జిల్లాలో రూ.400 కోట్ల రుణాలు మాఫీ
ఎస్. కోటతలారి (శృంగవరపుకోట రూరల్) : జిల్లాలో రూ. 400 కోట్ల రైతుల రుణాలు మాఫీ కానున్నట్టు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి తెలి పారు. బుధవారం ఎస్. కోటతలారిలో ఎంపీపీ రెడ్డి వెంకన్న దంపతులు జెడ్పీ చైర్‌పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభ హైమావతి, ఎస్. కోట జెడ్పీటీసీ సభ్యురాలు సుకురు రామలక్ష్మిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రూ. 3.67 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీతో లబ్ధి చేకూరనుందన్నారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒ కొక్కటిగా నెరవేర్చుతుందని వెల్లడించారు.
ఎస్. కోట నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముఖ్యమం త్రి దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. టీడీపీ రాష్ట్ర మహిళాఅధ్యక్షురాలు శోభా హైమావతి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హా మీలను ప్రభుత్వం నెరవేర్చి తీరుతుందన్నారు. అనంతరం ఎంపీపీగా పదవీబాధ్యతలు చేపట్టిన రెడ్డి వెంకన్న, భవానీ దంపతులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమా రి, జెడ్పీ చైర్‌పర్సన్ తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుగత వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ నానిగిరి రమణాజీ, టీడీపీ మం డల శాఖ అధ్యక్షుడు ఆర్. చంద్రశేఖర్, ఎస్. కోట సర్పంచ్ అంబటి లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.