విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయనగరం : విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు..జార్ఖండ్ రాష్ట్రం తన్‌బాత్ జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు నిర్వహించి గురువారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక బొలెరో వాహనాన్ని, 190 కేజీల గంజాయినీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి శుక్రవారం నిందితులను కోర్టులో హజరపర్చారు.
(ఎస్‌కోట)