
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గుండెల నిండా దేశభక్తితో జరుపుకునే పండగే ఈ గణతంత్ర దినోత్సవం.బ్రిటీష్ పాలనలో మగ్గిన మన దేశానికి స్వాతంత్ర్యం అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశ వ్యాప్తంగా పండగలా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
గుండెనింగా దేశభక్తి, మనసు ఉప్పొంగేలా అమరవీరుల పోరాటాన్ని వివరించేలా ఎన్నో దేశభక్తి గీతాలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల వరకు ఎంతో మంది స్టార్ హీరోలు దేశభక్తి కలిగిన సినిమాల్లో నటించారు. తరాలు మారినా ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని ఉప్పింగించే కొన్ని సినీ పాటల్ని ఓసారి గుర్తుచేసుకుందాం.
‘మేమే ఇండియన్స్’
గణతంత్ర దినోత్సవ రోజుల్లో టీవీల్లో మనం ఎక్కువగా చూసే సినిమా ‘ఖడ్గం’. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో పోషించారు. దేశభక్తి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే రన్ అవుతోంది. ఇందులోని దేశభక్తి సాంగ్ ‘మేమే ఇండియన్స్’ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని దేశభక్తి పాటలివే..