రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కొత్తూరు (శృంగవరపుకోట రూరల్): ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామ మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపి న వివరాలప్రకారం..లక్కవరపుకోట మండలం సోంపు రం జంక్షన్‌కు చెందిన ఇమంది బలరాం (27) జామి పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయ న ఎస్.కోట సబ్‌జైలులో మంగళవారం తెల్లవారుజామున విధులు నిర్వహించే నిమిత్తం సోంపురం జంక్షన్ నుంచి తన పల్సర్‌బైక్‌పై ఎస్.కోట బయలుదేరారు. అదే సమయంలో కొత్తూరు గ్రామం యాతపేట మలు పు వద్ద బహిర్భూమికి వచ్చిన కుప్ప పరదేశమ్మ(42)ను బైక్‌తో ఢీకొట్టిన బలరాం పక్కనే ఉన్న మురుగుకాలువలో బోల్తా పడ్డారు.
ఈ ఘటనలో ఇద్దరికీ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కొత్తూరు గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్.కోట ఎస్‌ఐ బి.సాగర్‌బాబు, కానిస్టేబుల్ విజయ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బలరాం కుటుంబసభ్యులకు, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. సీఐ ఎస్.లక్ష్మణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం మృతదేహాలను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించా రు. గీత కార్మిక కుటుంబానికి చెందిన మృతురాలు పరదేశమ్మకు భర్త తాతబాబుతో పాటు దేవి, ముత్యాలమ్మ, శ్రీను, రాము అనే నలుగురు పిల్లలు ఉన్నారు. బలరాంకు తండ్రి కనకారావుతో పాటు తల్లి, అన్నయ్య, చెల్లి ఉన్నారు. ఈ ఘటనతో సోంపురం, కొత్తూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతుల కుటుంబసభ్యులను
పరామర్శించిన ఎమ్మెల్యే కోళ్ల
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుప్ప పరదేశమ్మ, కానిస్టేబుల్ బలరాం కుటుంబసభ్యులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పరామర్శించి ఓదార్చారు. బహిర్భూమికి కూర్చున్న సందర్భంలో ప్రమాదం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే హితవుపలికారు.