kolla lalitha kumari
-
చంద్రబాబు మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్లు చంద్రబాబు మంత్రివర్గంలో చోటుదక్కని సీనియర్లు
వారంతా రాజకీయాల్లో సీనియర్లు. గెలిస్తే మంత్రి పదవి తమకే వస్తుందని గట్టిగా నమ్మారు. ఎన్నికల ప్రచార సభలు, సమీక్షల్లో పార్టీ శ్రేణుల వద్ద అదే విషయాన్ని పదేపదే ప్రస్తావించారు. తీరా గెలిచాక మంత్రి పదవులు వరించకపోవడం.. కొత్తగా ఎన్నికైన వారికే చంద్రబాబు ప్రభుత్వం పట్టంకట్టడం ప్రస్తుతం జిల్లాలోని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: రాజాంలో తనను గెలిపిస్తే టీడీపీ ప్రభుత్వంలో మంత్రినవుతానన్న కోండ్రు మురళీమోహన్ మాటలు నెగ్గలేదు... చీపురుపల్లిలో సీనియర్ నాయకుడైన బొత్స సత్యనారాయణను ఓడించి వస్తే మంత్రి పదవి కచ్చితంగా ఇస్తామని కళావెంకటరావుకు చంద్రబాబు ఇచ్చిన హామీ పనిచేయలేదు... శృంగవరపుకోటలో మూడోసారి గెలిస్తే సామాజికవర్గ సమీకరణాల్లో తనకు మంత్రి పదవి వస్తుందనుకున్న కోళ్ల లలితకుమారి కలలు నెరవేరలేదు... తొలిసారిగా ఎమ్మెల్యే అయినా ఏదో ఒక లెక్కలో తమకు జాక్‌పాట్ తగలకపోతుందా అని ఆశించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన, నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి లెక్కలూ ఫలితమివ్వలేదు. లోకేశ్‌తో సాన్నిహిత్యం, తన భార్యవైపు సంబంధాలతో చాపకింద నీరులా పనిచేసుకున్న కొండపల్లి శ్రీనివాస్ గజపతినగరం టీడీపీ టికెట్ దక్కించుకోవడంలోనే కాదు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు సంపాదించడంలోనూ సఫలమయ్యారు. విజయనగరం జిల్లా నుంచి ఏకైక మంత్రి అయ్యా రు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి ఎస్టీ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు.కోండ్రు ఆశలపై నీళ్లు...రాజాం (ఎస్సీ) నియోజకవర్గంలో 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి చలువతో ఎమ్మెల్యేగా గెలిచిన కోండ్రు మురళీమోహన్ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా నిర్వహించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తే కేవలం 4,790 ఓట్లే వచ్చాయి. టీడీపీ తీర్థం పుచ్చుకొని 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసినా వైఎస్సార్సీపీ నాయకుడు కంబాల జోగులు చేతిలో చావుదెబ్బ తప్పలేదు. అప్పటివరకూ పోటీగా ఉన్న సీనియర్ నాయకురాలు ప్రతిభాభారతి ఆరోగ్య కారణాల రీత్యా క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడంతో కోండ్రు పని సులువైంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. తాను గెలిస్తే చంద్రబాబు కేబినెట్లో తనకు చోటు ఖాయ మని ప్రచారం చేసుకున్న ఆయనకు ఇప్పుడు నిరాశే మిగిలింది. ఎస్సీ కోటాలో కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశించినా చివరకు హడావుడే మిగిలింది.ఎందు‘కళా’..?ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన టీడీపీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా కొచ్చి చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకుడిపై గెలిచిన కిమిడి కళావెంకటరావుకు ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు తప్పక ఉంటుందని ఆయన అనుచరులు అంతా కోటి ఆశలు పెట్టుకున్నారు. 1983లో రాజకీయ ఆరంగేట్రం చేసిన తర్వాత నుంచీ టీడీపీ అభ్యర్థిగా ఉణుకూరు నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఉణుకూరు రద్దు అయిన తర్వాత ఎచ్చెర్ల నియోజకవర్గానికి మారిన ఆయన 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీచేసి ఓడిపోయారు.2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీచేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి బొత్స సత్యనారాయణపై విజయం సాధించారు. ఇలా ఆరుసార్లు ఎమ్మెల్యే, గతంలో రెండుసార్లు మంత్రిగా బాధ్యతలు, 1998–2004 వరకూ రాజ్యసభ సభ్యుడిగా సేవలు, అంతకుమించి టీడీపీ రాష్ట్ర శాఖకు తొలి అధ్యక్షుడిగా పనిచేసిన కళాకు ఈసారి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. ఆయనకు చోటు దక్కకపోవడంతో అనుచరులంతా డీలా పడిపోయారు. స్పీకర్ పదవి వరిస్తుందనే ప్రచారం జరుగుతున్నా అది ఎంతవరకూ కార్యరూపం దాల్చుతుందో చూడాలి.‘కోళ్ల’ ఆశలు ఆవిరివిజయనగరం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లా ల్లో బలీయమైన సామాజికవర్గం నుంచి కోళ్ల లలితకుమారి ఒక్కరే ఈసారి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు కోళ్ల అప్పలనాయుడి కోడలుగా, రాజకీయ వారసురాలిగా శృంగవరపుకోట నియోజకవర్గంలో మూడో సారి గెలిచిన ఆమె ఈసారైనా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఆమెకే కాదు ఆమె సామాజికవర్గం నుంచి మరే ఎమ్మెల్యేకూ ఈసారి చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించలేదు. దీంతో ఆ సామాజికవర్గ నాయకులంతా గుర్రుగా ఉన్నారు.తొలిసారి గెలిచినా...బొబ్బిలి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన బేబీనాయనకు మంత్రి పదవి వస్తుందనే ప్రచారం జరిగింది. ఎందుకో ఆయన పేరు పరిశీలనలోనే లేకుండాపోయింది. విజయనగరం నుంచి రెండో సారి పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెడుతున్న అదితి గజపతిరాజుకు కూడా తన తండ్రి అశోక్ గజపతిరాజు కోటాలో మంత్రి పదవి వస్తుందని బంగ్లా అభిమానులంతా ఆశలు పెట్టుకున్నారు. కానీ రాజకీయ అస్త్రసన్యాసం చేసిన అశోక్‌ను ఏదైనా రాష్ట్రానికి గవర్నర్‌ను చేయించాలని అధిష్టానం ఆలోచిస్తోందట. దీంతో అదితికి మంత్రి పదవి అవకాశం లేకుండాపోయింది. జనసేన ఎమ్మెల్యేల్లో ఏకై క మహిళ నాయకురాలిగా ఆ పార్టీ కోటాలో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి మంత్రి పదవి వస్తుందని ఆమె అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. తుదకు గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్‌కు తూర్పుకాపు కోటాలో, సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణికి ఎస్టీ కోటాలో మంత్రి పదవులు దక్కాయి.మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గం: గజపతినగరం (తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు) వయస్సు: 42 సంవత్సరాలు విద్యార్హత: ఎంఎస్ (కంప్యూటర్ సైన్స్) స్వగ్రామం: గంట్యాడ కుటుంబం: భార్య: లక్ష్మీసింధు (గృహిణి) పిల్లలు: విహాన్ (కుమారుడు), మేధ (కుమార్తె) తాత : కొండపల్లి పైడితల్లి నాయుడు (రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, ఒకసారి జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు) తండ్రి : కొండపల్లి కొండలరావు (రెండుసార్లు గంట్యాడ ఎంపీపీగా పనిచేశారు) చిన్నాన్న: కొండపల్లి అప్పలనాయుడు (2014–19లో టీడీపీ ఎమ్మెల్యేగా చేశారు) పూర్వాశ్రమం: సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా అమెరికా, యూఏఈ, ఈజిప్ట్ తదితర దేశాల్లో పనిచేశారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి రాజకీయ ప్రస్థానం నియోజకవర్గం: సాలూరు (తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు) వయస్సు: 50 సంవత్సరాలు విద్యార్హత: బీఎస్సీ స్వగ్రామం: సాలూరు కుటుంబం: తండ్రి : జన్ని ముత్యాలు (1972–78 వరకూ కాంగ్రెస్ పారీ్టలో ఎమ్మెల్యేగా పనిచేశారు) తల్లి: జన్ని పార్వతమ్మ భర్త: గుమ్మడి జయకుమార్ పిల్లలు: పృధ్వీ (కుమారుడు), ప్రణతి (కుమార్తె) పూర్వాశ్రమం: కాంగ్రెస్ పార్టీ సాలూరు నియోజకవర్గ ఇంచార్జిగా 1999లో రాజకీయాల్లోకి వచ్చారు. అదే సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసి అప్పటి టీడీపీ అభ్యర్థి ఆర్పీ భంజ్‌దేవ్ చేతిలో ఓడిపోయారు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి నాటి కాంగ్రెస్ అభ్యర్థి పీడిక రాజన్నదొర చేతిలో ఓడిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పోటీచేసినా మళ్లీ ఓటమి తప్పలేదు. 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆమెను ఎమ్మెల్సీగా చేసింది. 2021 వరకూ ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. తర్వాత నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా కొనసాగుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి పీడిక రాజన్నదొరపై గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆమెకు చంద్రబాబు మంత్రివర్గంలోనూ చోటు దక్కింది. -
లలితమ్మా నీకో దండం..!
ఒకటి కాదు రెండు కాదు ఆమె పదేళ్లు పదవిలో ఉన్నారు.. ఏదో చేస్తారని ఆశించి ప్రజలు పట్టం కట్టారు. ‘కోట’ను అభివృద్ధి చేయాలని పదేపదే విన్నవించారు. ఆ పార్టీ పెద్దలు సైతం ఆమె ఇంటి చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచాయే తప్ప ఒక్క అభివృద్ధి పనీ తలపెట్టలేదు. ఒక్క కుటుంబానికి కూడా సరిగా ‘సంక్షేమం’ అందజేయలేదు. అన్నా.. తమ్ముడూ.. బావా.. మరిదీ.. అక్కా.. చెల్లీ అంటూ తీపిమాటలు వడ్డించడమే తప్ప మనసుపెట్టి ప్రజలకు మేలు చేయడం ఆమెకు తెలియదు. అందుకే.. ఇప్పుడు ఎస్.కోట ప్రజలందరూ ఆమెకో దండం అంటూ ఛీత్కరిస్తున్నారు. చాలుచాలు మీ పాలన అంటూ మోహం మీదే చెబుతున్నారు.ఎస్.కోట నెట్వర్క్: నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధి.. ఎమ్మెల్యే. ఆ పదవిలో ఉన్నవారు కృషి చేస్తే.. ప్రభుత్వం నుంచి దండిగా నిధులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ఆ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ముఖచిత్రమే మారిపోతుంది. అయితే... ఎస్.కోట ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు పని చేసిన కోళ్ల లలితకుమారి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెడితే.. ప్రతిష్టను దిగజార్చారన్నది ఇక్కడి జనం మాట. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా ఆమె చేసినది శూన్యమన్న మాటే వినిపిస్తోంది. పదేళ్ల ఎమ్మెల్యే పదవిని ఆస్తులు కూడబెట్టేందుకే వినియోగించుకున్నారన్న అపవాదు ఉంది. ఓట్ల చీలికతో పదవి దక్కినా.. ప్రజలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ ఏదో ఉద్ధరిస్తానంటూ ఎన్నికల ప్రచారానికి ఊరూరా తిరుగుతున్న ఆమెను జనం ఛీత్కరిస్తున్నారు. చేసినది చాలు అంటూ మొహంచాటేస్తు న్నారు.. ప్రజలకు ఎవరు మేలు చేస్తారో మాకు తెలుసు అంటూ చెబుతుండడంతో ఆమె తట్టుకోలేకపోతోంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో అనవసరంగా బరిలో దిగామంటూ పలువురి వద్ద నిట్టూర్చుతోందట. మామ పేరు చెప్పినా ప్రజలు హర్షించడంలేదంటూ వాపోతున్నట్టు సమాచారం.కోళ్ల పాలనలో ప్రగతి సున్నా...👉 విశాఖ–అరకు రోడ్డును అభివృద్ధి చేస్తాం, అరకును ఆంధ్రా ఊటీ చేస్తామంటూ చంద్రబాబుతో కలిసి కోళ్ల లలితకుమారి చెప్పిన మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. విశాఖ–అరకు రోడ్డుపై కనీసం గోతులు పూడ్చలేకపోయారు.👉 వేపాడ మండల ప్రజల రాకపోకలకు ఆధారమైన సోంపురం–ఆనందపురం రోడ్డు రాళ్లుతేలి గాత లు, గోతులు మయమైనా ఏనాడూ ఒక్క రూపా యి ఖర్చుచేసి అభివృద్ధి చేయలేదు. జనం కష్టాలను ఆమె పట్టించుకోలేదన్నది ఇప్పటికీ ఈ ప్రాంతీయులు విమర్శిస్తారు.👉 ఏడు మండలాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న ఎస్.కోట కమ్యూనిటీ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చేస్తానంటూ ఉత్తుత్తి ప్రసంగాలకే ఆమె పరిమితమయ్యారు. ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి తెచ్చుకోలేకపోయారు.👉 మండలాల్లోని పీహెచ్‌సీల్లో సదుపాయాలు, వైద్య సిబ్బంది, మందుల నిల్వలపై కనీసం ఆలోచన కూడా చేయలేదు.👉 జామి, లక్కవరపుకోట మండల కేంద్రాల్లో ప్రభు త్వ జూనియర్ కళాశాలలు తెస్తామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేశారే తప్ప విద్యార్థుల చదువు కష్టాలు పట్టించుకోలేదు.👉 రోడ్డు సదుపాయం లేక నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడినా పదేళ్ల లో ఒక్కటంటే ఒక్క రోడ్డు మార్గాన్నీ పూర్తిగా నిర్మించలేదు.👉 ఇళ్లు, మరుగుదొడ్లు, రైతు రథాలు, పింఛన్లు ఇలా.. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి. ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇదేమటని ఎమ్మెల్యే వద్ద ప్రాథేయపడినా కనీసం పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీల వసూళ్లలో ఆమెకూ వాటా చేరడమే దీనికి కారణమన్నది జనం మాట.👉 వేపాడ మండలంలోని మారిక, ఎస్.కోట మండలంలోని దబ్బగుంట రోడ్లకు అటవీశాఖ అనుమతులు తేవడంలో లలితకుమారి విఫలమయ్యారు.అభివృద్ధి అంటే ఇదే కదా... సమస్యల కోటగా పేరుపడిన శృంగవరపుకోటలో 2019లో వైఎస్సార్సీపీ జెండాను ప్రజలు ఎగురవేశారు. సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అంతే.. కేవలం 59 నెలల జగన్మోహన్రెడ్డి పాలనలో ఎస్.కోట ప్రగతి పట్టాలెక్కింది. సంక్షేమ, అభివృద్ధిపాలన చేరువైంది. ఇంటింటా ‘నవరత్న’కాంతులు వెదజల్లుతున్నాయి. 👉జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ–అరకు రోడ్డుకు జాతీయ హైవేగా గుర్తింపు తీసుకొచ్చారు. అభివృద్ధికి నాంది పలికారు. అర్ధంతరంగా వదిలేసిన బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మాణాలను రూ.9కోట్ల ఖర్చుతో పూర్తిచేశారు. 👉 రూ.39 కోట్ల ఖర్చుతో సోంపురం–ఆనందపురం రోడ్డును అభివృద్ధి చేశారు. 👉ఎస్.కోటలో ఉన్న 30 పడకల సీహెచ్‌సీని వంద పడకల ఏరియా ఆస్పత్రిగా స్థాయిపెంచారు. రూ.12.60 కోట్లతో ఆస్పత్రికి కావాల్సిన హంగులు కల్పిస్తున్నారు. 👉 నియోజకవర్గంలోని 7 పీహెచ్‌సీల కొత్త భవనాలు, ఆధునీకరణకు రూ 8.25 కోట్లు కేటాయించడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీహెచ్‌సీల్లో రెండో వైద్యాధికారిని నియమించి నిరంతర వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. 👉ఎస్.కోట మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ హైసూ్కల్లో బాలికల జూనియర్ కళాశాల, జామిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుచేసి ఇంటరీ్మడియట్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వందల స్కూళ్లను నాడు–నేడు నిధులతో అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. 👉 జల్‌జీవన్ మిషన్ కింద రూ.200 కోట్ల ఖర్చుతో 137 గ్రామాలకు ఇంటింటికీ కుళాయి నీటి సరఫరా పనులు చకచకా సాగుతున్నాయి. 👉 నియోజకవర్గంలో పదివేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఒక్కో లబి్ధదారుకు రూ. 1.80లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చారు. స్థానిక ప్రజాప్రతినిధు చొరవతో వేపాడ మండలం మారిక, ఎస్.కోట మండలంలోని దబ్బగుంట గిరిశిఖర గ్రామాలకు అటవీశాఖ అనుమతులతో రోడ్లు పనులు చకచకా సాగుతున్నాయి. 👉నియోజకవర్గంలో కేవలం 59 నెలల పాలనలో రూ.750 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాగా, వివిధ సంక్షేమ పథకాల కింద 70,291 మందికి రూ.2,335 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 👉 విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో నియోజకవర్గ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విద్య, ఉపాధి, వ్యాపార, రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఆశిస్తున్నారు. -
ఆయన పేరులో ‘రాజు’ ఉన్నా.. తీరు మాత్రం ...
ఆయన పేరులో ‘రాజు’ ఉన్నా.. తీరు మాత్రం నీచం. నమ్మిన వారికే వెన్నుపోటు పొడుస్తారు. ప్రజల మధ్య చిచ్చుపెడతారు. నిత్యం కుటిల రాజకీయాలు నెరపుతూ వివాదాలకు కేంద్రబిందువవుతారు. ఆ ప్రాంత అభివృద్ధికి అవరోధం కలిగిస్తారు. అనునిత్యం అహంకారధోరణి ప్రదర్శించే ఆయనను ఏ పల్లె నమ్మదు. చివరకు ఏ పార్టీ కూడా శాశ్వతంగా ఇముడ్చుకోదు. ఆయన రాజకీయ ప్రస్థానం ఆది నుంచీ అంతే అంటూ కొన్ని ఘటనలను ఎస్.కోట వాసులు ప్రస్తావించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: శృంగవరపుకోట జెడ్పీటీసీ సభ్యుడిగా 2001–06 కాలంలో ఇందుకూరి రఘురాజు రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అదే సమయంలో బొత్స ఝాన్సీలక్ష్మి విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. సొంత సోదరుడిలా రఘురాజును ఆదరించారు. జిల్లాలో రాజకీయ దురంధరుడైన బొత్స సత్యనారాయణ కూడా అండదండలు అందించారు. ఇదే అదనుగా బొత్స శిష్యుడినంటూ రఘురాజు ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గంలో చక్రం తిప్పారు. స్థాయికి మించి ఎమ్మెల్సీ పదవి పొందేవరకూ వెన్నుదన్నుగా నిలిచిన బొత్స కుటుంబానికే ఇప్పుడు రఘురాజు వెన్నుపోటు పొడిచాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బొత్స ఝాన్సీలక్ష్మి ఎస్.కోట అసెంబ్లీ నియోజకవర్గం భాగంగా ఉన్న విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న సమయంలో తన భార్య సుబ్బలక్ష్మిని, అనుచర గణాన్ని టీడీపీలోకి పంపించేసిన వైనం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ తరహా తిరుగుబాటు ధోరణి కొత్తేమీ కాదని, గత రెండు దశాబ్దాలుగా ఎస్.కోట నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరున్నా వారికి సున్నం పెట్టడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత డప్పు.. తాను ఏ పారీ్టలో ఉన్నా తనది పార్టీ లైన్ (విధానం) కాదని, తనదంతా సొంత స్టైల్ అని ఇందుకూరి రఘురాజు ఎంతో గర్వంగా తరచూ వల్లిస్తుంటారు. శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎవ్వరు ఎమ్మెల్యేగా ఉన్నా, ఎవ్వరు అక్కడ అభ్యర్థులుగా ఉన్నా వారిని తన గుప్పెట్లో ఉంచుకోవాలనే ఆరాటం నిలువెల్లా కనిపిస్తూ ఉంటుంది. తన మాటల గారఢీకి లొంగకపోతే ఇక బెదిరింపుల పర్వం మొదలవుతుంది. ఇదే విధానంతో తన స్వగ్రామం బొడ్డవరతో పాటు పెద్దఖండేపల్లి, కిల్తంపాలెం, ముషిడిపాలెం గ్రామస్తులనూ శాసిస్తుంటారనే విమర్శలు ఉన్నాయి. ప్రతిచోట రెండు వర్గాలుగా విడగొట్టి, అందులో ఒకరికి కొమ్ముకాస్తూ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటారనేది జగమెరిగిన సత్యం. రఘురాజు ఆధిపత్య ధోరణి, వెన్నుపోటు, దు్రష్పచారంతో ఇబ్బందిపడిన పార్టీ నాయకులు ఎందరో ఉన్నారు. శెట్టి గంగాధరస్వామి: గతంలో ఎస్టీ రిజర్వుర్డు నియోజకవర్గమైన ఎస్.కోట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యరి్థగా 1994, 1999 సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేశారు. అంతకుముందు అనంతగిరి మండలంలో గిరిజనుల నాయకుడిగా, ఎంపీపీగా పనిచేశారు. ఈ రెండు దఫాలు ఓడిపోయినా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చురుగ్గా ఉండేవారు. 2001 సంవత్సరంలో ఎస్.కోట జెడ్పీటీసీగా రాజకీయాల్లోకి వచ్చిన రఘురాజుకు కొద్దిరోజుల్లోనే శెట్టి గంగాధర స్వామి ఎందుకో నచ్చలేదు. అడుగడుగునా ఆయన్ను ఇబ్బందిపెడుతూనే ఉండేవారు. ఇదెంతవరకూ వెళ్లిందంటే 2004 సార్వత్రిక ఎన్నికల్లో మూడోసారి పోటీచేయడానికి సిద్ధమైన గంగాధరస్వామికి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ టిక్కెట్ దక్కకుండా చేశారు. అల్లు కేశవ వెంకట జోగినాయుడు: నియోజకవర్గాల పునరి్వభజన తర్వాత ఎస్.కోట జనరల్ నియోజకవర్గం అయ్యింది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అల్లు కేశవ వెంకట జోగినాయుడుకు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఇది రఘురాజుకు నచ్చలేదు. స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాట్లాడినా వినలేదు. స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసి ఓడిపోవడమే గాక జోగినాయుడు ఎన్నికగాకుండా దెబ్బతీశారు. ఫలితంగా టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారి గట్టెక్కింది. ఫలితంగా నియోజకవర్గం అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రఘురాజుకే సీటు ఇచ్చింది. కానీ రెండోసారి కూడా ఓటమి తప్పలేదు. కుంభా రవిబాబు: శెట్టి గంగాధరస్వామికి గాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కుంభా రవిబాబుకు కాంగ్రెస్ అధిష్టానం 2004 ఎన్నికల్లో టికెట్ ఇచ్చింది. గెలిచిన ఏడాది వరకూ రవిబాబు, రఘురాజు మధ్య సంబంధాలు బాగానే ఉండేవి. తర్వాత రఘురాజు ఎప్పటిలాగే ఆధిపత్యధోరణి, అహంకారం ప్రదర్శించడం మొదలెట్టారు. రవిబాబు పదవీకాలమంతా రఘురాజు తిరుగుబాటును ఎదుర్కోవడానికే సరిపోయింది. 2009 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అసలు రవిబాబు పనితీరు బాగోలేదని ఫిర్యాదు చేయడానికి రెండు బస్సుల్లో అనుచరులను రఘురాజు తీసుకెళ్లడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కడుబండి శ్రీనివాసరావు: రఘురాజు 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు వైఎస్సార్సీపీలో చేరారు. కానీ వైఎస్సార్సీపీ అధిష్టానం ఎస్.కోట టికెట్‌ను కడుబండి శ్రీనివాసరావుకు ఇచ్చింది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభంజనంలో కడుబండి శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి కోళ్ల లలితకుమారిపై ఘన విజయం సాధించారు. కానీ రఘురాజు తనకు ప్రాబల్యం ఉందని చెప్పుకుంటున్న నాలుగు గ్రామ పంచాయతీల్లో టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు రావడం గమనార్హం. అయినప్పటికీ రఘురాజుకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి చట్టసభలో కూర్చోబెట్టింది. ఎమ్మెల్యే కడుబండి కూడా నియోజకవర్గంలో ఎవ్వరికీ ఇవ్వనంత ప్రాధాన్యం అతనికి ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతను చెప్పిన అభ్యర్థులకే పార్టీ నుంచి మద్దతు పలికారు. ఇలా ఎంత గౌరవం ఇచ్చినా మళ్లీ అతనిలో ఆధిపత్య ధోరణి బయటకు వచ్చింది. కడుబండిని మార్చేయాలంటూ ఏకంగా ఉద్యమమే ప్రారంభించారు. తీరా కడుబండి శ్రీనివాసరావుకే మళ్లీ టికెట్ ఖరారు చేయడంతో తెరచాటు యుద్ధానికి తెరలేపారు. భార్య సుబ్బలక్షి్మని, కొంతమంది అనుచర గణాన్ని టీడీపీలోకి పంపించారు. ఈ ద్వంద్వ వైఖరిపై నియోజకవర్గం అంతా విమర్శలు వెల్లువెత్తడంతో రఘురాజు వర్గం దిద్దుబాటు చర్యలకు దిగింది. టీడీపీలో చేరిక వ్యవహారం రఘురాజుకు తెలియదని, ఆయనకు చెప్పకుండానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లామని చెప్పడం కొసమెరుపు. -
ఇలా చేశావేంటమ్మా..!
సాక్షి, లక్కవరపుకోట (ప్రకాశం): ఎల్.కోట... ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి సొంత మండలం. ఆ మండల విద్యార్థులనే ఆమె మోసం చేశారు. ప్రతీ ఎన్నికల సమయంలోనూ ఎల్.కోటకు ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయిస్తానని హామీ ఇస్తారు. అనంతరం వాటిని పక్కనపెడతారు. ఇది ఆమెకు షరామామూలే అయినా మండల విద్యార్థులకు చదువు కష్టాలు తప్పడం లేదు. ఏటా పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పొరుగుమండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి. వ్యయప్రయాసలు తప్పడంలేదు. ఆర్థిక స్థోమతలేని విద్యార్థులు పదోతరగతితోనే చదువుకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. సొంత మండలంలో ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ఆడపిల్లల చదువులు ప్రశ్నార్థకంగా మారాయి. అమ్మా... ఇంకా ఎన్నాళ్లిలా మోసం చేస్తావంటూ విద్యార్థులు ప్రశ్నిస్తున్నా.. ఆమె నుంచి సమాధానం లేదు. లక్కవరపుకోట మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు కలగానే మిగిలింది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇంటటర్ విద్య అందని ద్రాక్షగా మారింది. ఇంటర్మీడియట్ చదువుకోసం శృంగవరపుకోట, కొత్తవలస మండలాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. గతంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో కొన్నిగదులు జూనియర్ కళాశాలకు కేటాయించేందుకు ప్రతిపాదనలు చేశారు. కళాశాల ఏర్పాటుకు పూర్తి స్థాయిలో కృషిచేస్తానని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హామీ ఇచ్చారు. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు రాసిన 583 మంది విద్యార్థులకు ఇంటర్ విద్యాకష్టాలు తప్పడం లేదు. ఉత్తరాపల్లి నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఒక్క పర్యాయం తప్ప మిగిలిన అన్ని పర్యాయాలు మాజీ మంత్రి దివంగత కోళ్ల అప్పలనాయుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. తరువాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో శృంగవరపుకోట నియోజకవర్గంగా మారింది. కోళ్ల అప్పలనాయుడు కోడలు కోళ్ల లలితకుమారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఏళ్ల తరబడి అదే కుటుంబ పాలన సాగిస్తున్నా కళాశాల మంజూరుకు చర్యలు తీసుకోకపోవడంపై విద్యార్థిలోకం భగ్గుమంటోంది. గత ఎన్నికల్లో లక్కవరపుకోట మండల కేంద్రంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారని వాపోతున్నారు. పాలకులు మారితే తప్ప కళాశాల మంజూరు కాదని, విద్యార్థులకు ఇంటర్ విద్య అందుబాటులోకి రాదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇబ్బందులు పడుతున్నాం మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రమే. మండలంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేకపోవడంతో ఆర్థిక స్థోమత లేకపోయినా తప్పనిసరి పరిస్థితిలో ప్రైవేటు కళాశాలలో చేరాను. నాలాగే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మండలానికి చంద్రబాబు వచ్చి ప్రభుత్వ కళాశాల మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నేటికీ కార్యరూపం దాల్చలేదు. –పి.శ్రీను, ఇంటర్ ప్రథమ సంవత్సరం, లక్కవరపుకోట ఏం చేయాలో అర్థంకావడం లేదు మా కుటుంబం కొద్ది సంవత్సరాల కిందట బతుకు తెరువుకోసం ఎల్.కోట మండలం వచ్చాం. నేను ఈ ఏడాది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి పరీక్షలు రాసాను. ఇంటర్ విద్యకు ప్రైవేట్ కళాశాలలో చేర్పించే స్థోమత మా తల్లిదండ్రులకు లేదు. నాకు మాత్రం డాక్టర్ చదవాలని ఉంది. ప్రభుత్వ కళాశాల ఉంటే మాలాంటి పేదావాళ్లు చదువుకునే అవకాశం ఉండేది. ప్రస్తుత ఏడాది ఏ కళాశాలలో చేరాలో తెలియడం లేదు. –మహంతి రాకేష్,సోంపురం జంక్షన్, లక్కవరపుకోట మండలం ప్రభుత్వ కళాశాల కావాలి నేను ఈ ఏడాది పదో∙తరగతి పరీక్షలు రాశాను. ప్రభుత్వ కళాశాల లేకపోవడంతో ఇంటర్ ఎక్కడ జాయిన్ కావాలో తెలియడం లేదు. మా లాంటి విద్యార్థుల గోడు పాలకులకు పట్టడం లేదు. – ఆబోతు మణికంఠ, ఎల్.కోట కనికరం లేదు నేను స్థానిక కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి పరీక్షలు రాశాను. ఇంటర్మీడియట్ చదవాలంటే ఎస్.కోట, కొత్తవలసకు వెళ్లాలి. వ్యయప్రయాసలు తప్పవు. కళాశాలను ఏర్పాటు చేసి మాలాంటి పేద విద్యార్థులను ఆదుకోవాలి. – టి.దీపిక, గొల్జాం గ్రామం -
ఎమ్మెల్యే ప్రోగ్రెస్ రిపోర్ట్ - కోళ్ల లలిత కుమారి
-
టీటీడీ బోర్డు సభ్యురాలిగా కోళ్ల లలిత
విజయనగరం : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నియమితులయ్యారు. మాజీ మంత్రి, దివంగత సీనియర్ నేత కోళ్ల అప్పలనాయుడు మనవరాలిగా రాజకీయ వారసత్వం పుచ్చుకున్న లలితకుమారి 2006లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. లక్కవరపుకోట మండలం ఖాసాపేట ఎంపీటీసీగా ఎన్నికై, మెజార్టీ ఎంపీటీసీల బలంతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2009లో తొలిసారిగా శృంగవరపుకోట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-11 కాలంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె భర్త పేరు బుచ్చి రాంప్రసాద్. ఈయన రాజకీయ కరువృద్ధుడైన కోళ్ల అప్పలనాయుడు కుమారుడు. గతంలో ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. కోళ్ల లలితకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
మళ్లీ జన్మభూమి
విజయనగరం కంటోన్మెంట్: హుదూద్ తుపాను సందర్భంగా నిలిచిపోయిన జన్మభూమి గ్రామసభలు పునఃప్రారంభమయ్యాయి. జిల్లావ్యాప్తంగా ప్రకటించిన షెడ్యూల్ గ్రామాలు, వార్డులలో శనివారం నిర్వహించిన గ్రామసభల్లో మళ్లీ జన్మభూమిపింఛను దారులు, డ్వాక్రా మ హిళలు నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలను నిలదీశారు. ఎన్నికల సందర్భంగా మాయ మాటలు చెప్పి చేసిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏళ్ల తరబడి వృద్ధులకు, విక లాంగులకు అందుతున్న పింఛన్లను ఎందుకు ఆపేస్తున్నారని నిలదీశారు. ప్రజల ఆవేదన ఆగ్రహంగా మారడంతో జన్మభూమి గ్రామసభల్లో పాల్గొన్న నాయకులు తెల్లమొహం వేశారు. ఎస్.కోటలోని సీతారాంపురం, గోపాలపల్లి గ్రామాల్లో డ్వాక్రా రుణాలు, పింఛన్ల కోసం ప్రజలు నిలదీశారు. ఐకేపీ ఏపీఎం ప్రగతి నివేదిక చదువుతుండగా మాకు రుణాలు ఎందుకు మాఫీ చేయలేదని ప్రశ్నించారు. మాఫీ చేయకపోయినా రుణాలు చెల్లించాలంటూ ఎందుకు నోటీసులు జారీ చేశారని మండిపడ్డారు. రైతుల రుణాలను కూడా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీలు గుప్పించారని ఇప్పుడు కనిపించడం లేదని సంగంపూడి రమణ తదితరులు అసహనం వెలిబుచ్చారు. సీతారాంపురంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రసంగిస్తుండగా కరక గంగునాయుడు అనే వికలాంగుడు లేచి మాలాంటి వారికి కూడా పింఛన్లు రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. సదరం ధ్రువపత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీయడంతో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఏదో సర్దిచెప్పడానికి ప్రయత్నించారు. బొబ్బిలి మండలంలోని ఎం బూర్జి వలసలో చుక్క జగన్మోహనరావు అనే యువజన సంఘం నాయకుడు సమీపంలోని గ్రోత్ సెంటర్ వల్ల గ్రామం, పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయని, దీనికి పరిష్కార మార్గాలు ఎందుకు చూపడం లేదని అధికారులను నిలదీశాడు. విజయనగరంలో.. గీతకు చుక్కెదురు మండలంలోని గుంకలాంలో జరిగిన గ్రామసభలో ఎంఎల్ఏ మీసాల గీతకు చుక్కెదురైంది. ఈ గ్రామంలో 64 మంది అర్హులకు పింఛన్లు రాజకీయంగా తొలగించడంతో జన్మభూమి గ్రామసభను అడ్డుకున్నారు. పింఛన్లు కొనసాగిస్తామని స్పష్టమైన వివరణ ఇవ్వాలని, లేకుంటే సభను జరగనీయమని గ్రామస్తులు భీష్మించారు. ఈ రసాభాసను చూసిన అధికారులు ఎమ్మెల్యే మీసాల గీత, జెడ్పీ సీఈఓ మోహనరావుకు ఫోన్లో సమాచారమందించడంతో వారు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా గ్రామస్తులు వినిపించుకోకపోవడంతో ఎంఎల్ఏ ఆగ్రహిస్తూ పింఛన్లు పోయిన వారే మాట్లాడాలని లేనివారు నోరెత్తొద్దని అనడంతో ప్రజలంతా మండిపడ్డారు. పండు ముదుసలి, వికలాంగులకు పింఛన్లు రద్దు చేస్తే మాట్లాడొద్దా? అంటూ మరింత ఆగ్రహం వ్యక్తం చేయడంతో సభ మొత్తం గందరగోళమైంది. తెలుగు దేశం పార్టీకి ఓట్లేయలేదనే కారణంతోనే జెడ్పీటీసీ సభ్యుడు అర్హుల పేర్లు తొలగించారని అధికారులు, ఎమ్మెల్యేను నిలదీశారు. అనంతరం ఎంఎల్ఏ ప్రభుత్వం ప్రగతి గురించి మాట్లాడుతుండగా మా పింఛన్ల సంగతి లేకుండా ఆ సోదంతా మాకెందుకంటూ గుసగుసలాడారు. అలాగే జిల్లాలోని నెల్లిమర్ల, ఎస్‌కోట, చీపురుపల్లి, బొబ్బిలి, సాలూరు, గజపతినగరం, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల్లో జరిగిన పలు గ్రామసభలు ప్రజల నిరసనలు, నిలదీతలతోనే సాగాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
కొత్తూరు (శృంగవరపుకోట రూరల్): ఎస్.కోట మండలం కొత్తూరు గ్రామ మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపి న వివరాలప్రకారం..లక్కవరపుకోట మండలం సోంపు రం జంక్షన్‌కు చెందిన ఇమంది బలరాం (27) జామి పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈయ న ఎస్.కోట సబ్‌జైలులో మంగళవారం తెల్లవారుజామున విధులు నిర్వహించే నిమిత్తం సోంపురం జంక్షన్ నుంచి తన పల్సర్‌బైక్‌పై ఎస్.కోట బయలుదేరారు. అదే సమయంలో కొత్తూరు గ్రామం యాతపేట మలు పు వద్ద బహిర్భూమికి వచ్చిన కుప్ప పరదేశమ్మ(42)ను బైక్‌తో ఢీకొట్టిన బలరాం పక్కనే ఉన్న మురుగుకాలువలో బోల్తా పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికీ తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కొత్తూరు గ్రామస్తుల సమాచారం మేరకు ఎస్.కోట ఎస్ఐ బి.సాగర్‌బాబు, కానిస్టేబుల్ విజయ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి బలరాం కుటుంబసభ్యులకు, పోలీసు అధికారులకు సమాచారమిచ్చారు. సీఐ ఎస్.లక్ష్మణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతుల కుటుంబాలను ఓదార్చారు. అనంతరం మృతదేహాలను ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించా రు. గీత కార్మిక కుటుంబానికి చెందిన మృతురాలు పరదేశమ్మకు భర్త తాతబాబుతో పాటు దేవి, ముత్యాలమ్మ, శ్రీను, రాము అనే నలుగురు పిల్లలు ఉన్నారు. బలరాంకు తండ్రి కనకారావుతో పాటు తల్లి, అన్నయ్య, చెల్లి ఉన్నారు. ఈ ఘటనతో సోంపురం, కొత్తూరు గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కోళ్ల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుప్ప పరదేశమ్మ, కానిస్టేబుల్ బలరాం కుటుంబసభ్యులను ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పరామర్శించి ఓదార్చారు. బహిర్భూమికి కూర్చున్న సందర్భంలో ప్రమాదం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఎమ్మెల్యే హితవుపలికారు. -
పక్కలో మరో బల్లెం!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఇప్పటికే సొంతపార్టీ నేతల చర్యలతో అభద్రతా భావంతో సతమతమవుతున్నారు. ఇకపై మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఇందుకు బీజేపీలో చేరాలనుకుంటున్న కాంగ్రెస్ నేత, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఇందుకూరి రఘురాజే కారణం. ఆయన బీజేపీలో చేరితే అక్కడ మరో పవర్ సెంటర్ తయారవుతుందని భయపడుతున్నారు. అందుకనే ముందుజాగ్రత్తగా బీజేపీ అగ్రనేతలపై ఒత్తిడికి దిగారు. రాజకీయంగా విభేదిస్తున్న రఘురాజును చేర్చుకుంటే తనకు ఇబ్బంది వస్తుందని పరోక్షంగా తెలిపారు. కానీ కోళ్ల లలితకుమారి ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కొన్ని రోజుల పాటు సందిగ్ధంలో పడ్డ బీజేపీ అగ్రనేతలు చివరికి రఘురాజును చేర్చుకోవడానికే మొగ్గుచూపారు. ఎస్‌కోటలో పార్టీ బలపడాలనే వ్యూహంతో పావులు కదుపుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె శోభా స్వాతి రాణి జెడ్పీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన దగ్గరి నుంచి ఎస్‌కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అభద్రతా భావంలో పడ్డారు. జెడ్పీ పదవితో నియోజకవర్గంలో హైమావతి పట్టు పెంచుకుంటారని, తనకు పోటీగా తయారవుతారని, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌కు ఎసరొచ్చే అవకాశం ఉందనే భయపడుతున్నట్టు తెలిసింది. శోభా హైమావతి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారన్న వాదనలు ఉన్నాయి. ఈ తరుణంలో ఇందుకూరి రఘురాజు రూపంలో మరో ప్రతికూల పరిస్థితిని ఎదుర్కోవల్సిన పరిస్థితి ఆమెకు ఏర్పడింది. బీజేపీలో చేరుతానని రఘురాజు ప్రకటించిన రోజు నుంచి ఆమెవర్గీయుల్లో ఆందోళన మొదలైంది. విశాఖ పార్లమెంట్ పరిధిలోకి ఎస్‌కోట అసెంబ్లీ నియోజకవర్గం వస్తుందని, రఘరాజు బీజేపీలో చేరితే కంభంపాటి హరిబాబుకు చెందిన ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు తెచ్చి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తమకు సమాంతరంగా ఎదిగిపోతారని ఆమె అనుచరులు భయాందోళన వ్యక్తం చేసినట్టు తెలి సింది. దీంతో కోళ్ల లలితకుమారి అప్రమత్తమై రఘురాజును చేర్చుకోనివ్వద్దని మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు ద్వారా ఎంపీ కంభంపాటి హరిబాబుపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న కా మినేని శ్రీనివాసరావుపై కూడా ఒత్తిళ్లకు దిగినట్టు తెలియవచ్చింది. రఘరాజు బీజేపీలో చేరితే ఆయనతో పాటు ఆయన గురువులుగా ఉన్న కాంగ్రెస్ కీలక నేతలు కూడా చేరవచ్చని అదేజరిగితే భవిష్యత్‌లో టీడీపీకికూడా ఇబ్బందులొస్తాయం టూ మంత్రులకు చెప్పి తద్వారా బీజేపీపై ఒత్తిడి చేశారని నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ఈ విషయంపై నిర్ణయం తీసుకోని బీజేపీ చివరికి ఒక ఆలోచనకొచ్చింది. రాష్ట్రంలో పటిష్టమవుదామని వ్యూహాత్మకంగా అడుగులేస్తున్న బీజేపీ అగ్రనేతలు, వచ్చిన అవకాశాన్ని వదులకోకూడదని, పార్టీ బలోపేతం అయ్యేందుకు దోహదపడే పరి ణామాలను సద్వినియోగం చేసుకోవాలన్న యోచనతో రఘురాజును చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే కేంద్రమంతి వెంకయ్యనాయుడు, తదితర పెద్దల సమక్షంలో చేర్చుకునేందుకు రఘరాజుకు సంకేతాలు ఇచ్చా రు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. ఇక రఘురాజు బీజేపీలో చేరితే నియోజకవర్గంలో తిష్ఠవేయడమే కాకుండా ఎంపీ ల్యాడ్స్, కేంద్రప్రభుత్వ నిధులతో పనులు చేయించి ఎమ్మెల్యేకు పోటీగా తయారయ్యే అవకాశం ఉంది. చెప్పాలంటే మరో పవర్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే శోభా హైమావతి రూపంలో ఒక సవాల్ ఎదుర్కొంటుండగా ఇకపై రఘురాజు ద్వారా మరో సవాల్ ఎదుర్కోవల్సిన పరిస్థితి ఏర్పడనుంది. -
కష్టం ఆహుతైంది..గుండె ఆగిపోయింది
తిమిడి (శృంగవరపుకోట రూరల్) : ఎస్.కోట మండలం తిమిడి గ్రామ రాజివీధి లో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల పెంకుటిల్లు దగ్ధమైంది. ఇంట్లో ఉన్న రూ.2.50 లక్షల నగదుతోపాటు, ఆరు తులాల బంగారు నగలు అగ్నికి ఆహుతయ్యూయి. కష్టార్జితం కళ్ల ముందే కాలి బూడిదవుతుంటే.. ఆ ఇంటి యజమాని తట్టుకోలేకపోయూడు. అక్కడే కుప్పకూలిపోయూడు. వెంటనే కుటుంబ సభ్యులు అతనిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికు లు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిమిడి గ్రామానికి చెందిన తొత్తడి ఎర్నాయుడు.. శనివారం రాత్రి భార్య, కుమారుడు, కుమార్తెలతో కలిసి ఇంటి ఆరుబయట నిద్రించారు. అర్ధరా త్రి సమయంలో ఇంట్లో నుంచి వాసన వస్తుండడంతో లేచి చూశారు. ఇంట్లో నుంచి మంటలు రావడంతో వెంటనే ఎస్.కోట అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే ఇంట్లో ఉన్న బియ్యం, పప్పు దినుసులతోపాటు దుస్తు లు, ఇతర సామగ్రి, నగదు, నగలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యూయి. అగ్నిమాపక సిబ్బందికి ఇంటి యజ మాని ఎర్నాయుడు కూడా సహకారం అందించాడు. ఇటీవల పొలం అమ్మగా వచ్చిన రూ. 2.50 లక్షల నగదుతోపాటు, బంగారు నగలు, బియ్యం, ఇతర సామగ్రిని ఇంట్లో ని ట్రంకు పెట్టెలో ఎర్నాయుడు కుటుంబ సభ్యులు భద్రపరిచారు. ప్రమాదంలో మొత్తం దగ్ధమవ్వడాన్ని కళ్లారా చూసిన ఇంటి యజమాని ఎర్నాయుడు తట్టుకోలేకపోయూడు. అక్కడికక్కడే కుప్పకూలిపోయూడు. వెంటనే అతనిని కుటుంబ సభ్యులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుండెపోటుతో అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎమ్మెల్యే పరామర్శ ప్రమాద వార్త తెలుసుకున్న ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ఘటనా స్థలానికి చేరుకు ని పరిశీలించారు. ఎర్నాయుడు కుటుంబ సభ్యులను ఓదార్చారు. అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నిధుల మంజూరుకు ప్రయత్నిస్తామని ప్రకటించారు. మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇందిర కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాద వివరాలను సేకరించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, ఎస్సై సాగర్‌బాబు కేసు నమోదు చేశారు. -
అమాత్య రేసులో ఇద్దరు సాను‘కుల’మయ్యేనా !
మంత్రి పదవుల ఆశావహులకు సామాజిక వర్గం గుబులు పట్టుకుంది. సీనియారిటీ ఉన్నా సామాజిక వర్గ సమీకరణాలతో తమకు మంత్రి పదవులు దక్కుతాయా అన్న టెన్షన్ వారిలో మొదలైంది. దీంతో రాజధానికి పరుగులు తీస్తున్నారు. లాబీయింగ్‌లో నిమగ్నమయ్యారు. అధినేత చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. జిల్లాకు రెండు పదవులు వస్తాయా? ఒకటితో సరిపెడతారా? మొండి చేయి చూపిస్తారా అన్న సందేహాలు ఆ పార్టీ నేతల్లో నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రి పదవులను ఆశిస్తున్నారు. సీనియారిటీ ప్రకారం చూస్తే కాపు సామాజిక వర్గం నుంచి ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన పతివాడ నారాయణస్వామి, వెలమ సామాజిక వర్గం నుంచి రెండో పర్యాయం ఎన్నికైన కోళ్ల లలితకుమారి మంత్రి పదవుల రేసులో ముందు వరుసలో ఉన్నారు. పతివాడతో పోల్చితే లలితకుమారి సీనియారిటీ తక్కువగా ఉన్నా తాత కోళ్ల అప్పలనాయుడు పార్టీకి అందించిన సేవలే ఆమెను ముందు వరుసలోకి తెచ్చి పెట్టాయి. జిల్లాలో ఎన్నికైన మిగతా ఎమ్మెల్యేలు అమాత్య పదవులు ఆశిస్తున్నా వారికంత సీన్ లేదనే వాదన ఉంది. పతివాడ, కోళ్లను కూడా పీడిస్తున్న భయం.. అయితే, ఇప్పుడు పతివాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారిలకు కూడా భయం పట్టుకుంది. దీనికి ఉత్తరాంధ్ర జిల్లాల సామాజికవర్గ సమీకరణాలే కారణంగా తెలుస్తోంది. పక్క జిల్లా అయిన శ్రీకాకుళంలో కాపు సామాజిక వర్గం నుంచి కిమిడి కళా వెంకటరావు, వెలమ సామాజిక వర్గం నుంచి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రధానంగా మంత్రి పదవులను ఆశిస్తున్నారు. అందుకు తగ్గ లాబీయింగ్ చేసుకుంటున్నారు. సీనియారిటీ ఉండడంతో పాటు కాపు సామాజిక వర్గ పెద్ద నేతగా కళా వెంకటరావు చెలామణి అవుతున్నారు. ఇక, అచ్చెన్నాయుడు విషయానికొస్తే తన అన్న, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడికి పార్టీలో ఉన్న ప్రాధాన్యం మేరకు ప్రతిపాదిత జాబితాలోకి వచ్చారు. ఈ ఇద్దరే కాకుం డా ఆ జిల్లాలో గౌతు శ్యాంసుందర్ శివాజీ కూడా పదవి ఆశిస్తున్నారు. మరో పొరుగు జిల్లా అయిన విశాఖలో కూడా అదే సామాజిక వర్గాల నుంచి మంత్రి పదవులను ఆశిస్తున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి గంటా శ్రీనివాసరావు, వెలమ సామాజిక వర్గం నుంచి చింతకాయల అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి రేసులో ఉన్నారు. అందుకు తగ్గ పైరవీలు చేసుకుంటున్నారు. పార్టీ కీలక నేతల ఆశీస్సులు కూడా వారికి ఉన్నాయి. ఈ విధంగా అటు శ్రీకాకుళంలో కిమిడి, కింజరాపునకు, ఇటు విశాఖ నుంచి గంటా, చింతకాయల, బండారులను మంత్రి వర్గంలోకి తీసుకుంటే అదే సామాజిక వర్గానికి చెందిన విజయనగరం జిల్లా నేతలు పతి వాడ నారాయణస్వామినాయుడు, కోళ్ల లలితకుమారిలను పరిగణనలోకి తీసుకుంటారా అన్నసందేహం నెలకొంది. పొరుగు జిల్లా నేతలకు ఉన్న పలుకుబడి, ఆర్థిక బలం, లాబీయింగ్ వీరికి లేవని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆ రెండు జిల్లా నేతలతో పోటీపడి పతివాడ, కోళ్ల ముందుకు రాగలరా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల సమీకరణాలను పక్క న పెట్టి జిల్లాకు రెండు మంత్రి పదవులు కేటాయిస్తే రేసులో ఉన్న ప్రధాన నేతలిద్దరికీ దక్కనున్నాయి. ఒకవేళ జిల్లాకు ఒకటే కేటాయిస్తే అది ఎవరికి దక్కుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. దీంతో మంత్రి పదవులు ఖాయమనుకుంటున్న పతివాడ, కోళ్లకు టెన్షన్ మొదలైంది. ఈ నేపథ్యంలో రాజధానికి పరుగులు తీస్తున్నారు. అధినేత చుట్టూ తిరుగుతున్నారు. ఆయన దృష్టిలో పడేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు కోటరీ నాయకులతో లాబీయింగ్ చేస్తున్నారు. చివరికి అమాత్య యోగం ఇద్దరినీ వరిస్తుం దా లేదంటే ఒక్కరికే దక్కుతుందా అనేది చూడాలి.