మంత్రి హామీ ఏమైంది...? | poor house sites Statements PCC President botsa satyanarayana | Sakshi
Sakshi News home page

మంత్రి హామీ ఏమైంది...?

Published Tue, Jan 14 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

poor house sites Statements PCC President  botsa satyanarayana

శృంగవరపుకోట, న్యూస్‌లైన్ :  పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర రవాణా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ పేదల ఇళ్ల స్థలాల కోసం చేసిన ప్రకటనలు ఇవి. మంత్రి మాటలు సభలు, సమావేశాలకే పరిమితమని మరోసారి రుజువైంది. దశాబ్దాలుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురుచూస్తున్న పేదల గూ  డు గోడు ఎవరికీ పట్టడం లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ పలు పార్టీలకు చెందిన నాయకులు ఇళ్ల స్థలాలను ఎన్నికల అజెండాలో ప్రచార అంశంగా చూపిస్తున్నారు. మంత్రి బొత్స పేదలకు ఇళ్ల స్థలాలు కేటారుుంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసి, నెలలు కావస్తున్నా... పనులు ముందుకు సాగకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి మరోమారు తన రాజకీయ చదరం గంలో ఇళ్ల స్థలాల ఇష్యూనే వాడుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవల ఎస్. కోట నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలవాలనుకున్న మంత్రి హడావిడిగా గత ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో నెల రోజుల వ్యవధిలో వేపాడలో నాలుగు సార్లు, ఎస్. కోట-2, జామి-3, లక్కవరపుకోట-3, కొత్తవలస-4 ధపాలు సుడిగాలి పర్యటన చేశారు. అప్పటి నుంచి ఎస్. కోట వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. తాజాగా మంత్రి తన మనసు మార్చుకున్నారని, అసెంబ్లీకి పోటీ చేస్తే చీపురుపల్లి తనకు పది లం అని భావిస్తున్నారని కొందరు, ఈసారి బొత్స రాజ్యసభకు వెళ్తారని మరికొందరు అంటున్నారు. అందకనే ఎస్. కోటపై ఆయన కినుక వహిస్తున్నారని మరికొందరు చెబుతున్నారు.
 
 ఎదురుచూపులే...
 ఎస్.కోట పట్టణంలోని పుణ్యగిరి రోడ్డులో సర్వే నెం.147/23 నుంచి 72 వరకూ 46.82 ఎకరాల స్థలాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం సేకరించారు. ఇందులో 18.57 ఎకరాలు  పీఓటీ ల్యాండ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ మొత్తం భూములను ఇప్పటికే రెవెన్యూ శాఖ స్వాధీనం చేసుకుంది. పీఓటీ దా రులు కొందరు కోర్టుకి వెళ్లినా రెవెన్యూ శాఖకు అనుగుణంగానే తీర్పు వచ్చిందంటున్నారు. అసైన్డ్‌దారుల కు 1307 జీఓ ప్రకారం ఎకరానికి రూ. 2,02,800 చొప్పున చెల్లింపులు చేశారు. పరిహారం తీసుకోని వారి మొత్తాన్ని కోర్టుకు జమచేశారు. సేకరించిన భూముల్లో చెట్లను గుర్తించినా, ఇంత వరకూ వాటి తొలగింపు, వేలం మాత్రం జరగలేదు. గృహనిర్మాణశాఖ భూమి చదును పనులు ప్రారంభించలేదు. అర్హుల జాబితాల్లో అభ్యంతరాలపై వార్డు సభలు జరపలేదు. కొత్త దరఖాస్తుల విచారణ కొలి క్కి రాలేదు. దీంతో సుమారు దశాబ్ద కాలంగా ఇంటి స్థలం కోసం ఎదురుచూస్తున్న పేదల కల నెరవేరడం లేదు.
 
 అలమండలో రాజకీయ క్రీడ
 జామి మండలంలోని అలమండలో సుమారు 20 ఏళ్ల కిందట రెవెన్యూ శాఖ 7.15 ఎకరాల స్థలాన్ని సేకరించింది. ఈ స్థలంలో 325 మందికి పట్టాలు మంజూరు చేశారు. తరువాత మండలంలో రాజకీయ విభేదాలతో నేతలు చేసిన వీరంగం వల్ల స్థలాల కేటాయింపు ఆగిపోయింది. ఆ క్రమ ంలో రెవెన్యూ అధికారులు పట్టాలు రద్దు చేశారు. ప్రస్తుతం ఆ స్థలం రెవెన్యూ ఆధీనంలో ఉంది. గత 20 ఏళ్లుగా ఇంటి స్థలం ఇవ్వండి మొర్రో అంటూ అలమండ వాసులు విన్నవిస్తున్నా.. పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు.
 
 కొత్తవలసలో పాత కథే
  కొత్తవలస మండల కేంద్రంలో పేదల ఇళ్ల స్థలాల కోసం సర్వే నెం.173లో  20 ఎకరాలు, సర్వే నెం 168లో 5 ఎకరాలు స్థలాన్ని రెవెన్యూశాఖ సేకరించింది. ఇళ్ల స్థలాల కోసం వెరుు్య మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోగా అందులో 565 మందిని అర్హులుగా గుర్తించారు. రెవె న్యూ శాఖ సదరు భూములను గృహ నిర్మాణ శాఖకు అప్పగించింది. భూమి చదును చేసేందుకు రూ.68 లక్షలు అవసరం అంటూ గృహనిర్మాణశాఖ చేసిన ప్రతిపాదనలకు నిధులు మంజూరు కాలేదు. ఏళ్లతరబడి ఎదురుచూస్తున్న పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు కాలేదు.
 
 ‘అర్హులైన వారి నుంచి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు తీసుకోండి. ఎంపిక చేసిన జాబితాలో అనర్హుల పేర్లు ఉంటే తీసేయండి. సేకరించిన స్థలం చాలకుంటే ప్రభుత్వ స్థలం ఎక్కడ ఉందో చూడండి. తక్షణమే లెవిలింగ్ పనులు ప్రారంభించండి. సేకరించిన స్థలంలో రైతులు చెట్లు కావాలంటే ఇచ్చేయండి. పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలి. రచ్చబండ నాటికి పట్టాలు సిద్ధం కావాలి’
 - గత ఏడాది నవంబర్ 13వ తేదీన ఎస్. కోటలో
 మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటన
 
 ప్రస్తుతం సేకరించిన 40.58 ఎకరాల స్థలంతో పాటు అదనంగా సేకరించనున్న 31 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పట్టాలిస్తాం. భూమి చదును చేసేందుకు ఇప్పటికే కోటి రూపాయలు కేటాయించాం. సంక్రాంతిలోగా పట్టాలు పంపిణీ చేసేలా సన్నాహాలు చేస్తున్నాం. ప్ర స్తుతం ఉన్న అర్హుల జాబితాలో అనర్హులు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి వార్డులో సమావేశాలు నిర్వహించి అనర్హులను తొలగించండి.    
 - గత ఏడాది నవంబర్ 28వ తేదీన ఎస్. కోటలో జరిగిన రచ్చబండలో మంత్రి బొత్స ప్రకటన
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement