ముదిరిన అంతర్యుద్ధం
Published Mon, Jan 27 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎస్. కోట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ ప్రస్తుతం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు...నాయకుల మధ్య ఆదిపత్య పోరు వల్ల ఆ పరిస్థితి తారుమారైంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి శాసనసభకు పోటీ చేసే విష యంలో తాజా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి మధ్య నెలకొన్న ఆదిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆది వారం ఆ పార్టీ స్థానిక నేతలు చేసిన ప్రకటనతో వారి మధ్య నలుగుతున్న అంతర్యుద్ధం మరింత ముది రింది. ఇద్దరిలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందో తెలి యక.. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇరకాటంలో పడుతున్నారు.
లలితకు ఎమ్మెల్యే టికెట్ ఖాయమా ?
ఎస్. కోటలో ఎమ్మెల్యే లలితకుమారి నేతృత్వంలో ఆదివారం పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు శిక్షణ జరి గింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ పరిశీల కుడు కరెడ్ల ఈశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లలితకుమారిని గెలిపించాలంటూ కార్యక ర్తలను కోరారు. నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా చెప్పుకునే జెడ్పీ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి కూడా ఎమ్మెల్యేగా లలితకుమారిని గెలిపించాలని, ఆమె గెలుపునకు అంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చా రు. ఆ ఇద్దరి నేతల ప్రకటనతో కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. అయితే ఈ పరిణామంతో హైమవతి వర్గీయు లు ఖంగుతిన్నారు. నేతల ప్రకటనతో లలితకుమారికి ఎమ్మెల్యే టికెట్ ఖాయమయినట్టేనా....? హైమవతి ఆశలు అడియాసలేనా అన్న ప్రశ్నలు కార్యకర్తల మది లో మొదలయ్యూయి. ఇదే వాస్తవమైతే పార్టీలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉం దని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు.
కాగా ఎస్. కోట నుంచి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కోళ్ల లలితకుమారి, హైమవతి ఎవరికి వారే చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల లలితకుమారి పార్టీ టిక్కెట్ తనకే వస్తుందని, చం ద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే హైమవతి బహిరంగాం గా ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం లలితకుమారి జామి, కొత్తవలస మండలా ల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేశామని హాజరుకావాలంటూ హైమవతికి ఫోన్ చేశారు. దీనిపై స్పందించి హైమవతి...తాను హైదరాబాద్‌లో ఉన్నంతసేపూ కనీ సం మాట మాత్రం చెప్పలేదు... ఇప్పుడు షిర్డీలో ఉ న్నానని తెలిసీ..ఆకస్మికంగా సమావేశాలు ఏర్పాటు చేయడం దేనికని ప్రశ్నించారు. దీంతో లలితకుమారి ఫోన్‌ను పక్కనే ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌కు ఇచ్చారు. ఆయన కూడా ఎంత చెప్పినా.. ఆమె వినలేదని సమాచారం. ఇంత జరిగినా ఆదివారం ఎస్. కోట సమావేశంలో స్థానిక నేతలు ఎమ్మెల్యే అభ్యర్థిగా లలితకుమారిని ప్రకటించడం గమనార్హం. కాగా లలితకుమారి తన వర్గీయులు, సామాజిక వర్గాన్ని అండగా చేసుకుని హైమవతి అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కొందరు చెబుతున్నారు.
Advertisement