Shobha haimavati
-
టీడీపీకి షాక్: వైఎస్సార్సీపీలో చేరిన శోభా హైమావతి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి వైఎస్సార్సీపీలోకి వచ్చానని విజయనగరం జిల్లా ఎస్. కోట మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు శోభా హైమావతి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరానని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. పేద మహిళలందరికీ ప్రభుత్వ సాయం అందుతోందన్నారు. గిరిజన మహిళకు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చి గౌరవించారన్నారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కావాల్సిన అన్ని సౌకర్యాలు సీఎం జగన్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మన్యం వీరుడు అల్లూరి పేరుతో జిల్లా ఏర్పాటు చేయటంపై హర్షం వ్యక్తం అవుతోందని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ నేతల్లో సగంమంది వైఎస్సార్సీపీలో చేరుతారని ఆయన చెప్పారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మాజీ ఎంపీ డాక్టర్ డీవీజీ శంకరరావు కూడా సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. చదవండి: (కొత్త జిల్లాల ప్రకటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ) -
విజయనగరం: కుప్పకూలిన టీడీపీ ‘కోట’
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క స్థానం గెలుచుకోలేక కుదేలైన టీడీపీకి ఇప్పుడు మరో చావుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన శోభా హైమావతి పార్టీకి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపినట్టు ఆమె వెల్లడించారు. దీంతో ఎస్.కోట నియోజకవర్గంలో టీడీపీకి ఉన్న కాస్తంత బలం కూడా కరిగిపోయింది. ఇటు జిల్లాలో అటు విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో కీలకమైన శృంగవరపుకోటలో టీడీపీకి గట్టి నాయకత్వమే లేకుండా పోయింది. మారుమూల గ్రామం నుంచి... హైమావతి స్వస్థలం విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని భీమవరం గ్రామం. ఆమె భర్త అప్పలరాజు హిందుస్థాన్ షిప్‌యార్డులో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆమె కుమార్తె శోభా స్వాతిరాణి బ్యాచలర్ ఆప్ డెంటల్ సర్జరీ (బీడీఎస్) పూర్తిచేశారు. 2014 నుంచి 2019 వరకూ జిల్లా పరిషత్ అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఉన్నారు. హైమావతి ఇద్దరు కుమారులూ బీటెక్ పూర్తి చేశారు. రాజకీయాల్లో కీలక స్థానానికి... జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఒకప్పుడు జిల్లా టీడీపీలో కీలకంగా వ్యవహరించిన దివంగత నాయకుడు లగుడు సింహాద్రి హైమావతికి రాజకీయ గురువు. ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్న ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గమైన శృంగవరపు కోట నుంచి టీడీపీ అభ్యర్థిగా హైమావతి తొలిసారి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామిపై 678 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభంజనంతో 2004 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఓడిపోయింది. అప్పుడే కాంగ్రెస్ అభ్యర్థి కుంబా రవిబాబు చేతిలో 5,862 ఓట్ల తేడాతో హైమావతి ఓటమి పాలయ్యారు. తర్వాత ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్‌గా సేవలు అందించారు. టీడీపీలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ రాష్ట్ర మహిళాధ్యక్షురాలిగా, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేశారు. అనకాపల్లి, విశాఖ, కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఇన్చార్జిగా వ్యవహరించారు. 2009 నాటి ఎన్నికల్లో అరకు, ఎస్.కోట నియోజకవర్గాలకు టీడీపీ ఇన్చార్జిగా పనిచేశారు. జిందాల్ భూముల వ్యవహారంపై అలుపెరుగని పోరాటం చేశారు. ఆ కేసుల్లో జైలుకు కూడా వెళ్లారు. మృధుస్వభావి అయిన ఆమె పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ కీలక నేతగా ఎదిగారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో ఎస్.కోట జనరల్ సెగ్మెంట్ అయింది. ఉత్తరాపల్లి నియోజకవర్గం రద్దు అయ్యింది. దీంతో చంద్రబాబు ఎస్.కోట నియోజకవర్గాన్ని ‘కోళ్ల’ కుటుంబానికి కేటాయించారు. తదుపరి పరిణామాల్లో హైమావతి కుటుంబాన్ని పార్టీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. పార్టీలో ప్రాధాన్యం క్రమేపీ తగ్గిపోయింది. పార్టీ పదవుల నుంచి దూరం చేశారు. టీడీపీ వైఖరిని భరించలేక చివరకు ఆమె ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఎస్.కోటలో ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. -
విజయనగరం: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా
-
టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): టీడీపీ సీనియర్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి ఆ పార్టీకి రాజీనామా చేశారు. విజయనగరం జిల్లాకు చెందిన ఆమె తన రాజీనామా లేఖను చంద్రబాబుకు పంపుతానని శనివారం మీడియాకు చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆమె తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. అధికారం కోల్పోయాక పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని, పార్టీలో ఎదిగేందుకు అవకాశంలేదని ఆమె కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్నారు. పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. పార్టీకి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే.. 1999లో ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసి తొలి ప్రయత్నంలోనే ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో కాంగ్రెస్ అభ్యర్థి కుంభా రవిబాబు చేతిలో ఓటమి చెందారు. 2009లో సామాజిక సమీకరణల్లో ఎస్.కోట అసెంబ్లీ సీటును ఆమె త్యాగం చేశారు. అప్పటి నుంచి పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు. 2014లో హైమావతి కుమార్తె స్వాతిరాణి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2019లో ఎన్నికల తర్వాత స్వాతిరాణి వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ వైఖరి నచ్చక రాజీనామాలు కాగా, టీడీపీకి ఇలా పలువురు ముఖ్య నేతలు ఇప్పటికే రాజీనామా చేశారు. కొద్దిరోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన దాసరి రాజా మాస్టారు పార్టీకి గుడ్‌బై చెప్పారు. అలాగే, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన జియావుద్దీన్ కూడా అసంతృప్తితోనే పార్టీని వీడారు. అంతకుముందు.. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అనేకమంది పార్టీ వైఖరి నచ్చక రాజీనామా చేశారు. మరి -
పట్టు కోసం ఎమ్మెల్యే ల పోరు
శృంగవరపుకోట టీడీపీలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. నువ్వా.. నేనా అన్న రీతిలో వ్యవహారం కొనసాగుతోంది. వీరి మధ్య పోరు నడవడం కొత్తేమి కాకపోయినా ఇప్పుడు మరింత రసవత్తరంగా సాగుతోంది. సాధారణ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే సీటు కోసం పోరు నడిచింది. ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం పోరు నడుస్తోంది. ఎమ్మెల్యే పదవితో ఒకరు, చేతికొచ్చిన జెడ్పీ చైర్పర్సన్ పవర్‌తో ఇంకొకరు పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్ భయంతో కోళ్ల లలితకుమారి ఒక అడుగు ముందుకేసి తమ అధినేత చంద్రబాబునాయుడికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎన్నికలకు ముందు ఎస్.కోట ఎమ్మెల్యే టిక్కెట్‌పై కోళ్ల లలితకుమారి, శోభా హైమావతి కన్నేశారు. నియోజకవర్గంలో కోళ్ల లలితకుమారికి వ్యతిరేకత ఉందన్న అస్త్రంతో హైమావతి ముందుకెళ్లగా, కొప్పల వెలమ సామాజిక వర్గం ఎక్కువగా నియోజకవర్గంలో ఉన్నారని, అదే సామాజిక వర్గానికి చెందిన తనకు టిక్కెట్ ఇవ్వాలన్న నినాదంతో లలితకుమారి టిక్కెట్ కోసం పోటీ పడ్డారు. దీంతో ఇరువురు రెండు గ్రూపులుగా విడిపోయి సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకుని తమ వాదనను అప్పట్లో వినిపించారు. అవకాశం వచ్చినప్పుడుల్లా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్నారు. అధినేత చంద్రబాబునాయుడు వద్ద తమదైన బాణీలో వాణి విన్పించారు. ఈలోపే జెడ్పీటీసీ ఎన్నికలు రావడంతో వీరిద్దరికీ ఉపశమనం లభించింది. లలితకుమారికి ఎమ్మెల్యే టిక్కెట్, హైమావతి కుమార్తె స్వాతిరాణికి జెడ్పీ చైర్పర్సన్ పదవి ఇస్తామని అధిష్టానం ప్రకటించడంతో పరిస్థితి సద్దుమణిగింది. దీంతో మనసులు కలిసి ఎన్నికల్లో ఐక్యతగా పని చేశారు. గెలిచారు. ఇద్దరికీ పదవులు లభిం చాయి. దీంతో హమ్మయ్యా! అని టీడీపీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఎన్నికల అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో మళ్లీ వారి మధ్య అభిప్రాయ బేధాలు ఏర్పడ్డాయి. ఎమ్మెల్యేగా తన ఆధిపత్యం కొనసాగాలని కోళ్ల లలితకుమారి ప్రయత్నిస్తుండగా, జెడ్పీ చైర్పర్సన్ హోదాలో పట్టు సాధించాలని హైమావతి ఆరాట పడుతున్నారు. ముఖ్యంగా వేపాడ, ఎస్.కోట మండలాలను పూర్తిగా తనకే వదిలేయాలని, ఆ రెండింటిలో అభివృద్ధి, సంక్షేమ, కాంట్రాక్ట్ కార్యక్రమాలు తానే చూసుకుంటానని శోభా హైమావతి పార్టీ శ్రేణుల వద్ద అంతర్లీనంగా చెబుతున్న వార్తలతో కోళ్ల లలితకుమారి ఆవేదన చెందుతోంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గమంతా తన పర్యవేక్షణలో ఉంటుందని, రెండు మండలాలను వేరుగా చూడటమేంటని కోళ్ల వర్గీయులు మండి పడుతున్నారు. ఇదంతా భవిష్యత్ వ్యూహామేనని, హైమావతి అల్లుడ్ని ఇక్కడ బరిలోకి దించాలనే ఆలోచన ఉందని, స్వతహాగా ఆమె అల్లుడు గణేష్ కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన వారని, అందుకోసం ఇప్పటి నుంచే కేడర్‌ను తనవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారని కోళ్ల లలితకుమారి అభద్రతా భావానికి లోనవుతున్నారు. మరో పవర్ సెంటర్ తయారైతే ఇబ్బందులొస్తాయని భావిస్తూ లలితకుమారి అప్రమత్తమయ్యారు. ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాలని, తనకే నియోజకవర్గం సొంతం కావాలని పావులు కదుపుతున్నారు. ఈ మేరకు జిల్లాలోని శోభా హైమావతికి వ్యతిరేక వర్గంగా కొనసాగుతున్న ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబుకు ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు. -
జిల్లాలో రూ.400 కోట్ల రుణాలు మాఫీ
ఎస్. కోటతలారి (శృంగవరపుకోట రూరల్) : జిల్లాలో రూ. 400 కోట్ల రైతుల రుణాలు మాఫీ కానున్నట్టు జిల్లా పరిషత్ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి తెలి పారు. బుధవారం ఎస్. కోటతలారిలో ఎంపీపీ రెడ్డి వెంకన్న దంపతులు జెడ్పీ చైర్పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభ హైమావతి, ఎస్. కోట జెడ్పీటీసీ సభ్యురాలు సుకురు రామలక్ష్మిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రూ. 3.67 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీతో లబ్ధి చేకూరనుందన్నారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒ కొక్కటిగా నెరవేర్చుతుందని వెల్లడించారు. ఎస్. కోట నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముఖ్యమం త్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ రాష్ట్ర మహిళాఅధ్యక్షురాలు శోభా హైమావతి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హా మీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందన్నారు. అనంతరం ఎంపీపీగా పదవీబాధ్యతలు చేపట్టిన రెడ్డి వెంకన్న, భవానీ దంపతులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమా రి, జెడ్పీ చైర్పర్సన్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ, టీడీపీ మం డల శాఖ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్, ఎస్. కోట సర్పంచ్ అంబటి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
ముదిరిన అంతర్యుద్ధం
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎస్. కోట నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ ప్రస్తుతం పార్టీలో అంతర్గత కుమ్ములాటలు...నాయకుల మధ్య ఆదిపత్య పోరు వల్ల ఆ పరిస్థితి తారుమారైంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి శాసనసభకు పోటీ చేసే విష యంలో తాజా ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ ఎమ్మెల్యే శోభా హైమవతి మధ్య నెలకొన్న ఆదిపత్య పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆది వారం ఆ పార్టీ స్థానిక నేతలు చేసిన ప్రకటనతో వారి మధ్య నలుగుతున్న అంతర్యుద్ధం మరింత ముది రింది. ఇద్దరిలో ఎవరికి ఎమ్మెల్యే టిక్కెట్ వస్తుందో తెలి యక.. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఇరకాటంలో పడుతున్నారు. లలితకు ఎమ్మెల్యే టికెట్ ఖాయమా ? ఎస్. కోటలో ఎమ్మెల్యే లలితకుమారి నేతృత్వంలో ఆదివారం పార్టీ బలోపేతంపై కార్యకర్తలకు శిక్షణ జరి గింది. ఈ సమావేశంలో ఆ పార్టీ నియోజకవర్గ పరిశీల కుడు కరెడ్ల ఈశ్వరరావు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా లలితకుమారిని గెలిపించాలంటూ కార్యక ర్తలను కోరారు. నియోజకవర్గంలో పార్టీకి పెద్దదిక్కుగా చెప్పుకునే జెడ్పీ మాజీ చైర్మన్ లగుడు సింహాద్రి కూడా ఎమ్మెల్యేగా లలితకుమారిని గెలిపించాలని, ఆమె గెలుపునకు అంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చా రు. ఆ ఇద్దరి నేతల ప్రకటనతో కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. అయితే ఈ పరిణామంతో హైమవతి వర్గీయు లు ఖంగుతిన్నారు. నేతల ప్రకటనతో లలితకుమారికి ఎమ్మెల్యే టికెట్ ఖాయమయినట్టేనా....? హైమవతి ఆశలు అడియాసలేనా అన్న ప్రశ్నలు కార్యకర్తల మది లో మొదలయ్యూయి. ఇదే వాస్తవమైతే పార్టీలో మరిన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉం దని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. కాగా ఎస్. కోట నుంచి పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు కోళ్ల లలితకుమారి, హైమవతి ఎవరికి వారే చాపకింద నీరులా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల లలితకుమారి పార్టీ టిక్కెట్ తనకే వస్తుందని, చం ద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారని ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని మాజీ ఎమ్మెల్యే హైమవతి బహిరంగాం గా ఖండించిన విషయం తెలిసిందే. తాజాగా శనివారం ఉదయం లలితకుమారి జామి, కొత్తవలస మండలా ల్లో పార్టీ సమావేశం ఏర్పాటు చేశామని హాజరుకావాలంటూ హైమవతికి ఫోన్ చేశారు. దీనిపై స్పందించి హైమవతి...తాను హైదరాబాద్‌లో ఉన్నంతసేపూ కనీ సం మాట మాత్రం చెప్పలేదు... ఇప్పుడు షిర్డీలో ఉ న్నానని తెలిసీ..ఆకస్మికంగా సమావేశాలు ఏర్పాటు చేయడం దేనికని ప్రశ్నించారు. దీంతో లలితకుమారి ఫోన్‌ను పక్కనే ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జగదీష్‌కు ఇచ్చారు. ఆయన కూడా ఎంత చెప్పినా.. ఆమె వినలేదని సమాచారం. ఇంత జరిగినా ఆదివారం ఎస్. కోట సమావేశంలో స్థానిక నేతలు ఎమ్మెల్యే అభ్యర్థిగా లలితకుమారిని ప్రకటించడం గమనార్హం. కాగా లలితకుమారి తన వర్గీయులు, సామాజిక వర్గాన్ని అండగా చేసుకుని హైమవతి అభ్యర్థిత్వాన్ని అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కొందరు చెబుతున్నారు. -
నేనూ... నా కూతురు!
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతికి పుత్రికా వాత్సల్యం పట్టుకుంది. నేనూ, నా కూతురు తప్ప మరెవరూ బరిలో ఉండరని ఇటు పార్టీ కేడర్‌తోనూ... మా ఇద్దరికే టిక్కెట్లు ఇవ్వాలని అటు అధిష్టానం వద్ద గట్టిగా ఆమె చెబుతున్నారు. తనకు ఎస్.కోట అసెంబ్లీ , కుమార్తెకు అరకులోయ ఎంపీ టిక్కెట్లను కేటాయించాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధిష్టానానికి ఏమీ పాలుపోవడం లేదు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తనతో పాటు కుమార్తెను కూడా నాయకురాలిగా చేయాలని శోభా హైమవతి తపిస్తున్నారు. దీనికోసం పావులు కదుపుతున్నారు. ఎవరేమనుకున్నా, పోటీలో ఇతర నేతలున్నా తన పంతం నెగ్గించుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఈ మేరకు అధిష్టానం వద్ద పై రెండు డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో టీడీపీలో గందరగోళం చోటు చేసుకుంది. ఇప్పుడా చిక్కుముడిని విప్పలేక అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా సతమతమవుతున్న పరిస్థితి ఏర్పడింది. గత ఎన్నికల్లో ఎస్.కోట టిక్కెట్ దక్కకపోయినా శోభా హైమావతి పార్టీ కోసం పనిచేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ అధినేత దృష్టిలో పడ్డారు. అధిష్టానం వద్ద పలుకుబడి పెరిగిందనో, మరేంటో తెలియదు గానీ తన కుమార్తె స్వాతిని ప్రమోట్ చేసేందుకు ఇదే మంచి అవకాశంగా ఆమె ఎంచుకున్నారు. పార్టీకి అందించిన సేవల్ని, గతంలో జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎస్.కోట ఎమ్మెల్యే టిక్కెట్‌ను తనకివ్వాలని, అరకు పార్లమెంట్ సీటును తన కుమార్తెకివ్వాలని చంద్రబాబును డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో అధినేత ఇరకాటంలో పడ్డట్టు సమాచారం. కోళ్లకు ఎసరు ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడా రెండు సీట్లపై ఆశలు పెట్టుకున్న నేతలు అభద్రతా భావంలో పడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మరోసారి ఎస్.కోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆ మేరకు తనకంటూ కేడర్‌ను ఏర్పాటు చేసుకున్నారు. తమ కుటుంబం మొదటి నుంచి టీడీపీని అంటి పెట్టుకుని ఉందని, తమను కాదని వేరొకరికి టిక్కెట్ వద్దని అధిష్టానం వద్ద గట్టిగానే పట్టుబడుతున్నట్టు సమాచారం. కాదూ కూడదంటే భవిష్యత్ పరిణామాలు వేరొక విధంగా ఉంటాయని హెచ్చరికలు కూడా పంపించినట్టు తెలిసింది. కానీ శోభా హైమావతి పూర్తి నమ్మకంతో ఉన్నారు. అధిష్టానం వద్ద ఉన్న పలుకుబడితో ఎలాగైనా తనకే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కుతుందని నియోజకవర్గంలో ఇప్పటికే విసృ్తతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యం లో కోళ్ల, శోభా మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. శంకరరావుకు ఇదిలా ఉండగా శోభా తన కుమార్తె స్వాతి రాజకీయ ప్రవేశానికి ఇదే మంచి తరుణమని ఆలోచించి అరకు పార్లమెంట్‌పై కన్నేశారు. గిరిజనుల్లో మంచి పట్టు, బంధుత్వం ఉన్న దృష్ట్యా పార్లమెంట్ సీటును తన కుమార్తెకు ఇవ్వాలని చంద్రబాబును గట్టిగా కోరినట్టు తెలిసింది. అయితే ఇదే సీటుపై మాజీ ఎంపీ డీవీజీ శంకరరావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అదే ఆలోచనతో గత ఐదేళ్లుగా పనిచేస్తూ వస్తున్నారు. కానీ హఠాత్తుగా శోభా హైమావతి తన కుమార్తెను తెరపైకి తీసుకురావడంతో డీవీజీలో అసహనం మొదలైనట్టు తెలుస్తోంది. దీంతో పార్టీ కేడర్‌లో కూడా చీలిక వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఇటు ఎస్.కోట అసెంబ్లీ, అటు అరకు పార్లమెంట్‌పై కన్నేయడంతో టీడీపీ రాజకీయమంతా శోభా హైమావతి చుట్టూ తిరుగుతోంది. ఇప్పటికే రేసులో ఉన్న నేతలు ఆందోళనకు లోనవుతుండగా, టిక్కెట్ల పంచాయతీని పరిష్కరించుకోలేక చంద్రబాబు సతమతమవుతున్నట్టు తెలిసింది.