కానరాని లోకాలకు చేరిన కన్నకొడుకు
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
బస్ కిందపడి మృతి
శంగవరపుకోట: కని పెంచిన కొడుకు చేతికి అందివచ్చాడు. ఇక చింతా లేదు. ఏ కూలీనాలి చేసైనా పోషిస్తాడు. అంతా తానే చూసుకుంటాడని భావించిన ఆ తల్లిదండ్రుల నమ్మకం అంతలోనే ఆవిరైంది. కొడుకు కనిపించని లోకాలకు వెళ్లిపోయి కడుపుకోత మిగల్చడంతో ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. తమ కష్టం పగవారికైనా రాకూడదంటూ ఏడుస్తున్న తల్లిదండ్రులను ఓదార్చడం ఎవ్వరి తరమూ కాలేదు. ఎస్.కోట పట్టణంలో గురువారం మధ్యాహ్నం విశాఖ -అరకు రోడ్డులో షిర్డీసాయి గుడి ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించి విరాలిలా ఉన్నాయి.
మండలంలోని ఆలుగుబిల్లి గ్రామానికి చెందిన జీనపాటి ఎర్నిబాబు(25) అనే యువకుడు గ్రామంలోని ఆదిత్య ఎగ్రిగేట్స్ క్వారీలో లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. ఎస్.కోటలో ఇటీవల తాను తీసుకున్న ద్విచక్రవాహనానికి సంబంధించి ఫైనాన్స్ చెల్లించేందుకు ఎర్నిబాబు ఎస్.కోట వచ్చినట్టు తెలిసింది. పనిచూసుకుని గ్రామానికి వెళ్లేందుకు బయల్దేరిన ఎర్నిబాబు స్థానిక షిర్డీసాయి ఆలయం వద్ద విశాఖ నుంచి ఎస్.కోట డిపో వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్‌ను ఓవర్‌టేక్ చేసేందుకు ప్రయత్నించి పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో అదుపు తప్పి రోడ్డుపైకి తూలిపోయాడు. అదే సమయంలో వెనుక వస్తున ఆర్టీసీబస్ ఢీకొట్టడంతో బైక్ నుజ్జయిపోగా, ఎర్నిబాబును సుమారు 10 అడుగుల దూరం ఈడ్చుకుపోయింది.
ఈ ఘటనలో ఎర్నిబాబు తలకు తీవ్ర గాయం కావడంతో పాటూ బస్ ముందు టైర్‌కింద శరీరం ఛాతీ భాగం ఉండిపోయింది. స్థానికులు 108 కు సమాచారం అందించడంతో వెంటనే వచ్చిన సిబ్బంది ఎర్నిబాబును ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుడు ఎం.ఎన్.చారి సిబ్బంది సేవలు అందిస్తుండగానే ఎర్నిబాబు ప్రాణాలు వదిలాడు. ఎస్.కోట ఎస్సైలు సాగర్‌బాబు, కాంతారావులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మతుని తండ్రి దేముడు గ్రామస్వీపర్. కుమారుడు మరణ వార్త విని తల్లిదండ్రులు దేముడు-ఈశ్వరమ్మలు ఆస్పత్రికి వచ్చి మమ్మల్ని అన్యాయం చేశావురా అంటూ నెత్తీనోరు బాదుకుంటూ ఏడ్వడం ఆస్పత్రిలో అందర్నీ కంటతడి పెట్టించిందిృ మతుడికి ఒక చెల్లెలు ఉంది.
నువ్వే ఆధారం అనుకుంటే..
Published Fri, May 1 2015 4:48 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement