శృంగవర పుకోట, న్యూస్‌లైన్: వివిధ పథకాలకు ఆధార్ తప్పనిసరి చేయడంతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులను ప్రభుత్వం మరోసారి గందరగోళంలోకి నెట్టనుంది. చౌకధరల డిపోల ద్వారా అందజేస్తున్న సరుకులకు ఆధార్‌తో ముడి పెట్టాలని యోచిస్తోంది. వచ్చే నెల నుంచి ఆధార్ కార్డు ఉంటేనే చౌకధరల దుకాణాల ద్వారా సరుకులు అందుతాయంటూ జిల్లా అధికారులు సైతం స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి కే ప్రభుత్వ పథకాలు, రాయితీలు, ధ్రువీకరణపత్రాలు, హెల్త్‌కార్డులు.. ఇలా ఏ సేవ పొందాలన్నా ఆధార్ ఉండాలని ప్రభుత్వం చెబుతుం డడం.. అందుకు తగ్గట్టుగా ఆధార్ కార్డులు జారీ చేయకపోవడంతో గందరగోళ పరిస్థితు లు ఏర్పడ్డాయి.
ఆధార్ అందేదెప్పుడు..!
జిల్లాలో 23,44,000 మందికి ఆధార్ కార్డులు అందాల్సి ఉండగా ఇప్పటివరకూ కేవలం 7 లక్షల మంది మాత్రమే ఆధార్‌తో అనుసంధా నం అయినట్టు అధికారులు చెబుతున్నారు. విజయనగరం డివిజన్‌లో మొత్తం 6,47,532 మందికి ఆధార్‌కార్డులు అందాల్సి ఉండగా వీరిలో 19,853మంది విద్యార్థులు ఉన్నారు. గతంలో ఐరిష్ చేయించుకుని ఆధార్‌కేంద్రాల్లో ఇ.ఐ.డి స్లిప్‌లు తీసుకున్న వందలాది మంది ఆధార్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పలుచోట్ల కేవలం 30 శాతం మందికే ఆధార్‌కార్డులు అందాయ ని, కొన్నిగ్రామాల్లో ఒక్క కార్డు కూడా అందని పరిస్థితి నెలకొందని సాక్షాత్తు తహశీల్దార్లే చెబుతున్నారు.
అంతటా అయోమయం..
గతంలో ఆధార్‌కార్డుల జారీ ప్రక్రియ రెవెన్యూశాఖతో పాటూ కొన్ని బ్యాంక్‌లు, ప్రైవేటు సంస్థలు నిర్వహించాయి. తర్వాత కొన్ని ప్రైవే ట్ సంస్థలు ప్రభుత్వంతో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్నాయి. దీంతో పలువురి నుంచి సేకరించిన డేటా పనికిరాకుండా పోయింది. ఫలితంగా కొద్దిమందికి మాత్రమే ఆధార్ కార్డులు అందా యి. ఆధార్ కేంద్రాలపై కచ్చితమైన పర్యవేక్ష ణ, నియంత్రణ, ఆధార్ జారీలో క్రమమైన పద్ధతి పాటించకపోవడంతో ఆధార్ కార్డులు కావాల్సినవారు, కార్డుల్లో తప్పులున్నవారు, స్థానికేతరులు వేల సంఖ్యలో ఆధార్ కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెవిన్యూ, పంచాయతీరాజ్, గ్రామస్థాయి ఉద్యోగులను భాగస్వాములను చేసి గ్రామాన్ని ఒక యూని ట్‌గా తీసుకుని ఆధార్‌కార్డులు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
అనుసంధానం కాక అవస్థలు..
ఆధార్‌కార్డు నంబరును ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేయకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు అందని పరిస్థితి.వంటగ్యాస్, వృద్ధాప్య, వికలాంగ, వితంతు పింఛన్లు, రేషన్‌కార్డు, ఉద్యోగుల హెల్త్‌కార్డులు అన్నీ ఆధార్ నంబర్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. అయితే చాలామందికి ఆధార్ అనుసంధానం కాక వంటగ్యాస్ రాయితీ పొంద లేకపోతున్నా రు. ప్రస్తుతం జిల్లాలో ఆధార్ కార్డుల జారీకి 300 సెంటర్లు ఏర్పాటు చేశారు. విజయనగ రం డివిజన్‌లో ఎస్.కోట, ఎల్.కోట, కొత్తవల స, నెల్లిమర్ల, గరివిడి, విజయనగరం కేంద్రా ల్లో ఆధార్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి క్రమపద్ధతిలో ఆధార్‌కార్డులు జారీ చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు.
ఆధార్..బేజార్
Published Thu, Jan 9 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement