ఐటమ్ సాంగ్స్‌తో ప్లస్సే | Item Songs Plasse says actress meenakshi | Sakshi
Sakshi News home page

ఐటమ్ సాంగ్స్‌తో ప్లస్సే

Published Wed, Sep 24 2014 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

ఐటమ్ సాంగ్స్‌తో ప్లస్సే

ఐటమ్ సాంగ్స్‌తో ప్లస్సే

ఇవాళ ఐటమ్‌సాంగ్ లేని చిత్రమే లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు ఇలాంటి పాటల కోసమే ప్రత్యేకంగా శృంగార తారలుండేవారు. అయితే ఇప్పుడా బాధ్యతను కూడా ప్రముఖ హీరోయిన్లే మోసేస్తున్నారు. నయనతార, శ్రుతిహాసన్, శ్రియ, ప్రియమణి, చార్మిలాంటి వాళ్లందరూ సింగిల్ సాంగ్‌కు ఆడేసిన వారే. దీంతో ఆయా చిత్రాలకు పిచ్చ పిచ్చగా ప్రచారం, తద్వారా ఆదాయం వచ్చింది. తాజాగా ఐటమ్‌సాంగ్ గర్ల్ లిస్టులో నటి మీనాక్షి చేరిపోయింది. కరుప్పుస్వామి గుత్తగైదార్ చిత్రం ద్వారా కరణ్‌కి జంటగా కోలీవుడ్‌కు పరిచయమైన ముంబయి బ్యూటీ మీనాక్షి. ఆ తరువాత కొన్ని చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయికి చేరలేకపోయింది. మూడేళ్లకు పైగా తమిళ తెరకు దూరమైన భామ తాజాగా మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యింది.
 
 పస్తుతం రెండు చిత్రాల్లో హీరోయిన్‌గాను ఒక చిత్రంలో సింగిల్ సాంగ్‌కు నటిస్తోంది.  దీని గురించి మీనాక్షి మాట్లాడుతూ, ధనుష్ హీరోగా నటిస్తున్న చిత్రం సూదాడి చిత్రంలో పార్తీపన్‌కు జంటగా నటించనున్నట్లు తెలిపింది. ఈ చిత్రంలో ధనుష్‌కు జంటగా లక్ష్మీమీనన్ నటించనున్నట్లు చెపింది. ఇటీవల ముంబయి వచ్చిన చిత్ర దర్శకుడు వెట్రిమారన్ సూదాడి చిత్ర కథ చెప్పి పార్తీపన్ సరసన నటించమని అడిగినట్లు తెలిపింది. పాత్ర నచ్చడంతో అంగీకరించానంది. చిత్రంలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని చీర ధరించిన పాత్ర గ్లామరస్‌గా ఉంటుందని పేర్కొంది. ఈ చిత్రం అక్టోబరులో ప్రారంభమై వచ్చే ఏడాది మధ్యలో విడుదలవుతుందని చెప్పింది. ఈ చిత్రంతోపాటు నందాకు జంటగా విళంగం చిత్రంలో నటిస్తున్నట్లు చెప్పిం ది.
 
 ఇది నటనకు అవకాశం వున్న పాత్ర అంది. విక్రమ్ ప్రభు చిత్రంలో ఐటమ్‌సాంగ్ చేస్తున్న విషయం గురించి ప్రస్తావిం చగా అవును దర్శకుడు ఎళిల్ తన వెళ్లైక్కార దొరై చిత్రం లో ఒక స్పెషల్ సాంగ్ చేయమని అడిగాారని చెప్పిం ది. విక్రమ్‌ప్రభు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన పరిచయ సన్నివేశంలో వచ్చే ఈ పాటకు దర్శకుడు వెంకట్‌ప్రభుతో కలసి నటించినట్లు వెల్లడించింది. హీరోయిన్‌గా నటిస్తూ ఐటమ్‌సాంగ్ చేస్తే ఇమేజ్‌కు భంగం వాటిల్లదా? అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని ఒక రకంగా ఐటమ్‌సాంగ్‌లో నటించడం వలన అధిక ప్రచారం జరిగి ప్లస్ అవుతుందనే అభిప్రాయాన్ని మీనాక్షి వ్యక్తం చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement