నిన్ను చూసి ఫ్లాటైపోయా! | i am Flat to see you - amy jackson | Sakshi
Sakshi News home page

నిన్ను చూసి ఫ్లాటైపోయా!

Published Sat, Jul 25 2015 11:43 PM | Last Updated on Sun, Sep 3 2017 6:09 AM

నిన్ను చూసి ఫ్లాటైపోయా!

నిన్ను చూసి ఫ్లాటైపోయా!

భాష తెలియనప్పుడు ఉచ్చారణలో పొరపాట్లు దొర్లడం సహజం. ‘రామా’ అనే బదులు ‘రామ్మా’ అనేసే ప్రమాదం ఉంది. అలాగే, పక్కవాళ్లు కూడా అనకూడని మాటలు ఏవేవో అనిపించి, ఆనందం పొందుతుంటారు. ‘ఐ’, ‘ఎవడు’ చిత్రాల ఫేమ్ అమీ జాక్సన్‌కి ఈ మధ్య అదే జరిగింది. ఈ విదేశీ సుందరి తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకులకు సుపరిచితురాలే.
 
 ఇంగ్లిష్ తప్ప పాపం అమీకి ఏమీ తెలియదు. ఆ విషయం హిందీ నటుడు అక్షయ్‌కుమార్‌కి బాగా తెలుసు. ప్రభుదేవా దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న ‘సింగ్ ఈజ్ బ్లింగ్’లో అమీ జాక్సన్ కథానాయిక. ఇటీవల లొకేషన్లో ఈ చిత్రనిర్మాత అశ్విని యార్దీతో కలిసి అమీని అక్షయ్ ఆటపట్టించారు. ప్రభుదేవా దగ్గరికెళ్లి ‘మై తుమ్ పర్ ఫిదా హూ’ అనమన్నారట.
 
 దానర్థం ‘నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయా’ అని తెలియక, ప్రభుదేవాతో అమీ అనడం, అతగాడు షాకవడం జరిగిపోయాయి. చివరకు అసలు విషయం తెలుసుకుని చిత్రబృందం అంతా హాయిగా నవ్వుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement