చీరస్తు | City Page Three Circles | Sakshi
Sakshi News home page

చీరస్తు

Published Tue, Apr 21 2015 12:13 AM | Last Updated on Sun, Sep 3 2017 12:35 AM

చీరస్తు

చీరస్తు

జుబిన్ డిజైన్ మస్తు కొంతకాలంగా సిటీ పేజ్ త్రీ సర్కిల్స్‌లో గాని, ఫ్యాషన్ సీన్‌లో గాని పెద్దగా కని-వినిపించని జుబిన్.. మరోసారి న్యూస్ మేకర్ అయ్యారు. తన స్టైల్‌కు పూర్తి భిన్నంగా.. శారీ కలె క్షన్స్‌ను క్రియేట్ చేసి వావ్ అనిపిస్తున్నారు. తరుణ్ తహిల్యానీ, రోహిత్ ఖోస్లా వంటి టాప్ డిజైనర్స్‌కు వర్క్ చేసిన మాయా అనంతరాజన్ హ్యాండ్ పెయింటింగ్ తోడుగా ఆయన ఈ కలె క్షన్స్ డిజైన్ చేశారు. జుబిన్ కలెక్షన్స్‌లో అందంగా మెరిసిపోతున్న మిస్ ప్లానెట్ మెహక్‌మూర్తి స్టిల్స్‌ని ఫొటోగ్రాపర్ సిరాజ్ క్లిక్‌మనిపించారు.
- ఎస్.సత్యబాబు

 
వెస్ట్రన్ వేర్. ఈ పదం వినగానే సిటీలోని ఫ్యాషన్ లవర్స్‌కి ఠక్కున గుర్తొచ్చే పేరు జుబిన్ వకీల్. అల్ట్రామోడ్రన్‌కి ఆల్టర్నేటివ్ అనిపించేలా మీ వర్క్స్ ఉంటాయంటూ తరచుగా కాంప్లిమెంట్స్ అందుకునే ఈ డిజైనర్.. వర్క్ పరంగానూ, వ్యక్తిగతంగానూ టాక్ ఆఫ్ ది టౌన్. దాదాపు 15 ఏళ్లుగా ఈ రంగంలో ఉన్న జుబిన్ తొలిసారి శారీస్ డిజైనింగ్‌లోకి ప్రవేశించారు.
 
ఒక్క‘శారీ’ కమిట్ అయితే...
‘నా చేత శారీ కలెక్షన్స్ లాంచ్ చేయించిన క్రెడిట్ నా క్లయింట్  సునందా సేన్ గుప్తాకే దక్కుతుంది’ అని చెప్పారు జుబిన్. తన కోసం ఒక్క శారీ డిజైన్ చేసి ఇమ్మని పదే పదే సునంద రిక్వెస్ట్ చేయడంతో కాదనలేక శారీస్ డిజైనింగ్‌కు సిద్ధమయ్యానన్నారు. ‘అయితే వర్క్ చేస్తున్నప్పుడే అర్థమైంది శారీస్ డిజైనింగ్‌లో లభించే ఆనందం ఏమిటో’ అన్న జుబిన్.. అదే ఊపులో కొత్త కలెక్షన్స్ లాంచ్ చేసేశారు. సమకాలీన డిజైనర్లకు భిన్నంగా కొన్నేళ్లు ముందుకు వెళ్లి డిజైన్ చేయడానికి ఇష్టపడే ఈ ట్రెండ్ సెట్టర్.. తాజా కలెక్షన్స్‌లో ఎల్లో మేళవించిన ఆలివ్ గ్రీన్, డల్ గ్రీన్-పింక్ మిక్సింగ్.. వంటి కలర్స్ కాంబినేషన్లతో తన ఫాస్ట్ ఫార్వర్డ్ ఐడియాస్‌కి అందమైన రూపమిచ్చారు.

సిల్క్స్, ఆర్గాంజా, షిఫాన్ తదితర ఫ్యాబ్రిక్స్‌తో రూపొందిన ఈ లైట్ వెయిట్ శారీస్ డిఫరెంట్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్నాయని జుబిన్ హ్యాపీగా చెప్పారు. ఆర్టిస్ట్ మాయా అనంతరాజన్ తన శారీస్‌పై ఆమె హ్యాండ్ పెయింటింగ్ చేయాలనుకుంటున్నట్టు చెప్పగానే.. ఆమె పెయింటింగ్ స్టైల్ తన కలెక్షన్స్‌కు నప్పుతుందా లేదా అని కొంత తటపటాయించినా.. ఒక్కసారి ఆమె వర్క్ చూశాక ఫిదా అయిపోయానంటున్నారీ ప్రయోగాల డిజైనర్.
 
నా రూటే వేరు...
ఫ్యాషన్‌వీక్స్, సెలబ్రిటీ షోస్, బొటిక్స్, స్టోర్స్.. ఇలా ఎప్పుడూ న్యూస్‌లో వెలిగిపోయే మిగిలిన డిజైనర్ల మార్గాన్ని ఎంచుకోని జుబిన్.. ఫ్యాషన్ వీక్ అనేది ఒక వ్యయప్రయాసల వ్యవహారమని అంటారు. దీని కోసం నిధులు సమకూర్చే ‘ఫండింగ్’ పర్సన్‌ని వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత డిజైనర్‌దేనని, సెలబ్రిటీలు డబ్బుల విషయంలో పెట్టే ఇబ్బందులు భరించడం తనవల్ల కాదన్నారు. క్లయింట్స్‌ను మెప్పించినంత కాలం.. ఈ రంగంలో సక్సెస్‌ఫుల్‌గా కొనసాగడం సాధ్యమేనంటున్న జుబిన్... శారీస్ డిజైనింగ్ కొనసాగిస్తూనే.. తనదైన శైలి షాకింగ్ డ్రెస్‌లతో మెరిపిస్తానని చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement