Republic Day events
-
అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో డిస్కౌంటే డిస్కౌంట్లు!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్‌లో రిపబ్లిక్‌డేని పురస్కరించుకొని గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ (Great Republic day Sale)ను నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రతి ఏడాది రిపబ్లిక్ డేకి కొన్ని రోజుల ముందు ప్రారంభమయ్యే సేల్‌లో భాగంగా అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, ఆడియో ప్రొడక్ట్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో సహా అనేక రకాల ఉత్పత్తులపై డిస్కౌంట్లను అందిస్తుంది. ఈ సేల్‌లో కస్టమర్లు అర్హులైన బ్యాంక్ కార్డ్ లావాదేవీలపై డిస్కౌంట్ పొందవచ్చు. ఈ అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం ఎప్పుడనేది స్పష్టత రావాల్సి ఉంది. అయితే గతేడాది ఈ సేల్ జనవరి 15న ప్రారంభమైంది. ఈ ఏడాది సైతం సేల్ అప్పుడే ప్రారంభమవుతుందని యూజర్లు భావిస్తున్నారు. 50 వేల వరకు డిస్కౌంట్ రాబోయే సేల్‌లో అమెజాన్ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 5జీ స్మార్ట్ఫోన్లు ప్రారంభ ధర రూ. 9,999కే అమ్ముతుండగా.. పలు ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లపై రూ.50వేల వరకు డిస్కౌంట్‌ను సొంతం చేసుకోవచ్చు. 75 శాతం.. 65 శాతం డిస్కౌంట్ అదేవిధంగా, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు 75 శాతం వరకు, స్మార్ట్ టీవీలు, ఇతర ఉపకరణాలను 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా అనేక ఉత్పత్తులపై డిస్కౌంట్లతో పాటు, ఎస్బీఐ బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డ్, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ తగ్గింపును పొందవచ్చు అని అమెజాన్ తెలిపింది. -
పాటల్లో దేశభక్తి స్ఫూర్తి.. ఈ పాటలు ఎవర్గ్రీన్!
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనది. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. గుండెల నిండా దేశభక్తితో జరుపుకునే పండగే ఈ గణతంత్ర దినోత్సవం.బ్రిటీష్ పాలనలో మగ్గిన మన దేశానికి స్వాతంత్ర్యం అనంతరం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేశ వ్యాప్తంగా పండగలా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గుండెనింగా దేశభక్తి, మనసు ఉప్పొంగేలా అమరవీరుల పోరాటాన్ని వివరించేలా ఎన్నో దేశభక్తి గీతాలు ప్రేక్షకులను సమ్మోహన పరిచాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ కాలం నుంచి జూ. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల వరకు ఎంతో మంది స్టార్ హీరోలు దేశభక్తి కలిగిన సినిమాల్లో నటించారు. తరాలు మారినా ప్రతి భారతీయుడిలోనూ దేశభక్తిని ఉప్పింగించే కొన్ని సినీ పాటల్ని ఓసారి గుర్తుచేసుకుందాం. ‘మేమే ఇండియన్స్’ గణతంత్ర దినోత్సవ రోజుల్లో టీవీల్లో మనం ఎక్కువగా చూసే సినిమా ‘ఖడ్గం’. ఈ సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో పోషించారు. దేశభక్తి చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ.. ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గానే రన్ అవుతోంది. ఇందులోని దేశభక్తి సాంగ్ ‘మేమే ఇండియన్స్’ ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని దేశభక్తి పాటలివే.. -
జాతీయ జెండాను ఆవిష్కరించిన రామ్‌నాథ్ కోవింద్
సాక్షి, న్యూఢిల్లీ: భారత 73వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో బుధవారం అట్టహాసంగా జరిగాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సాయుధ దళాలు 21 తుపాకులతో సైనిక వందనం సమర్పించాయి. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు, కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకలకు హాజరయ్యారు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో వీక్షకుల సంఖ్యను కుదించారు. 2500 మందిని రాజ్‌పథ్‌లో పరేడ్ చూసేందుకు అనుమతించారు. 15ఏళ్లలోపువారికి అనుమతి లేదు. కరోనా నేపథ్యంలో ఈసారి గణతంత్ర వేడుకలకు విదేశీ అతిథులను ఆహ్వానించలేదు. ఆకట్టుకున్న సైనిక పరేడ్ రాజ్‌పథ్‌లో సైనిక పరేడ్ అదరహో అనిపించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిర్వహిస్తున్న వేళ.. భారత సైనిక సామర్థ్యాన్ని, దేశ సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేలా రిపబ్లిక్ డే పరేడ్ సాగింది. 16 కవాతు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నాయి. సైన్యం, నౌకాదళం, వాయుసేన, కేంద్ర పారామిలటరీ దళాలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సిబ్బంది మార్చ్ ఫాస్ట్‌లో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా.. భారతీయ వాయుసేన 75 యుద్ధవిమానాలతో గ్రాండ్ ప్లైపాస్ట్ నిర్వహించింది. రఫేల్, సుఖోయ్, జాగ్వర్, అపాచీ వంటి ఫైటర్ జెట్స్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. -
శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి.. నలుగురికి తీవ్రగాయాలు
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సిటీలో ఉగ్రవాదులు గ్రెనేడ్ బాంబులతో దాడికి పాల్పడ్డారు. కాగా, వీరు స్థానికంగా ఉన్న హైస్ట్రీట్ వద్ద మంగళవారం సాయంత్రం బాంబు దాడికి తెగబడ్డారు. పోలీసుల ప్రకారం.. భద్రత సిబ్బందిని టార్గెట్‌గా చేసుకుని దాడి చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల బాంబు దాడితో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా భయానకంగా మారిపోయింది. అక్కడి ప్రజలంతా భయంతో పరుగులు తీశారు. గ్రెనేడ్ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భద్రత సిబ్బంది, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యంకోసం ఆసుపత్రికి తరలించారు. భద్రత అధికారులు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఏవైన పేలుడు పదార్థాలు ఉన్నాయా.. అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, రిపబ్లిక్‌డే వేడుకలకు ఒక రోజు ముందు ఉగ్రవాదుల గ్రెనేడ్ దాడి ప్రస్తుతం తీవ్ర కలకలంగా మారింది. కాగా, ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టారు. Jammu & Kashmir | Grenade attack at Hari Singh High Street in Srinagar Details awaited. pic.twitter.com/ioU2AQABgh — ANI (@ANI) January 25, 2022 చదవండి: రైతుకు ఘోర అవమానం.. స్పందించిన ఆనంద్ మహీంద్రా -
హలో పోలీసూ.. ఏంటా పని..!!
-
హలో పోలీసూ.. ఏంటా పని..!!
నాగ్‌పూర్ : రిపబ్లిక్ డే సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థినిలపై డబ్బులు వెదజల్లిన ఓ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ సస్పెండ్ అయ్యాడు. వివరాలు.. నాగ్‌పూర్‌లోని భివాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ప్రమోద్ వాల్కే హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ‘ఆయే వతన్ తేరే లియే’ దేశభక్తి గీతాన్ని ప్రదర్శిస్తున్న స్కూల్ విద్యార్థినిలపై తప్పతాగిన వాల్కే డబ్బులు వెదజల్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. సదరు పోలీసు చర్యపై విమర్శలు రావడంతో ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. విధుల్లో ఉండి మద్యం సేవిచండంతో పాటు.. ఒళ్లు మరచి ప్రవర్తించినందుకు సస్పెండ్ చేశారు. కాగా, ముంబైలో డాన్సింగ్ బార్ల నిర్వహణకు అనుమతిస్తూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే, డ్యాన్సర్లపై డబ్బులు వెదజల్లడం నిషేధించిన కోర్టు.. కావాలంటే వారికి టిప్ అందివ్వొచ్చని పేర్కొంది. సీసీ కెమెరాల నిఘాలో డ్యాన్స్ బార్లు నిర్వహించుకోవాలని నిబంధనలు విధించింది. -
సంక్షేమ పథకాలపై ఎగ్జిబిషరన్ స్టాళ్లు ఏర్పాటు చేయాలి
కలెక్టర్ ఇలంబరిది నిర్మల్‌టౌన్ : గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా జిల్లాలో అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఎగ్జిబిషన్ సాళ్లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలంబరిది అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజాఫిర్యాదుల విభాగానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ఆర్జీదారులు వచ్చి ఫిర్యాదులు అందజేశారు. బీడీ కార్మికుల ఫించన్ దరఖాస్తులు 76, గృహనిర్మాణం కోసం 120, వికలాంగుల ఫించన్ల కోసం 6, అభయహస్తం 2, ఇతర అంశాలకు సంబంధించిన 6 దరఖాస్తులు వచ్చాయి. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ఆరోగ్యం, వ్యవసాయం, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ, విద్యా, స్త్రీ, మహిళ సంక్షేమం, డీఆర్డీఏ, డబుల్ బెడ్రూం, వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, మార్కెటింగ్, రహదారుల భద్రత, జాతీయ ఓటరు దినోత్సవం, విద్యుచ్ఛక్తి తదితర అంశాలపై గణతంత్ర దినోత్సవం రోజు ఎగ్జిబిషన్ స్టాళ్లను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్లో వీటిని ప్రదర్శించాలని కోరారు. లక్ష్మణచాంద మండలం బొప్పారం గ్రామానికి చెందిన ఎస్. నారాయణ వికలాంగుల ఫించన్ కోసం, నిర్మల్ జిల్లా కేంద్రంలోని బుధవార్‌పేట్‌కు చెందిన జి. గంగాధర్ అభయహస్తం ఫించన్ కోసం, దిలావర్పూర్ మండలం సాంగ్వికి చెందిన భూమవ్వ బీడీ కార్మికుల ఫించన్, నర్సాపూర్‌కు చెందిన నవనీత, ప్రమీల బీడీ కార్మికుల ఫించన్ మంజూరు చేయాల్సిందిగా అభ్యర్థించగా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందులో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీఓ నారాయణ, జిల్లా వైద్యాధికారి జలపతినాయక్, ఆసుపత్రి సూపరిండెంటెంట్ సురేష్, జిల్లా విద్యాధికారి ప్రణీత, పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ ప్రభాకర్, డీఎంఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పింఛన్లు రావడం లేదు అన్ని అర్హతలు ఉన్నా బీడీ పింఛన్ రావడం లేదు. పలుకుబడి ఉన్నవారికే అధికారులు పింఛన్లను అందజేస్తున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి బీడీలను చుడుతూ జీవనం సాగిస్తున్నాం. పీఎఫ్ కూడా ఉన్నప్పటికీ అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు బీడీ పింఛన్ ఇప్పించాలి. – వెల్మల్ బొప్పారం గ్రామస్తులు