remuration
-
ఈ డైరెక్టర్ రూటే సెపరేటు..ఏకంగా రెండో సినిమాకే
తొలి సినిమా ఉప్పెనతోనే హిట్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు బుచ్చిబాబు. సుకుమార్ శిష్యుడిగా భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్.. టాలీవుడ్‌కు వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేశాడు. ఉప్పెనతో హీరో, హీరోయిన్లకు ఎంత క్రేజ్ వచ్చిందో డైరెక్టర్ బుచ్చిబాబుకు సైతం అంతే పేరు ప్రఖ్యాతలు దక్కాయి. దీంతో బుచ్చిబాబుతో పని చేసేందుకు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఉప్పెన బంపర్ హిట్‌తో ఇదివరకే డైరెక్టర్ బుచ్చిబాబుకు కాస్ట్లీ బెంజ్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ బ్యానర్లో ఇంకో సినిమా చేయమని మైత్రీమూవీ మేకర్స్ బుచ్చిబాబును సంప్రదించారట. ఇందుకోసం ఆయనకు 10 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో రెండో సినిమాకే ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకోనున్న అతి కొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా బుచ్చిబాబు నిలిచారు. తాజా సమాచారం ప్రకారం బుచ్చి తన రెండో సినిమాను జూనియర్ ఎన్టీఆర్‌తో చేయనున్నట్లు సమాచారం. ఇందుకుఓసం ఇప్పటికే స్ర్కిప్ట్‌ను సిద్దం చేశాడట. పిరియాడికల్ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం హిందీ మూవీ దంగల్ తరహాలో ఉండనుందట. ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్ర చూట్టు ఈ కథ తిరగనుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసి బుచ్చి కథ వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్ స్పందించలేదని ఆయన గ్రీన్ సిగ్నిల్ కోసం మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమచారం. చదవండి : 'ఉప్పెన' దర్శకుడికి బెంజ్ కారు గిఫ్ట్ అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదు : చిన్మయి -
రెమ్యునరేషన్‌పై సమంత ఘాటు వ్యాఖ్యలు
దక్షిణాది చిత్రసీమలో హీరో, హీరోయిన్ల రెమ్యునరేషన్ విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుందన్న సంగతి తెలిసిందే. హీరోలకు సమానంగా పోటీపడి నటించినా, పారితోషికం వరకు వచ్చేసరికి హీరోకు ఇచ్చిన దాంట్లో కనీసం సగం కూడా ఇవ్వరని గతంలో చాలామంది హీరోయిన్లు బాహాటంగానే పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా నటి సమంత ఈ విషయంపై మాట్లాడారు. ఇండస్ర్టీలో టాప్ 3లో ఉన్న హీరోయిన్‌కు కనీసం టాప్ 20కూడా లేని హీరోకు ఇచ్చే రెమ్యునరేషన్ కంటే తక్కువగానే ఇస్తారని చెప్పుకొచ్చింది. 'ఒకవేళ రెమ్యునరేషన్ పెంచితే ఆమె భారీగా డిమాండ్ చేస్తుంది, అత్యాశకు పోతుంది అనే ముద్ర వేస్తారు. అదే హీరో అడిగితే మాత్రం పెద్దగా అభ్యంతరం చెప్పారు. పైగా అతను సక్సెస్‌లో ఉన్నాడని సమర్థిస్తారు. హీరోయిన్లు రెమ్యునరేషన్ ఎక్కువ అడిగితే అదేదో క్రైమ్‌లా చూస్తారు' అంటూ ఘాటుగా స్పందించింది. రానున్న రోజుల్లో అయినా హీరోలకు సమానంగా పారితోషికం ఇచ్చే రోజులు రావాలని సమంత చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సమంత నటించిన వెబ్ డ్రామా ది ఫ్యామిలీ మ్యాన్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సమంత తమిళంలో ‘కాదు వాక్కుల రెండు కాదల్’ అనే సినిమాలో నటిస్తున్నారు. చదవండి : (వైరల్: సమంత అద్భుత స్టెప్పులు చూశారా) (‘క్లైమాక్స్ చూసి అమ్మ కంటతడి పెట్టింది’) -
హీరోలూ... పారితోషికం తగ్గించుకోండి!
‘‘సినిమా బడ్జెట్ 10 మిలియన్ డాలర్లు అనుకుందాం. అందులో 9.7 శాతం హీరోలు పట్టుకుపోతుంటే ఇక మాకేం మిగులుతుంది’’ అంటున్నారు హాలీవుడ్ తార సల్మా హయక్. ఫ్రాన్స్ దేశంలో జరుగుతోన్న కాన్స్ చలన చిత్రోత్సవాల్లో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. స్త్రీ–పురుష సమానత్వం గురించి ఈ ఉత్సవాల్లో పలువురు ఇప్పటికే మాట్లాడారు. చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మొదలైన ‘మీటూ’, ‘టైమ్ ఈజ్ అప్’ ఉద్యమానికి మద్దతు పలుకుతూ 82 మంది మహిళలు కాన్స్ సాక్షిగా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే వేదిక సాక్షిగా హీరో, హీరోయిన్ల పారితోషికం గురించి సల్మా హయక్ మాట్లాడారు. సినిమాకి పెడుతున్న బడ్జెట్లో దాదాపు 9 శాతానికి పైగా హీరోలు తీసేసుకుంటే.. ఇక హీరోయిన్లకు ఎంత దక్కుతుందన్నారామె. ఇంకా సల్మా హయక్ మాట్లాడుతూ – ‘‘హీరోలకు సమానంగా హీరోయిన్లకూ పారితోషికం దక్కాలి. అది జరగాలంటే హీరోయిన్లకు కూడా నిర్మాతలు ఎక్కువ పారితోషికం ఇస్తే సరిపోదు. హీరోలు తమ పారితోషికం తగ్గించుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా సమానం అవుతుంది’’ అన్నారు. అటు హీరోకీ ఇటు హీరోయిన్‌కీ ఎక్కువ పారితోషికం ఇస్తే.. ఇక నిర్మాతకు ఏం మిగులుతుంది? దానికి బదులు హీరోలే పారితోషికం తగ్గించుకుంటే బాగుంటుందన్నది సల్మా అభిప్రాయం. పాయింటే కదా. ఆ సంగతలా ఉంచితే... పలువురు నటీమణుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్ తనను కూడా హెరాస్ చేశాడని అన్నారామె. సల్మా నటించి, నిర్మించిన చిత్రం ‘ఫ్రిడా’ (2002). ‘‘ఈ సినిమా అప్పుడు హార్వీ వెయిన్‌స్టీన్ ఇచ్చిన అడ్వాన్స్‌ని తిరస్కరిస్తే నా మోకాలి చిప్పలను పగలగొడతానని బెదిరించాడు. ఇలాంటివాళ్లను తరిమికొట్టాలి’’ అని సల్మా ఘాటుగా స్పందించారు. -
వీరి రెమ్యూనరేషన్ ఎంతంటే..
సాక్షి, ముంబయి: బాలీవుడ్లో ఖాన్ త్రయం తర్వాత యువ కెరటాల్లా దూసుకొస్తున్న నవతరం హీరో, హీరోయిన్లు పెద్దమొత్తంలో రెమ్యూనరేషన్లు అందుకుంటున్నారు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన వరుణ్ ధావన్ వరుసగా హిట్ సినిమాలతో దూసుకెళుతూ భారీ మొత్తంలో పారితోషికం అందుకుంటున్నారు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా సినిమాకు వరుణ్ ధావన్ ఏకంగా రూ 32 కోట్లు రెమ్యూనరేషన్ సొంతం చేసుకున్నారు. ఇక బాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ అలియా భట్ హైవే, ఉడ్తా పంజాబ్ సినిమాలతో తన నటనా సామర్థ్యాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ పాతికేళ్ల బ్యూటీ రూ 7 కోట్ల పారితోషికం వసూలు చేస్తున్నారు. పద్మావత్ మూవీలో ఖిల్జీగా నట విశ్వరూపం ప్రదర్శించిన రణ్వీర్ సింగ్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ 300 కోట్లు పైగా కలెక్ట్ చేయడంతో తన రెమ్యూనరేషన్‌నూ అమాంతం పెంచేశారు. రణ్వీర్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ 13 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. బాలీవుడ్లో ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ పొందుతున్న దీపికా పదుకోన్ పద్మావత్ ఘనవిజయంతో తనకు ఆ మాత్రం ఇవ్వడంసముచితమేనంటూ పారితోషికం మరింత పెంచే పనిలో పడ్డారు. షారుక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుష్క శర్మ రూ 8 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుంటున్నారు. బాలీవుడ్ కండలవీరుడిగా పేరొందిన సల్మాన్ ఖాన్‌ను మరిపించే బాడీతో తెరపై యాక్షన్ సీక్వెన్స్‌లను అలవోకగా పండిస్తున్న టైగర్ ష్రాఫ్ తక్కువ సినిమాలే చేసినా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. బాఘీ 2తో ఘన విజయం అందుకున్న టైగర్ ప్రస్తుతం రూ 3 నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ త్వరలోనే ఆయన పారితోషికం భారీగా పెరుగుతుందని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇక బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ గత సినిమాలు నిరాశపరిచినప్పటికీ సాహో మూవీకి ఆమె ఏకంగా రూ 9 కోట్లు పారితోషికం రాబట్టడంతో శ్రద్ధ మార్కెట్ చెక్కుచెదరలేదు. బాలీవుడ్ మూవీలకు మాత్రం ఆమె రూ 5 కోట్లు డిమాండ్ చేస్తారని, సాహో పలు భాషల్లో తెరకెక్కుతుండటంతో అదే స్ధాయిలో పారితోషికం డిమాండ్ చేశారు. -
అందుకు రూ.65 లక్షలా?
ప్రముఖ కథానాయికలు ఐటమ్ సాంగ్స్‌లో అందాలారబోతకు సిద్ధం అవడానికి ప్రధాన కారణం పెద్ద మొత్తంలో పారితోషికం ముట్టడమేనన్నది జగమెరిగిన సత్యం. ఒక వేళ ఆబ్లిగేషన్ కోసం అలా నటించానని ఎవరైనా చెబితే అది సత్యదూరమే అవుతుంది. అదే విధంగా ఇవాళ ఏ ఒక టాప్ నటి స్పెషల్ సాంగ్ పేరుతో గ్లామరస్‌గా నటించడానికి కాదనడం లేదు. తాజాగా నటి క్యాథరిన్ ట్రెసా అలాంటి భారీ పారితోషికానికి ఐటమ్ సాంగ్ చేయడానికి సై అన్నదన్నది టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ వరుస కడుతున్న ఈ భామ మెడ్రాస్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు దిగుమతి అయ్యింది. ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా సంసారపక్షంగా కనిపించి గుర్తింపు పొందిన క్యాథరిన్ ట్రెసా ఆ తరువాత అందాలారబోతలో విజృంభించిందనే చెప్పాలి. కణిదన్, కథకళి తమిళ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా ఆర్యతో కడంబన్, విష్ణువిశాల్‌కు జంటగా కథానాయకన్ చిత్రాలతో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా తెలుగులో ఒక ఐటమ్ సాంగ్‌లో నటించడానికి సిద్ధం అవుతోంది. ఇందుకు ఈ జాణ డిమాండ్ చేసిన పారితోషికమే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వర్ధమాన టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో క్యాథరిన్ ట్రెసాను ఒక ఐటమ్ సాంగ్‌లో నటించమని అడగ్గా రూ.40 లక్షలు డిమాండ్ చేసిందట. అందుకు నిర్మాత వర్గం ఓకే అనడంతో పాట రిహార్సల్‌కు వెళ్లిందట. ఆ పాటకు మామూలు గ్లామర్ కాదు పరిధులు దాటే గ్లామరస్‌గా నటించాలని గ్రహించిన క్యాథరిన్ ట్రెసా అదనంగా మరో రూ.25 లక్షలు పారితోషికం ఇస్తేనే అందాలారబోయడానికి సిద్ధం అని అనడంతో అందుకు ఆ చిత్ర నిర్మాత అంగీకరించారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొత్తం మీద ఒక ఐటమ్ సాంగ్‌కు రూ.65 లక్షలు అందుకుంటోందనే టాక్ స్ప్రెడ్ అయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొసమెరుపేంటంటే ఇంతకు ముందు కూడా ఇదే హీరోతో సింగల్ సాంగ్‌లో చిందేయడానికి మిల్కీబ్యూటీ తమన్నా భారీ మొత్తాన్ని పుచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది.