ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినపుడు ఒకటికి బదులు ఒకటి రావడం, లేదంటే ఆహారంలో పురుగులు, సిగరెట్ పీకలు రావడం లాంటి ఘటనలు గతంలో చాలా చూశాం. తాజాగా అమెరికాలోని ఒక మహిళకు మరో వింత అనుభవం ఎదురైంది. తను ఆర్డర్ చేసిన ప్యాకేజీ ఓపెన్ చేసి, చూసి షాకయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. స్టోరీ ఏంటంటే..!
న్యూజెర్సీలో డ్రైవర్‌గా పని చేసే ఒక మహిళ ఉబెర్ ఈట్స్‌నుంచి బురిటో(షావర్మా) లాంటిది ఆర్డర్ చేసింది. ఉబెర్ ఈట్స్ డెలివరీ అందుకొని ఓపెన్ చేసి, తిందామని ఏంతో ఆతృతగా ఫాయిల్ రేపర్ విప్పి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అందులో బురిటోకు బదులుగా గంజాయి ప్యాక్ చేసి ఉంది. ఘటన వాషింగ్టన్ టౌన్‌షిప్, క్యామ్‌డెన్ కౌంటీలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ విషయంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తన డెలివరీ ప్యాకేజీలో బురిటోకు బుదులుగా ఏదో తేడా వాసన వచ్చినట్టుగా అనిపించిందని బాధితురాలు తెలిపిందని వాషింగ్టన్ టౌన్‌షిప్ పోలీస్ చీఫ్ పాట్రిక్ గుర్సిక్ ఒక ప్రకటనలో తెలిపారు. అది ఒక ఔన్స్ గంజాయి అని తేలిందని ఆయన వెల్లడించారు. డ్రగ్స్, ఆల్కహాల్ లేదా మందులను రవాణాపై నిషేధం ఉన్న నేపథ్యంలో ఉబెర్ ఈట్స్‌లో ప్యాకేజీ డెలివరీ ఫీచర్‌ను ఎవరైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఉబెర్ ఈట్స్ స్పందన
దీనిపై ఉబెర్ ఈట్స్ కూడా స్పందించింది. ఈ ఘటన తీవ్రంగా కలపర్చేదేనని ఉబెర్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. స్థానిక అధికారులను వెంటనే అప్రమత్తం చేసినందుకు ఆమెను అభినందించారు. ఇలాంటి అనుమానాస్పద డెలివరీలపై వెంటనే రిపోర్ట్ చేయాలని ఇతర డ్రైవర్లను కూడా కోరారు.
ఇదీ చదవండి : వయసు 28, తులసి పంట రారాజు ఫిలిప్పో సక్సెస్ స్టోరీ, ఆదాయం ఎంతో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment