'ఆ షోలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తా' | I'll bring positivity in 'Bigg Boss 8' says Sana Khan | Sakshi
Sakshi News home page

'ఆ షోలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తా'

Published Tue, Jan 6 2015 8:14 AM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

'ఆ షోలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తా' - Sakshi

'ఆ షోలో పాజిటివ్ ఎనర్జీ తీసుకొస్తా'

న్యూఢిల్లీ:తరుచు వివాదాలు చోటు చేసుకునే బిగ్ బాస్ షోలో పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తానని బాలీవుడ్ నటి సనాఖాన్ స్పష్టం చేసింది. బిగ్ బాస్ -6 పాల్గొంటున్న సనా.. ఆ షోలో సానుకూల వాతావరణాన్ని తీసుకొస్తానని తెలిపింది.  ఈ షో సందర్భంగా శనివారం రాత్రి ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మ..  బిగ్ బాస్ కొత్త సిరీస్ లో కొత్త  ఊపిరి నింపుతానని తెలిపింది. ఈ రియాల్టీ షో కు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సనాఖాన్ తెలిపింది.


ఇప్పటికే చాలా మంది బిగ్ బాస్ లో భాగస్వామ్యం అయినా.. తానొక ప్రత్యేక పర్సనాలిటీనని సనా తెలిపింది. దీంతో తాను కూడా తప్పక ప్రత్యేక గుర్తింపు పొందుతానని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఒక స్టైల్ లోనే కాకుండా దుస్తులు, హై వీల్స్, లాఫింగ్ తదితర వాటితో ఆకట్టుకుంటానని సనా పేర్కొంది.ఈ బిగ్ బాస్ సిరీస్ కు ముఖ్య అతిథిగా ఫిల్మ్ మేకర్, కొరియాగ్రాఫర్ ఫరాఖాన్ వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement