ఆ నలుగురు...
Published Wed, Jan 29 2014 2:30 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
శృంగవరపుకోట, న్యూస్‌లైన్ : ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఎస్. కోటలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అక్కడి శాసనసభా స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. దీనిపై ఇప్పటికే రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గాల లెక్కలు చూసుకునే పనిలో ఆయా పార్టీలు మునిగి తేలుతున్నాయి. ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు అభ్యర్థులు కూడా పోటీ పడుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌కు పెద్ద దిక్కు అయిన సత్తిబాబు ఎస్. కోట బరిలో నిలిచేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న ప్రచారం జరగడం,
అందుకు అనుగుణంగానే ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి, నిధుల వరద పారించడం వంటి పరిణామాలతో కాంగ్రెస్‌లో ఆశావహులు చల్లబడిపోయారు. కాగా రచ్చబండ సమావేశాల్లో జన స్పందన కొరవడటం, పంచాయతీ ఎన్నికలకు ముందు పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో ఐదు మండలాల్లో కాంగ్రెస్‌కు పడే ఓట్ల శాతం గణ నీయంగా దిగజారిందని తేలడం వంటి పరిణామా లతో బొత్స యూటర్న్ తీసుకుని చీపురుపల్లి వైపు మొగ్గినట్టు తెలుస్తోంది. అయితే ఎస్. కోట నియోజకవర్గం తన చేతుల నుంచి జారిపోకుండా తనకు వీరవిధేయులుగా ఉన్న వారిని బరిలోకి దించే పనిలో బొత్స ఉన్నట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఆ నలుగురు ....
ఎస్. కోట నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రధానంగా నలుగురు పోటీ పడుతున్నారు. ఎస్.కోట మండలానికి చెందిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఇందుకూరి రఘురాజు, జామి మండలానికి చెందిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుడివాడ రాజేశ్వరరావు, కొత్తవలస మండలానికి చెందిన డీసీసీ కార్యదర్శి నెక్కల నాయుడుబాబు, వేపాడ మండలానికి చెందిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు మూకల కస్తూరిలలో ఒకరికి ఈ దఫా టికెట్ దక్కుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారంతా మంత్రి బొత్సకు వీరవిధేయులే. సత్తెన్న చీపురుపల్లి నుంచి ఎన్నికల బరిలోకి దిగితే వీరిలో ఒక్కరికి ఎస్. కోట బెర్త్ ఖాయమని రాజకీయ విళ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు ఎవరికి వారు టికెట్ తమదేనని చెబుతున్నట్టు సమాచారం.
ముగ్గురికి శృంగభంగం
అరుుతే ఆ నలుగురిలో ముగ్గురు గతంలో సత్తెన్న రాజకీయ వ్యూహాన్ని, కాంగ్రెస్ మాయాజాలాన్ని నమ్మి భంగపడిన వారే. 2009 ఎన్నికల్లో ఇం దుకూరి రఘురాజుకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేశారు. చివరి నిమిషంలో సామాజిక వర్గం పేరుతో అల్లు జోగినాయుడును రంగంలోకి దింపడంతో రఘురాజుకు భంగపాటు తప్పలేదు. ఈ పరిణామంతో రఘురాజు రెబల్‌గా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వరరావు.. మంత్రి బొత్స అండతో 2004లో ఉత్తరావల్లి నియోజకవర్గం నుంచి, తర్వాత 2009లో ఎస్. కోట నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. రెండు ధపాలు అభయం ఇచ్చిన బొత్స చివరి నిమిషంలో మనసు మార్చుకోవడంతో రాజేశ్వరరావుకు దెబ్బ పడింది. డీసీసీ కార్య దర్శి నెక్కల నాయుడుబాబుకు 1999లో ఉత్తరావల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా బి-ఫారం ఇచ్చినా చివరి నిమిషంలో మంగపతికి కట్టబెట్టారు. 2004లో మ రోమారు టికెట్ ఆశించినా నాయుడుబాబుకు భంగపాటు తప్పలేదు.
అభయం ఎవరికి ?
రఘురాజుకు సత్తెన్న పూర్తి మద్దతు పలికినట్టు తెలుస్తోంది. సామాజిక వర్గాన్ని కాదని ర ఘురాజుకు టికెట్ ఇప్పిస్తారా...? వెలమ సామాజిక వర్గా నికి చెందిన నాయుడుబాబు, రాజే శ్వరరావుల్లో ఎవరికైనా చాన్స్ ఇస్తారా...బీసీ మహిళ అన్న నినాదంతో సత్తెన్న వర్గానికి వీర విధేయురాలిగా ఉన్న మూకల కస్తూరిని అభ్యర్థిగా నిలుపుతారా అన్న చర్చ ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, మిగిలిన వర్గాల్లో జోరుగా సాగుతోంది. పెద్దల సభలో ఆశించిన బెర్త్ సత్తిబాబుకు దక్కలేదు. ఈ పరిణామంతో ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో నిలచి గెలవాల్సి ఉన్నందున ఎస్. కోట వచ్చేది...రానిది తేలిపోనుంది. సత్తెన్న నిర్ణయంపైనే ఎస్. కోట టికెట్ ఆశిస్తున్న వారి భవిష్యత్ ఆధారపడి ఉంది.
Advertisement
Advertisement