శృంగవరపుకోట :అధికారంలో లేమని కార్యకర్తలు డీలా పడొద్దని... భవిష్యత్తు మనదేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో దొంగ హామీలు ఇవ్వడం వల్లే అధికారంలోకి వచ్చారని చెప్పారు. శనివారం మధ్యాహ్నం పట్టణంలోని సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నాయుడుబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో నాయకులు,కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారని, కానీ ఎవరూ డీలా పడాల్సిన అవసరం లేదన్నారు. అబద్ధం ఆడకూడదు...మాట తప్పకూడదన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిజాయతీ వల్ల అధికారం కోల్పోయామని చెప్పారు. చంద్రబాబు దొం గ హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు.
ఇప్పుడు ప్రజ ల్లో జగన్‌ను మోసం చేసి, చంద్రబాబు చేతిలో మోసపోయామన్న పరివర్తన ప్రారంభమైందని చెప్పారు. పార్టీ మనకేం ఇచ్చిందని కాకుండా పార్టీకి మనం ఏం చేశామన్న ఆలోచన చేయాలని హితవుపలికారు. వచ్చే నెల 5వ తేదీన కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాను కార్యకర్తలు విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు మాట్లాడుతూ చంద్రబాబు ఆరు నెలల పాలనకే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. బలమైన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. జిల్లాలో పార్టీ శ్రేణులన్నీ ఒక్కటి గా నడవాలని, త్వరలో గ్రామస్థాయి కమిటీలు వేసి పార్టీని పటిష్టం చేస్తామన్నారు.నియోజకవర్గ ఇన్‌చార్జి నెక్కల నా యుడుబాబు మాట్లాడుతూ వర్గాలు, గ్రూపులకు అతీతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేద్దామని పిలుపునిచ్చారు.
అనంతరం పార్టీ నాయకులు తుపాను సమయంలో మృతి చెందిన జామి మండలం జాగరం గ్రామానికి చెందిన సింగిడి రమేష్, కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన సానబోని అప్పన్న కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున పార్టీ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సమవేశంలో పార్టీ నాయకులు సింగుబా బు, షేక్ రెహ్మన్, కె. ముత్యాలనాయుడు, కె. రంగా, మేలా స్త్రి అప్పారావు, జి. నాగభూషణం, వేచలపు చినరామునాయుడు, సూర్యనారాయణరాజు, మామిడి అప్పలనాయు డు, జైహింద్ కుమార్, శానాపతి చంద్రరావు, వై. మాధవరావు, సింగంపల్లి సత్యం, ఎన్. శ్రీను, కేత వీరన్న, మోపాడ నాయుడు, లక్ష్మణరావు, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదో చేతకాని ప్రభుత్వం
గంట్యాడ : టీడీపీ ఎన్నికల హామీలపై వచ్చే నెల 5వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను కార్యకర్తలు విజయవంతం చేయా లని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి పిలుపునిచ్చారు. శనివారం కొటారుబిల్లి జంక్షన్‌లోని పార్టీ కార్యా లయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన బాబు బుద్ధి ఆరు నెలల్లోనే ప్రజలకు అర్ధమైందన్నారు. ప్రభుత్వ పథకాల మంజూరులో కార్యకర్తలకు అన్యాయం జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలలకే ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు, ఉద్యమాలు చేపట్టాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఈ సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, పార్టీ నాయకులు మామిడి అప్పలనాయు డు, వర్రి నరసింహమూర్తి, కృష్ణంరాజు, వై. నాగు, తదితరులు పాల్గొన్నారు.
తుపాను బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలం
ఖాసాపేట (లక్కవరపుకోట) : టీడీపీ ప్రభుత్వానికి పాలన చేత కావడం లేదని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీర భద్రస్వామి విమర్శించారు. శనివారం ఖాసాపేటలోని 500 మంది తుపాను బాధితులకు వైఎస్సార్ ఫౌండేషన్, సాక్షి మీడియా గ్రూప్ సహాయంతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటివరకు బాధితులకు పరిహారం ఇవ్వలేదు సరికదా కనీసం నిత్యావసర సరుకులు కూడా అందించలేని దుస్థితిలో ఉందన్నారు. వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నాయుడుబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నప్పటికీ కేవలం రెండు మండలాల్లో మాత్ర మే తుపాను తీవ్రత ఉన్నట్టు పరిహారం పంపిణీ చేశారన్నా రు. మిగతా మండలాల్లోని బాధితులకు అన్యాయం చేశార న్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పి. సాంబశివ రాజు, కిసాన్ సెల్ జిల్లా అధ్యుడు డి. సింగుబాబు, కె. వి. సూర్యనారయణ, కొటాన శోభ, మేలాస్త్రీ అప్పారావు, బి. శ్రీనివాసరావు, సూరిదేముడు, పాల్గొన్నారు.
డీలా వద్దు... భవిష్యత్తు మనదే
Published Sun, Nov 30 2014 3:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement
Advertisement