Uppena Director Buchi Babu Sana To Get Massive Remunaration For His Next Movie - Sakshi
Sakshi News home page

భారీ రెమ్యూనరేషన్‌ తీసుకోనున్న బుచ్చిబాబు

Published Thu, Apr 22 2021 3:00 PM | Last Updated on Thu, Apr 22 2021 5:37 PM

Uppena Director Buchi Babu To Get A Massive Paycheck For His Next Film - Sakshi

తొలి సినిమా ఉప్పెనతోనే హిట్‌ డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు బుచ్చిబాబు. సుకుమార్‌ శిష్యుడిగా భారీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్‌.. టాలీవుడ్‌కు వైష్ణవ్‌ తేజ్‌, కృతీ శెట్టిలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేశాడు.  ఉప్పెనతో హీరో, హీరోయిన్లకు ఎంత క్రేజ్‌ వచ్చిందో  డైరెక్టర్‌ బుచ్చిబాబుకు సైతం అంతే పేరు ప్రఖ్యాతలు దక్కాయి. దీంతో బుచ్చిబాబుతో పని చేసేందుకు స్టార్ హీరోలు, నిర్మాతలు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఉప్పెన బంపర్‌ హిట్‌తో ఇదివరకే డైరెక్టర్‌ బుచ్చిబాబుకు కాస్ట్‌లీ బెంజ్‌ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తమ బ్యానర్‌లో ఇంకో సినిమా చేయమని మైత్రీమూవీ మేకర్స్‌ బుచ్చిబాబును సంప్రదించారట. ఇందుకోసం ఆయనకు 10 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. 

దీంతో రెండో సినిమాకే ఈ రేంజ్‌ రెమ్యునరేషన్‌ తీసుకోనున్న అతి కొద్దిమంది దర్శకుల్లో ఒకరిగా బుచ్చిబాబు నిలిచారు. తాజా సమాచారం ప్రకారం బుచ్చి తన రెండో సినిమాను జూనియర్‌ ఎన్టీఆర్‌తో చేయనున్నట్లు సమాచారం. ఇందుకుఓసం ఇప్పటికే  స్ర్కిప్ట్‌ను సిద్దం చేశాడట. పిరియాడికల్‌ స్పోర్ట్స్‌ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రం హిందీ మూవీ దంగల్‌ తరహాలో ఉండనుందట. ఇందులో ఎన్టీఆర్‌ 60 ఏళ్ల మాజీ ఆటగాడి పాత్ర చూట్టు ఈ కథ తిరగనుంది. కాగా ఇటీవల ఎన్టీఆర్‌ను కలిసి బుచ్చి కథ వివరించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు దీనిపై ఎన్టీఆర్‌ స్పందించలేదని ఆయన గ్రీన్‌ సిగ్నిల్‌ కోసం మైత్రీ మూవీ మేకర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు సమచారం. 

చదవండి 'ఉప్పెన' దర్శకుడికి బెంజ్‌ కారు గిఫ్ట్‌
అత్యాచారం జరిగితే అది అమ్మాయి తప్పు కాదు : చిన్మయి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement