వివాదంలో చిక్కుకున్న నటి బాయ్ ఫ్రెండ్ | Sana Khan boy friend Ismail khan accused of taping women | Sakshi
Sakshi News home page

వివాదంలో చిక్కుకున్న నటి బాయ్ ఫ్రెండ్

Published Tue, Aug 30 2016 12:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

వివాదంలో చిక్కుకున్న నటి బాయ్ ఫ్రెండ్ - Sakshi

వివాదంలో చిక్కుకున్న నటి బాయ్ ఫ్రెండ్

ముంబై: బాలీవుడ్ నటి సనా ఖాన్ బాయ్ ఫ్రెండ్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. అపార్ట్ మెంట్లో సీక్రెట్ కెమెరాలు అమర్చి యువతలును టాపింగ్ చేయాలని ట్రై చేస్తున్నాడని సనా బాయ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ ఖాన్ పై అపార్ట్ మెంట్ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. గతంలో విడుదలైన సల్మాన్ ఖాన్ మూవీ'జై హో' తో బాలీవుడ్ లో తనకంటూ పేరు సంపాదించుకున్న నటి సనాఖాన్.

వీరికి వివాదాలలో తలదూర్చడం కొత్తేమీ కాదు. గతంలో ఓ మీడియా కన్సల్టెంట్ ను బెదిరించిన కేసులో సనాతో పాటు ఆమె ప్రియుడు ఇస్మాయిల్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది.
మరోవైపు ఇందులో తన తప్పిదం ఏం లేదని ఇస్మాయిల్ చెబుతున్నాడు. కొన్నేళ్ల కిందటే అపార్ట్ మెంట్లో ఫ్లాట్ కొనుక్కున్నానని, తన వ్యక్తిగత భద్రత కోసం సీక్రెట్ కెమెరాలు అమర్చి చాలా కాలం అయిందని తెలిపాడు. 2011లో తనకారును ఎవరో డామేజ్ చేశారని ఆరోపించాడు.

ఆగస్టు 2న వార్షిక సమావేశం సందర్భంగా కెమెరాలను తీసేయాలని సొసైటీ సభ్యులు అతడికి సూచించారు. వారి మాట వినకపోతే ఆగస్టు 11న నోటీసులు పంపించారు. అప్పటికీ స్పందించని కారణంగా 25న ఓషివార పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. అపార్ట్ మెంట్ ఆడవాళ్లు ఇస్మాయిల్ సీక్రెట్ కెమెరాలతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. సీక్రెట్ కెమెరాలు అమర్చడానికి తీసుకున్న పర్మిషన్ లేఖను సమర్పించాలని పోలీసులు అతడికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement