retired officer
-
‘గంటా’ అంటే గయ్ గయ్!
సాక్షి, అమరావతి: యాధృచ్ఛికమో.. తనకు కలిసొస్తుందని భావించారో తెలియదుగానీ మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పరంపర రెండు పేర్లతో ప్రత్యేకంగా ముడిపడి ఉండటం గమనార్హం. వీటిలో ఒక పేరు ‘గంటా’ అయితే మరోపేరు ‘లక్ష్మీనారాయణ’!! విచారణ సమయంలో ఈ పేర్లు వింటేనే మాజీ సీఎం చంద్రబాబు గయ్ గయ్‌మంటున్నారు! ఏదో చెప్పలేని గుబులు ఆయనలో మొదలవుతోంది! అటు అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీలో.. ఇటు స్కిల్ కుంభకోణంలోనూ ఈ రెండు పేర్లు ప్రధానంగా తెరపైకి వచ్చాయి. అసైన్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రులు, వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, పొంగూరు నారాయణ కీలకం కాగా స్కిల్ స్కామ్‌లో గంటా సుబ్బారావు, రిటైర్డ్ అధికారి లక్ష్మీ నారాయణ ద్వారా చంద్రబాబు ప్రజాధనాన్ని కొల్లగొట్టారు! చిర్రుబుర్రులు.. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీఐడీ కస్టడీలో రెండు రోజుల పాటు విచారణ సందర్భంగా గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు హడలిపోయారు! మాయల ఫకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లుగా స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతి గుట్టు అంతా వారిద్దరి గుప్పిట్లోనే ఉంది మరి!! అందుకే వారి పేర్లను ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ చంద్రబాబు అంతెత్తున లేచారు. మరికొందరు పేర్లను ప్రస్తావిస్తూ వారిని ఎందుకు విచారించరంటూ దర్యాప్తును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారు. అక్రమ నిధుల తరలింపులో పాత్రధారులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల గురించి అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు చిర్రుబుర్రులాడుతూ విషయాన్ని పక్కదారి పట్టించేందుకు యత్నించారు. ఇంతకీ గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణలతోపాటు పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా పేర్లను సిట్ అధికారులు ప్రస్తావించగానే చంద్రబాబు ఎందుకు అంతగా బెంబేలెత్తిపోయారన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే...?? అంతా ఒకే ఒక్కరే.. గంటా 2014లో అధికారంలోకి రాగానే ప్రజాధనాన్ని వేగంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు మార్గాలను అన్వేషించారు. అందుకోసం ఏర్పాటు చేసిందే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ)! తన అక్రమాలకు అక్షయపాత్రగా భావించిన ఏపీఎస్ఎస్డీసీ పూర్తిగా తన సొంత మనుషుల చేతిలో ఉండాలని ఆయన భావించారు. అందుకే ఆ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా తనకు సన్నిహితులైన ప్రైవేట్, రిటైర్డ్ వ్యక్తుల గుప్పిట్లో పెట్టారు. వారిలో ఒకరు గంటా సుబ్బారావు. ఆయన ప్రభుత్వ అధికారి కాదు. కానీ ఏకంగా ఏపీఎస్ఎస్డీసీతోపాటు ఆ సంస్థ వ్యవహారాలతో సంబంధం ఉన్న మరో మూడు పోస్టులూ కట్టబెట్టేశారు. గంటా సుబ్బారావును ఏపీఎస్ఎస్డీసీ మేనేజింగ్ డైరెక్టర్– చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ–సీఈవో)గా నియమించారు. అంతటితో ఆగలేదు. మొదట్లో ఏపీఎస్ఎస్డీసీని ఉన్నత విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీంతో సంస్థ బిల్లులను ఉన్నత విద్యా శాఖ ద్వారా పంపించాలి. ఈ క్రమంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వద్దకు ఫైళ్లు వెళ్లకుండా పాస్ చేసేందుకు మరో ఎత్తుగడ వేశారు. గంటా సుబ్బారావును ఉన్నత విద్యా శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. అనంతరం ప్రత్యేకంగా స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ అనే శాఖను ఏర్పాటు చేశారు. ఆ శాఖకు కూడా గంటా సుబ్బారావునే ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. ప్రాజెక్ట్ ఆమోదం, బిల్లుల చెల్లింపు ఫైళ్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే గంటా సుబ్బారావును నాడు చంద్రబాబు తన ఎక్స్ అఫీషియో కార్యదర్శిగా నియమించారు. దాంతో ఏపీఎస్ఎస్ఎస్డీసీలో ప్రాజెక్ట్ ఫైళ్లు తయారు చేసేది, ఉన్నత విద్యా శాఖ, స్కిల్ డెవలప్మెంట్–ఇన్నోవేషన్ శాఖల్లో పరిశీలించి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపేది, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆ ఫైళ్లను పరిశీలించి తుది ఆమోదం తెలిపేది అంతా ఒకే ఒక్కరే ఆయనే గంటా సుబ్బారావు కావడం గమనార్హం. ప్రైవేట్ వ్యక్తికి నాలుగు పోస్టులు కట్టబెడుతూ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి ఆమోదించారు. ఆ ముగ్గురి ప్రస్తావనే రానివ్వకుండా గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ ప్రధాన పాత్రధారులుగా చంద్రబాబు కొల్లగొట్టిన స్కిల్ ప్రాజెక్ట్ నిధులను అక్రమంగా తరలించడంలో బాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా కీలకంగా వ్యవహరించారు. సిట్ దర్యాప్తులో ఈ ముగ్గురి గురించి ప్రశ్నించే అవకాశాన్ని ఏమాత్రం ఇవ్వకుండా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. సిట్‌కు ఇచ్చిన రెండు రోజుల సమయాన్ని వీలైనంత వరకు వృథా చేసేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విచారణ షెడ్యూల్ అని ముందే కోర్టు నిర్ణయించింది. అందులో ప్రతి గంటకు ఐదు నిముషాలు విరామం, భోజన విరామం కూడా ఉంటుంది. మొదటి రోజు శనివారం మధ్యాహ్నం 12గంటల వరకు అసలు విచారణ మొదలు కాకుండా అడ్డుకున్నారు. కస్టడీ కాపీ కావాలని అడిగి దాన్ని చదువుతూ కాలహరణం చేశారు. వివిధ పత్రాలను పరిశీలించాలంటూ సమయాన్ని వృథా చేశారు. రెండో రోజు తన రాజకీయ అనుభవం గురించి పాతచింతకాయ పచ్చడిలా కథలు చెబుతూ సమయాన్ని గడిపారు. గంటా సుబ్బారావు, లక్ష్మీ నారాయణ గురించి గానీ, పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల గురించి ప్రస్తావించగానే చంద్రబాబు అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడం గమనార్హం. అంటే ఆ ఐదుగురితో ఈ కుంభకోణం ముడిపడి ఉన్నట్లు స్పష్టమవుతోంది. బాబు బాల్య స్నేహితుడే.. విద్యార్థి దశలో తన స్నేహితుడైన రిటైర్డ్ అధికారి కె.లక్ష్మీనారాయణను ఏపీఎస్ఎస్డీసీ డైరెక్టర్‌గా చంద్రబాబు నియమించారు. తాను ఇతరత్రా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా తన స్వప్రయోజనాలకు అనుగుణంగా ఏపీఎస్ఎస్డీసీలో వ్యవహారాలు సాగేలా చూసేందుకే లక్ష్మీనారాయణను తెచ్చారు. ఓ రకంగా చెప్పాలంటే ఆయన చంద్రబాబు ప్రతినిధిలా వ్యవహరించారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ప్రాజెక్ట్ రూపకల్పన, అందుకు అనుగుణంగా జీవో జారీ, నకిలీ ఒప్పందం ఆమోదం, షెల్ కంపెనీల ద్వారా నిధుల అక్రమ తరలింపు.. అంతా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. అంటే స్కిల్ స్కామ్ కీలక గుట్టు అంతా గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ వద్దే ఉంది. ఈ క్రమంలో వారిద్దరిని ఎందుకు నియమించారు? వారితో సాగించిన వ్యవహారాలేమిటి? అని సిట్ అధికారులు అడిగేసరికి చంద్రబాబు కంగుతిన్నారు. ఎవరిని విచారించాలో బాబే చెబుతారట..! ఎక్కడైనా దర్యాప్తు అధికారులు చట్ట ప్రకారమే విచారణ నిర్వహిస్తారు. దీనిపై ముద్దాయిలు న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించవచ్చు. చంద్రబాబు మాత్రం తాను చెప్పినట్లే దర్యాప్తు సాగాలనే రీతిలో వ్యవహరించారు. స్కిల్ స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులుగా ఉన్న అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు, సంబంధిత కంపెనీల ప్రతినిధులను సిట్ అధికారులు ఇప్పటికే పలు దఫాలుగా విచారించారు. కానీ చంద్రబాబు మాత్రం వివిధ హోదాల్లో పనిచేసిన ఉన్నతాధికారులను ఎందుకు విచారించరంటూ ఎదురు ప్రశ్నించడం గమనార్హం. వాస్తవానికి ప్రేమచంద్రారెడ్డి ఆ పోస్టులోకి వచ్చేసరికే 90శాతం నిధులను టీడీపీ ప్రభుత్వం చెల్లించేసింది. దీంతో ఆయన మూడో పార్టీ నివేదిక కావాలని కోరారు. దీనిపై నాడు గంటా సుబ్బారావు, డిజైన్ టెక్ కంపెనీ ప్రతినిధులు సీఐటీడీ పేరుతో కనికట్టు చేశారు. స్కిల్ ప్రాజెక్ట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కేవలం పత్రాల్లో ఉన్న వివరాలను పొందుపరుస్తూ ఇచ్చిన ఓ నివేదికను మూడో పార్టీ మదింపు నివేదికగా మభ్యపుచ్చారు. ఈ విషయాలన్నీ సిట్ దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడయ్యాయి. సీఐటీడీ ఆ విషయాన్ని సిట్‌కు లిఖితపూర్వకంగా వెల్లడించింది కూడా. సీమెన్స్ కంపెనీ ఈ మెయిల్ ద్వారా తెలియజేయడంతోపాటు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం కూడా ఇచ్చింది. దీన్నిబట్టి సిట్ ఎంత పకడ్బందీగా నిబంధనల మేరకు దర్యాప్తు చేస్తోందన్నది వెల్లడవుతోంది. -
ఆసిఫాబాద్ కాంగ్రెస్ టికెట్ రిటైర్డ్ రవాణా అధికారికే..!
సాక్షి, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను రిటైర్డ్ రవాణా శాఖ అధికారి అజ్మీరా శ్యామ్‌నాయక్‌కు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. నియోజకవర్గం నుంచి మర్సుకోల సర్వసతి, అజ్మీరా శ్యామ్‌నాయక్, బుర్స పోచయ్య పేర్లను జిల్లా అధ్యక్షుడు ప్రతిపాదించగా.. గెలుపు గుర్రాలను బరిలో దించాలనే యోచనలో ఉన్న కాంగ్రెస్ శ్యామ్‌నాయక్ వైపే మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిద్ధం చేసిన తుది జాబితాను స్క్రీనింగ్ కమిటీకి అందజేయనుంది. రెండోవారంలో అభ్యర్థుల తొలి జాబితాను వెలువడనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించే మొదటి జాబితాలో శ్యామ్‌నాయక్ పేరు ఉంటుందని తెలుస్తోంది. మొదలైన హడావుడి.. ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థులను ప్రకటించి అధికార పార్టీ ముందస్తుగానే సన్నద్ధం కావడంతో జిల్లాలో ఎన్నికల హడావుడి మొదలైంది. జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేయడంతో ప్రధాన విపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఆసిఫాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్ నుంచి శ్యామ్‌నాయక్‌ను ఎంపిక చేయాలనే నిర్ణయానికి అధిష్టానం వచ్చినట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి పది మంది ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేశారు. అందులో ఇటీవల పార్టీలో చేరిన శ్యామ్‌నాయక్ కూడా ఉన్నారు. అధికార పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మిని ఢీకొట్టాలంటే అందుకు శ్యామ్నాయకే సరైన అభ్యర్థి అని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందని సమాచారం. ఇంజనీరింగ్ పట్టభద్రుడు.. జిల్లా ప్రజలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి.. ఇక్కడే జిల్లా రవాణా శాఖాధికారిగా ఏడేళ్లపాటు పనిచేయడంతోపాటు సౌమ్యుడనే పేరున్న శ్యామ్‌నాయక్‌కు సర్వేలు కూడా అనుకూలంగా ఉండడంతో ఆయననే అభ్యర్థిగా ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిర్పూర్‌పై అనిశ్చితి..! సిర్పూర్ నియోజకవర్గ అభ్యర్థిని ఖరారు చేసే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సందిగ్ధంలో పడినట్లు సమాచారం. మొదటి విడత జాబితాలోనే ఈ నియోజకవర్గ అభ్యర్థి పేరును ఖరారు చేయాల్సి ఉండగా.. ఇంతలోనే అధిష్టానం పునరాలోచనలో పడడం సిర్పూర్ నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. సిర్పూర్ స్థానానికి నలుగురు ఆశావహులు దరఖాస్తులు చేయగా.. అక్కడ అభ్యర్థి ఎంపికకు మరింత సమయం పట్టే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఎవరిని పోటీకి దించాలా అనే అంశంపై పూర్థిస్తాయిలో పీసీసీలో ఏకాభిప్రాయం రాలేదని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సర్వేల ఆధారంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తేలడమే అందుకు కారణమని తెలుస్తోంది. పొత్తుల్లో భాగంగా బీఎస్పీ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌కు మద్దతు ఇస్తే ఎలా ఉంటుందనే యోచన చేస్తున్నట్లు సమాచారం. జోరు పెంచిన కాంగ్రెస్.. జిల్లాలో శాసనసభ ఎన్నికల వేడి ఇప్పటికే మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు? బరిలో నిలబడతారు అనే స్థితి నుంచి, వామ్మో ఇంతమంది టికెట్ కోసం పోటీ పడుతున్నారా? అనే పరిస్థితి జిల్లాలో కనిపిస్తుండడంతో.. అధికార పార్టీని ఢీకొట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ వివిధ రూపాల్లో ప్రజల్లోకి వెళ్తోంది. వలసలతో జిల్లాలో చాలా కాలంగా స్తబ్ధుగా ఉంటూ వచ్చిన కాంగ్రెస్.. కర్ణాటక ఎన్నికలతో నూతనోత్సాహంతో కార్యక్రమాలను పెంచింది. అధిష్టానం పిలుపుతో ఆందోళనలు, వివిధ వర్గాలకు ఎన్నికల హామీగా ప్రకటిస్తున్న డిక్లరేషన్లపై గడపగడపకూ ప్రచారం కార్యక్రమాన్ని విస్తృతం చేసింది. -
రాజ్యసభకు టీఎంసీ అభ్యర్థిగా జవహర్ సర్కార్
కోల్‌కతా: ఆగస్టు 9వ తేదీన పశ్చిమబెంగాల్ రాజ్యసభ సీటుకు జరగనున్న ఉప ఎన్నికకు రిటైర్డు ప్రభుత్వాధికారి జవహర్ సర్కార్(69)ను తమ అభ్యర్థిగా టీఎంసీ ఎంపిక చేసింది. అధికారిగా ప్రజలకు అమూల్యమైన సేవలందించిన సర్కార్ దేశానికి మరింతగా సేవ చేసేందుకు సహాయపడతారని ఆశిస్తూ ఎంపిక చేసినట్లు టీఎంసీ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాగా, టీఎంసీ నేత దినేశ్ త్రివేది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో సీటు ఖాళీ అయింది. టీఎంసీకి పోటీగా బీజేపీ కూడా అభ్యర్థిని బరిలోకి దించితే ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. లేకుంటే రాజ్యసభకు జవహర్ సర్కార్ పోటీ లేకుండానే ఎన్నికవుతారు. సర్కార్ ప్రభుత్వ ఉద్యోగిగా 42 ఏళ్లపాటు పనిచేశారు. -
శివసేన కార్యకర్తల తెగింపు..
-
రిటైర్డ్ ఉద్యోగిపై శివసేన కార్యకర్తల దాడి..
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ ఓ కార్టూన్ ఫార్వార్డ్ చేసినందుకు రిటైర్డ్ నావికాదళ అధికారిపై శివసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. వివరాలు.. మదన్ శర్మ అనే 65 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ముంబైలోని కండివలి ఈస్ట్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో తనకు వాట్సప్‌లో వచ్చిన ఠాక్రేకు సంబంధించిన ఓ కార్టూన్‌ను మదన్ తమ రెసిడెన్షియల్ సొసైటీ గ్రూప్‌లో పంపించాడు. ఆ తర్వాత అతనికి కమలేష్ కదమ్ అనే వ్యక్తి కాల్ చేసి తన పేరు, ఇంటి చిరునామా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం మదన్‌ను ఇంటి బయటకు పిలిచి కొందరు వ్యక్తుల బృందం ఆయనపై దాడి చేసింది. (కంగనా డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు) దాడి చేస్తున్న వీడియోలు సమీప సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో ఇంటి నుంచి బయటకు వస్తున్న మదన్ దాదాపు ఎనిమిది మందితో కూడిన శివసేన కార్యకర్తల బృందం వెంబడించింది. భయంతో లోపలికి పరుగెత్తుతున్న మదన్‌ను చొక్కా పట్టుకొని లాగి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మదన్ ముఖం మీద గాయాలవ్వగా, కన్ను రక్తంతో తడిసిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బీజేపీ వర్గాలు శివసేన ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసి రెచ్చిపోయిన శివసేన ఇప్పుడు రిటైర్డ్ అధికారిపై దాడికి తెగబడిందని బీజేపీ ఆరోపిస్తోంది. (ఠాక్రే-పవార్ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!) ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా పలువురు బీజేపీ నాయకులు గాయపడిన మదన్ శర్మ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘చాలా విచారకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన. రిటైర్డ్ నావీ ఆఫీసర్ కేవలం వాట్సప్ ఫార్వార్డ్ చేసిన కారణంగా గూండాల దాడిలో గాయపడ్డారు. దయచేసి ఇలాంటివి ఆపండి ఉద్దవ్ ఠాక్రే జీ. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు కమలేష్ కదమ్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. (సోనియా గాంధీని టార్గెట్ చేసిన కంగనా..) -
భార్య హత్య కేసులో రిటైర్డ్ కల్నల్‌కు యావజ్జీవం
సాక్షి, న్యూఢిల్లీ : భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో లెఫ్టినెంట్ కల్నల్ (రిటైర్డ్) సోమనాథ్ ఫరీదాకు భువనేశ్వర్ స్ధానిక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. 24 మంది సాక్షులను విచారించి, సైంటిఫిక్ బృందం అందించిన ఆధారాలను పరిశీలించిన మీదట న్యాయస్ధానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2013లో ఓ కుటుంబ వివాదం ఘర్షణకు దారితీయడంతో రిటైర్డ్ సైనికాధికారి ఫరీదా (78) తన భార్య ఉషశ్రీ సమాల్ (61)ను స్టీల్ టార్చ్‌తో దాడి చేసి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని 300 ముక్కలుగా కోసి దానికి కెమికల్‌ను మిక్స్ చేసి స్టీల్, గ్లాస్ టిఫిన్ బాక్సుల్లో భద్రపరిచాడు. కాగా తన తల్లితో తాను మాట్లాడలేకపోతున్నానని ఈ దంపతుల కుమార్తె భువనేశ్వర్‌లో ఉండే తన మామగారికి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. ఆమె మామను సైతం అధికారి తన ఇంట్లోకి అనుమతించకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సైనికాధికారి ఇంట్లోనే పలు చోట్ల ఆమె శరీర భాగాలను గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చార్జిషీట్ నమోదు చేశారు. అప్పటి నుంచి నిందితుడు జర్పద జైలులో ఉన్నాడు. తనకు శిక్ష తగ్గించాలని ఫరీదా చేసిన అభ్యర్ధనను కోర్టు తోసిపుచ్చింది. -
విజయనగరం: జిల్లాలో భారీ చోరీ
సాక్షి, విజయనగరం: జిల్లాలో చోరీ సంఘటన ఆలస్యంగా వెలుగ చూసింది. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి శివారు గాంధీ నగరం వద్ద నివాసం ఉంటున్న రిటైర్డ్ కస్టమ్స్అధికారి మూనూరు సీతారాం ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు ఇరవై మూడు తులాల బంగారం ఆభరణాలు, 25 తులాల వెండి వస్తువులు, లక్షా యాభైవేలు రూపాయలు నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కొత్తవలస పోలీసులు కేసు నమోదు చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే పనిలో ఉంది. -
సబ్ ట్రెజరీ కార్యాలయంలో కుప్పకూలిన విశ్రాంత ఉద్యోగి
జగ్గయ్యపేట :మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ బకాయిలు వచ్చాయేమో తెలుసుకునేందుకు సబ్ ట్రెజరీ కార్యాలయానికి వెళ్లిన ఓ విశ్రాంత ఉద్యోగి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ ఘటన కృష్ణాజిల్లా జగ్గయ్యపేట పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జగ్గయ్యపేటలోని కాగితాల బజారుకు చెందిన వేముల సీతారామరావు (విశ్రాంత గ్రామాభివృద్ధి అధికారి) సోమవారం ఉదయం సబ్‌ట్రెజరీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడున్న సిబ్బందిని తన పింఛను బకాయిల గురించి విచారిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సిబ్బంది వెంటనే 108కు సమాచారం అందించి ఆయన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే సీతారామరావు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా తన భర్త మరణానికి ప్రభుత్వ సిబ్బంది తీరే కారణమని సీతారామరావు భార్య అన్నపూర్ణ ఆరోపించారు. అనారోగ్యంతో చికిత్స చేయించుకోగా, దానికి సంబంధించి మెడికల్ బిల్లుల రీయింబర్స్మెంట్ కోసం నెలరోజులుగా తన భర్త ఎండీవో, ట్రెజరీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, వెంటనే మంజూరు చేయకుండా తిప్పించుకోవడంతో ఆయన మానసిక వేదనకు లోనవడం వల్లే హఠాన్మరణం చెందినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
మృతదేహం తర లింపులో ఉద్రిక్తం.
శృంగవరపుకోట రూరల్/శృంగవరపుకోట, న్యూస్‌లైన్: ఆత్మహత్యకు పాల్పడిన రిటైర్డ్ అధికారి మృతదేహం తరలింపులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఎల్.కోట పీహెచ్సీ అధికారి ఏఎస్ఎన్మూర్తి (58) అప్పుల బాధ తాళలేక పురుగు మందు తాగి బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన సంగతి విదితమే. ఆయన మృతదేహానికి ఎస్.కోట ప్రభుత్వాస్పత్రిలో గురువారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం రాజు చెరువు వద్ద గల శ్మశానవాటికకు అంబులెన్స్‌లో కుటుంబ సభ్యులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుటన (విశాఖ-అరుకు రోడ్డులో) మృతుడు ఏఎస్ఎన్ మూర్తి బంధువులకు, మృతునికి భారీ మొత్తంలో అప్పు ఇచ్చిన సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజమానికి మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజమాని కోట్ని శ్రీరాములు నాయుడికి కుడి కంటిపై తీవ్ర గాయం కావడంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రి తరలించి ప్రథమ చికిత్స అనంతరం విశాఖకు తరలించారు. అంబులెన్స్‌ను తరలించుకుపోయారు: మృతుని కుటుంబ సభ్యులు ‘పోస్ట్‌మార్టం అనంతరం ఏఎస్ఎన్ మూర్తి మృతదేహాన్ని దహనం చేసేందుకు అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు తరలిస్తున్నాం. ఇంతలో అప్పు తీర్చకుండా మృతదేహాన్ని ఎలా తీసుకెళ్తారని సుచిత్ర ఎలక్ట్రానిక్స్ యజ మా ని కుమారుడు కోట్ని సురేష్ అంబులెన్స్‌ను అటకాయిం చి అతని షాపు వద్దకు తీసుకుపోయారు. ఈ హఠాత్పరిణామానికి వెంటనే తేరుకుని షాపు వద్దకు వెళ్లగా శ్రీరాములునాయుడు ఇష్టానుసారంగా తిట్ల పురాణం అందుకున్నాడు. మృతిచెందిన ఏఎస్ఎన్ మూర్తి భారీగా చేసిన అప్పు మాటేమిటని ప్రశ్నించి షాపులోని ఏవో ఆయుధాలు తీసుకుని తమపై’కి వచ్చారని మృతు ని బంధువులు చెప్పారు. ఆ క్రమంలోనే శ్రీరాములు నాయుడికి దెబ్బతగిలి ఉంటుందన్నారు. తాము అతనిపై దాడి చేయలేదని మృతుని బంధువులు స్పష్టం చేశారు. మృతికి నేనే కారణమంటూ దాడి: క్షతగాత్రుడు శ్రీరాములునాయుడు ఏఎస్ఎన్ మూర్తి మృతికి తానే కారణమంటూ అకారణంగా నా షాపు వద్దకు అంబులెన్స్‌లో శవాన్ని తీసుకుని వచ్చి నాపైన, నా కుమారుడిపైనా మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు దాడి చేశారని క్షతగాత్రుడు కోట్ని శ్రీరాములు నాయుడు, అతని కుమారుడు సురేష్ లు భోరున విలపించారు. తన దగ్గర అప్పుగా భారీ మొత్తంలో మూర్తి నగదు తీసుకున్నారనీ, చెల్లించకుండా నే చనిపోయిన విషయం తెలిసి మిన్నకుండిపోయానని శ్రీరాములునాయుడు చెప్పారు. తన తండ్రిపై మృతుడు మూర్తి బంధువులు దాడి చేశారని, వారిని తాను గుర్తుపడతానని దాడి అనంతరం షాపు వద్దకు వచ్చిన ఎస్ఐ సంతోష్‌కుమార్, ట్రైనీ ఎస్ఐ బాలాజీరావుల వద్ద సురే ష్ విలపించాడు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని క్షతగాత్రుని భార్య, కుమారుడు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎస్ఐని ప్రశ్నించగా సుచిత్రా ఎలక్ట్రానిక్స్ వద్ద ఇరు పక్షాల మధ్య గలాటా జరుగుతోంద ని సమాచారం అందగా సిబ్బందితో కలిసి వచ్చామని అంతలోనే ఇరు వర్గాల వారు వెళ్లిపోయారని, ఎటువంటి ఫిర్యాదులూ అందజేయలేదని ఎస్ఐ వెల్లడించారు.