సూపర్‌ హీరో ఎవరు? | Captain Marvel Promoted with a Her In Every Hero Event | Sakshi

సూపర్‌ హీరో ఎవరు?

Published Sat, Mar 2 2019 5:47 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM

Captain Marvel Promoted with a Her In Every Hero Event - Sakshi

కాజల్, రకుల్, తమన్నా, సమంత

ప్రతి హీరో (HERO) లోను హర్‌ (HER) ఉందంటూ లేటెస్ట్‌ హాలీవుడ్‌ సూపర్‌ హీరోయిన్‌ ఫిల్మ్‌ ‘కెప్టెన్‌ మార్వెల్‌’ చిత్రాన్ని ప్రమోట్‌ చేయడానికి వచ్చారు సౌత్‌ సూపర్‌ హీరోయిన్లు కాజల్‌ అగర్వాల్, తమన్నా, సమంత, రకుల్‌ ప్రీత్‌సింగ్‌. మార్వెల్‌ సంస్థ నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్‌ మార్వెల్‌’. సూపర్‌ హీరో సినిమాల పాపులారిటీ ఇండియన్‌ మార్కెట్‌లో ఎలా పెరుగుతుందో తెలిసిన విషయమే.

ఈ చిత్రం తమిళ వెర్షన్‌ ప్రమోషన్‌లో ఈ నలుగురు భామలు పాల్గొన్నారు. అక్కడ ప్రేక్షకులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇండియన్‌ వెర్షన్‌ ‘ఐరన్‌ మేన్‌’కి హీరోగా ఎవరైతే బావుంటారని అడగ్గా రకుల్, సమంతలు వెంటనే ‘సూర్య’ అన్నారు. కాజల్‌ ఏమో విజయ్‌ పేరు చెప్పారు. సూపర్‌ హీరో ‘థోర్‌’ పాత్రకు ఎవరు బాగుంటారన్న ప్రశ్నకు అజిత్‌ పేరు చెప్పారు తమన్నా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement