భార్య కళ్లముందే భర్త మృతి | Husband killed in road accidents | Sakshi
Sakshi News home page

భార్య కళ్లముందే భర్త మృతి

Published Wed, Jan 7 2015 2:29 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

భార్య కళ్లముందే భర్త మృతి - Sakshi

భార్య కళ్లముందే భర్త మృతి

 శృంగవరపుకోట: ఆలూమగలిద్దరూ మార్నింగ్‌వాక్‌కు వెళ్లారు. అడుగులో అడుగేస్తూ నడుస్తున్న వారి వెనకే ఆర్టీసీ బస్ మృత్యురూపంలో వచ్చి ఢీకొట్టడంతో భర్త రోడ్డు మీదే ప్రాణాలు కోల్పోయారు. వివరాలిలా ఉన్నాయి. శృంగవరపుకోటలో గాంధీనగర్ రెండవవీధికి చెందిన దాసరి కృష్ణమూర్తి(63) భార్య కామేశ్వరిలు మంగళవారం వేకువజామున మార్నింగ్‌వాక్‌కు బయల్దేరారు. వారిద్దరరూ ఎస్.కోట నుంచి కొత్తూరు వైపు వాకింగ్ చేస్తున్నారు. భార్య కామేశ్వరి కాస్త ముందుగా న డిచి కొత్తూరు గ్రామంలో వినాయక ఆలయం వద్ద కూర్చుంది. కృష్ణమూర్తి కొత్తూరు గ్రామం శివాలయం వద్ద రోడ్డు మలుపు తిరుతుండగా ఎస్.కోటలో బయల్దేరిన అరకు -విశాఖ డీలక్స్  ఆర్టీసీ బస్ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఢీకొట్టిన బస్ కృష్ణమూర్తిని సుమారు 30మీటర్లకు పైగా ఈడ్చుకు పోవడంతో   రోడ్డుపై పడ్డ  ఆయన సంఘటనా స్థలంలోనే ప్రాణాలు వదిలారు.  
 
 అదే దారిలో వాకింగ్‌కు వచ్చిన వారు గమనించి బస్ ఢీకొని వృద్ధుడు చనిపోయారని చెప్పుకోవడంతో వినాయక ఆలయం వద్ద కూర్చున్న భార్య కామేశ్వరికి అనుమానం వచ్చి చూడగా చనిపోయింది భర్త కావడంతో  ఒక్కసారిగా ఆమె కుప్పకూలిపోయింది. భర్తతో పాటు తాను కూడా పోకుండా ఎందుకు ఉండిపోయానంటూ  ఆమె నెత్తీ నోరు బాదుకుంటుంటే  చూపరులు చలించిపోయారు. ప్రమాదానికి కారణమైన బస్ డ్రైవర్ కేఆర్‌డీ. ప్రసాద్ బస్‌ను సంఘటనా స్థలంలో వదిలి ఎస్.కోట స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఎస్.కోట ఎస్సై ఎస్.కె.ఘనీ  కేసు నమోదు చేసి, వివరాలు సేకరించి,  మృతదే హాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి పంపి, ఆర్టీసీబస్‌ను తీయించి ట్రాఫిక్ క్లియర్ చేయించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement