సాక్షి, శృంగవరపుకోట రూరల్: ఎస్.కోట మండలం, బొడ్డవర గ్రామంలోని ఎస్‌ఎస్‌ఎస్ చికెన్ షాపు వద్ద గల షెడ్డులోకి 10 అడుగుల భారీ కొండచిలువ ఆదివారం ప్రవేశించి పదికోళ్లకు పైగా తినేసి మరో రెండు కోళ్లను తీవ్రంగా గాయపరిచింది. అదే సమయంలో షాపు యజమానులు సాయి, రామసత్తి, స్థానికులు భారీ కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు.
స్థానికుడు పట్నాయక్ సహాయంతో భారీ కొండచిలువను షాపు యజమానులు పట్టుకుని గోనె సంచిలో బంధించి సమీపంలో ఉన్న గంటికొండలో విడిచిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సమీపంలో ఉన్న కొండపై నుంచి గెడ్డ ప్రవాహం ద్వారా భారీ కొండ చిలువ కొట్టుకుని వచ్చి చికెన్‌షాపులో ప్రవేశించి ఉంటుందని స్థానిక రైతులు చెబుతున్నారు.
చదవండి: (విదేశీ వలస విహంగాల విలాపం.. పదుల సంఖ్యలో మృతి)
భారీ కొండచిలువను పట్టుకున్న స్థానికుడు
Comments
Please login to add a commentAdd a comment