ఐటమ్ సాంగ్‌లో పూర్ణ | Poorna dances for a solo song | Sakshi
Sakshi News home page

ఐటమ్ సాంగ్‌లో పూర్ణ

Published Fri, Oct 17 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

ఐటమ్ సాంగ్‌లో పూర్ణ

ఐటమ్ సాంగ్‌లో పూర్ణ

 ఐటమ్ సాంగ్స్‌పై హీరోయిన్లకున్న మోహం అంతా ఇంతా కాదు. ఇందుకు కారణం లక్షల పారితోషికంతోపాటు అంతకుమించిన ప్రచారం లభిస్తుంది. శ్రమా, సమయమూ రెండూ తక్కువే. ఇన్ని ప్రయోజనాలు ఏక కాలంలో లభిస్తుంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు. శ్రుతిహాసన్, తమన్న, శ్రీయ, చార్మి ఇలా చాలా మంది కథానాయికలు ఐటమ్స్ సాంగ్స్‌కు సై అంటున్నారు. ఈ మధ్య తెలుగు చిత్రం ఆగడులో ఐటమ్ సాంగ్‌కు శ్రుతిహాసన్ 50 లక్షల పారితోషికం తీసుకున్నట్లు ప్రచారం హోరెత్తింది.
 
 తాజాగా నటి పూర్ణ కూడా సింగిల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జయంరవి, త్రిష, అంజలి హీరో హీరోయిన్లుగా దర్శకుడు సురాజ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రానికి అప్పాటక్కర్ అనే టైటిల్‌ను ఇటీవలే ఖరారు చేశారు. ప్రభు, రాధారవి, సూరి, కుంకి అశ్విన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎస్.తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అప్పాటక్కర్ చిత్రం కోసం ఈయన సంగీతబాణీలందించిన ఒక ఐటమ్‌సాంగ్‌కు పూర్ణ ఆడనుందట. ఈ పాట చిత్రీకరణ గురువారం నుంచి జరుగుతుందని యూనిట్‌వర్గాలు తెలిపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement