‘కాశీపట్నం’ చూడర బాబూ! | kasipatnam choodara babu! | Sakshi
Sakshi News home page

‘కాశీపట్నం’ చూడర బాబూ!

Published Wed, Nov 12 2014 4:35 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 PM

‘కాశీపట్నం’ చూడర బాబూ!

‘కాశీపట్నం’ చూడర బాబూ!

శృంగవరపుకోట: పవిత్రంగా ప్రవహించే గోస్తనీ నది, మదిని అలరించే అందమైన ఇసుక తిన్నెలు, నీడనిచ్చే వృక్షాలు, ఆ వృక్షాల నడుమ ఓ తొ ర్రలో కొలువైన శివుడు. ఆ స్వామి ఎదుట స్వయంభువుగా వెలసిననంది. అన్నీ కలిపి కాశీపట్నం. కార్తీక మాసాన భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ, వారి పాలిట కొంగుబంగారంగా పరిఢవిల్లుతోందీ క్షేత్రం. ఎస్.కోటకు 13కిలోమీటర్ల దూరంలో విశాఖ-అరకు రోడ్డులో విశా ఖ జిల్లా అనంతగిరి మండల పరిధిలో ఉన్న కాశీపట్నానికి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వెళతారు. ఈ క్షేత్రం విశాఖ జిల్లాలోనే ఉ న్నా విజయనగరం నుంచే అధిక సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. ని త్యం భక్తుల దర్శనాలతో, పర్యాటకులతో సందడిగా ఉండే కా శీపట్నం క్షేత్రం అటు దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకున్నా భక్తులు సమర్పిస్తున్న దక్షిణలు, కానుకలతో నిర్వహణ సాగుతోంది.
 
ఇదీ ఉమారామలింగేశ్వరుని చరితం...
కాశీపట్నంలో కొలువుదీరిన నీలకంఠుడు ఉమారామలింగేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడు. ఇక్కడ ఉన్న కథనం ప్రకారం... విజయనగరం సంస్థానాధీశులు వేటకు వెళ్లినపుడు చక్రవ ర్తి కాలికి రాయి తగిలింది. చక్రవ ర్తి శివలింగాకారంలో ఉన్న రాయిని చూసి ఇది దైవ సంకల్పం అని విశ్వసించారు. శివలింగం పక్కనే రావి,మర్రి మొక్కలు నాటి పూజ చేశారు. తర్వాత కొన్నేళ్లకు వేటకు వెళ్లే సమయానికి శివలింగం పెరిగి పెద్దదయినట్టు గుర్తించారు. ప్రస్తుతం శివలింగం మూడు అడుగుల ఎత్తులో ఉంది. అప్పటి నుంచి ఈ ఈశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు.
 
పవిత్రం గోస్తనీ స్నానం...
కాశీపట్నంలో కొలువుదీరిన ఉమారామలింగేశ్వరుని దర్శించేందుకు వచ్చిన భక్తులు ఆలయం పక్కనున్న గోస్తనీలో తనివీ తీరా పవిత్ర స్నానాలు చేసి పుల కించి, స్వామిని దర్శించి త రిస్తారు. గోస్తనీ పరవళ్లు, పక్కనే ఉన్న పర్యతాలు, చెట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
 
స్వయంభువుడైన నందీశ్వరుడు :
విజయనగరం సంస్థానాధీశులు ఉమారామలింగేశ్వరుని కనుగొన్నప్పుడు అక్కడ నందీశ్వరుడు లేడు. కాలక్రమంలో రాజులు ఉమారామలింగేశ్వరుని కనుగొన్న తర్వాత అక్కడ నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని స్థానికులు చెబుతారు. నందీశ్వరున్ని  కాలితో తన్నిన వ్యక్తి నోటిమాట పోయిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు నందీశ్వరున్ని సైతం అంతే భక్తితో కొలిచి పూజలు చేస్తారు.
 
చెట్టు తొర్రే కైలాసంగా:
కాశీపట్నం క్షేత్రంలో నేటికీ ఉమారామలింగేశ్వరుడు మర్రి, రావి చెట్లు కలిసి ఏర్పడిన చెట్టు తొర్రలోనే ఉన్నాడు. చెట్లు పెద్దవిగా పెరిగిపోవటంతో చెట్ట కాండాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో క్ర మంగా ఇటుకలు పేర్చి పూరించారు. నేటీకి ఈ ఆలయం చెట్టుగానే కొనసాగుతోంది. బయటి నుంచి చూస్తే ఆలయం ఎక్కడా కని పించదు. మిగిలిన ఆలయాల మాదిరిగా ఆలయ గోపురం, ప్రాం గణం, గర్భాలయం, గాలిగోపురం ఏమీ ఉండవు. విస్తారంగా వ్యాపించిన రావి, మర్రి చెట్లు కొమ్మల మాటున ఉన్న ఆలయ ప్రాంగణంలో ఉమారామలింగేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. కాశీపట్నంలో ఉమారామలింగేశ్వరుని సన్నిధి, ఆలయానికి ఎదురుగా శ్మశానవాటిక, పక్కనే పవిత్ర గోస్తనీ నదీ ప్రవాహం ఉన్నాయి.  
 
కాశీపట్నం చేరాలంటే :
* విశాఖ నుంచి ఎస్.కోట మీదుగా అరుకు వెళ్లే బస్‌లు కాశీపట్నం మీదుగా వెళ్తాయి.  ఎస్.కోట నుంచి కాశీపట్నం వెళ్లేందుకు ప్రతి గంటకు బస్ ఉంది.
* ఎస్.కోట నుంచి కాశీపట్నం 13 కిలోమీటర్ల ఉంటుంది. బస్ చార్జి పల్లెవెలుగు రూ 10లు, ఎక్స్‌ప్రెస్‌కు *15లు ఉంటుంది.
* ఎస్.కోట నుంచి కాశీపట్నం వేళ్లేందుకు ఆటోలు, ప్రైవేటు వాహనాలు విరివిగా ఉంటాయి.
* విజయనగరం నుంచి ఎస్.కోటకు తాటిపూడి రూట్లో వస్తే బొడ్డవర జంక్షన్‌లో దిగి కాశీపట్నం వెళ్లొచ్చు. బొడ్డవర నుంచి కాశీపట్నం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement