లారీ డ్రైవర్ దారుణ హత్య | Lorry driver brutal murder | Sakshi
Sakshi News home page

లారీ డ్రైవర్ దారుణ హత్య

Published Tue, Nov 18 2014 1:33 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

లారీ డ్రైవర్ దారుణ హత్య - Sakshi

లారీ డ్రైవర్ దారుణ హత్య

వెంకటరమణపేట (శృంగవరపుకోట రూరల్) : ఎస్.కోట మండలం వెంకటరమణపేట గ్రామ చావిడి సమీపంలో (దిగువ వీధిలో) అడపా శ్రీను (38) అనే లారీడ్రైవర్ సోమవారం మధ్యాహ్నం దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్.కోట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఎస్.లక్ష్మణమూర్తి, ఎస్సై బి.సాగర్‌బాబు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శ్రీను మృతదేహాన్ని పరిశీలించడంతో పాటు నిందితుడు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసు సిబ్బంది, స్థానికులు  తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి.
 
 వెంకటరమణపేట గ్రామానికి చెందిన అడపా శ్రీను లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది నెలల కిందట ఒక లారీని కొనుగోలు చేసి బాడుగకు తిప్పి నష్టపోవడంతో తిరిగి లారీ డ్రైవర్‌గా కొనసాగుతున్నాడు. వెంకటరమణపేట గ్రామంలోని కాలనీలో కుటుంబంతో నివాసం ఉంటున్న శ్రీను సోమవారం అదే గ్రామంలోని దిగువ వీధిలో నివాసం ఉంటున్న మేనమామ గన్ను గోవింద ఇంటికి వెళ్లాడు. మధ్యాహ్నం శ్రీను పడుకున్న సమయంలో అతని మేనమామ గోవింద కత్తితో మెడపై నరికి హత్య చేశాడు. మృతుడికి భార్య ఆదిలక్ష్మి, మూడేళ్ల కుమార్తె యశస్విని ఉన్నారు. భార్య ప్రస్తుతం గర్భవతి. సీఐ ఎస్. లక్ష్మణమూర్తి, ఎస్సై సాగర్‌బాబు మృతుడి తల్లి, అక్క, బంధువులు,స్థానికులను విచారించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎస్.కోట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీఆర్‌ఓ వైవీఎస్‌ఆర్ ప్రతాప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.  
 
  వేధింపులు భరించలేకే హత్య.. నిందితుడు
 మేనల్లుడు అడపా శ్రీను వేధింపులు భరించలేకే హత్య చేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు గన్ను గోవింద నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. తన కుమార్తెలతో పాటు తనను కూడా నిత్యం వేధిస్తున్నట్లు గోవింద పోలీసులకు చెప్పినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement