సాక్షి, శృంగవరపుకోట(శ్రీకాకుళం) : పట్టణంలోని విశాఖ-అరకు రోడ్డులో ఉంటున్న సాలూరు ప్రియాంక అనే వివాహిత బుధవారం సాయంత్రం ఐదు గం టల సమయంలో ఇంటిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మృతురాలు ప్రియాంక, నాయనమ్మ భాగ్యలక్ష్మి ఇంట్లో ఉండగా.. ట్యాంక్‌లో నీళ్లు పడుతున్నాయా లేదా చూసి వస్తానంటూ ప్రియాంక సాయంత్రం 5 గంటల సమయంలో మేడ మీదికి వెళ్లింది. ఎంతకూ మనుమరాలు కిందికి రాకపోవడంతో నాయనమ్మ భాగ్యలక్ష్మి మేడమీదికి వెళ్లి చూడగా ప్రియాంక గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని కనిపించింది. దీంతో హతాశురాలైన భాగ్యలక్ష్మి వెంటనే పట్టణంలో ఉన్న తమ బంధువులకు ఫోన్ చేయగా, వాళ్లు వచ్చి ప్రియాంకను కిందికి దించారు. అయితే అప్పటికే ఆమె మరణించడంతో పోలీసులకు... శ్రీకాకుళంలో ఉద్యోగం చేస్తున్న మృతురాలి తల్లి అరుణకుమారికి సమాచారం అందించారు.
రెండు నెలల్లోనే..
ఎస్.కోటకు చెందిన సాలూరు లేటు ప్రసాద్, అరుణకుమారిల కుమార్తె ప్రియాంక(23)ను హైదరాబాద్‌కు చెందిన అక్కుమహంతి గోపీకృష్ణకు ఇచ్చి ఏప్రిల్ నెల 17న వివాహం చేశారు. పెళ్లయిన కొద్ది రోజులకే ప్రియాంకకు వరకట్న వేధింపులు ఆరంభమయ్యాయి. హైదరాబాద్‌లో ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ప్రియాంక కొద్ది రోజులు అత్తింటి వేధిం పులు భరించి ఆ తర్వాత తన తల్లికి విషయం చెప్పింది. తర్వాత ఎస్.కోటలో తల్లి వద్దకు వచ్చిన ప్రియాంక స్థానిక పోలీస్‌స్టేషన్‌లో భర్త గోపీకృష్ణ, అత్త లక్ష్మీఇందిరలపై ఫిర్యాదు చేసింది.
పోలీస్‌ల నిర్లక్ష్యమే కారణం..
మృతురాలు ప్రియాంక తొలుత హైదరాబాద్‌లో కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా అక్కడ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. సొంత ఊరులో ఫిర్యాదు చేసుకో అంటూ ప్రి యాంకను పంపేశారు. దీంతో ఎస్.కోట వచ్చి న ప్రియాంక గత నెల 18న ఎస్.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్.కోట పోలీసులు హైదరాబాద్ వెళ్లి చిరునామా తెలియక వెనక్కి వచ్చేశారు. ప్రి యాంకకు అత్తింటి వారితో పాటు కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ నుంచి తరచూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవి. తన వల్ల కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి తెలిపింది. ఎస్.కోట ఎస్సై జి. రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment