మృతదేహం తర లింపులో ఉద్రిక్తం.
Published Fri, Dec 13 2013 3:09 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
శృంగవరపుకోట రూరల్/శృంగవరపుకోట, న్యూస్‌లైన్: ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ అధికారి మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎల్.కోట పీహెచ్‌సీ అధికారి ఏఎస్‌ఎన్‌మూర్తి (58) అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఆయన మృతదేహానికి ఎస్.కోట ప్రభుత్వాస్పత్రిలో గురువారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం రాజు చెరువు వద్ద గల శ్మశానవాటికకు అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుటన (విశాఖ-అరుకు రోడ్డులో) మృతుడు ఏఎస్‌ఎన్ మూర్తి బంధువులకు, మృతునికి భారీ మొత్తంలో అప్పు ఇచ్చిన సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజమానికి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజమాని కోట్ని శ్రీరాములు నాయుడికి కుడి కంటిపై తీవ్ర గాయం కావడంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖకు తరలించారు.
అంబులెన్స్‌ను తరలించుకుపోయారు: మృతుని కుటుంబ సభ్యులు
‘పోస్ట్‌మార్టం అనంతరం ఏఎస్‌ఎన్ మూర్తి మృతదేహాన్ని దహనం చేసేందుకు అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు తరలిస్తున్నాం. ఇంతలో అప్పు తీర్చకుండా మృతదేహాన్ని ఎలా తీసుకెళ్తారని సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజ మా ని కుమారుడు కోట్ని సురేష్ అంబులెన్స్‌ను అటకాయిం చి అతని షాపు వద్దకు తీసుకుపోయారు. ఈ హఠాత్పరిణామానికి వెంటనే తేరుకుని షాపు వద్దకు వెళ్లగా శ్రీరాములునాయుడు ఇష్టానుసారంగా తిట్ల పురాణం అందుకున్నాడు. మృతిచెందిన ఏఎస్‌ఎన్ మూర్తి భారీగా చేసిన అప్పు మాటేమిటని ప్రశ్నించి షాపులోని ఏవో ఆయుధాలు తీసుకుని తమపై’కి వచ్చారని మృతు ని బంధువులు చెప్పారు. ఆ క్రమంలోనే శ్రీరాములు నాయుడికి దెబ్బతగిలి ఉంటుందన్నారు. తాము అతనిపై దాడి చేయలేదని మృతుని బంధువులు స్పష్టం చేశారు.
మృతికి నేనే కారణమంటూ దాడి: క్షతగాత్రుడు శ్రీరాములునాయుడు
ఏఎస్‌ఎన్ మూర్తి మృతికి తానే కారణమంటూ అకారణంగా నా షాపు వద్దకు అంబులెన్స్‌లో శవాన్ని తీసుకుని వచ్చి నాపైన, నా కుమారుడిపైనా మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు దాడి చేశారని క్షతగాత్రుడు కోట్ని శ్రీరాములు నాయుడు, అతని కుమారుడు సురేష్ లు భోరున విలపించారు. తన దగ్గర అప్పుగా భారీ మొత్తంలో మూర్తి నగదు తీసుకున్నారనీ, చెల్లించకుండా నే చనిపోయిన విషయం తెలిసి మిన్నకుండిపోయానని శ్రీరాములునాయుడు చెప్పారు. తన తండ్రిపై మృతుడు మూర్తి బంధువులు దాడి చేశారని, వారిని తాను గుర్తుపడతానని దాడి అనంతరం షాపు వద్దకు వచ్చిన ఎస్‌ఐ సంతోష్‌కుమార్, ట్రైనీ ఎస్‌ఐ బాలాజీరావుల వద్ద సురే ష్ విలపించాడు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్షతగాత్రుని భార్య, కుమారుడు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్‌ఐని ప్రశ్నించగా సుచిత్రా ఎలక్ట్రానిక్స్ వద్ద ఇరు పక్షాల మధ్య గలాటా జరుగుతోంద ని సమాచారం అందగా సిబ్బందితో కలిసి వచ్చామని అంతలోనే ఇరు వర్గాల వారు వెళ్లిపోయారని, ఎటువంటి ఫిర్యాదులూ అందజేయలేదని ఎస్‌ఐ వెల్లడించారు.
Advertisement
Advertisement