టీటీడీ బోర్డు సభ్యురాలిగా కోళ్ల లలిత | mla kolla lalitha kumari as ttd member | Sakshi
Sakshi News home page

టీటీడీ బోర్డు సభ్యురాలిగా కోళ్ల లలిత

Published Tue, Apr 28 2015 12:06 AM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

mla kolla lalitha kumari as ttd member

విజయనగరం : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి నియమితులయ్యారు. మాజీ మంత్రి, దివంగత సీనియర్ నేత కోళ్ల అప్పలనాయుడు మనవరాలిగా రాజకీయ వారసత్వం పుచ్చుకున్న లలితకుమారి 2006లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. లక్కవరపుకోట మండలం ఖాసాపేట ఎంపీటీసీగా ఎన్నికై, మెజార్టీ ఎంపీటీసీల బలంతో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 2009లో తొలిసారిగా శృంగవరపుకోట ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు.

 

2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009-11 కాలంలో టీడీపీ జిల్లా అధ్యక్షురాలిగా పనిచేశారు. ఆమె భర్త పేరు బుచ్చి రాంప్రసాద్. ఈయన రాజకీయ కరువృద్ధుడైన కోళ్ల అప్పలనాయుడు కుమారుడు. గతంలో ఎంపీపీ, జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. కోళ్ల లలితకుమారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement