లలితమ్మా నీకో దండం..! | - | Sakshi
Sakshi News home page

లలితమ్మా నీకో దండం..!

Published Thu, May 9 2024 4:10 AM | Last Updated on Thu, May 9 2024 1:25 PM

-

పదేళ్లు పదవిలో ఉన్నా ‘కోట’ అభివృద్ధికి చేసినది శూన్యం

పేదలకు అందని ‘సంక్షేమం’ 

ప్రజల కష్టాలు పట్టించుకోని నైజం

మామ పేరుతోనే కాలక్షేపం

దోచుకో.. దాచుకోవడానికే అధికారం అన్నట్టు పాలన

ఆమె పేరు చెబితేనే భగ్గుమంటున్న ప్రజలు

ఆమెకు.. ఆమె పాలనకో దండం అంటూ నిట్టూర్పు

ఒకటి కాదు రెండు కాదు ఆమె పదేళ్లు పదవిలో ఉన్నారు.. ఏదో చేస్తారని ఆశించి ప్రజలు పట్టం కట్టారు. ‘కోట’ను అభివృద్ధి చేయాలని పదేపదే విన్నవించారు. ఆ పార్టీ పెద్దలు సైతం ఆమె ఇంటి చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచాయే తప్ప ఒక్క అభివృద్ధి పనీ తలపెట్టలేదు. ఒక్క కుటుంబానికి కూడా సరిగా ‘సంక్షేమం’ అందజేయలేదు. అన్నా.. తమ్ముడూ.. బావా.. మరిదీ.. అక్కా.. చెల్లీ అంటూ తీపిమాటలు వడ్డించడమే తప్ప మనసుపెట్టి ప్రజలకు మేలు చేయడం ఆమెకు తెలియదు. అందుకే.. ఇప్పుడు ఎస్‌.కోట ప్రజలందరూ ఆమెకో దండం అంటూ ఛీత్కరిస్తున్నారు. చాలుచాలు మీ పాలన అంటూ మోహం మీదే చెబుతున్నారు.

ఎస్‌.కోట నెట్‌వర్క్‌: నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధి.. ఎమ్మెల్యే. ఆ పదవిలో ఉన్నవారు కృషి చేస్తే.. ప్రభుత్వం నుంచి దండిగా నిధులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ఆ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ముఖచిత్రమే మారిపోతుంది. అయితే... ఎస్‌.కోట ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు పని చేసిన కోళ్ల లలితకుమారి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెడితే.. ప్రతిష్టను దిగజార్చారన్నది ఇక్కడి జనం మాట. 

ఏ గ్రామానికి వెళ్లి అడిగినా ఆమె చేసినది శూన్యమన్న మాటే వినిపిస్తోంది. పదేళ్ల ఎమ్మెల్యే పదవిని ఆస్తులు కూడబెట్టేందుకే వినియోగించుకున్నారన్న అపవాదు ఉంది. ఓట్ల చీలికతో పదవి దక్కినా.. ప్రజలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ ఏదో ఉద్ధరిస్తానంటూ ఎన్నికల ప్రచారానికి ఊరూరా తిరుగుతున్న ఆమెను జనం ఛీత్కరిస్తున్నారు. చేసినది చాలు అంటూ మొహంచాటేస్తు న్నారు.. ప్రజలకు ఎవరు మేలు చేస్తారో మాకు తెలుసు అంటూ చెబుతుండడంతో ఆమె తట్టుకోలేకపోతోంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో అనవసరంగా బరిలో దిగామంటూ పలువురి వద్ద నిట్టూర్చుతోందట. మామ పేరు చెప్పినా ప్రజలు హర్షించడంలేదంటూ వాపోతున్నట్టు సమాచారం.

కోళ్ల పాలనలో ప్రగతి సున్నా...
👉 విశాఖ–అరకు రోడ్డును అభివృద్ధి చేస్తాం, అరకును ఆంధ్రా ఊటీ చేస్తామంటూ చంద్రబాబుతో కలిసి కోళ్ల లలితకుమారి చెప్పిన మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. విశాఖ–అరకు రోడ్డుపై కనీసం గోతులు పూడ్చలేకపోయారు.

👉 వేపాడ మండల ప్రజల రాకపోకలకు ఆధారమైన సోంపురం–ఆనందపురం రోడ్డు రాళ్లుతేలి గాత లు, గోతులు మయమైనా ఏనాడూ ఒక్క రూపా యి ఖర్చుచేసి అభివృద్ధి చేయలేదు. జనం కష్టాలను ఆమె పట్టించుకోలేదన్నది ఇప్పటికీ ఈ ప్రాంతీయులు విమర్శిస్తారు.

👉 ఏడు మండలాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న ఎస్‌.కోట కమ్యూనిటీ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చేస్తానంటూ ఉత్తుత్తి ప్రసంగాలకే ఆమె పరిమితమయ్యారు. ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి తెచ్చుకోలేకపోయారు.

👉 మండలాల్లోని పీహెచ్‌సీల్లో సదుపాయాలు, వైద్య సిబ్బంది, మందుల నిల్వలపై కనీసం ఆలోచన కూడా చేయలేదు.

👉 జామి, లక్కవరపుకోట మండల కేంద్రాల్లో ప్రభు త్వ జూనియర్‌ కళాశాలలు తెస్తామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేశారే తప్ప విద్యార్థుల చదువు కష్టాలు పట్టించుకోలేదు.

👉 రోడ్డు సదుపాయం లేక నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడినా పదేళ్ల లో ఒక్కటంటే ఒక్క రోడ్డు మార్గాన్నీ పూర్తిగా నిర్మించలేదు.

👉 ఇళ్లు, మరుగుదొడ్లు, రైతు రథాలు, పింఛన్లు ఇలా.. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి. ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇదేమటని ఎమ్మెల్యే వద్ద ప్రాథేయపడినా కనీసం పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీల వసూళ్లలో ఆమెకూ వాటా చేరడమే దీనికి కారణమన్నది జనం మాట.

👉 వేపాడ మండలంలోని మారిక, ఎస్‌.కోట మండలంలోని దబ్బగుంట రోడ్లకు అటవీశాఖ అనుమతులు తేవడంలో లలితకుమారి విఫలమయ్యారు.

అభివృద్ధి అంటే ఇదే కదా...  

సమస్యల కోటగా పేరుపడిన శృంగవరపుకోటలో 2019లో వైఎస్సార్‌సీపీ జెండాను ప్రజలు ఎగురవేశారు. సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అంతే.. కేవలం 59 నెలల జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో ఎస్‌.కోట ప్రగతి పట్టాలెక్కింది. సంక్షేమ, అభివృద్ధిపాలన చేరువైంది. ఇంటింటా ‘నవరత్న’కాంతులు వెదజల్లుతున్నాయి.  

👉జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ–అరకు రోడ్డుకు జాతీయ హైవేగా గుర్తింపు తీసుకొచ్చారు. అభివృద్ధికి నాంది పలికారు. అర్ధంతరంగా వదిలేసిన బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మాణాలను రూ.9కోట్ల ఖర్చుతో పూర్తిచేశారు.   
👉 రూ.39 కోట్ల ఖర్చుతో సోంపురం–ఆనందపురం రోడ్డును అభివృద్ధి చేశారు.  

👉ఎస్‌.కోటలో ఉన్న 30 పడకల సీహెచ్‌సీని వంద పడకల ఏరియా ఆస్పత్రిగా స్థాయిపెంచారు. రూ.12.60 కోట్లతో ఆస్పత్రికి కావాల్సిన హంగులు కల్పిస్తున్నారు.  

👉 నియోజకవర్గంలోని 7 పీహెచ్‌సీల కొత్త భవనాలు, ఆధునీకరణకు రూ 8.25 కోట్లు కేటాయించడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీహెచ్‌సీల్లో రెండో వైద్యాధికారిని నియమించి నిరంతర వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. 

👉ఎస్‌.కోట మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్‌ హైసూ్కల్‌లో బాలికల జూనియర్‌ కళాశాల, జామిలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఏర్పాటుచేసి ఇంటరీ్మడియట్‌ విద్యను అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వందల స్కూళ్లను నాడు–నేడు నిధులతో అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు.  

👉 జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.200 కోట్ల ఖర్చుతో 137 గ్రామాలకు ఇంటింటికీ కుళాయి నీటి సరఫరా పనులు చకచకా సాగుతున్నాయి.
  
👉 నియోజకవర్గంలో పదివేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఒక్కో లబి్ధదారుకు రూ. 1.80లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చారు. స్థానిక ప్రజాప్రతినిధు చొరవతో వేపాడ మండలం మారిక, ఎస్‌.కోట మండలంలోని దబ్బగుంట గిరిశిఖర గ్రామాలకు అటవీశాఖ అనుమతులతో రోడ్లు పనులు చకచకా సాగుతున్నాయి.  

👉నియోజకవర్గంలో కేవలం 59 నెలల పాలనలో రూ.750 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాగా, వివిధ సంక్షేమ పథకాల కింద 70,291 మందికి రూ.2,335 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది.   

👉  విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో నియోజకవర్గ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విద్య, ఉపాధి, వ్యాపార, రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఆశిస్తున్నారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement