
కంగనా రనౌత్
మున్నీ బద్‌నామ్ హుయీ డార్లింగ్ తేరే లియే... చిక్‌నీ చమేలీ చిక్‌నీ చమేలీ... మై నేమ్ ఈజ్ షీలా... తెరపై తారలు ఈ ఐటమ్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేస్తుంటే చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. ఆ మాటకొస్తే ఐటమ్ సాంగ్స్ కోసమే థియేటర్లకు వెళ్లేవాళ్లు ఉంటారు. అలాంటి క్రేజీ సాంగ్స్‌కి ఇక ఫుల్‌స్టాప్ పెట్టండి అని ఎవరైనా అంటే ‘ఎందుకమ్మా అంత కోపం’ అంటారు. ఇప్పుడు కంగనా రనౌత్‌ని అలానే అంటున్నారు. ఎందుకంటే సూటిగా సుత్తి లేకుండా ఈ హాట్ గర్ల్ ‘ఐటమ్ సాంగ్స్‌ని బ్యాన్ చేయండి’ అనేశారు.
టాప్ హీరోయిన్స్ సైతం ఐటమ్ సాంగ్‌లో యాక్ట్ చేస్తుంటారు. కానీ కంగనా రనౌత్ మాత్రం ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లైనా ఒక్క ఐటమ్ సాంగ్‌లోనూ కనిపించలేదు. దానికి కారణం ఏంటి? అని కంగనాను అడిగితే– ‘‘నాకు ఆనందాన్నిచ్చేవి అందరికీ నచ్చాలి, ఆనందాన్నివ్వాలని రూలేం లేదు. నాకు ఫెయిర్‌నెస్ బ్రాండ్‌లను ప్రమోట్ చేయడం, పెద్ద హీరోలతో యాక్ట్ చేయడం, ఐటమ్ సాంగ్స్‌లో కనిపించటం పెద్దగా నచ్చవు. కానీ వాటితో కెరీర్‌కి వచ్చే బూస్టప్ మామూలుగా ఉండదు. అయినా నాకు నచ్చవు.
ఐటమ్ సాంగ్స్‌లో పెద్దగా చేయటానికి ఏమీ ఉండదు. ఎక్కువ శాతం అవి మహిళలను తక్కువ చేసే విధంగానే ఉంటాయి. ఐటమ్ సాంగ్స్‌లో ‘మోహినీ, మున్నీ’ అని పేర్లు వినిపిస్తుంటాయి. అలా పిలిపించుకోవటం నాకు నచ్చదు. నా అభిప్రాయం ఏంటంటే ఐటమ్ సాంగ్స్‌ని బ్యాన్ చేయాలి. సొసైటీకి హాని కలిగించే వాటిలో భాగం అవ్వడానికి నేను రెడీగా లేను. రేపు సొసైటీలో మన ఆడపిల్లలను ఇలాంటి పేర్లు పెట్టి పిలవలేం కదా. ఇలాంటి పాటలను పిల్లలు చూస్తుంటారు. వీటి ద్వారా వాళ్లేం నేర్చుకుంటారు? ఏమీ ఉండదు కదా. అందుకే మనం రెస్పాన్సిబుల్‌గా ఉండాలి’’ అని పేర్కొన్నారు కంగనా.
Comments
Please login to add a commentAdd a comment