samantha And Regina: Star Heroines Special Dances In Movies - Sakshi
Sakshi News home page

Samantha-Regina: స్పెషల్‌ సాంగ్స్‌తో కనువిందు చేయబోతోన్న బ్యూటీలు వీరే!

Published Sat, Nov 27 2021 5:24 AM | Last Updated on Sat, Nov 27 2021 12:14 PM

Special Dances With Star Heroines - Sakshi

కొంత లవ్వు.. కాస్త నవ్వు.. కాసింత సెంటిమెంట్‌... మధ్య మధ్యలో ఫైట్స్‌.. సినిమా ఇలా సాగిపోతుంటుంది. మధ్యలో జిల్‌.. జిల్‌.. జిగేల్‌మనే స్పెషల్‌ సాంగ్‌ వస్తే... ప్రేక్షకులకు ఐ ఫీస్ట్‌... ఇయర్‌ ఫీస్ట్‌... ఇప్పటికే ఇలాంటి ప్రత్యేక పాటలు చాలానే చూశాం. రానున్న రోజుల్లో కనువిందు చేయనున్న ‘స్పెషల్‌ సాంగ్స్‌’ గురించి తెలుసుకుందాం.

ఒకప్పుడు స్పెషల్‌ సాంగ్స్‌ చేయడానికి ప్రత్యేకంగా తారలు ఉండేవారు. ఇప్పుడు స్టార్‌ హీరోయిన్లు, హీరోయిన్లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. కెరీర్‌లో తొలిసారి సమంత ఒక స్పెషల్‌ సాంగ్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ బ్యూటీ యాభైకి పైగా సినిమాలు చేశారు. ఫస్ట్‌ టైమ్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుండటం విశేషం. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘పుష్ప’లోనే సమంత ప్రత్యేక పాటలో కనిపించనున్నారు.

చదవండి: 'జగపతిబాబును గుర్తుపట్టలేదు, బాలకృష్ణ మనిషేనా?'

సేమ్‌ టు సేమ్‌ సమంతలానే హీరోయిన్‌ రెజీనా తన కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ స్పెషల్‌ సాంగ్‌ చేశారు. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’లోనే రెజీనా స్పెషల్‌ సాంగ్‌ చేశారు. అయితే ఇది రెగ్యులర్‌ స్పెషల్‌ సాంగ్‌లానో, ఐటమ్‌ సాంగ్‌లానో ఉండదని తెలిసింది. చిరంజీవి–రెజీనా పాల్గొనగా ఓ గుడిలో ఈ పాట ఉంటుందని సమాచారం. రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలు చేసిన ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న థియేటర్స్‌లోకి రానుంది.

ఇంకోవైపు బుల్లితెర ఫేమస్‌ యాంకర్, నటి రష్మీ గౌతమ్‌ ‘బోళా శంకర్‌’ చిత్రంలో ఓ మాస్‌ మసాలా సాంగ్‌లో చిరంజీవితో కలిసి స్టెప్పులేశారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలిగా కీర్తీ సురేష్‌ కనిపిస్తారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక సమంత, రెజీనా, రష్మీ గౌతమ్‌ల లెక్క ఫస్ట్‌ టైమ్‌ కాకుండా... ఇప్పటికే తమన్నా అరడజను (అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, కేజీఎఫ్‌: చాప్టర్‌ 1, జై లవకుశ, సరిలేరు నీకెవ్వరు) స్పెషల్‌ సాంగ్స్‌లో స్టెప్పులు వేశారు.

చదవండి: RRR Janani Song: ఆర్‌ఆర్‌ఆర్‌ 'జనని' సాంగ్‌ వచ్చేసింది..

తాజాగా ‘గని’ కోసం మరోసారి స్పెషల్‌గా మాస్‌ స్టెప్పులేశారని తెలిసింది. వరుణ్‌ తేజ్‌ హీరోగా కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోవైపు యంగ్‌ హీరోయిన్‌ ఫరియా అబ్దుల్లా (‘జాతి రత్నాలు’ ఫేమ్‌) ‘బంగార్రాజు’ చిత్రంలో నాగార్జునతో కలిసి ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నారు. నాగార్జున హీరోగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో  2016లో వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయానా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపుదిద్దుకుంటోంది. ఇందులో నాగచైతన్య, కృతీశెట్టి ఓ జంటగా నటిస్తున్నారు.


ఇంతేనా? రానున్న రోజుల్లో మరిన్ని స్పెషల్‌ సాంగ్స్‌లో కొందరు తారలను చూసే అవకాశం ఉంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement