అందుకు రూ.65 లక్షలా? | katherine theresa sign item Song | Sakshi
Sakshi News home page

అందుకు రూ.65 లక్షలా?

Published Fri, Mar 24 2017 1:45 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

అందుకు రూ.65 లక్షలా?

అందుకు రూ.65 లక్షలా?

ప్రముఖ కథానాయికలు ఐటమ్‌ సాంగ్స్‌లో అందాలారబోతకు సిద్ధం అవడానికి ప్రధాన కారణం పెద్ద మొత్తంలో పారితోషికం ముట్టడమేనన్నది జగమెరిగిన సత్యం. ఒక వేళ ఆబ్లిగేషన్‌ కోసం అలా నటించానని ఎవరైనా చెబితే అది సత్యదూరమే అవుతుంది. అదే విధంగా ఇవాళ ఏ ఒక టాప్‌ నటి స్పెషల్‌ సాంగ్‌ పేరుతో గ్లామరస్‌గా నటించడానికి కాదనడం లేదు. తాజాగా నటి క్యాథరిన్‌ ట్రెసా అలాంటి భారీ పారితోషికానికి ఐటమ్‌ సాంగ్‌ చేయడానికి సై అన్నదన్నది టాక్‌ ఆఫ్‌ ది టాక్‌గా మారింది.

కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్‌ అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ వరుస కడుతున్న ఈ భామ మెడ్రాస్‌ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు దిగుమతి అయ్యింది. ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా సంసారపక్షంగా కనిపించి గుర్తింపు పొందిన క్యాథరిన్‌ ట్రెసా ఆ తరువాత అందాలారబోతలో విజృంభించిందనే చెప్పాలి. కణిదన్, కథకళి తమిళ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా ఆర్యతో కడంబన్, విష్ణువిశాల్‌కు జంటగా కథానాయకన్‌ చిత్రాలతో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా తెలుగులో ఒక ఐటమ్‌ సాంగ్‌లో నటించడానికి సిద్ధం అవుతోంది. ఇందుకు ఈ జాణ డిమాండ్‌ చేసిన పారితోషికమే టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. వర్ధమాన టాలీవుడ్‌ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో క్యాథరిన్‌ ట్రెసాను ఒక ఐటమ్‌ సాంగ్‌లో నటించమని అడగ్గా రూ.40 లక్షలు డిమాండ్‌ చేసిందట.

అందుకు నిర్మాత వర్గం ఓకే అనడంతో పాట రిహార్సల్‌కు వెళ్లిందట. ఆ పాటకు మామూలు గ్లామర్‌ కాదు పరిధులు దాటే గ్లామరస్‌గా నటించాలని గ్రహించిన క్యాథరిన్‌ ట్రెసా అదనంగా మరో రూ.25 లక్షలు పారితోషికం ఇస్తేనే అందాలారబోయడానికి సిద్ధం అని అనడంతో అందుకు ఆ చిత్ర నిర్మాత అంగీకరించారనే ప్రచారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మొత్తం మీద ఒక ఐటమ్‌ సాంగ్‌కు రూ.65 లక్షలు అందుకుంటోందనే టాక్‌ స్ప్రెడ్‌ అయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొసమెరుపేంటంటే ఇంతకు ముందు కూడా ఇదే హీరోతో సింగల్‌ సాంగ్‌లో చిందేయడానికి మిల్కీబ్యూటీ తమన్నా భారీ మొత్తాన్ని పుచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement