నేను ఐటమ్ గర్లా?
నేనేమీ ఐటమ్ సాంగ్స్ చేసే నటినా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిందట నటి సానా ఖాన్. ఈ భామ శింబు సరసన సిలంబాట్టం చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తరువాత తంబిక్కు ఇందవూరు, ఆయిరం విళక్కు తదితర చిత్రాల్లో నటించినా హీరోయిన్‌గా ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది. అదే విధంగా అవకాశాలు కరువవ్వడంతో తెలుగు, కన్నడం, మలయాళం చిత్ర పరిశ్రమలపై దృష్టి సారించింది. తెలుగులో కత్తి, మిస్టర్ నూకయ్య వంటి చిత్రాల్లో నటించినా అక్క డ క్రేజ్ పాదించుకోలేకపోయింది. ఆ మధ్య కై్లమాక్స్ అనే మలయాళ చిత్రంలో చేసింది.
ఈ చిత్రం సానాఖాన్‌ను ఆదుకోలేదు. అయితే ఈ అమ్మడికి బాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకునే అవకాశం వచ్చింది. సల్మాన్‌ఖాన్ సరసన జయ్‌హో చిత్రంలో నటిస్తోంద ట. అయితే దక్షిణాదిలో ఐరన్ లెగ్ ముద్రపడటంతో తమిళ చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయమని అడిగారట. దీంతో ఈ బ్యూటీ తాను ఐటమ్ గర్ల్ మాదిరి కనిపిస్తున్నానా అంటూ ఆగ్రహంతో రెచ్చిపోయిందట. తాను నటించి న హిందీ చిత్రం జయహో త్వరలో విడుదలకానుంది. ఆ తరువాత తెలుస్తుంది తన రేంజ్ ఏమిటో అంటూ దర్శక నిర్మాతలపై చిర్రు బుర్రులాడిందట.