
‘ఐటమ్’కు అరకోటి
హీరోయిన్ల ఐటమ్ సాంగ్స్ సంస్కృతి పెరిగిపోతోంది. ఇది ఎవరూ కాదనలేని నిజం. తమన్నా, కాజల్, ఇలా ప్రముఖ హీరోయిన్లందరూ ఐటమ్‌సాంగ్స్‌కు ఓకే అంటున్నారు. అధిక పారితోషికం ముట్టడమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. తాజాగా శ్రుతిహాసన్ ఒక టాలీవుడ్ చిత్రంలో ఐటమ్ సాంగ్‌కు 50 లక్షలు పుచ్చుకుని యమాగా ఆడేశారని తెలిసింది. మహేష్‌బాబు, తమన్నా జంటగా నటిస్తున్న ఆగడు చిత్రంలో శ్రుతి స్పెషల్‌సాంగ్‌ను చూడవచ్చునట.
తొలుత ఐటమ్‌సాంగ్‌కు ఆడదామా? వద్దా? అని సందేహించిన శృతి చివరికి రూ.50 లక్షలు డిమాండ్ చేశారట. అందుకు నిర్మాత ఓకే అనడంతో ఈ క్రేజీ నటి సింగిల్ సాంగ్ చేశారని సమాచారం. ప్రస్తుతం శ్రుతి తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంలో నటిస్తున్నారు. తదుపరి విజయ్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. ఇలా హీరోయిన్‌గా బిజీగా ఉంటూ మరో పక్క ఐటమ్‌సాంగ్స్‌తో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట ఈ ముద్దుగుమ్మ.