katherine theresa
-
నా చివరి ప్రేమ కథ ఇదే
‘‘నా గత చిత్రాలన్నింటిలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమా కోసమే ఎక్కువ కష్టపడ్డా. ఈ సినిమాకి నేనేం హడావిడి చెయ్యలేదు. ఈ ట్రైలర్‌తో బయట హడావిడి స్టార్ట్ అవుతుంది. నా చివరి ప్రేమ కథా చిత్రమిది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్, కేథరిన్, ఇజాబెల్లే లెయితే కథానాయికలుగా నటించారు. కె.ఎస్. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘మనిషిగా కొంచెం మారుతున్నా.. టేస్టులు కొంచెం మారుతున్నాయి. లైఫ్‌లో కొత్త దశలోకి వెళ్తున్నా. ఈ సినిమా చేస్తున్నప్పుడే ఇదే నా చివరి ప్రేమకథా చిత్రం అని తెలిసిపోయింది. అందుకే ఈ సినిమాని పూర్తిగా ప్రేమతో నింపేశాం. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలి. క్రాంతి మాధవ్‌కు పెద్ద సక్సెస్ రావాలి’’ అన్నారు. ‘‘వరల్డ్ ఫేమస్ లవర్’ తెలుగు ప్రేక్షకుల సినిమాలా ఉండదు.. హాలీవుడ్, హిందీ సినిమాలా ఉంటుంది. ప్రతి సినిమా లవర్‌కి మా చిత్రం నచ్చుతుంది’’ అన్నారు కె.ఎస్. రామారావు. ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ తర్వాత ఈ బ్యానర్లో ఇది నా రెండో సినిమా. ఈ సినిమాలో అందరూ తమ పాత్రల్లో జీవించారు’’ అన్నారు క్రాంతి మాధవ్. ‘‘ఇప్పటి వరకూ నేను చేసిన సినిమాల్లో, చేసిన పాత్రల్లో ఈ సినిమాలోని యామిని పాత్ర బెస్ట్’’ అన్నారు రాశీఖన్నా. ‘‘ఈ సినిమాలో స్మిత అనే భిన్నమైన పాత్ర చేశా’’ అన్నారు కేథరిన్. ‘‘ఈ చిత్రంలో నటించినందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు ఇజా బెల్లా. -
బాలయ్యకు ‘సినిమా’ కష్టాలు!
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమాలో నటించడానికి హీరోయిన్ కేథరిన్ థెరిసా నో చెప్పిందట. రూలర్ సినిమా తర్వాత బాలయ్య నటించే భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమాలో కేథరిన్‌ను హీరోయిన్గా ఫైనల్ చేసినా.. రెమ్యునరేషన్ విషయంలో రాజీ కుదరలేదట. బాలయ్యతో జోడీ కట్టేందుకు దాదాపు కోటి రూపాయలు డిమాండ్ చేసిందట ఈ భామ. ఇంత భారీ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు నిరాకరించడంతో కేథరిన్.. ఈ అవకాశాన్ని వదులుకున్నట్టు టాలీవుడ్ టాక్. 2013లో చమ్మక్ చల్లో అనే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన కేథరిన్.. ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాతో హీరోయిన్గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు 'సింహా' వంటి బ్లాక్ బస్టర్‌తో మంచి సక్సెస్ అందించాడు బోయపాటి శ్రీను. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన 'లెజెండ్' మూవీ అంతకు మించిన సక్సెస్ సాధించింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో నటించే అవకావాన్ని రెమ్యునరేషన్ కోసం మిస్ చేసుకుంది కేథరిన్. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్ కోసం బోయపాటికి తంటాలు తప్పడం లేదు. తరచుగా ఏదో ఒక హీరోయిన్ పేరు వినిపించడం.. తీరా సదరు బ్యూటీ ఆ వార్తలని ఖండించడం మామూలైపోయింది. కేథరిన్‌కి ముందు చిత్ర యూనిట్.. మిల్క్ బ్యూటీ తమన్నాను సంప్రదించగా ఆమె సున్నితంగా తిరస్కరించింది. ఆ మధ్యన బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా బాలయ్యతో జోడీ కట్టనుందని వార్తలు వినిపించినా సోనాక్షి వాటిని ఖండించింది. మొత్తానికి బాలయ్యకు హీరోయిన్ని వెతకడం బోయపాటికి పెద్ద సవాల్‌గా మారినట్లు ఉంది. చదవండి: ‘రూలర్’ మూవీ రివ్యూ -
కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ప్రారంభం
-
అందుకు రూ.65 లక్షలా?
ప్రముఖ కథానాయికలు ఐటమ్ సాంగ్స్‌లో అందాలారబోతకు సిద్ధం అవడానికి ప్రధాన కారణం పెద్ద మొత్తంలో పారితోషికం ముట్టడమేనన్నది జగమెరిగిన సత్యం. ఒక వేళ ఆబ్లిగేషన్ కోసం అలా నటించానని ఎవరైనా చెబితే అది సత్యదూరమే అవుతుంది. అదే విధంగా ఇవాళ ఏ ఒక టాప్ నటి స్పెషల్ సాంగ్ పేరుతో గ్లామరస్‌గా నటించడానికి కాదనడం లేదు. తాజాగా నటి క్యాథరిన్ ట్రెసా అలాంటి భారీ పారితోషికానికి ఐటమ్ సాంగ్ చేయడానికి సై అన్నదన్నది టాక్ ఆఫ్ ది టాక్‌గా మారింది. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ అంటూ దక్షిణాది భాషలన్నిటిలోనూ వరుస కడుతున్న ఈ భామ మెడ్రాస్ చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు దిగుమతి అయ్యింది. ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయిగా సంసారపక్షంగా కనిపించి గుర్తింపు పొందిన క్యాథరిన్ ట్రెసా ఆ తరువాత అందాలారబోతలో విజృంభించిందనే చెప్పాలి. కణిదన్, కథకళి తమిళ చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా ఆర్యతో కడంబన్, విష్ణువిశాల్‌కు జంటగా కథానాయకన్ చిత్రాలతో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. తాజాగా తెలుగులో ఒక ఐటమ్ సాంగ్‌లో నటించడానికి సిద్ధం అవుతోంది. ఇందుకు ఈ జాణ డిమాండ్ చేసిన పారితోషికమే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. వర్ధమాన టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో క్యాథరిన్ ట్రెసాను ఒక ఐటమ్ సాంగ్‌లో నటించమని అడగ్గా రూ.40 లక్షలు డిమాండ్ చేసిందట. అందుకు నిర్మాత వర్గం ఓకే అనడంతో పాట రిహార్సల్‌కు వెళ్లిందట. ఆ పాటకు మామూలు గ్లామర్ కాదు పరిధులు దాటే గ్లామరస్‌గా నటించాలని గ్రహించిన క్యాథరిన్ ట్రెసా అదనంగా మరో రూ.25 లక్షలు పారితోషికం ఇస్తేనే అందాలారబోయడానికి సిద్ధం అని అనడంతో అందుకు ఆ చిత్ర నిర్మాత అంగీకరించారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మొత్తం మీద ఒక ఐటమ్ సాంగ్‌కు రూ.65 లక్షలు అందుకుంటోందనే టాక్ స్ప్రెడ్ అయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొసమెరుపేంటంటే ఇంతకు ముందు కూడా ఇదే హీరోతో సింగల్ సాంగ్‌లో చిందేయడానికి మిల్కీబ్యూటీ తమన్నా భారీ మొత్తాన్ని పుచ్చుకున్నారన్న ప్రచారం జరిగింది. -
లక్ లేని కేథరీన్ థేరీసా