అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా భేటీలు... ముందుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో మొదలు
రేపటి నుంచి 14వ తేదీ వరకు సమీక్షలు... పార్టీ ఎమ్మెల్యేలు,
ఇతర ముఖ్య నేతలతో చర్చలు
కులగణన జరుగుతున్న తీరుపైనా సమీక్ష
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణను ప్రారంభించింది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు ఐదు రోజులపాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శి పి. విశ్వనాథన్ ఈ సమావేశాలకు స్వయంగా హాజరవుతారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి.
ఈ నెల 10న ఆదిలాబాద్, బోథ్, 11న ఆసిఫాబాద్, సిర్పూర్, 12న చెన్నూరు, బెల్లంపల్లి, 13న మంచిర్యాల, ఖానాపూర్, 14న నిర్మల్, ముథోల్‌లో సమావేశాలు జరగనున్నాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రితో పాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, కార్పొరేషన్ల చైర్మన్లు, ఏఐసీసీ, పీసీసీ, డీసీసీ సభ్యులు, అనుబంధ సంఘాల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే లు, పీసీసీ ప్రతినిధులు, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఈ సమావేశాలకు విధిగా హా జరు కావాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు టి. కుమార్‌రావు ఉత్తర్వులు జారీచేశారు.
కులగణన తీరుపై సమీక్ష
ఈ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే వ్యూహాలను రూపొందించటంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో కులగణన జరుగుతున్న తీరును కూడా సమీక్షిస్తారని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కులగణన కార్యక్రమం తెలంగాణలో ప్రారంభమైనందున దీని ఆధారంగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో కులగణన విషయంలో పార్టీ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనే కోణంలో ఈ సమావేశాల్లో కులగణన అంశాన్ని కూడా చేర్చినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment