వినాయకచవితి స్పెషల్.. ఈ సాంగ్స్ లేకపోతే సందడే ఉండదు! | Vinayaka Chavithi Special Songs On The Occassion Of Festival | Sakshi
Sakshi News home page

Vinayaka Chavithi Special Songs: ఈ పాటలు లేకుండా వినాయకచవితిని ఊహించుకోలేం!

Published Mon, Sep 18 2023 12:39 PM | Last Updated on Mon, Sep 18 2023 1:00 PM

Vinayaka Chavithi Special Songs On Festival Occassion - Sakshi

వినాయకచవితి పండుగ వచ్చిందంటే చాలు. చిన్నపిల్లలే కాదు.. పెద్దలు డ్యాన్సులతో హోరెత్తిస్తారు. పెద్ద పెద్ద డీజేలు, గణనాధుని పాటలతో ఏ గల్లీలో చూసినా సందడే సందడి.. ధూమ్ ధామ్. మరీ ఇంత సంతోషంగా పిల్లలు, పెద్దలు జరుపుకునే పండుగలో గణనాథునిపై మనం రాసుకున్న పాటలకైతే కొదువ లేదాయే. మరీ ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంతోషంగా గణనాధున్ని గంగమ్మ ఒడికి చేర్చే వరకు మనకోసం.. మరీ ముఖ్యంగా బొజ్జ గణపయ్య కోసం సినిమాల్లో వచ్చిన పాటలను ఓ సారి గుర్తు చేసుకుందాం. వినాయకచవితి సందర్భంగా లంబోదరుడి సూపర్ హిట్‌ సాంగ్స్ గురించి తెలుసుకుందాం పదండి. 

సినిమాల్లో మన గణపయ్య సూపర్ హిట్ సాంగ్స్

మెగాస్టార్ 'జై చిరంజీవ'-  'జై జై గణేశా.. జై కొడతా గణేశా'

'జై జై గణేశా.. జై కొడతా గణేశా' అనే సాంగ్‌ వినాయకచవితి వచ్చిందంటే కచ్చితంగా ఉండాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, సమీరా రెడ్డి, భూమిక ప్రధాప పాత్రల్లో  విజయ భాస్కర్‌  దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 

వెంకటేశ్ కూలీనెం 1-  'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా'

'దండాలయ్యా.. ఉండ్రాలయ్యా..దేవా. నీ అండదండా ఉండాలయ్యా.. దేవా' అంటూ సాగే వినాయకుని పాట ఇప్పటికీ కూడా ఎవర్‌గ్రీన్. వెంకటేశ్, టబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2002లో రిలీజైంది. 

100% లవ్ -'తిరుతిరు గణనాథ..'

నాగచైతన్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 100% లవ్. ఈ చిత్రంలో తమన్నా పాడే  'తిరుతిరు గణనాథ..' అంటూ పాడే సాంగ్‌ హైలెట్. వినాయకచవితి పండుగ రోజు ఈ పాట కచ్చితంగా ఉండాల్సిందే. 


అల్లు అర్జున్ 'ఇద్దరమ్మాయిలతో'-  గణపతి బప్పా మోరియా

అల్లు అర్జున్, అమలా పాల్ జంటగా నటించిన చిత్రం ఇద్దరమ్మాయిలతో. ఈ చిత్రంలో 'గణపతి బప్ప మోరియా' సాంగ్ వినని వారుండరు. ఐకాన్‌ స్టార్ ఈ పాటకు తన స్టెప్పులతో అదరగొట్టాడు. వెస్ట్రర్న్ స్టెల్లో  బన్నీ దుమ్ములేపారు.

 

దేవుళ్లు- 'వక్రతుండా మహాకాయ' సాంగ్

ఎస్పీ బాలసుబ్రమణ్య ఆలపించిన ఈ సాంగ్ దేవుళ్లు సినిమాలోది. ఇద్దరు చిన్న పిల్లలు తమ తల్లిదండ్రుల కోసం దేవుడిని మొక్కులు చెల్లించేందుకు బయలుదేరుతారు. ఈ సినిమాలో 2001లో రిలీజ్‌ కాగా.. కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కించారు. 

బాలయ్య భగవంత్ కేసరి- గణేశ్ ఆంతం సాంగ్

బాలకృష్ణ, శ్రీలీల జంటగా నటిస్తోన్న చిత్రం భగవంత్ కేసరి. ఈ చిత్రంలో గణేశ్ ఆంతం లిరికల్ సాంగ్‌ను ఇటీవలే రిలీజ్ చేశారు. వినాయకచవితికి గణపతి మండపాలు ఈ పాటతో హోరెత్తనున్నాయి.

 
  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement