
సాక్షి, విజయనగరం: శృంగవరపుకోట మండలం మూల బొడ్డవర గిరిజన గ్రామంలో అనారోగ్యంతో డిప్పల సింహాచలం అనే గిరిజన బాలుడు మృతి చెందాడు. దీంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్ప శ్రీవాణి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. బాలుడి తల్లి తండ్రులులను ఓదార్చి వారికి తన వంతుగా పాతిక వేల రూపాయలు ఆర్ధిక సాయం అందించారు. అంతేకాక ప్రభుత్వం తరపున రావలసిన సాయాన్ని త్వరలోనే అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విజయనగరం జిల్లాలోని శృంగవరపుకోటలో బాలుడు చదువుకున్న గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో ఉన్న మౌళిక వసతులను డిప్యూటీ సీఎం పరిశీలించారు. శృంగవరపుకోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, రఘురాజు, నెక్కల నాయుడు బాబు తదితరులు ఆమె వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment