s kota
-
లలితమ్మా నీకో దండం..!
ఒకటి కాదు రెండు కాదు ఆమె పదేళ్లు పదవిలో ఉన్నారు.. ఏదో చేస్తారని ఆశించి ప్రజలు పట్టం కట్టారు. ‘కోట’ను అభివృద్ధి చేయాలని పదేపదే విన్నవించారు. ఆ పార్టీ పెద్దలు సైతం ఆమె ఇంటి చుట్టూ తిరిగారు. ఏళ్లు గడిచాయే తప్ప ఒక్క అభివృద్ధి పనీ తలపెట్టలేదు. ఒక్క కుటుంబానికి కూడా సరిగా ‘సంక్షేమం’ అందజేయలేదు. అన్నా.. తమ్ముడూ.. బావా.. మరిదీ.. అక్కా.. చెల్లీ అంటూ తీపిమాటలు వడ్డించడమే తప్ప మనసుపెట్టి ప్రజలకు మేలు చేయడం ఆమెకు తెలియదు. అందుకే.. ఇప్పుడు ఎస్.కోట ప్రజలందరూ ఆమెకో దండం అంటూ ఛీత్కరిస్తున్నారు. చాలుచాలు మీ పాలన అంటూ మోహం మీదే చెబుతున్నారు.ఎస్.కోట నెట్వర్క్: నియోజకవర్గానికి ప్రజా ప్రతినిధి.. ఎమ్మెల్యే. ఆ పదవిలో ఉన్నవారు కృషి చేస్తే.. ప్రభుత్వం నుంచి దండిగా నిధులు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయి. ఆ నియోజకవర్గం అభివృద్ధి పథంలో పయనిస్తోంది. ముఖచిత్రమే మారిపోతుంది. అయితే... ఎస్.కోట ఎమ్మెల్యేగా పదేళ్ల పాటు పని చేసిన కోళ్ల లలితకుమారి నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెడితే.. ప్రతిష్టను దిగజార్చారన్నది ఇక్కడి జనం మాట. ఏ గ్రామానికి వెళ్లి అడిగినా ఆమె చేసినది శూన్యమన్న మాటే వినిపిస్తోంది. పదేళ్ల ఎమ్మెల్యే పదవిని ఆస్తులు కూడబెట్టేందుకే వినియోగించుకున్నారన్న అపవాదు ఉంది. ఓట్ల చీలికతో పదవి దక్కినా.. ప్రజలకు చేసిన మేలు ఒక్కటంటే ఒక్కటీ లేకపోవడం గమనార్హం. ఇప్పుడు మళ్లీ ఏదో ఉద్ధరిస్తానంటూ ఎన్నికల ప్రచారానికి ఊరూరా తిరుగుతున్న ఆమెను జనం ఛీత్కరిస్తున్నారు. చేసినది చాలు అంటూ మొహంచాటేస్తు న్నారు.. ప్రజలకు ఎవరు మేలు చేస్తారో మాకు తెలుసు అంటూ చెబుతుండడంతో ఆమె తట్టుకోలేకపోతోంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో అనవసరంగా బరిలో దిగామంటూ పలువురి వద్ద నిట్టూర్చుతోందట. మామ పేరు చెప్పినా ప్రజలు హర్షించడంలేదంటూ వాపోతున్నట్టు సమాచారం.కోళ్ల పాలనలో ప్రగతి సున్నా...👉 విశాఖ–అరకు రోడ్డును అభివృద్ధి చేస్తాం, అరకును ఆంధ్రా ఊటీ చేస్తామంటూ చంద్రబాబుతో కలిసి కోళ్ల లలితకుమారి చెప్పిన మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. విశాఖ–అరకు రోడ్డుపై కనీసం గోతులు పూడ్చలేకపోయారు.👉 వేపాడ మండల ప్రజల రాకపోకలకు ఆధారమైన సోంపురం–ఆనందపురం రోడ్డు రాళ్లుతేలి గాత లు, గోతులు మయమైనా ఏనాడూ ఒక్క రూపా యి ఖర్చుచేసి అభివృద్ధి చేయలేదు. జనం కష్టాలను ఆమె పట్టించుకోలేదన్నది ఇప్పటికీ ఈ ప్రాంతీయులు విమర్శిస్తారు.👉 ఏడు మండలాల ప్రజలకు ఆరోగ్య ప్రదాయనిగా ఉన్న ఎస్.కోట కమ్యూనిటీ ఆస్పత్రిని ఏరియా ఆస్పత్రిగా మార్చేస్తానంటూ ఉత్తుత్తి ప్రసంగాలకే ఆమె పరిమితమయ్యారు. ప్రభుత్వం నుంచి ఒక్కరూపాయి తెచ్చుకోలేకపోయారు.👉 మండలాల్లోని పీహెచ్‌సీల్లో సదుపాయాలు, వైద్య సిబ్బంది, మందుల నిల్వలపై కనీసం ఆలోచన కూడా చేయలేదు.👉 జామి, లక్కవరపుకోట మండల కేంద్రాల్లో ప్రభు త్వ జూనియర్ కళాశాలలు తెస్తామంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేశారే తప్ప విద్యార్థుల చదువు కష్టాలు పట్టించుకోలేదు.👉 రోడ్డు సదుపాయం లేక నియోజకవర్గంలోని గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడినా పదేళ్ల లో ఒక్కటంటే ఒక్క రోడ్డు మార్గాన్నీ పూర్తిగా నిర్మించలేదు.👉 ఇళ్లు, మరుగుదొడ్లు, రైతు రథాలు, పింఛన్లు ఇలా.. ఏ ప్రభుత్వ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీల కాళ్లు పట్టుకోవాల్సిన దుస్థితి. ముడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇదేమటని ఎమ్మెల్యే వద్ద ప్రాథేయపడినా కనీసం పట్టించుకోలేదు. జన్మభూమి కమిటీల వసూళ్లలో ఆమెకూ వాటా చేరడమే దీనికి కారణమన్నది జనం మాట.👉 వేపాడ మండలంలోని మారిక, ఎస్.కోట మండలంలోని దబ్బగుంట రోడ్లకు అటవీశాఖ అనుమతులు తేవడంలో లలితకుమారి విఫలమయ్యారు.అభివృద్ధి అంటే ఇదే కదా... సమస్యల కోటగా పేరుపడిన శృంగవరపుకోటలో 2019లో వైఎస్సార్సీపీ జెండాను ప్రజలు ఎగురవేశారు. సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అంతే.. కేవలం 59 నెలల జగన్మోహన్రెడ్డి పాలనలో ఎస్.కోట ప్రగతి పట్టాలెక్కింది. సంక్షేమ, అభివృద్ధిపాలన చేరువైంది. ఇంటింటా ‘నవరత్న’కాంతులు వెదజల్లుతున్నాయి. 👉జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి విశాఖ–అరకు రోడ్డుకు జాతీయ హైవేగా గుర్తింపు తీసుకొచ్చారు. అభివృద్ధికి నాంది పలికారు. అర్ధంతరంగా వదిలేసిన బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మాణాలను రూ.9కోట్ల ఖర్చుతో పూర్తిచేశారు. 👉 రూ.39 కోట్ల ఖర్చుతో సోంపురం–ఆనందపురం రోడ్డును అభివృద్ధి చేశారు. 👉ఎస్.కోటలో ఉన్న 30 పడకల సీహెచ్‌సీని వంద పడకల ఏరియా ఆస్పత్రిగా స్థాయిపెంచారు. రూ.12.60 కోట్లతో ఆస్పత్రికి కావాల్సిన హంగులు కల్పిస్తున్నారు. 👉 నియోజకవర్గంలోని 7 పీహెచ్‌సీల కొత్త భవనాలు, ఆధునీకరణకు రూ 8.25 కోట్లు కేటాయించడంతో పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీహెచ్‌సీల్లో రెండో వైద్యాధికారిని నియమించి నిరంతర వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు. 👉ఎస్.కోట మండలంలోని ధర్మవరం జిల్లా పరిషత్ హైసూ్కల్లో బాలికల జూనియర్ కళాశాల, జామిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుచేసి ఇంటరీ్మడియట్ విద్యను అందుబాటులోకి తెచ్చారు. నియోజకవర్గం వ్యాప్తంగా రెండు వందల స్కూళ్లను నాడు–నేడు నిధులతో అభివృద్ధి చేశారు. ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. 👉 జల్‌జీవన్ మిషన్ కింద రూ.200 కోట్ల ఖర్చుతో 137 గ్రామాలకు ఇంటింటికీ కుళాయి నీటి సరఫరా పనులు చకచకా సాగుతున్నాయి. 👉 నియోజకవర్గంలో పదివేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఒక్కో లబి్ధదారుకు రూ. 1.80లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నారు. పేదల సొంతింటి కల నెరవేర్చారు. స్థానిక ప్రజాప్రతినిధు చొరవతో వేపాడ మండలం మారిక, ఎస్.కోట మండలంలోని దబ్బగుంట గిరిశిఖర గ్రామాలకు అటవీశాఖ అనుమతులతో రోడ్లు పనులు చకచకా సాగుతున్నాయి. 👉నియోజకవర్గంలో కేవలం 59 నెలల పాలనలో రూ.750 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టాగా, వివిధ సంక్షేమ పథకాల కింద 70,291 మందికి రూ.2,335 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరింది. 👉 విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో నియోజకవర్గ వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. విద్య, ఉపాధి, వ్యాపార, రాజకీయ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని ఆశిస్తున్నారు. -
ఏపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
సాక్షి, విజయనగరం : కరోనా వైరస్ ప్రతాపానికి ప్రజాప్రతినిధులు సైతం తలవంచక తప్పడంలేదు. తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు వైరస్ బారినపడ్డారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా శృంగవరపు కోట ఎమ్మెల్యే శ్రీనివాసరావుకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా సోమవారం ఒక్కరోజే జిల్లాలో 21 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 162కి చేరింది. తాజాగా రెవెన్యూ శాఖలోనూ వైరస్ ప్రవేశించింది. జిల్లాలోని ఓ డిప్యూటీ తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. -
అదో ఆవాస గ్రామం... అయితేనేం!
సాక్షి, విశాఖపట్నం : ఆ గ్రామం మండల కేంద్రం కాదు. కనీసం పంచాయతీ కూడా కాదు. ఓ మేజర్ పంచాయతీలోని ఆవాస గ్రామం. కానీ, నేడు అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాల కేంద్రంగా గుర్తింపు పొందింది. అదే... అరకు. ప్రకృతి ప్రత్యేకతలతో రాష్ట్రంలో, దేశంలోనే పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరాజిల్లే అరకును విశాఖలో అడుగుపెట్టే దేశ, విదేశ పర్యాటకులు చూడకుండా వెళ్లరనే చెప్పాలి. చిత్రమేమంటే ఈ గ్రామానికంటూ ప్రత్యేకంగా ఎలాంటి కార్యాలయం, యంత్రాంగమూ లేదు. 2009కు ముందు అనంతగిరి, అరుకులోయ మండలాలు ఎస్.కోట (ఎస్టీ) నియోజకవర్గంలో ఉండేవి. ఎస్.కోట అసెంబ్లీ స్థానం విశాఖ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అరకు లోయ కేంద్రంగానే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో మేజర్ పంచాయతీలే మండల, నియోజకవర్గ కేంద్రాలుగా ఉంటాయి. వాటిపేరిటే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు ఏర్పడతాయి. ఇవేవీ లేకుండానే అరకు తన విశిష్టతను మరోసారి చాటుకోవడం గమనార్హం. -
‘మీరు రాసిందే నిజం.. చెప్పిందే సత్యం..
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఎస్ కోట సర్కిల్లో ఉన్నతాధికారి అవినీతి దందాలపై ఇటీవల కాలంలో సాక్షి ప్రచురించిన వరుస కథనాలు జిల్లా వ్యాప్తంగా సంచలనమైన విషయం విది తమే. సాక్షి కథనాలు పోలీస్ శాఖలో గుబులు రేపాయి. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ జి.పాలరాజు స్పందించారు. అసిస్టెంట్ ఎస్పీ అట్టాడ వెంకటరమణను విచారణాధికారిగా నియమించారు. కొద్ది రోజుల క్రితమే వెంకటరమణ ఎస్ కోట వెళ్లి పలువురు సాక్షులను, అక్కడి సిబ్బం దిని విచారించారు. ఈ క్రమంలో తన దందా వ్యవహారాన్ని ఎవరు బయటపెట్టారనే కోణంలో సీఐ కూడా విచారణ చేస్తున్నారు. అనుమానం ఉన్నవారి కాల్ డేటా తీయించడం, స్టేషన్‌కు పిలిపించి ప్రశ్నించడం, తన అనుచరుల ద్వారా అడిగించడం, కొందరికి ఫోన్లు చేయించడం వంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు తనకు ఎదురుతిరిగిన వారిని టార్గెట్ చేశారు. దానిలో భాగంగా కొంత కాలం క్రితం తనకు ఎదురుతిరిగిన మురళిని ముందుగా ఎంపిక చేసుకున్నా రు. ఆ తర్వాత ఏం జరిగిందనేది మురళి మాటల్లోనే.. నన్ను వాడుకున్నారు... మాది ఎస్ కోట. ముస్లిం యువతిని ప్రేమించి పోలీసులు, మీడియా సమక్షంలోనే ఆదర్శ వివాహం చేసుకున్నాను. మా ప్రాంతంలో రక్తదాన, అన్నదాన కార్యక్రమాలు, పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటాను. నాకు ఒక కారు, ఒక లారీ, ఒక ట్రాక్టర్ ఉన్నాయి. అవి కూడా అప్పు చేసి కొన్నాను. వాటితో ఇసుక, రాళ్లు రవాణా చేస్తుంటాను. ట్రాక్టర్‌ను వ్యవసాయపనులకు వినియోగిస్తుంటాను. మరోవైపు పోలీస్మిత్రగా కూడా సేవలందించేవాడిని. మా ప్రాంతానికి సీఐగా వచ్చిన రమణమూర్తితో పరిచ యం ఏర్పడింది. ఆయనకు అవసరమైనప్పుడల్లా నా కారు వినియోగించుకునేవారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా నా కారులోనే తిరిగేవారు. నేనే డ్రైవర్‌గా కూడా పనిచేసేవాడిని. నిందితులతో కుమ్మక్కయ్యారు పోలీస్ మిత్రగా నేను ఓ కేసు పట్టుకున్నాను. సీహెచ్ అబద్ధం అలియాస్ సురేష్ అనే వ్యక్తి ఉద్యోగాలిప్పిస్తామనంటూ కొందరి నుంచి రూ.30 లక్షల వరకూ వసూలు చేసి మోసం చేశాడు. అతనిని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు అప్పగిస్తే సీఐ రమణమూర్తి, కానిస్టేబుళ్లు శేఖర్, రాంనా యుడు, సూర్యనారాయణ అబద్ధంతో కుమ్మకై విడిచిపెట్టేశారు. దానికి ప్రతిఫలంగా కాపుసోంపురం–2లో యాభై సెంట్ల భూమిని రాయించుకున్నా రు. రెండు చెక్కులు కూడా తీసుకున్నారు. వాటిలో ఎంత రాశారనేది తెలియదు. నేనే కాదు నాలా మరికొంతమంది పోలీస్ మిత్రలు పట్టుకున్న కేసుల్లోనూ వీరు నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసి వదిలేశారు. గంజాయి కేసులో దొరికిన చెవర్లేట్ కారును వదిలేయడానికి డబ్బులు డిమాండ్ చేశారు. శెట్టి ఉమామహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ బావ మరిది అకౌంట్లో ఆ కారు యజమాని రూ. 50వేలు డిపాజిట్ చేశారు. అతని నుంచి ఎస్ఐ నరేష్ ద్వారా సీఐకి ఆ డబ్బు చేరింది. శెట్టి ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి గం జాయి స్మగ్లర్. ఇటీవల గంజాయి కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. తాటిపూడి నుంచి తాగునీరు సరఫరా చేసేందుకు రోడ్డు పక్కన పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. వారి నుంచి కూడా రూ. 25వేలు తీసుకున్నట్లు తెలిసింది. విశాఖ ఏజెన్సీకి చెందిన గంజాయి స్మగ్లర్ లారీని వదిలేసినందుకు సీఐకి రూ. 25లక్షలు ప్రతిఫలం దక్కినట్లు కూడా చెబుతున్నారు. ఉన్నతాధికారులు సరిగ్గా విచారిస్తే ఇవన్నీ బయటకొస్తాయి. అడ్డుపడ్డానని కక్ష గట్టారు ఇసుక అక్రమ వ్యాపారానికి సీఐ అండ పుష్కలంగా ఉంది. లారీ ఓనర్లంతా కలిసి ప్రతినెలా రూ. 5వేలు చొప్పున కానిస్టేబుల్ శేఖర్‌కు అందజేస్తుంటాం. ఆయన ద్వారా సీఐకి వెళుతుంది. ఇసుక లారీ ఓనర్ల మధ్య వివాదంలో అక్రమ ఇసుక రవాణా లారీని నేను మీడియాకు పట్టిచ్చాను. దాని వల్ల నెల నెలా వచ్చే మామూళ్లు ఆగిపోతాయనే కారణంతో సీఐ నాపై కక్ష గట్టారు. స్టేషన్‌కు రావాల్సిందిగా కొద్ది రోజులుగా కబురుపెడుతున్నారు. నాపై రౌడీషీట్ తెరుస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. దానిని ఆపాలంటే రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి నుంచి తప్పించుకుని తిరుగుతున్నాను. రౌడీషీట్ తెరిచేంత తప్పులు నేనేం చేశానో నాకే తెలియడం లేదు. అదే జరిగితే ఇక ఆత్మహత్యే శరణ్యం. ‘మీరు రాసిందే నిజం.. చెప్పిందే సత్యం.. ఎస్ కోట పోలీస్ సర్కిల్ పరిధిలోని అధికారి అక్రమాలు అన్నీ ఇన్నీ కావు.. వాటిలో కొన్నిటికి నేనే సాక్షిని. ఇప్పుడు నాపై కక్ష కట్టారు. రౌడీషీట్ తెరుస్తామని బెదిరిస్తున్నారు. నన్ను కాపాడమని పోలీసుల్లో ఎవరికీ చెప్పుకోలేక మిమ్మల్ని ఆశ్రయించాను. సీఐ అక్రమాలపై ఎక్కడైనా, ఎవరిదగ్గరైనా సాక్ష్యం చెప్పడానికైనా నేను సిద్ధం.’ – ‘సాక్షి’తో ఒకప్పటి పోలీస్ మిత్ర వాకాడ మురళి -
ఎస్.కోటలో గంజాయి స్వాధీనం
విజయనగరం: విజయనగరం జిల్లా ఎస్.కోటలో శనివారం అక్రమంగా తరలిస్తున్న 15 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హరిద్వార్‌కు చెందిన రాంసింగ్, బాబాసాగలనాథ్ ఎస్.కోట బస్టాండ్ వద్ద ఉండగా వారిని పోలీసులు సోదాలు జరిపారు. ఈ సందర్భంగా వారి వద్ద ఉన్న 15 కిలోల గంజాయిని సీజ్ చేశారు. వారిద్దరిని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి... విచారణ చేపట్టారు. -
190 కేజీల గంజాయి పట్టివేత
విజయనగరం : విజయనగరం జిల్లా ఎస్‌కోట మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు..జార్ఖండ్ రాష్ట్రం తన్బాత్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి గురువారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక బొలెరో వాహనాన్ని, 190 కేజీల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి శుక్రవారం నిందితులను కోర్టులో హజరపర్చారు. (ఎస్‌కోట)