సలాం... కలామ్‌జీ | Salam ... kalamji | Sakshi
Sakshi News home page

సలాం... కలామ్‌జీ

Published Fri, Jul 31 2015 1:49 AM | Last Updated on Mon, Aug 20 2018 3:02 PM

Salam ... kalamji

శృంగవరపుకోట : భరతమాత ముద్దుబిడ్డ అబ్దుల్ కలాంకు ఎస్.కోట వా సులు గురువారం ఘన నివాళులర్పిం చారు. స్థానిక జేఏసీ నేతృత్వంలో గురువారం ఉదయం 10.30 గంటలకు ఎస్.కోటలో స్థానిక పుణ్యగిరి కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ నిలువెత్తు చిత్రపటాన్ని ఉంచి ఊరేగించారు.
 
 జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభాస్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఎస్.కోట మండలాధ్యక్షుడు రెడ్డి వెంకన్న, జెడ్పీటీసీ ఎస్.రామలక్ష్మి, సర్పంచ్ అంబటి లక్ష్మి, ఎల్.కోట జెడ్పీటీసీ కె.ఈశ్వరరావు, వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ నెక్కల నాయుడుబాబు, జేఏసీ నాయకులు జె.మురళి. సుధాకర్, మోహన్‌రాజ్, అశోక్‌రాజు, రాష్ట్ర రేషన్‌డీలర్ల సంఘ అధ్యక్షులు బుగత వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్, స్నేహ స్వచ్చంద సంస్థల సభ్యు లు అంతా ముందుగా కలాం చిత్రపటానికి పూలు వేసి నివాళులు అ ర్పించారు.
 
 అనంతరం విద్యార్థులు, స్థానికులు, అధికారులు వేలాదిగా వెంటరాగా కలాం చిత్రపటాన్ని దేవీ జంక్షన్‌కు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ అంతా కాసేపు మౌనం పాటిం చారు. హిందూ, క్రైస్తవ, ముస్లిం మత పెద్దలు కలాం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కలాం మరణం ఎన్నటికీ తీరని లోటని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, జెడ్పీ చైర్మన్ శోభాస్వాతిరాణి, వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు నెక్కల నాయుడుబాబు అన్నారు. కొత్తవలస సీఐ సంజీవరావు, ఎస్.కోట ఎస్‌ఐ  సాగర్‌బాబులు ర్యాలీకి బందోబస్తు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement