
సాక్షి, విజయనగరం : విజయనగరం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. శృంగవరపుకోట మండలం బొడ్డవర గ్రామంలో ఎంపీయూపీ స్కూల్లో 4వ తరగతి చదువుతున్న గిరిజన బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. మంగళవారం స్కూలు పూర్తయ్యాక బస్ స్టాప్ వద్ద తన గ్రామానికి వెళ్లేందుకు వేచిచూస్తుండగా, ఓ యువకుడు మాయమాటలు చెప్పి చిన్నారిని తాటిపూడి దాటిన తర్వాత ఓ మామిడితోటలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం తీవ్ర రక్తస్రావం అవుతున్న బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.
బుధవారం తెల్లవారుజామున రోడ్డు పైనే ఏడుస్తూ కూర్చున్న బాలికను అటుగా వెళుతున్న ఆటో డ్రైవర్ వివరాలు తెలుసుకుని బాలిక తల్లి తండ్రులకు అప్పచెప్పాడు. ఘటనావివరాలు తెలుసుకున్న తల్లిదండ్రులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించి, చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వెంకటరావు కేసు నమోదు చేసి నిందితుడు కోసం గాలింపుచర్యలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment