ఎస్. కోట.. ఓ ప్రత్యేకం
Published Wed, Mar 19 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:52 AM
శృంగవరపుకోట, న్యూస్‌లైన్:ఎస్.కోట మండలానికి ఓ ప్రత్యేకత ఉం ది. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూ రి ప్రకాశం పంతులు ఇక్కడి నుంచే శాసనసభకు ఎన్నికయ్యారు. 1956లో నాన్‌బ్లాక్‌గా ఏ ర్పడిన ఈ మండలం తరువాత సమితిగా కొన సాగింది. 1986లో మండల పరిషత్‌గా ఏర్పడింది. ఎస్.కోట సమితిలో అరుకు, అనంతగి రి, పాడేరు, వియ్యంపేట గ్రామాలు ఉండేవి. తర్వాత క్రమంలో ఎస్. కోట నుంచి అరుకు, అనంతగిరి, పాడేరు, వియ్యంపేటలను ప్రత్యే క సమితులుగా వేరు చేశారు. 1986లో వి య్యంపేట, ఎస్. కోట, ఎల్.కోట సమితుల్లో గ్రామాలను కలిసి ఎస్.కోట మండలంగా ఏ ర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మండలంలో 75,917 మంది జనాభా, 52, 888 ఓటర్లు ఉ న్నారు. 26 పంచాయతీలున్న ఈ మండలంలో 42 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఎస్. కోట (జనాభా 28,267) ధర్మవరం (4738) మేజర్ పంచాయతీలు.
సమితి సారథులు వీరే
ఎస్. కోట నాన్‌బ్లాక్ ఏరియాగా ఉన్నప్పుడు అల్లు దశావతారంను సమితి అధ్యక్షుడిగా ప్ర భుత్వం నామినేట్ చేసింది. అనంతరం 1956 లో జామి మండలం విజినిగిరి గ్రామానికి చెం దిన గొర్రిపోటు బుచ్చి అప్పారావు ఎస్.కోట సమితి తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1961, 1965 ఎన్నికల్లో కూడా ఆయనే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 1967లో జామి ని యోజకవర్గ ఎమ్మెల్యేగా ఈయన ఎన్నిక కావడంతో అప్పటి జామి సర్పంచ్ రొబ్బి మల్లికార్జున స్వామి రెండున్నరేళ్ల పాటు సమితి అధ్యక్షుడిగా పని చేశారు. అనంతరం 1970-76లో జామి మండలం అలమండ గ్రామానికి చెంది న లగుడు సింహాద్రి పని చేశారు. 1976- 1980 మధ్య కాలంలో ప్రభుత్వం సమితి ఎన్నికలు నిర్వహించలేదు. 1981 నాటి ఎన్నికల్లో సమితి అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన లగుడు సింహాద్రి 1986లో మండల పరిషత్ ఏర్పడిన వరకు పనిచేశారు.
మండల సారథులు వీరే
1987లో మండల పరిషత్ ఏర్పాటైన తరువా త రాజీపేట గ్రామానికి చెందిన ఐవిఎన్ రాజు ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1992లో రెండోసా రి కూడా ఆయనే ఎన్నికైనప్పటికీ..ఆయన అకాల మరణంతో ఎస్.కోటకు చెందిన షేక్ దర్గాజీ కొన్ని నెలల పాటు ఎంపీపీ పగ్గాలు చేపట్టారు. తరువాత ధర్మ వరానికి చెందిన లగుడు సత్యనారాయణమూర్తి, ఆ తరువాత ఎన్నికల్లో ధర్మవరం గ్రామానికి చెందిన లగు డు వెంకటరమణమ్మ, కొత్తపాలెం గ్రామానికి చెందిన ఒంటి అప్పారావు ఎంపీపీలుగా పనిచేశారు. ధర్మవరం గ్రామానికి చెందిన అల్లు సూర్యనారాయణమ్మ తొలి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. తర్వాత ఐ.రఘురాజు, ఎ.కె.వి. జోగి నాయుడు జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యూరు.
ప్రస్తుత రిజర్వేషన్లు
22 ఎంపీటీసీ స్థానాల్లో 11 మహిళలకు కేటాయించారు. ముషిడిపల్లి, శివరామరాజుపేట స్థానాలు ఎస్సీ మహిళ, కొట్టాం, సీతారాం పు రం, పెదఖండేపల్లి, మూలబొడ్డవర, ధర్మవ రం స్థానాలు అన్ రిజర్వుడు మహిళలకు, ఎస్. కోట-2, ఎస్.కోట-3,ఎస్.కోట-8, కిల్తం పాలెం స్థానాలు బిసి మహిళకు, ఎస్.కోట తలా రి, ఎస్.కోట-7, ఎస్.కోట-4, వెంకటరమణపేట స్థానాలు బిసీ జనరల్‌కు, వీరనారాయ ణం, ఆలుగుబిల్లి, ఎస్.కోట-5, ఎస్.కోట -6, తిమిడి స్థానాలు అన్ రిజర్వుడ్‌కు, ఎస్.కోట-1 ఎస్టీ జనరల్‌కు, సంతగవిరమ్మపేట ఎ స్సీ జనరల్‌కు కేటాయించారు.
ఈసారి జెడ్పీటీసీ స్థానాన్ని ఎస్టీ మహిళకు కేటాయించారు.
Advertisement
Advertisement