార్జి పల్లెవెలుగు రూ 10లు, ఎక్స్‌ప్రెస్‌కు *15లు ఉంటుంది. * ఎస్.కోట నుంచి కాశీపట్నం వేళ్లేందుకు ఆటోలు, ప్రైవేటు వాహనాలు విరివిగా ఉంటాయి. * విజయనగరం నుంచి ఎస్.కోటకు తాటిపూడి రూట్లో వస్తే బొడ్డవర జంక్షన్లో దిగి కాశీపట్నం వెళ్లొచ్చు. బొడ్డవర నుంచి కాశీపట్నం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. -
30,697 హెక్టార్లలో పంట నష్టం
పెదఖండేపల్లి (శృంగవరపుకోట రూరల్) : హుదూద్ తుపాను వల్ల జిల్లాలో 30,697 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశామని వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ ప్రమీల తెలిపారు. పెదఖండేపల్లి గ్రామంలో జేడీ ప్రమీల, రైతు శిక్షణా కేంద్రం డిప్యూటీ డెరైక్టర్ ఆశాదేవి, కొత్తవలస సబ్‌డివిజన్ ఏడీఏ కె.మహారాజన్ తదితరులు ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా తుపాను తాకిడికి దెబ్బతిన్న చెరుకు, ఇతర పంటలను పరిశీలించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. హుదూద్ కారణంగా వీచిన గాలులకు ఇప్పటివరకు జిల్లాలో 513 గ్రామాల్లో 632 హెక్టార్లలో వరి, 436 హెక్టార్లలో మొక్కజొన్న, 444 హెక్టార్లలో పత్తి, 153 హెక్టార్లలో చెరుకు పంటలకు నష్టం వాటిల్లినట్లు గుర్తించామన్నారు. మరో 14,483 హెక్టార్లలో పంట నష్టాలను పరిశీలించాల్సి ఉందన్నారు. అలాగే 5,404 మంది రైతులకు 50శాతం పైబడి పంట నష్టం జరిగిందన్నారు. 6698 హెక్టార్లలో వరి, 4091 హెక్టార్లలో పత్తి, 5064 హెక్టార్లలో చెరుకు తదితర పంట నష్టాలను సర్వే చేయాల్సి ఉందని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తంగా 66వేలమంది రైతులకు పంట నష్టం వాటిల్లగా ఇప్పటివరకు 30వేల మంది రైతులను గుర్తించామన్నారు. వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శెనగ తదితర విత్తనాలను రాయితీపై అందజేస్తామని ఆమె ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులు తప్పనిసరిగా బ్యాంకు ఖాతాలను కలిగి ఉండాలని సూచించారు. మండలంలోని పెదఖండేపల్లి గ్రామంలో 236 హెక్టార్లలో చెరుకు పంటకు నష్టం వాటిల్లిందని సర్పంచ్ యాళ్ల రమణ, ఎంపీటీసీ తదితరులు జేడీ ప్రమీల దృష్టికి తీసుకొచ్చారు. కానీ సర్వే అధికారులు ఈ నష్టాన్ని గుర్తించడం లేదని వారు ఆరోపించారు. జేడీ వెంట ఏడీఏ కె.మహరాజన్, మండల వ్యవసాయాధికారిణి ఎం.స్వాతికుమారి, ఏఈఓ పి.హైమావతి తదితరులు ఉన్నారు. -
10 వేల హెక్టార్లలో పంట నష్టం పరిశీలన
శృంగవరపుకోట రూరల్ : హుదూద్ తుపాను తాకిడికి అరటి, బొప్పాయి, జీడి, మామిడి, కొబ్బరి, కూరగాయలు, పామాయిల్ తోటలు జిల్లా వ్యాప్తంగా దెబ్బతిన్నాయనీ, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 10 వేల హెక్టార్లలో పంట నష్టాలను పరిశీలించినట్టు ఉద్యానవనశాఖ డిప్యూటీ డెరైక్టర్ ఎల్.వజ్రశ్రీ తెలిపారు. ఎస్.కోట మండలంలోని కిల్తంపాలెం పంచాయతీ పరిధిలో తుపానుకు దెబ్బతిన్న ఉద్యానవన పంటలను ఏడీఏ పీఎల్ ప్రసాద్, హెచ్ఓ ఎ.రమేష్‌కుమార్‌లతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం స్థానిక ఎంపీపీ రెడ్డి వెంకన్న, ఎంపీటీసీ సభ్యులు ఆర్.చంద్రశేఖర్, ఆడారి రమేష్, పలువురు ప్రజాప్రతినిధులతో పంట నష్టాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 5405 హెక్టార్లలో అరటి, 3,258 హెక్టార్లలో కూరగాయలు, 400 హెక్టార్లలో బొప్పాయి, 2503 హెక్టార్లలో కొబ్బరి, 963 హెక్టార్లలో జీడి, 40వేల హెక్టార్లలో మామిడిపంట దెబ్బతిన్నాయన్నారు. వరి పంట పరిశీలన జియ్యమ్మవలస : మండల పరిధిలోని సీమనాయుడు వలసలో నీట మునిగిన వరి పంటను కేవికే సస్యరక్షణా కేంద్రం శాస్త్ర వేత్త పి.ఉదయ్‌బాబు బృందం పరిశీలించింది. ఈ సందర్బంగా ఉదయ్‌బాబు మాట్లాడుతూ, 50 శాతం మేర నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని చెప్పారు. ప్రస్తుతం వరి పంటలో సుడిదోమ ఎక్కువగా ఉందని తెలిపారు. దీని నివారణకు 200 మిల్లీ లీటర్ల డైక్లోరోపాస్, 250 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్, 200 గ్రాముల కార్బండిజమ్ కలిపి పిచికారీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎ.డి విజయ్, కేవికే శాస్త్రవేత్త యు.త్రివేణి, వీఆర్వో వాగ్ధేవి, సత్యం, రైతులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కొత్తూరు (శృంగవరపుకోట రూరల్): ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామ మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపి న వివరాలప్రకారం..లక్కవరపుకోట మండలం సోంపు రం జంక్షన్‌కు చెందిన ఇమంది బలరాం (27) జామి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయ న ఎస్.కోట సబ్‌జైలులో మంగళవారం తెల్లవారుజామున విధులు నిర్వహించే నిమిత్తం సోంపురం జంక్షన్ నుంచి తన పల్సర్‌బైక్‌పై ఎస్.కోట బయలుదేరారు. అదే సమయంలో కొత్తూరు గ్రామం యాతపేట మలు పు వద్ద బహిర్భూమికి వచ్చిన కుప్ప పరదేశమ్మ(42)ను బైక్‌తో ఢీకొట్టిన బలరాం పక్కనే ఉన్న మురుగుకాలువలో బోల్తా పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికీ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కొత్తూరు గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్.కోట ఎస్ఐ బి.సాగర్‌బాబు, కానిస్టేబుల్ విజయ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బలరాం కుటుంబసభ్యులకు, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. సీఐ ఎస్.లక్ష్మణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం మృతదేహాలను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించా రు. గీత కార్మిక కుటుంబానికి చెందిన మృతురాలు పరదేశమ్మకు భర్త తాతబాబుతో పాటు దేవి, ముత్యాలమ్మ, శ్రీను, రాము అనే నలుగురు పిల్లలు ఉన్నారు. బలరాంకు తండ్రి కనకారావుతో పాటు తల్లి, అన్నయ్య, చెల్లి ఉన్నారు. ఈ ఘటనతో సోంపురం, కొత్తూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కోళ్ల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుప్ప పరదేశమ్మ, కానిస్టేబుల్ బలరాం కుటుంబసభ్యులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పరామర్శించి ఓదార్చారు. బహిర్భూమికి కూర్చున్న సందర్భంలో ప్రమాదం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే హితవుపలికారు. -
ప్రే‘ముంచినందుకు’..యావజ్జీవం..
విజయనగరం లీగల్/శృంగవరపు కోట రూరల్: నిన్నే ప్రేమించానన్నాడు. పెళ్లాడతానని ప్రమాణం చేశాడు. కొన్నాళ్లు వివాహేతర సంబంధం నడిపాడు. తీరా పెళ్లి మాట వచ్చేసరికి తనకు ముందే పెళ్లయిందని నంగనాచి కబుర్లు చెప్పాడు. ప్రేమించి ముంచినందుకు చివరకు కటకటాల పాలయ్యాడు. దళిత యువతిని ప్రేమ పేరుతో నమ్మించి వంచించాడన్న కేసు రుజువు కావడంతో ఎస్‌కోట మండల కేంద్రం పెద్ద వీధికి చెందిన పొట్నూరు అప్పలనాయుడుకు జీవిత ఖైదుతో పాటు రూ.5వేల జరిమానా విధిస్తూ ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కె.వి.రమణాజీరావు మంగళవారం తీర్పు చెప్పారు. పాసిక్యూషన్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు అప్పలనాయుడు ఎస్‌కోట హౌసింగ్ డిపార్టుమెంట్లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. బాధితురాలు ఎల్కోట కంప్యూటర్ ప్రెజెంటేషన్ రిసోర్స్ కేంద్రంలో పనిచేస్తోంది. 2006నుంచి అప్పలనాయుడు ఉద్యోగ రీత్యా ఎల్‌కోటకు వస్తుండేవాడు.అదే సమయంలో ఆమెతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఆమెను పెళ్లి పేరుతో లొంగదీసుకుని వివాహేతర సంబంధం కొనసాగించాడు. రెండుసార్లు అబార్షన్ కూడా చేయించాడు. సుమారు అయిదేళ్ల పాటు వారి సంబంధం, ప్రేమ కొనసాగింది. 2011 సెప్టెంబరులో అప్పలనాయుడును పెళ్లి విషయమై బాధితురాలు నిలదీసింది. దీంతో అప్పలనాయుడు తనకు ఇది వరకే వివాహమైందని, ఇద్దరు పిల్లలున్నారంటూ అసలు విషయం చెప్పాడు. ఈ విషయంపై ఇరువర్గాల పెద్దల మధ్య చర్చలు కూడా జరిగాయి. రెండో భార్యగా ఆమెను స్వీకరిస్తానని అప్పలనాయుడు చెప్పడంతో బాధితురాలు ఇష్టం లేకపోయినా సరేనంది. నెలలు గడుస్తున్నా అప్పలనాయుడు మౌనంగా ఉండడంతో కుటుం బ సభ్యులతో పాటు వెళ్లి అప్పలనాయుడును నిల దీసింది. తమ కుటుంబ సభ్యులు భార్యగా స్వీకరించడానికి ససేమిరా అంటున్నారంటూ డబ్బులిచ్చి ఆమెను వదిలించుకోవాలని చూశాడు. అప్పటికే రెండుసార్లు మోసపోయానని గ్రహించిన ఆమె 2012 అక్టోబరు 25న పోలీసుకలకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు అప్పలనాయుడుపై అత్యాచారం,ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టంకింద ఎస్‌కోట పోలీసులు కేసులు నమోదు చేశా రు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలతో కేసు రుజువు చేయడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున నాగమల్లేశ్వరరావు వాదించారు. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
శృంగవరపుకోట:తన కాపురాన్ని పండించుకోవాలని కోటి ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆ ఇల్లాలు పెళ్లయి రెండో ఏడు నిండకుండానే అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఎస్.కోట పట్టణంలోని శ్రీనివాసకాలనీలో మంగళవారం జరిగిన సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీనివాసకాలనీలో నివాసం ఉంటున్న వానపల్లి త్రిమూర్తులు, దేవి దంపతుల కుమారుడు రవివర్మ, స్థానిక బర్మాకాలనీకి చెందిన కొట్యాడ కొన్నాయుడు, ఎర్నమ్మల కుమార్తె మణిలకు 2013 మే 12వ తేదీన వివాహం జరిగింది. అయితే వానపల్లి మణి(17)ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడిందన్న వార్త పట్టణమంతా ఒక్కసారిగా వ్యాపించడంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే మణి మృతదేహాన్ని ఆరుబయట గడ్డిపై వేసి, ఆమె ముఖమంతా పసుపురాసి, మలేరియా జ్వరంతో చనిపోయిందంటూ వచ్చి న వారందరికీ కుటుంబీకులు చెబుతున్నారు. ఇంతలో పోలీసులు రంగప్రవేశం చేసిఆరా తీయగాతొలుత జ్వ రంతో చనిపోయిందని చెప్పిన కుటుంబీకులు తర్వాత ఉరిపోసుకుని చనిపోయిందని, ఆ సమయంలో తామెవరం ఇంటి వద్ద లేమని చెప్పారు. మృతురాలి అత్త, మామలైన వానపల్లి త్రిమూర్తులు, దేవిలు మాట్లాడుతూ గదిలో చీరతో ఉరిపోసుకున్నమణిని తాము దిం పి బయట వేశామని చెప్పారు. ఎటువంటి తగాదాలు లేవని, ఎందుకు ఈ పని చేసిందో తమకు తెలియదన్నారు. మృతురాలి భర్త రవివర్మ మాట్లాడుతూ తాను పనికి పోయి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేసరికి ఇంటివద్ద జనం గుమిగూడి ఉన్నారని, తీరా చూస్తే తన భార్య చనిపోయి ఉందని, ఎందుకు చనిపోయిందో తనకేమీ తెలియదని చెప్పాడు. మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహంపై ఉన్న పసుపును కడిగించి చూడడంతో ఆమె మెడ కమిలిన నల్లని గుర్తులు కనిపించాయి. ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఎస్.ఘనీ కేసు నమోదు చేశారు. డీఎస్పీ శ్రీనివాస రావు, సీఐ లక్ష్మణమూర్తిలు మంగళవారం సాయంత్రం సంఘటనా స్థలాన్ని సందర్శించి కుటుంబీకులను విచారణ చేశారు. మణి చావుకు కారణం అద నపు కట్నం వేధింపులే అని పలువురు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్యాయత్నం విజయనగరం క్రైం: అదనపు కట్నం వేధింపులు తాళలేక పట్టణానికి చెందిన ఓ వివాహిత మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలి కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం..పట్టణంలోని ఇప్పిలివీధిలో ఎస్.గణేష్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. గణేష్‌కు రెండేళ్లక్రితం విశాఖ జిల్లా వేపగుంటకు చెందిన విజయమాధవితో వివాహమైంది. ఈ దంపతులకు ప్రస్తుతం ఓ పాప కూడా ఉంది. పెళ్లి అయిన దగ్గర నుంచి గణేష్‌తోపాటు అత్త మహాలక్ష్మి, చిన్నత్త పద్మ, అడపడుచు కామేశ్వరి అదనపుకట్నం కోసం మాధవిని నిరంతరం వేధిస్తున్నారని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఉదయం కుటుంబ సభ్యులందరూ బయటకు వెళ్లిన తర్వాత మాధవి ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు భరించలేక కేకలు వేయడంతో స్థానికులు చూసి 108కు సమాచారం అందించి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మాధవి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి నుంచి మెజిస్ట్రేట్ వాంగ్మూలం నమోదు చేశారు. బాధితురాలు తల్లి రంగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారని ఇన్చార్జ్ సీఐ కె.రామారావు తెలిపారు. -
వికటించిన పుష్కర ప్రేమ
శృంగవరపుకోట: సుమారు 12 ఏళ్ల క్రితం వారిద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. కులాలు వేరైనా మనసులు కలిసి మనువాడిన వారిద్దరూ ఒక్కటిగా ఉంటే చాలు అనుకున్న ఇరువైపుల కుటుంబాలు ఆనందించి వారి వివాహబంధాన్ని ఆనందించి ఆమోదించారు. ఆ దంపతులిద్దరూ ఇంతవరకూ అన్యోన్యంగా కాపురం చేశారు. వారి అన్యోన్యానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. అంతలో ఏమైందో? వారి కాపురంలో కలహాలు చోటు చేసుకున్నాయి. భార్యతో గొడవపడ్డ భర్త మద్యం మత్తులో ఆమెపై దాడికి తెగబడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోట మండలం సంతగవిరమ్మపేట గ్రామానికి చెందిన సన్యాసమ్మ..విజయనగరానికి చెందిన మజ్జి శ్రీనివాసరావును ప్రేమించి పెళ్లాడింది. వీరికి లోకేష్, అఖిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్.కోట పట్టణంలోని శ్రీనివాసకాలనీలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ కార్యాలయం ఎదుట నివాసముంటున్న ఎం.సన్యాసమ్మ స్థానిక ప్రభుత్వాస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో మజ్జి శ్రీనివాసరావు భార్యతో గొడవపడి ఎక్సర్సైజులు చేసే డంబెల్స్‌తో ఆమె తలపై బలంగా మోదాడు. దాంతో ఆమె తల ఎడమవైపు బలమైన గాయం అయ్యింది. ఈ గొడవతో ఉలిక్కిపడిన ఇరుగుపొరుగు వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సన్యాసమ్మ భర్త ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భార్యపై దాడి చేశానని చెప్పి లొంగిపోయాడు. ఎస్సై సాగర్‌బాబు హుటాహుటిన శ్రీనివాసకాలనీకి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న సన్యాసమ్మను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి డాక్టర్ శ్యామల ప్రాథమిక చికిత్స చేసి విశాఖకు తరలించాలని సూచించారు. జరిగిన సంఘటనపై ఎస్సై మాట్లాడుతూ శ్రీనివాసరావు డ్రైవర్‌గా పని చేస్తున్నాడని, బాధ్యతారహితంగా తిరుగుతాడని, భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలిపారు. ఆ దంపతులను గతంలో ఒకసారి స్టేషన్‌కు పిలిచి మందలించామని చెప్పారు. పూర్తి వివరాలు బాధితురాలి నుంచి సేకరించాల్సి ఉందన్నారు. -
ఐదు కిలోల బరువుతో బాలిక జననం
శృంగవరపుకోట:విజయనగరం జిల్లా శృంగవరపుకోట ప్రభుత్వాస్పత్రిలో శనివారం ఉదయం ఓ మహిళ 5 కిలోల బరువు కలిగిన పాపకు జన్మిచ్చింది. లక్కవరపుకోట మండలం కల్లేపల్లి గ్రామానికి చెందిన ముల్లవరపు సంతోషి అనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు శనివారం ఉదయం 6 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉదయం 6.30గంటల సమయంలో ఆమెకు సాధారణ ప్రసవం జరిగి, ఐదు కిలోల బరువు ఉన్న ఆడపిల్ల జన్మిం చింది. శిశువు బరువు ఎక్కువగా ఉండడంతో విస్మయం చెందిన వైద్యులు పరీక్షలు చేశారు. అన్నివిధాలా బిడ్డ, తల్లీ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. సంతోషికి మూడేళ్ల క్రితం తొలి కాన్పులో సాధారణ ప్రసవం జరిగి 3.5 కిలోల బరువుతో మగబిడ్డ పుట్టాడు. ప్రస్తుతం రెండవ కానుపులో పుట్టిన శిశువు బరువు ఐదు కిలోలు ఉండడం పట్ల ఆస్పత్రి ఇన్చార్జ్ దిలీప్‌కుమార్, డాక్టర్ ఎం.హరిలు మాట్లాడుతూ సాధారణంగా సరాసరి 2.8కిలోల బరువుతో శిశుజననాలు నమోదవుతాయి. ఇంతవరకూ 4కిలోల బరువు ఉన్న వారిని చూశాం. కొన్ని కేసుల్లో మధుమేహం, హైపోథైరాయిడ్, జన్యుపరమైన సమస్యలు ఉన్న వారిలో అధిక బరువుతో బిడ్డ పుట్టడం జరుగుతుందని చెప్పారు. తల్లి, బిడ్డలకు షుగర్ టెస్ట్ చేయిస్తే, మధుమేహం లేదని తేలింది. ైథైరాయిడ్ పరీక్షలతో పాటూ బిడ్డ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపేందుకు, పూర్తి వివరాలు తెలుసుకోవటానికి విశాఖ కేజీహెచ్‌కు ప్రత్యేకంగా రిఫర్ చేస్తామంటూ చెప్పారు. పుట్టిన బిడ్డ బొద్దుగా, ఎర్రగా ఉండటంతో వార్డులో మహిళలు, వైద్య సిబ్బంది బిడ్డను అపురూపంగా చూస్తూ ఎత్తుకుని ముద్దాడుతున్నారు. -
జిల్లాలో రూ.400 కోట్ల రుణాలు మాఫీ
ఎస్. కోటతలారి (శృంగవరపుకోట రూరల్) : జిల్లాలో రూ. 400 కోట్ల రైతుల రుణాలు మాఫీ కానున్నట్టు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తెలి పారు. బుధవారం ఎస్. కోటతలారిలో ఎంపీపీ రెడ్డి వెంకన్న దంపతులు జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభ హైమావతి, ఎస్. కోట జెడ్పీటీసీ సభ్యురాలు సుకురు రామలక్ష్మిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రూ. 3.67 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీతో లబ్ధి చేకూరనుందన్నారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒ కొక్కటిగా నెరవేర్చుతుందని వెల్లడించారు. ఎస్. కోట నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముఖ్యమం త్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ రాష్ట్ర మహిళాఅధ్యక్షురాలు శోభా హైమావతి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హా మీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందన్నారు. అనంతరం ఎంపీపీగా పదవీబాధ్యతలు చేపట్టిన రెడ్డి వెంకన్న, భవానీ దంపతులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమా రి, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ, టీడీపీ మం డల శాఖ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్, ఎస్. కోట సర్పంచ్ అంబటి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమించలేదని.. బావిలో నెట్టేశాడు!
శృంగవరపుకోట :తన ను ప్రేమించకుంటే చంపేస్తానం టూ యువతిని ఓవ్యక్తి బావిలో తోసి పరారయ్యూడు. స్థానికుల అప్రమత్తం కావడంతో బయటపడిన ఆమె.. ఎస్.కోట పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆమె ఫిర్యాదు లో పేర్కొన్న మేరకు వివరాలిలా ఉన్నాయి. లక్కవరపుకోట మండలంకొట్యాడగ్రామానికి చెందిన యువతి కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం మధ్యాహ్నం అదేగ్రామంలో కోటమ్మ అమ్మవారిఆలయానికి వెళ్లిం ది. అదే సమయంలోకొట్యాడ గ్రామానికే చెందిన రొం గలి కృష్ణ అక్కడకువచ్చాడు. యువతితో కాసేపు మా ట్లాడాడు. ఇద్దరూ ఒకేఊరి వారుకావడంతో ఎవరూ ఆ విషయూన్ని పెద్దగా పట్టించుకోలేదు. కుటుంబ సభ్యు లు కూడాచూసిఊరుకున్నారు. అప్పటి వరకూ కుటుం బసభ్యులఎదుటే మాట్లాడినకృష్ణ.. ఒక్కసారిగా యువ తిని సమీపంలోని బావిలోకి నెట్టి, పారిపోయూడు. ఊహించని పరిణామంతో నివ్వెరపోయిన కుటుంబ సభ్యులు.. పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు వచ్చి యువతిని బయటకు తీశారు. బావిలో నీరు లేకపోవటంతో యువతి స్వల్ప గాయూలతో బయటపడింది. మంగళవారం రాత్రి ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొట్యాడ గ్రామానికి చెందిన రొంగలి కృష్ణ.. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. తనకు పెళ్లి సంబంధం కుదిరిందని, తన వెంట పడొద్దని ప్రాధేయపడినా వినిపించుకోలేదని తెలిపింది. తన అంతు చూస్తానంటూ నూతిలో తోసేశాడని పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఎస్.ఘనీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కష్టం ఆహుతైంది..గుండె ఆగిపోయింది
తిమిడి (శృంగవరపుకోట రూరల్) : ఎస్.కోట మండలం తిమిడి గ్రామ రాజివీధి లో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల పెంకుటిల్లు దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.2.50 లక్షల నగదుతోపాటు, ఆరు తులాల బంగారు నగలు అగ్నికి ఆహుతయ్యూయి. కష్టార్జితం కళ్ల ముందే కాలి బూడిదవుతుంటే.. ఆ ఇంటి యజమాని తట్టుకోలేకపోయూడు. అక్కడే కుప్పకూలిపోయూడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిమిడి గ్రామానికి చెందిన తొత్తడి ఎర్నాయుడు.. శనివారం రాత్రి భార్య, కుమారుడు, కుమార్తెలతో కలిసి ఇంటి ఆరుబయట నిద్రించారు. అర్ధరా త్రి సమయంలో ఇంట్లో నుంచి వాసన వస్తుండడంతో లేచి చూశారు. ఇంట్లో నుంచి మంటలు రావడంతో వెంటనే ఎస్.కోట అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు దినుసులతోపాటు దుస్తు లు, ఇతర సామగ్రి, నగదు, నగలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యూయి. అగ్నిమాపక సిబ్బందికి ఇంటి యజ మాని ఎర్నాయుడు కూడా సహకారం అందించాడు. ఇటీవల పొలం అమ్మగా వచ్చిన రూ. 2.50 లక్షల నగదుతోపాటు, బంగారు నగలు, బియ్యం, ఇతర సామగ్రిని ఇంట్లో ని ట్రంకు పెట్టెలో ఎర్నాయుడు కుటుంబ సభ్యులు భద్రపరిచారు. ప్రమాదంలో మొత్తం దగ్ధమవ్వడాన్ని కళ్లారా చూసిన ఇంటి యజమాని ఎర్నాయుడు తట్టుకోలేకపోయూడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయూడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎమ్మెల్యే పరామర్శ ప్రమాద వార్త తెలుసుకున్న ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఘటనా స్థలానికి చేరుకు ని పరిశీలించారు. ఎర్నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధుల మంజూరుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇందిర కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేశారు. -
నల్ల చెరువులో ఆక్రమణలు
కొత్త చామలాపల్లి (శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్:చామలాపల్లి పంచాయతీ పరిధిలో కొత్త చామలాపల్లి గ్రామ ఆయకట్టు భూములకు నీరందిస్తున్న నల్ల చెరువును క్వారీ యజమానులు మట్టితో కప్పేస్తున్నారు. క్వారీ లారీల రాకపోకలకు వీలుగా రహదారి పనులు చేపట్టడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లచెరువు కొమ్ము వద్ద గల మదుముకి నీరు వెళ్లే ఆస్కారం లేకుండా క్వారీ సిబ్బంది శుక్రవారం అర్థరాత్రి జేసీబీతో రోడ్డు పనులు చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. జేసీబీని రైతులు తమ అధీనంలోకి తీసుకుని కొత్త చామలాపల్లి గ్రామంలో ఉంచారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఇరిగేషన్ అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లారు. రైతులు తెలియజేసిన సమాచారం మేరకు విలేకరులు శనివారం ఉదయం నల్లచెరువు వద్ద జరిగిన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, నల్ల చెరువుకు ఆవల ఒడ్డున రెండు క్వారీలున్నాయని తెలిపారు. ఆ క్వారీలకు సంబంధించిన లారీలు చుక్కవానిపాలెం గ్రామం మీదుగా రాకపోకలు సాగించాల్సి ఉందని చెప్పా రు. అయితే క్వారీ యజమానులు మాత్రం క్వారీ రాతిమట్టితో నల్ల చెరువును కప్పేసి రహదారి నిర్మాణం చేపడుతున్నారని ఆరోపించారు. చెరువు కబ్జాకు గురవ్వడం వల్ల తమ పొలాలకు సాగునీరు అందదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలుమార్లు పనులు అడుడ్డుకున్నా, రహదారికడ్డంగా చెట్లు, రాళ్లు పడేసినా జేసీబీలతో వాటిని తొలగించి మరీ పనులు చేపడుతున్నారని రైతులు తొత్తడి ప్రకాశరావు, టి.స్వామినాధం, టి.సన్యాసిరావు, తొత్తడి ఎర్నిబాబు, టి.స్వామినాయుడు, గుమ్మడి ఆనందరావు, టి.ముత్యాలనాయుడు, టి.సింహాద్రిదేముడు, టి.పైడితల్లి, టి.చినఅప్పారావు, గుమ్మడి అప్పలనాయుడు, జుత్తాడ బుచ్చి అప్పారావు, తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. చెరువు గట్టుపై నుంచి భారీ లారీలు తిరుగుతున్నందు వల్ల ఇప్పటికే రెండు మదుములు పాడయ్యాయని చెప్పారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి క్వారీ యజమానులు నిర్మించిన రహదారిని ధ్వంసం చేసి పొలాలకు నీరందేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని రైతులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇరిగేషన్ డీఈఈ అప్పలనాయుడు వద్ద ప్రస్తావించగా చెరువులో రహదారి నిర్మించి వాహన రాకపోకలు సాగించడం చట్ట విరుద్ధమన్నారు. రైతుల ఫిర్యాదు మేరకు క్వారీ యజమానులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
మహిళపై కత్తితో దాడి
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : చిన్నపిల్లాడితో వచ్చిన వివాదం ముదిరి హత్యాయత్నానికి దారి తీసింది. క్షణికావేశంతో జరిగిన ఈ ఘటన ఒక వ్యక్తిని జైలుపాల్జేసింది. మరో మహిళ ఆస్పత్రి పాలైంది. ఈ ఘటనకు సంబంధించి ఎస్.కోట పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక శ్రీనివాస కాలనీలో నివాసం ఉంటున్న వానపల్లి దేవి ఇంటికి పొరుగున ఒక ఇల్లు తనఖాకు తీసుకుని ఏడాదిగా పట్నాల శ్రీనివాస్, కృష్ణవేణి దంపతులు ముగ్గురు పిల్లలతో ఉంటున్నారు. శ్రీనివాస్ విశాఖ రైల్వేలో కాంట్రాక్ట్ కూలీగా పనిచేస్తున్నాడు. కృష్ణవేణి బ్యూటీషియన్ శిక్షణ తీసుకుంటోంది. బుధవారం తనను వానపల్లి రవి, అతని తల్లి వానపల్లి దేవిలు కొట్టి, అవమానించారని కృష్ణవేణి ఫోన్లో భర్త శ్రీనివాస్‌కు సమాచారం అందించింది. దీంతో సాయంత్రం 5.30 గంటల సమయంలో శ్రీనివాస్ ఇంటికి చేరుకున్నాడు. వేటకత్తి తీసుకుని వానపల్లి దేవి కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. దీంతో వానపల్లి దేవికి వీపుపైన, ఎడమ చేతిపైన గాయూలయ్యూరుు. ఈ దాడిలో రాజేశ్వరి అనే మహిళ త్రుటిలో తప్పించుకుంది. శ్రీనివాస్ అక్కడితో ఆగకుండా ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ బయటకు తెచ్చాడు. గ్యాస్ లీక్ చేసి, దానిపై పెట్రోల్ పోసి ఎవరైనా వస్తే నిప్పు పెడతానంటూ కత్తి చేత పట్టుకుని వీధిలో పరుగులు తీసి వీరంగం చేశాడు. దీంతో వీధిలో జనం ఇళ్లలో దూరి తలుపులు మూసుకున్నారు. శ్రీనివాస్ భార్య కృష్ణవేణి కూడా శరీరంపై పెట్రోల్ పోసుకుని తనకు న్యాయం చేయాలని, లేకుంటే నిప్పు పెట్టుకుంటానంటూ హల్చల్ చేసింది. స్థానికుల సమాచారం మేరకు ఎస్సై సాగర్‌బాబు, పీసీలు విజయ్, ప్రతాప్ శ్రీనివాసకాలనీకి చేరుకున్నారు. పోలీసులను చూసినా వారిద్దరూ శాంతించలేదు. అతి కష్టంమీద వారి వద్ద ఉన్న కత్తి, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తలను స్టేషన్‌కు తరలించారు. దాడిలో గాయపడిన దేవిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బట్టలూడదూసి అవమానించారు... ఈ ఘటనపై పట్నాల కృష్ణవేణి మాట్లాడుతూ.. తన కొడుకు సతీష్‌కుమార్‌ను వానపల్లి రవి గుట్కా తెమ్మని చెప్పాడని తెలిపింది. సతీష్ నిరాకరించడంతో రవి తీవ్రంగా కొట్టాడని చెప్పింది. దీనిపై తాను వెళ్లి రవి కుటుంబ సభ్యులను నిలదీశానని, దీంతో నాచేయి వెనక్కి విరిచి, దాడికి పాల్పడ్డారని తెలిపింది. ఇంతలో అతని తల్లి దేవి వచ్చి కొబ్బరిమట్టతో తనను తీవ్రంగా కొట్టిందని పేర్కొంది. తాను ఇంటికి పారిపోయి భర్తకు ఫోన్ చేశానని, అదే సమయంలో వానపల్లి దేవి వీధిలోని పది మందికి పైగా స్థానికులను తీసుకొచ్చి, తన దుస్తులు ఊడదీసి అవమానం చేశారని వాపోరుుంది. హత్యకు యత్నించారు.. దాడిలో గాయపడిన దేవి మాట్లాడుతూ.. తన కుమారుడు రవిపై కృష్ణవేణి చేరుు చేసుకుందని, అందుకే ఆమెను మందలించానని తెలిపింది. ఈలోగా ఆమె భర్త వచ్చి కత్తితో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
ఎస్. కోట.. ఓ ప్రత్యేకం
శృంగవరపుకోట, న్యూస్‌లైన్:ఎస్.కోట మండలానికి ఓ ప్రత్యేకత ఉం ది. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూ రి ప్రకాశం పంతులు ఇక్కడి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. 1956లో నాన్బ్లాక్గా ఏ ర్పడిన ఈ మండలం తరువాత సమితిగా కొన సాగింది. 1986లో మండల పరిషత్గా ఏర్పడింది. ఎస్.కోట సమితిలో అరుకు, అనంతగి రి, పాడేరు, వియ్యంపేట గ్రామాలు ఉండేవి. తర్వాత క్రమంలో ఎస్. కోట నుంచి అరుకు, అనంతగిరి, పాడేరు, వియ్యంపేటలను ప్రత్యే క సమితులుగా వేరు చేశారు. 1986లో వి య్యంపేట, ఎస్. కోట, ఎల్.కోట సమితుల్లో గ్రామాలను కలిసి ఎస్.కోట మండలంగా ఏ ర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మండలంలో 75,917 మంది జనాభా, 52, 888 ఓటర్లు ఉ న్నారు. 26 పంచాయతీలున్న ఈ మండలంలో 42 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఎస్. కోట (జనాభా 28,267) ధర్మవరం (4738) మేజర్ పంచాయతీలు. సమితి సారథులు వీరే ఎస్. కోట నాన్బ్లాక్ ఏరియాగా ఉన్నప్పుడు అల్లు దశావతారంను సమితి అధ్యక్షుడిగా ప్ర భుత్వం నామినేట్ చేసింది. అనంతరం 1956 లో జామి మండలం విజినిగిరి గ్రామానికి చెం దిన గొర్రిపోటు బుచ్చి అప్పారావు ఎస్.కోట సమితి తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1961, 1965 ఎన్నికల్లో కూడా ఆయనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1967లో జామి ని యోజకవర్గ ఎమ్మెల్యేగా ఈయన ఎన్నిక కావడంతో అప్పటి జామి సర్పంచ్ రొబ్బి మల్లికార్జున స్వామి రెండున్నరేళ్ల పాటు సమితి అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం 1970-76లో జామి మండలం అలమండ గ్రామానికి చెంది న లగుడు సింహాద్రి పని చేశారు. 1976- 1980 మధ్య కాలంలో ప్రభుత్వం సమితి ఎన్నికలు నిర్వహించలేదు. 1981 నాటి ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన లగుడు సింహాద్రి 1986లో మండల పరిషత్ ఏర్పడిన వరకు పనిచేశారు. మండల సారథులు వీరే 1987లో మండల పరిషత్ ఏర్పాటైన తరువా త రాజీపేట గ్రామానికి చెందిన ఐవిఎన్ రాజు ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1992లో రెండోసా రి కూడా ఆయనే ఎన్నికైనప్పటికీ..ఆయన అకాల మరణంతో ఎస్.కోటకు చెందిన షేక్ దర్గాజీ కొన్ని నెలల పాటు ఎంపీపీ పగ్గాలు చేపట్టారు. తరువాత ధర్మ వరానికి చెందిన లగుడు సత్యనారాయణమూర్తి, ఆ తరువాత ఎన్నికల్లో ధర్మవరం గ్రామానికి చెందిన లగు డు వెంకటరమణమ్మ, కొత్తపాలెం గ్రామానికి చెందిన ఒంటి అప్పారావు ఎంపీపీలుగా పనిచేశారు. ధర్మవరం గ్రామానికి చెందిన అల్లు సూర్యనారాయణమ్మ తొలి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. తర్వాత ఐ.రఘురాజు, ఎ.కె.వి. జోగి నాయుడు జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యూరు. ప్రస్తుత రిజర్వేషన్లు 22 ఎంపీటీసీ స్థానాల్లో 11 మహిళలకు కేటాయించారు. ముషిడిపల్లి, శివరామరాజుపేట స్థానాలు ఎస్సీ మహిళ, కొట్టాం, సీతారాం పు రం, పెదఖండేపల్లి, మూలబొడ్డవర, ధర్మవ రం స్థానాలు అన్ రిజర్వుడు మహిళలకు, ఎస్. కోట-2, ఎస్.కోట-3,ఎస్.కోట-8, కిల్తం పాలెం స్థానాలు బిసి మహిళకు, ఎస్.కోట తలా రి, ఎస్.కోట-7, ఎస్.కోట-4, వెంకటరమణపేట స్థానాలు బిసీ జనరల్‌కు, వీరనారాయ ణం, ఆలుగుబిల్లి, ఎస్.కోట-5, ఎస్.కోట -6, తిమిడి స్థానాలు అన్ రిజర్వుడ్‌కు, ఎస్.కోట-1 ఎస్టీ జనరల్‌కు, సంతగవిరమ్మపేట ఎ స్సీ జనరల్‌కు కేటాయించారు. ఈసారి జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు. -
జెడ్పీ పీఠానికి ‘స్వాతి రాణి’
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె స్వాతి రాణి జిల్లా పరిషత్ పదవికి పోటీ చేయడానికి తెలుగుదేశం అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ విషయంలో శోభా హైమావతి పంతం నెగ్గించుకున్నారు. ఆదివారం నాటి సమావేశంలో అశోక్‌గజపతిరాజు సమక్షంలో నిర్ణయించినట్లు తెలిసింది. అశోక్ చేసిన ప్రకటనతో స్వాతిరాణి రాజకీయ అరంగ్రేటానికి లైన్ క్లియర్ అయింది. విజయనగరంలో జరిగిన సమావేశంలో అశోక్ గజపతిరాజు పలువురి నేతలకు అభ్యంతరాలను అడిగారు. ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో ఆమె అభ్యర్థత్వానికి ఏకగ్రీవంగా ఆమోదం లభించింది. ఎస్.కోట ఎమ్మెల్యే స్థానం ఆశించిన మాజీ ఎమ్మెల్యే హైమావతి ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగేందుకు ఇప్పుడు ఏం చేస్తారు? ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? ఎలా పోటీ చేస్తారు? అన్న సందేహాలు మొదలయ్యాయి. దీంతో హైమావతి పొలిటికల్ కెరియర్‌పై సందేహాలు ముసురుకున్నాయి. వేపాడ నుంచి స్వాతిరాణి జెడ్పీటీసీగా పోటీ చేయాలని తీర్మానం చేసి పార్టీ అధిష్ఠానానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ద్వారా పంపారు. మరో వైపు ఎస్.కోట నుంచి పోటీకి దింపాలని ఎమ్మెల్యే లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే హైమావతిలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తొలుత రెండు మండలాల నుంచి నామినేషన్ వేయాలని, తర్వాత అధిష్ఠానం సూచనల మేరకు ఎక్కడ నుంచి పోటీలో ఉండాలో తేల్చుకుంటారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. శత్రుచర్లకు చెక్ చెప్పిన హైమ! తొలుత తన కుమార్తె స్వాతిరాణికి అరుకు ఎంపీ టికెట్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే ైహైమావతి పట్టుబట్టారు. గుమ్మడి సంధ్యారాణికి అరుకు పార్లమెంట్‌కు పోటీ చేయాలని చంద్రబాబు చెప్పినా సంధ్యారాణి సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో స్వాతిరాణి అరుకులో ప్రచారం ప్రారంభించారు. తనకే అరుకు పార్లమెంట్ స్థానం కేటాయించాలని డి.వి.జి శంకరరావు అధిష్ఠానంపై ఒత్తిడి చేశారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల బేరి మోగటం, జెడ్పీచైర్‌పర్సన్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వుడు కావడం, హైమావతికి పట్టున్న వేపాడ, ఎస్.కోట జెడ్పీటీసీ స్థానాలు ఎస్టీలకు కేటాయించడంతో శోభ మనసు మార్చుకున్నారు. శత్రుచర్ల ఆగమనాన్ని వ్యతిరేకించిన అశోక్‌తో స్వరం కలిపారు. మాజీ మంత్రి శత్రుచర్ల తన మేనల్లుడు జనార్ధన్ థాట్రాజ్ కుటుంబీకులకు జెడ్పీ పీఠం ఇవ్వాలన్న డిమాండ్‌కు అడ్డుకట్ట వేశారు. ఎస్.కోట, వేపాడ మండలాల దేశం నేతలు స్వాతిరాణి అభ్యర్థిత్వాన్ని బలపరచాలని ఎమ్మెల్యే లలితకుమారిపై ఒత్తిడి పెంచేలా వ్యూహం పన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఎమ్మెలే లలితకుమారి స్వాతిరాణి అభ్యర్థిత్వాన్ని బలపరిచేలా పావులు కదిపారు. జిల్లా నేతలను సైతం ఒప్పించడంతో శోభ వ్యూహం ఫలించింది. దీంతో హైమావతి శత్రుచర్లకు ఆదిలోనే చెక్ చెప్పారు. -
శివరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు
ధర్మవరం (శృంగవరపుకోట రూరల్), న్యూస్‌లైన్: విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో గల 85 శి వాలయాల్లో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరిం చుకుని ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ ఎన్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. ధర్మవరం శివారు సన్యాసయ్యపాలెంలో గల సన్యాసేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం శివరా త్రి సందర్భంగా చేపడుతున్న పలు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. మూడు జిల్లాల్లో గల ఎస్.కోటలోని పుణ్యగిరి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామి, రామతీర్థం, శ్రీ ముఖలింగం, రావివలస, ఎండల మల్లిఖార్జునుడు, అప్పికొండ, దారపాలెం, బలిఘట్టాం, సోమలింగపాలెం, దేవునిపూతసంగం, లింగాల తిరుగుడు తదితర శివాలయాల్లో రానున్న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. జాతరను విజయవంతంగా నిర్వహిం చేందుకు ఎస్.కోటలోని పుణ్యగిరి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామి ఆలయాల వద్ద 220 మంది పోలీ సులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామనీ, ఇందుకు సంబంధించి సర్కిల్ ఇన్స్పెక్టర్, స్థానిక ఎస్ఐలు, తహశీలార్లు, ఆలయాల ఈఓలతో చర్చించినట్లు తెలిపారు. ఉచిత దర్శనం మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పుణ్యగిరిలోని ఉమాకోటిలింగేశ్వరస్వామి, ధర్మవరంలోని సన్యాసేశ్వరస్వామితో పాటు మూడు జిల్లాల్లో గల శివాలయాలకు విచ్చేసే భక్తులకు ఉచిత దర్శన ఏర్పా ట్లు చేస్తున్నామని డిప్యూటీ కమిషనర్ తెలిపారు. అలాగే భక్తులకు ఉచితంగా పటిక బెల్లం (ప్రసాదం) అందించే విధంగా ఇప్పటికే ఆయా ఆలయాల ఈఓలకు ఆదేశించామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆల యాల వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు, వైద్య సిబ్బందితో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. -
ఆ నలుగురు...
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎస్. కోటలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అక్కడి శాసనసభా స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల లెక్కలు చూసుకునే పనిలో ఆయా పార్టీలు మునిగి తేలుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు అయిన సత్తిబాబు ఎస్. కోట బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న ప్రచారం జరగడం, అందుకు అనుగుణంగానే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, నిధుల వరద పారించడం వంటి పరిణామాలతో కాంగ్రెస్‌లో ఆశావహులు చల్లబడిపోయారు. కాగా రచ్చబండ సమావేశాల్లో జన స్పందన కొరవడటం, పంచాయతీ ఎన్నికలకు ముందు పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఐదు మండలాల్లో కాంగ్రెస్‌కు పడే ఓట్ల శాతం గణ నీయంగా దిగజారిందని తేలడం వంటి పరిణామా లతో బొత్స యూటర్న్ తీసుకుని చీపురుపల్లి వైపు మొగ్గినట్టు తెలుస్తోంది. అయితే ఎస్. కోట నియోజకవర్గం తన చేతుల నుంచి జారిపోకుండా తనకు వీరవిధేయులుగా ఉన్న వారిని బరిలోకి దించే పనిలో బొత్స ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఆ నలుగురు .... ఎస్. కోట నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు. ఎస్.కోట మండలానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇందుకూరి రఘురాజు, జామి మండలానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, కొత్తవలస మండలానికి చెందిన డీసీసీ కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, వేపాడ మండలానికి చెందిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మూకల కస్తూరిలలో ఒకరికి ఈ దఫా టికెట్ దక్కుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారంతా మంత్రి బొత్సకు వీరవిధేయులే. సత్తెన్న చీపురుపల్లి నుంచి ఎన్నికల బరిలోకి దిగితే వీరిలో ఒక్కరికి ఎస్. కోట బెర్త్ ఖాయమని రాజకీయ విళ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు ఎవరికి వారు టికెట్ తమదేనని చెబుతున్నట్టు సమాచారం. ముగ్గురికి శృంగభంగం అరుుతే ఆ నలుగురిలో ముగ్గురు గతంలో సత్తెన్న రాజకీయ వ్యూహాన్ని, కాంగ్రెస్ మాయాజాలాన్ని నమ్మి భంగపడిన వారే. 2009 ఎన్నికల్లో ఇం దుకూరి రఘురాజుకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. చివరి నిమిషంలో సామాజిక వర్గం పేరుతో అల్లు జోగినాయుడును రంగంలోకి దింపడంతో రఘురాజుకు భంగపాటు తప్పలేదు. ఈ పరిణామంతో రఘురాజు రెబల్‌గా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు.. మంత్రి బొత్స అండతో 2004లో ఉత్తరావల్లి నియోజకవర్గం నుంచి, తర్వాత 2009లో ఎస్. కోట నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. రెండు ధపాలు అభయం ఇచ్చిన బొత్స చివరి నిమిషంలో మనసు మార్చుకోవడంతో రాజేశ్వరరావుకు దెబ్బ పడింది. డీసీసీ కార్య దర్శి నెక్కల నాయుడుబాబుకు 1999లో ఉత్తరావల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బి-ఫారం ఇచ్చినా చివరి నిమిషంలో మంగపతికి కట్టబెట్టారు. 2004లో మ రోమారు టికెట్ ఆశించినా నాయుడుబాబుకు భంగపాటు తప్పలేదు. అభయం ఎవరికి ? రఘురాజుకు సత్తెన్న పూర్తి మద్దతు పలికినట్టు తెలుస్తోంది. సామాజిక వర్గాన్ని కాదని ర ఘురాజుకు టికెట్ ఇప్పిస్తారా...? వెలమ సామాజిక వర్గా నికి చెందిన నాయుడుబాబు, రాజే శ్వరరావుల్లో ఎవరికైనా చాన్స్ ఇస్తారా...బీసీ మహిళ అన్న నినాదంతో సత్తెన్న వర్గానికి వీర విధేయురాలిగా ఉన్న మూకల కస్తూరిని అభ్యర్థిగా నిలుపుతారా అన్న చర్చ ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, మిగిలిన వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దల సభలో ఆశించిన బెర్త్ సత్తిబాబుకు దక్కలేదు. ఈ పరిణామంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో నిలచి గెలవాల్సి ఉన్నందున ఎస్. కోట వచ్చేది...రానిది తేలిపోనుంది. సత్తెన్న నిర్ణయంపైనే ఎస్. కోట టికెట్ ఆశిస్తున్న వారి భవిష్యత్ ఆధారపడి ఉంది. -
ముదిరిన అంతర్యుద్ధం
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎస్. కోట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ ప్రస్తుతం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు...నాయకుల మధ్య ఆదిపత్య పోరు వల్ల ఆ పరిస్థితి తారుమారైంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి శాసనసభకు పోటీ చేసే విష యంలో తాజా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి మధ్య నెలకొన్న ఆదిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆది వారం ఆ పార్టీ స్థానిక నేతలు చేసిన ప్రకటనతో వారి మధ్య నలుగుతున్న అంతర్యుద్ధం మరింత ముది రింది. ఇద్దరిలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందో తెలి యక.. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇరకాటంలో పడుతున్నారు. లలితకు ఎమ్మెల్యే టికెట్ ఖాయమా ? ఎస్. కోటలో ఎమ్మెల్యే లలితకుమారి నేతృత్వంలో ఆదివారం పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు శిక్షణ జరి గింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ పరిశీల కుడు కరెడ్ల ఈశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లలితకుమారిని గెలిపించాలంటూ కార్యక ర్తలను కోరారు. నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా చెప్పుకునే జెడ్పీ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి కూడా ఎమ్మెల్యేగా లలితకుమారిని గెలిపించాలని, ఆమె గెలుపునకు అంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చా రు. ఆ ఇద్దరి నేతల ప్రకటనతో కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. అయితే ఈ పరిణామంతో హైమవతి వర్గీయు లు ఖంగుతిన్నారు. నేతల ప్రకటనతో లలితకుమారికి ఎమ్మెల్యే టికెట్ ఖాయమయినట్టేనా....? హైమవతి ఆశలు అడియాసలేనా అన్న ప్రశ్నలు కార్యకర్తల మది లో మొదలయ్యూయి. ఇదే వాస్తవమైతే పార్టీలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉం దని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కాగా ఎస్. కోట నుంచి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కోళ్ల లలితకుమారి, హైమవతి ఎవరికి వారే చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల లలితకుమారి పార్టీ టిక్కెట్ తనకే వస్తుందని, చం ద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే హైమవతి బహిరంగాం గా ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం లలితకుమారి జామి, కొత్తవలస మండలా ల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేశామని హాజరుకావాలంటూ హైమవతికి ఫోన్ చేశారు. దీనిపై స్పందించి హైమవతి...తాను హైదరాబాద్‌లో ఉన్నంతసేపూ కనీ సం మాట మాత్రం చెప్పలేదు... ఇప్పుడు షిర్డీలో ఉ న్నానని తెలిసీ..ఆకస్మికంగా సమావేశాలు ఏర్పాటు చేయడం దేనికని ప్రశ్నించారు. దీంతో లలితకుమారి ఫోన్‌ను పక్కనే ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌కు ఇచ్చారు. ఆయన కూడా ఎంత చెప్పినా.. ఆమె వినలేదని సమాచారం. ఇంత జరిగినా ఆదివారం ఎస్. కోట సమావేశంలో స్థానిక నేతలు ఎమ్మెల్యే అభ్యర్థిగా లలితకుమారిని ప్రకటించడం గమనార్హం. కాగా లలితకుమారి తన వర్గీయులు, సామాజిక వర్గాన్ని అండగా చేసుకుని హైమవతి అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కొందరు చెబుతున్నారు. -
దేశం ‘కోట’లో అంతర్యుద్ధం
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీకి జిల్లాలో కంచుకోటగా ఉన్న ఎస్.కోటలో అంతర్యుద్ధం మొదలయింది. టికెట్ కోసంప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేలయిన ఇద్దరు మహిళామణులు పోటీ పడుతుండడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో ఎస్.కోట శాసనసభ స్థానం నుంచి పోటీచేసేందుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం రాష్ట్ర మహిళాధ్యక్షురాలు శోభా హైమావతి, ప్రస్తుత ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తీవ్రంగా పోటీ పడుతున్నారు. దీంతో వీరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. నిన్నమొన్నటి వరకూ కలిసిమెలిసి.. లోలోపల ఏమున్నా ఇటీవల కాలం వరకూ పార్టీ కార్యక్రమాల్లో కలిసిమెలిసి పాల్గొన్న ఎమ్మెల్యే లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే హైమావతి మధ్య పోరు ప్రారంభమయింది. ఎస్.కోట శాసనసభ స్థానం నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఈ ఇద్దరూ సిద్ధమవుతున్నారు. కొంతకాలంగా వీళ్లిద్దరూ ఎవరికి వారే చాపకింద నీరులా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం వారు తమ వర్గాలను సమాయత్తం చేసి, తమ బలం చాటుకుని, అధిష్టానం ఆశీస్సులు పొందేందుకు ఆరాటపడుతున్నారు. ఇప్పుడు ఎవరికి వారు విడివిడిగా పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేశారు. టికెట్‌పై ఎవరి ధీమా వారిదే... ఎన్నికల వాతావరణం వేడెక్కడంతో ఎమ్మెల్యే లలితకుమారి గ్రామాల్లో పార్టీ ప్రచారం జోరు పెంచారు. ఈ సందర్భంగా ఆమె ఈ దఫా పార్టీ టికెట్ తనకే వస్తుందని, చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని చెబుతున్నారు. ఈ ప్రచారంతో చిర్రెత్తుకొచ్చిన మాజీ ఎమ్మెల్యే హైమావతి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ టికెట్ ఎవ్వరికీ ప్రకటించలేదని, అధిష్టానం సరైన సమయంలో అభ్యర్థిని ప్రకటిస్తుందని, అ వాస్తవాలతో పార్టీ క్యాడర్లో గందరగోళం సృష్టించడం సరికాదంటూ ఎమ్మెల్యే లలితకుమారికి అటాక్ ఇచ్చారు. దీంతో నిన్నటి వరకూ వీరి మధ్య సాగిన కోల్డ్‌వార్ ఇప్పుడు బహిర్గతమయింది. వెలమ సామాజిక వర్గానికి ఎస్.కోట స్థానం కేటాయిస్తారని, 2009లో రాజన్న హవాను తట్టుకున్న లలితకుమారిని కాదని టికెట్ వేరెవరికీ ఇవ్వరంటూ లలితకుమారి వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా గతంలో ఎమ్మెల్యేగా వ్యవహరించిన హైమావతి పనితీరు, ప్రజాఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడం, పార్టీక్యాడర్పై మంచి పట్టుఉన్నందున సామాజిక వర్గాలకు అతీతంగా హైమావతికి టికెట్ వస్తుందని, ఇప్పటికే పార్టీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని ఆమె వర్గీయులు చెబుతున్నారు. అయోమయంలో పార్టీక్యాడర్ : ప్రజాదరణ తగ్గడం, క్యాడర్ పార్టీకి దూరంగా వెళ్లడం, రెండోస్థాయి లీడర్లంతా ఈ దఫా ఎన్నికల్లో పార్టీ మారేందుకు యత్నించడం, జిల్లాలో పలు స్థానాల్లో పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు, రెబల్స్‌తో అవస్థలు పడుతున్న చంద్రబాబుకు ఎస్.కోట మరో సమస్య అయింది. లలితకుమారి, హైమవతిల్లో ఎవరిని కాదన్నా పార్టీ కొంత బలగాన్ని, వర్గాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఈ పరిణామాలతో ఎస్.కోట స్థానాన్ని చేజేతులా వదులుకోవాల్సి వస్తుందన్న గుబులు పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎవరి వైపు వెళ్తే భవిష్యత్‌లో ఏ ఇబ్బందులు ఎదురవుతాయో అన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొంది. -
మంత్రి హామీ ఏమైంది...?
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పేదల ఇళ్ల స్థలాల కోసం చేసిన ప్రకటనలు ఇవి. మంత్రి మాటలు సభలు, సమావేశాలకే పరిమితమని మరోసారి రుజువైంది. దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న పేదల గూ డు గోడు ఎవరికీ పట్టడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పలు పార్టీలకు చెందిన నాయకులు ఇళ్ల స్థలాలను ఎన్నికల అజెండాలో ప్రచార అంశంగా చూపిస్తున్నారు. మంత్రి బొత్స పేదలకు ఇళ్ల స్థలాలు కేటారుుంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి, నెలలు కావస్తున్నా... పనులు ముందుకు సాగకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మరోమారు తన రాజకీయ చదరం గంలో ఇళ్ల స్థలాల ఇష్యూనే వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల ఎస్. కోట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలవాలనుకున్న మంత్రి హడావిడిగా గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నెల రోజుల వ్యవధిలో వేపాడలో నాలుగు సార్లు, ఎస్. కోట-2, జామి-3, లక్కవరపుకోట-3, కొత్తవలస-4 ధపాలు సుడిగాలి పర్యటన చేశారు. అప్పటి నుంచి ఎస్. కోట వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తాజాగా మంత్రి తన మనసు మార్చుకున్నారని, అసెంబ్లీకి పోటీ చేస్తే చీపురుపల్లి తనకు పది లం అని భావిస్తున్నారని కొందరు, ఈసారి బొత్స రాజ్యసభకు వెళ్తారని మరికొందరు అంటున్నారు. అందకనే ఎస్. కోటపై ఆయన కినుక వహిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. ఎదురుచూపులే... ఎస్.కోట పట్టణంలోని పుణ్యగిరి రోడ్డులో సర్వే నెం.147/23 నుంచి 72 వరకూ 46.82 ఎకరాల స్థలాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఇందులో 18.57 ఎకరాలు పీఓటీ ల్యాండ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ మొత్తం భూములను ఇప్పటికే రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. పీఓటీ దా రులు కొందరు కోర్టుకి వెళ్లినా రెవెన్యూ శాఖకు అనుగుణంగానే తీర్పు వచ్చిందంటున్నారు. అసైన్డ్‌దారుల కు 1307 జీఓ ప్రకారం ఎకరానికి రూ. 2,02,800 చొప్పున చెల్లింపులు చేశారు. పరిహారం తీసుకోని వారి మొత్తాన్ని కోర్టుకు జమచేశారు. సేకరించిన భూముల్లో చెట్లను గుర్తించినా, ఇంత వరకూ వాటి తొలగింపు, వేలం మాత్రం జరగలేదు. గృహనిర్మాణశాఖ భూమి చదును పనులు ప్రారంభించలేదు. అర్హుల జాబితాల్లో అభ్యంతరాలపై వార్డు సభలు జరపలేదు. కొత్త దరఖాస్తుల విచారణ కొలి క్కి రాలేదు. దీంతో సుమారు దశాబ్ద కాలంగా ఇంటి స్థలం కోసం ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరడం లేదు. అలమండలో రాజకీయ క్రీడ జామి మండలంలోని అలమండలో సుమారు 20 ఏళ్ల కిందట రెవెన్యూ శాఖ 7.15 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఈ స్థలంలో 325 మందికి పట్టాలు మంజూరు చేశారు. తరువాత మండలంలో రాజకీయ విభేదాలతో నేతలు చేసిన వీరంగం వల్ల స్థలాల కేటాయింపు ఆగిపోయింది. ఆ క్రమ ంలో రెవెన్యూ అధికారులు పట్టాలు రద్దు చేశారు. ప్రస్తుతం ఆ స్థలం రెవెన్యూ ఆధీనంలో ఉంది. గత 20 ఏళ్లుగా ఇంటి స్థలం ఇవ్వండి మొర్రో అంటూ అలమండ వాసులు విన్నవిస్తున్నా.. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. కొత్తవలసలో పాత కథే కొత్తవలస మండల కేంద్రంలో పేదల ఇళ్ల స్థలాల కోసం సర్వే నెం.173లో 20 ఎకరాలు, సర్వే నెం 168లో 5 ఎకరాలు స్థలాన్ని రెవెన్యూశాఖ సేకరించింది. ఇళ్ల స్థలాల కోసం వెరుు్య మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా అందులో 565 మందిని అర్హులుగా గుర్తించారు. రెవె న్యూ శాఖ సదరు భూములను గృహ నిర్మాణ శాఖకు అప్పగించింది. భూమి చదును చేసేందుకు రూ.68 లక్షలు అవసరం అంటూ గృహనిర్మాణశాఖ చేసిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు కాలేదు. ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదు. ‘అర్హులైన వారి నుంచి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు తీసుకోండి. ఎంపిక చేసిన జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే తీసేయండి. సేకరించిన స్థలం చాలకుంటే ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉందో చూడండి. తక్షణమే లెవిలింగ్ పనులు ప్రారంభించండి. సేకరించిన స్థలంలో రైతులు చెట్లు కావాలంటే ఇచ్చేయండి. పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి. రచ్చబండ నాటికి పట్టాలు సిద్ధం కావాలి’ - గత ఏడాది నవంబర్ 13వ తేదీన ఎస్. కోటలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన ప్రస్తుతం సేకరించిన 40.58 ఎకరాల స్థలంతో పాటు అదనంగా సేకరించనున్న 31 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాలిస్తాం. భూమి చదును చేసేందుకు ఇప్పటికే కోటి రూపాయలు కేటాయించాం. సంక్రాంతిలోగా పట్టాలు పంపిణీ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. ప్ర స్తుతం ఉన్న అర్హుల జాబితాలో అనర్హులు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి వార్డులో సమావేశాలు నిర్వహించి అనర్హులను తొలగించండి. - గత ఏడాది నవంబర్ 28వ తేదీన ఎస్. కోటలో జరిగిన రచ్చబండలో మంత్రి బొత్స ప్రకటన -
ఆధార్..బేజార్
శృంగవర పుకోట, న్యూస్‌లైన్: వివిధ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులను ప్రభుత్వం మరోసారి గందరగోళంలోకి నెట్టనుంది. చౌకధరల డిపోల ద్వారా అందజేస్తున్న సరుకులకు ఆధార్‌తో ముడి పెట్టాలని యోచిస్తోంది. వచ్చే నెల నుంచి ఆధార్ కార్డు ఉంటేనే చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు అందుతాయంటూ జిల్లా అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి కే ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ధ్రువీకరణపత్రాలు, హెల్త్‌కార్డులు.. ఇలా ఏ సేవ పొందాలన్నా ఆధార్ ఉండాలని ప్రభుత్వం చెబుతుం డడం.. అందుకు తగ్గట్టుగా ఆధార్ కార్డులు జారీ చేయకపోవడంతో గందరగోళ పరిస్థితు లు ఏర్పడ్డాయి. ఆధార్ అందేదెప్పుడు..! జిల్లాలో 23,44,000 మందికి ఆధార్ కార్డులు అందాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం 7 లక్షల మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధా నం అయినట్టు అధికారులు చెబుతున్నారు. విజయనగరం డివిజన్లో మొత్తం 6,47,532 మందికి ఆధార్‌కార్డులు అందాల్సి ఉండగా వీరిలో 19,853మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఐరిష్ చేయించుకుని ఆధార్‌కేంద్రాల్లో ఇ.ఐ.డి స్లిప్‌లు తీసుకున్న వందలాది మంది ఆధార్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పలుచోట్ల కేవలం 30 శాతం మందికే ఆధార్‌కార్డులు అందాయ ని, కొన్నిగ్రామాల్లో ఒక్క కార్డు కూడా అందని పరిస్థితి నెలకొందని సాక్షాత్తు తహశీల్దార్లే చెబుతున్నారు. అంతటా అయోమయం.. గతంలో ఆధార్‌కార్డుల జారీ ప్రక్రియ రెవెన్యూశాఖతో పాటూ కొన్ని బ్యాంక్‌లు, ప్రైవేటు సంస్థలు నిర్వహించాయి. తర్వాత కొన్ని ప్రైవే ట్ సంస్థలు ప్రభుత్వంతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాయి. దీంతో పలువురి నుంచి సేకరించిన డేటా పనికిరాకుండా పోయింది. ఫలితంగా కొద్దిమందికి మాత్రమే ఆధార్ కార్డులు అందా యి. ఆధార్ కేంద్రాలపై కచ్చితమైన పర్యవేక్ష ణ, నియంత్రణ, ఆధార్ జారీలో క్రమమైన పద్ధతి పాటించకపోవడంతో ఆధార్ కార్డులు కావాల్సినవారు, కార్డుల్లో తప్పులున్నవారు, స్థానికేతరులు వేల సంఖ్యలో ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవిన్యూ, పంచాయతీరాజ్, గ్రామస్థాయి ఉద్యోగులను భాగస్వాములను చేసి గ్రామాన్ని ఒక యూని ట్‌గా తీసుకుని ఆధార్‌కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. అనుసంధానం కాక అవస్థలు.. ఆధార్‌కార్డు నంబరును ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందని పరిస్థితి.వంటగ్యాస్, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు, రేషన్‌కార్డు, ఉద్యోగుల హెల్త్‌కార్డులు అన్నీ ఆధార్ నంబర్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. అయితే చాలామందికి ఆధార్ అనుసంధానం కాక వంటగ్యాస్ రాయితీ పొంద లేకపోతున్నా రు. ప్రస్తుతం జిల్లాలో ఆధార్ కార్డుల జారీకి 300 సెంటర్లు ఏర్పాటు చేశారు. విజయనగ రం డివిజన్లో ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవల స, నెల్లిమర్ల, గరివిడి, విజయనగరం కేంద్రా ల్లో ఆధార్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రమపద్ధతిలో ఆధార్‌కార్డులు జారీ చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
శృంగవరపుకోట రూరల్ / ఎల్.కోట, న్యూస్‌లైన్: ఎల్.కోటలోని స్టీల్ ఎక్స్ఛేంజ్ కంపెనీలో సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న కంటిమహంతి గణేష్(38)ను ఇసుక లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. ప్రమాద సంఘటనపై ఎల్.కోట హెచ్‌సీ ఎల్.గోవిందరావు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. మంగళవారం తెల్లవారుజామున 4.45 సమయంలో విధులు ముగించుకుని కంపెనీ నుంచి ఎస్.కోట వైపు వస్తున్న గణేశ్ ద్విచక్రవాహనాన్ని ఎల్.కోట మండలంలోని సోంపురం జంక్షన్ సమీపంలో ఎదురుగా అతివేగంగా వస్తున్న ఇసుక లారీ ఢీకొంది. ఆ వేగానికి ద్విచక్రవాహనం లారీ కింద చక్రాల్లో ఇరుక్కుపోగా.. గణేశ్ కొద్ది దూరంలో తుళ్లిపడ్డాడు. ఈ ప్రమాదంలో గణేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద స్థలంలో పడి ఉన్న ఆయనను అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి 108కు సమాచారమందించి, ఎస్.కోట కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్ హరి పరిశీలించి ఆయన అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య శోభారాణి, భరత్ అనే కుమారుడు ఉన్నారు. శోభారాణి విశాఖలోని పోర్టులో ఉద్యోగం చేస్తూ అక్కడి క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదానికి కారణమైన లారీని పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు హెచ్‌సీ తెలిపారు. కాగా గణేశ్ గతంలో ఆర్పీఎఫ్లో విధులు నిర్వహించి రిజైన్ చేశారు. ప్రస్తుతం స్టీల్ ఎక్స్ఛేంజ్ కంపెనీలో సెక్యూరిటీ అధికారిగా విధులు నిర్వహిస్తూ కంపెనీ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నాడు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
మృతదేహం తర లింపులో ఉద్రిక్తం.
శృంగవరపుకోట రూరల్/శృంగవరపుకోట, న్యూస్‌లైన్: ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ అధికారి మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎల్.కోట పీహెచ్సీ అధికారి ఏఎస్ఎన్మూర్తి (58) అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఆయన మృతదేహానికి ఎస్.కోట ప్రభుత్వాస్పత్రిలో గురువారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం రాజు చెరువు వద్ద గల శ్మశానవాటికకు అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుటన (విశాఖ-అరుకు రోడ్డులో) మృతుడు ఏఎస్ఎన్ మూర్తి బంధువులకు, మృతునికి భారీ మొత్తంలో అప్పు ఇచ్చిన సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజమానికి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజమాని కోట్ని శ్రీరాములు నాయుడికి కుడి కంటిపై తీవ్ర గాయం కావడంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖకు తరలించారు. అంబులెన్స్‌ను తరలించుకుపోయారు: మృతుని కుటుంబ సభ్యులు ‘పోస్ట్‌మార్టం అనంతరం ఏఎస్ఎన్ మూర్తి మృతదేహాన్ని దహనం చేసేందుకు అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు తరలిస్తున్నాం. ఇంతలో అప్పు తీర్చకుండా మృతదేహాన్ని ఎలా తీసుకెళ్తారని సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజ మా ని కుమారుడు కోట్ని సురేష్ అంబులెన్స్‌ను అటకాయిం చి అతని షాపు వద్దకు తీసుకుపోయారు. ఈ హఠాత్పరిణామానికి వెంటనే తేరుకుని షాపు వద్దకు వెళ్లగా శ్రీరాములునాయుడు ఇష్టానుసారంగా తిట్ల పురాణం అందుకున్నాడు. మృతిచెందిన ఏఎస్ఎన్ మూర్తి భారీగా చేసిన అప్పు మాటేమిటని ప్రశ్నించి షాపులోని ఏవో ఆయుధాలు తీసుకుని తమపై’కి వచ్చారని మృతు ని బంధువులు చెప్పారు. ఆ క్రమంలోనే శ్రీరాములు నాయుడికి దెబ్బతగిలి ఉంటుందన్నారు. తాము అతనిపై దాడి చేయలేదని మృతుని బంధువులు స్పష్టం చేశారు. మృతికి నేనే కారణమంటూ దాడి: క్షతగాత్రుడు శ్రీరాములునాయుడు ఏఎస్ఎన్ మూర్తి మృతికి తానే కారణమంటూ అకారణంగా నా షాపు వద్దకు అంబులెన్స్‌లో శవాన్ని తీసుకుని వచ్చి నాపైన, నా కుమారుడిపైనా మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు దాడి చేశారని క్షతగాత్రుడు కోట్ని శ్రీరాములు నాయుడు, అతని కుమారుడు సురేష్ లు భోరున విలపించారు. తన దగ్గర అప్పుగా భారీ మొత్తంలో మూర్తి నగదు తీసుకున్నారనీ, చెల్లించకుండా నే చనిపోయిన విషయం తెలిసి మిన్నకుండిపోయానని శ్రీరాములునాయుడు చెప్పారు. తన తండ్రిపై మృతుడు మూర్తి బంధువులు దాడి చేశారని, వారిని తాను గుర్తుపడతానని దాడి అనంతరం షాపు వద్దకు వచ్చిన ఎస్ఐ సంతోష్‌కుమార్, ట్రైనీ ఎస్ఐ బాలాజీరావుల వద్ద సురే ష్ విలపించాడు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్షతగాత్రుని భార్య, కుమారుడు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐని ప్రశ్నించగా సుచిత్రా ఎలక్ట్రానిక్స్ వద్ద ఇరు పక్షాల మధ్య గలాటా జరుగుతోంద ని సమాచారం అందగా సిబ్బందితో కలిసి వచ్చామని అంతలోనే ఇరు వర్గాల వారు వెళ్లిపోయారని, ఎటువంటి ఫిర్యాదులూ అందజేయలేదని ఎస్ఐ వెల్లడించారు. -
సర్టిఫికెట్లు ఇవ్వాల్సిందే..
శృంగవరపుకోట రూరల్, న్యూస్‌లైన్ : విద్యార్థుల సర్టిఫికెట్లను వెంటనే వారికి అందజేయాలని పలు కళాశాలల విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక విశాఖ-అరకు ప్రధాన రహదారిలో బుధవారం రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై బాలాజీరావు, సిబ్బందితో తరలివచ్చి విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. జిల్లాలో సెక్షన్ 30 అమల్లో ఉందని, ఆందళన కార్యక్రమాలు విరమించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దశలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గణేష్ కలుగజేసుకుని ముందుగా విద్యార్థులను మోసగిస్తున్న కళాశాలల యజమానులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్వీఎన్, వివేకానంద కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఆందోళన విరమిస్తే సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఎస్సై బాలాజీరావు హామీ ఇవ్వడంతో రాస్తారోకోను విరమించి స్థానిక ఎస్వీఎన్ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నేత జె.గౌరీష్ మాట్లాడుతూ, పలు కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను బినామీలుగా చేర్చుకుని విద్యార్థుల స్కాలర్‌షిప్పులను కాజేస్తున్నారని ఆరోపించారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా అదనపు సొమ్ము వసూలు చేస్తున్నారన్నారు. ఆరు నెలలుగా తిప్పుతున్నారు ఎస్వీఎన్ కళాశాలలో 2011-13లో ఎంపీహెచ్‌డబ్ల్యు ఇంటర్ కోర్స్‌లో చేరి పాసైనట్లు జామి మండలం అలమండ సంత గ్రామానికి చెందిన విద్యార్థిని వెల్దూటి ఎర్నమ్మ తెలిపింది. జాయినింగ్ సమయంలో అందజేసిన సర్టిఫికెట్లను ఇవ్వాలని జూన్ నెల నుంచి కోరుతుంటే ఇవ్వడం లేదని వాపోయింది. కొద్ది రోజల కిందట నుంచి సర్టిఫికెట్లు కావాలంటే వివేకానంద కళాశాల నుంచి తీసుకోవాలని చెబుతున్నారని తెలిపింది. ఆ కళాశాలలో అడిగితే తమకు సంబంధం లేదంటున్నారని కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం నర్స్ కోర్సులో ప్రవేశించేందుకు సమయం ఆసన్నమవుతోందని, ఇంటర్ సర్టిఫికెట్తో పాటు పదో తరగతి సర్టిఫికెట్ అవసరం ఉందని తెలిపింది. వివేకానంద కళాశాల వారిని గట్టిగా అడిగితే రూ. 13 వేలు డిమాండ్ చేశారని చెప్పింది. అలాగే తనకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వలేదని కర్రి ముత్యాలమ్మ అనే విద్యార్థిని తెలిపింది. వివేకానంద కళాశాల వారే సర్టిఫికెట్లు ఇవ్వాలి.. వివేకానంద కళాశాల వారే విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వాలని ఎస్వీఎన్ కళాశాల కరస్పాండెంట్ జె. కృష్ణ తెలిపారు. ఇంటర్లో చేరేందుకు తమ కళాశాలకు ఎక్కువ మంది విద్యార్థులు రావడంతో సీట్లు ఖాళీలేక 17 మంది విద్యార్థులను వివేకానంద కళాశాలకు పంపించామని చెప్పారు. సర్టిఫికెట్లు కూడా అప్పట్లోనే వారికి అందజేశామన్నారు. అడ్మిషన్ పరంగా విద్యార్థులు వివేకానంద కళాశాలలో చేరినా తమ కళాశాలలోనే చదువు కొనసాగించారని చెప్పారు. ఈ మధ్యలో వివేకానంద యాజమాన్యంతో అభిప్రాయ బేధాలు రావడంతో వారు కావాలనే సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. కానరాని సర్టిఫికెట్లు విద్యార్థిని ఎర్నమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై బాలాజీరావు రెండు కళాశాలల యాజమాన్యాలను పిలిపించి సమస్యపై ఆరా తీశారు. సర్టిఫికెట్లు విద్యార్థులకు అందజేయాలని సూచించారు. అయితే విద్యార్థులకు సంబంధించిన పదో తరగతి సర్టిఫికెట్లు కనిపించనట్లు తెలిసింది. దీంతో విద్యార్థులు ఇంటర్ సర్టిఫికెట్లు తీసుకోకుండా వెళ్లిపోయారు. ఈ విషయమై గురువారం నుంచి ఆందోళనలు చేపట్టి ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. -
బొత్స రచ్చబండ రాజకీయం
శృంగవరపుకోట, న్యూస్‌లైన్:‘ఒరేబాబూ కాస్త ఆగరా..నీపనిచేసి వెళ్తాను. మీసమస్యలు తీర్చ డానికే వచ్చాను. ఇతగాడికి కార్డుఎందుకు ఇవ్వలేదు సమస్యేంటి..’అంటూ సామాన్యుడి తరఫున వకాల్తా పుచ్చుకున్న రాష్ట్ర రవాణా శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ లక్కవరపుకోటలో బుధవారం జరిగిన రచ్చబండలో తన మార్కు మ్యాజిక్ చేశారు. సభలో కొత్తవలస మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, రచ్చబండ ఆహ్వాన కమిటీ స భ్యురాలు తూర్పాటి వరలక్ష్మి మాత్రమే నాలు గు మాటలు మాట్లాడారు. మంత్రి బొత్స వన్‌మేన్ షో చేసి అన్నీ తానై వ్యవహరించి రచ్చబండ సందర్భంగా తాజాగా జారీ చేసిన కార్డు లు, పింఛన్లు, ఇళ్ల వివరాలు అధికారులచే చెప్పించారు. లబ్ధిదారులను పిలిచి ‘ఎప్పుడు ధరఖాస్తు పెట్టావు. ఎన్నాళ్ల నుంచి తిరుగుతున్నావ్..’అని అడిగి సమాధానాలు రాబట్టారు. నాలుగేళ్లుగా ఉన్న మీ ఇబ్బందుల్ని తీర్చాం. ఇప్పుడున్న జాబితాలో రాకుండా మిగిలిపోయిన అర్హులు ఎవ్వరున్నా కార్డులు, పింఛన్లు, ఇళ్లు అన్నీ జనవరిలోగా ఇచ్చేస్తామంటూ పదే పదే చెప్పారు. మంత్రి బొత్స మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లకు గతంలో రూ.40వేలు ఇస్తే, ఇప్పుడు రూ.80 వేలు నుంచి రూ.1,10,000 లుకు పెంచామని, ఎస్సీ, ఎస్టీ కులస్థుల విద్యుత్ బిల్లులు మాఫీ చేశామని, బంగారుతల్లి పథకంతో ఆడపిల్లలకు భద్రత ఇచ్చామని చెప్పారు. జిల్లా అధికారులకు, ఇతర ప్రజాప్రతినిధులెవ్వరికీ మాట్లాడే ఛాన్స్ రాలేదు. రచ్చబండ వేదికపై ముందు వరుసలో కలెక్టర్ మినహా ఇతర జిల్లా అధికారులెవ్వరికీ చోటు దక్కలేదు. ఆర్డీఓ వెంకటరావు, డీఎంహెచ్ఓ స్వరాజ్యలక్ష్మి తదితర అధికారులు, మండల అధికారులు వెనుక వరుసకే పరిమితమయ్యారు. ప్రభుత్వ కార్యక్రమం అయిన రచ్చబండ వేదిక కాంగ్రెస్ తాజా మాజీలతో నిండిపోయింది. బొత్స ఈ ధపా ఎస్.కోట నియోజక వర్గం నుంచి పోటీ చేసేందుకు, ప్రజాభిమానం కూడగట్టటానికే ఇలా నియోజకవర్గం అంతా కలియతిరుగుతున్నారంటూ పలువురు చర్చించుకున్నారు. గడిచిన నెల రోజుల్లో మంత్రి బొత్స వేపాడలో నాలుగుసార్లు, ఎస్.కోటలో ఒకసారి, జామిలో రెండుసార్లు, లక్కవరపుకోటలో మూడుసార్లు, కొత్తవలసలో మూడు సార్లు పర్యటించారు. 22న జామి, కొత్తవలసలలో జరిగే రచ్చబండకు, 25న ఎస్.కోటలో జరగనున్న రచ్చబండ కార్యక్రమాలకు హాజరుకానున్నారు. మొత్తంగా సత్తెన్న రచ్చబండ సాక్షిగా రసవత్తర రాజకీయం సాగిస్తున్నారు. బుధవారం నాటి రచ్చబండ కార్యక్రమానికి ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, లక్కవరపుకోట సర్పంచ్ సంఘం నాగమణి హాజరు కాలేదు.