తమిళనాడులోని తిరుపూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి (ఆలిండియా) షటిల్ బ్యాడ్మింటన్ అండర్-15 ర్యాంకింగ్ పోటీల్లో
శృంగవరపుకోట రూరల్: తమిళనాడులోని తిరుపూరు ఇండోర్ స్టేడియంలో జరిగిన జాతీయస్థాయి (ఆలిండియా) షటిల్ బ్యాడ్మింటన్ అండర్-15 ర్యాంకింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి కొణదం ప్రీతి (విజయనగరం జిల్లా ఎస్.కోట) విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో గుజరాత్ రాష్ట్రానికి చెందిన దీప్తికుట్టిపై 21-12, 21-15 తేడాతో వరుస సెట్లలో ప్రీతి విజయం సాధించింది. జాతీయ ర్యాంకింగ్ పోటీల్లో విజయం సాధించిన అనంతరం ప్రీతి సాక్షి ప్రతినిధితో ఫోన్‌లో మాట్లాడుతూ తన విజయం గురించి వివరించింది. ఎస్.కోట పట్టణానికి చెందిన కొణదం ప్రీతి విజయం సాధించడం పట్ల జిల్లా ప్రజలతో పాటు ఎస్.కోటలోని ఫ్రెండ్స్ రిక్రియేషన్ క్లబ్‌కు చెందిన షటిల్ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.