ఐడెంటిటీ వస్తుందంటే రెడీ | Will ready to act for Item songs in Tolllywood , if i get good Identity | Sakshi
Sakshi News home page

ఐడెంటిటీ వస్తుందంటే రెడీ

Published Sat, Aug 9 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

ఐడెంటిటీ వస్తుందంటే రెడీ

ఐడెంటిటీ వస్తుందంటే రెడీ

చిట్‌చాట్: మంచి గుర్తింపు వస్తుందంటే టాలీవుడ్‌లోనూ ఐటమ్ సాంగ్స్‌కు రెడీ అంటోంది ముంబై ముద్దుగుమ్మ జరైన్ ఖాన్. ఐటమ్‌గాళ్‌గా బాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తున్న ఈ అమ్మడు నగరానికి వచ్చింది. నోవాటెల్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ఫ్యాషన్ షోలో పాల్గొన్న జరైన్ ఖాన్ ‘సిటీప్లస్’తో ముచ్చటించింది. ‘వీర్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. బ్లాక్‌బస్టర్ హిట్ ‘రెడీ(హిందీ)’లో చేసిన ‘క్యారెక్టర్ డీలా..’ ఐటమ్ సాంగ్ తనను ఎక్కడికో తీసుకెళ్లిందని, అంత మాత్రాన తాను వాటికే పరిమితం కానని చెప్పింది. మరి తమిళ్‌లో ఐటమ్ గాళ్‌గా తళుక్కుమన్నావుగా అంటే ‘ ఆ పాట పిచ్చపిచ్చగా నచ్చింది. అందుకే చేశాను’ అని కలరింగ్ ఇచ్చింది. టాలీవుడ్‌లో చాన్స్ వస్తే తప్పకుండా చేస్తానంటూనే.. ఐటమ్ సాంగైనా రెడీ.. కానీ, అది మంచి గుర్తింపు తెచ్చేదై ఉండాలని కండిషన్ పెట్టింది.
 
 ఇటీవల తరుచూ ర్యాంప్ షోల్లో మెరిసిపోతున్న జరైన్..‘ఇట్స్ నైస్. డిఫరెంట్ డిజైన్స్ కోసం వాక్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా ఉంది’ అంటూ ర్యాంప్ వాక్‌పై తన ఇష్టాన్ని వ్యక్తం చేసింది. ‘హైదరాబాద్‌కు రావడం ఇదే మొదటిసారి. సిటీని పూర్తిగా చూడలేదు. చూసినంత వరకూ చాలా బాగుంది’ అంటూ మురిసిపోయింది. కత్రినా కైఫ్‌కు దగ్గరి పోలికలున్నాయన్న కామెంట్స్‌పై స్పందిస్తూ... ‘నాకు నచ్చడం లేదు. ఎవరు చూసినా అదే ప్రస్తావన తెస్తారెందుకు? ఆమె పోలికలు ఉంటే ఏమిటట? నాకంటూ ఓ గుర్తింపు ఇవ్వండి. నాకు అదే ఇష్టం’ అంటూ మూతిబిగించింది.
 - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement